1. బాబా దయతో ఉద్యోగం
2. సంవత్సరం వృధా కాకుండా దయ చూపిన బాబా3. బాబాకి చెప్పుకున్నంతనే పూర్తైన పని
బాబా దయతో ఉద్యోగం
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!!!
సద్గురు సాయినాథుని శరత్ బాబూజీ కి జై!!!
సాయిబంధువులకు నా నమస్కారాలు. నా పేరు మాధురి. మాకు ఒక పాప. తను యుఎస్‌లో తన ఫ్రెండ్స్‌తో కలిసుంటూ MS చేసింది. రెండు సంవత్సరాల చదువు ఒకటిన్నర సంవత్సరంలోనే పూర్తి చేసింది. అయితే తన కోర్సు పూర్తైన వెంటనే యుఎస్‌లో ఆర్థికమాంద్యం మొదలైంది. అందువల్ల మా అమ్మాయి చాలా ఉద్యోగాలకు ప్రయత్నించినప్పటికీ ఇంటర్వ్యూకి పిలుపు రాలేదు. కొన్ని ఇంటర్వ్యూలకి వెళ్ళినా తను సెలెక్ట్ కాలేదు. మాకు చాలా బాధేసింది. అప్పుడు నేను, "బాబా! పాపకి ఉద్యోగం వస్తే, మీ అనుగ్రహాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మొక్కుకున్నాను. తర్వాత బాబా దయవల ఒక బ్యాంకు ఇంటర్వ్యూకి పిలువు వచ్చింది. మా అమ్మాయి ఆ ఇంటర్వ్యూ బాగానే చేసానని చెప్పింది. బ్యాంకువాళ్ళు మా అమ్మాయి ఆ ఉద్యోగానికి సెలెక్ట్ అయిందని కూడా చెప్పారు. తర్వాత బ్యాంకువాళ్ళు చాలా ఇన్వెస్టిగేషన్స్ చేసి జాయినింగ్ డేటు చెప్పారు. కానీ అంతలోనే వాయిదా వేశారు. మళ్ళీ జాయినింగ్ డేట్ చెప్పి, మళ్ళీ వాయిదా వేశారు. ఆ ఉద్యోగం వస్తుందని మేము చాలా ఆశపడ్డాం. అలాంటిది అలా వాయిదా వేస్తూండేసరికి మాకు ఏమీ అర్థం కాలేదు. మేము బాబానే నమ్ముకున్నాము. చివరికి బాబా దయతో యుఎస్ కాలమానం ప్రకారం 2023, జూలై 17న మా అమ్మాయి ఆ ఉద్యోగంలో చేరింది. మేము చాలా ఆనందపడ్డాము. అంతా బాబా దయ. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. ఈ అనుభవాన్ని ఆలస్యంగా పంచుకున్నందుకు నన్ను క్షమించండి బాబా. మీ దయ మా అందరిపైనా ఇలాగే ఉండాలని మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నాను తండ్రీ".
సంవత్సరం వృధా కాకుండా దయ చూపిన బాబా
ఓం శ్రీసాయినాథాయ నమః!!! ముందుగా బాబాకు నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలని. నేను హైదరాబాదు నివాసిని. 2018లో హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ బాబా మందిరం పక్కన ఉన్న ఒక ప్రయివేట్ కంపెనీ కార్యాలయానికి నాకు బదిలీ అయింది. 2019, ఏప్రిల్ నెలలో బాబా నన్ను తమ చెంతకు చేర్చుకున్నారు. నెమ్మదిగా ఆయన మీద నమ్మకం కుదిరింది. రోజూ పొద్దున్న, సాయంత్రం బాబాని దర్శించుకోవడం, హారతులు వినడం చేస్తుంటాను. సచ్చరిత్ర పారాయణ వల్ల నేను చాలా తెలుసుకున్నాను ఈరోజు సొంత ఆఫీస్ పెట్టుకొని ఒక మంచిస్థితిలో ఉండడానికి బాబానే కారణం. అందుకే ఈ జీవితం బాబా పెట్టిన బిక్ష అని భావిస్తాను. ఈమధ్యకాలంలో మా పాపని ఒక ప్రముఖ కాలేజీలో బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ చేశాను. ఆ కాలేజీకి యూనివర్సిటీ అనుమతులన్నీ ఉన్నాయని అనుకున్నాము. కానీ కొన్ని కారణాల వల్ల ఆ కాలేజీకి యూనివర్సిటీ అనుమతి రాలేదు. దాంతో మేము ఒక సంవత్సరం వృధా అవుతుందని కంగారుపడ్డాము. ఆ సమయంలో నేను, "ఈ సమస్య గురించి నువ్వే చూసుకోవాలి బాబా" అని బాబాకి మొరపెట్టుకున్నాను. తరువాత 2023, జూలై 20, గురువారంనాడు గవర్నమెంట్ స్పెషల్ జీవో ప్రకారం ఈ సంవత్సరం వృధా కాకుండా ఆ కాలేజీ విద్యార్థులను ఇంజనీరింగ్ JNTUలో కొనసాగించాలా అనుమతించారు. అలా బాబా నా సమస్యను అర్థం చేసుకుని ప్రేమతో పరిష్కరించారు. "బాబా! మీకు నా శతకోటి వందనాలు. పాప ఆరోగ్యం, భవిష్యత్తు కూడా బాగుండేలా చూడు స్వామి. ప్రస్తుతం నా సమస్యలు మీకు తెలుసు బాబా. అన్నిటినీ తీర్చి నా జీవితంలో ముందుకు సాగేలా ఆశీర్వదించి ఈ బ్లాగు ద్వారా తోటి భక్తలతో నా అనుభవాన్ని పంచుకునే అవకాశాన్ని మరల నాకివ్వు తండ్రీ".
బాబాకి చెప్పుకున్నంతనే పూర్తైన పని
నా పేరు రమ్యశ్రీ. నా భర్త ఉద్యోగరీత్యా మేము బెంగళూరులో నివాసముంటున్నాము. నేను డ్వాక్రా గ్రూపు సభ్యురాలిని. 2023, జూలై 22న మా డ్వాక్రా గ్రూపు సభ్యులందరికీ 'kyc' చేయించడానికి మా సొంత ఊరు వెళ్ళాను. అందరి 'kyc' అయింది కానీ, నాది కాలేదు. జూలై 24, సోమవారం నుండి మా అమ్మయికి పరీక్షలు ఉన్నందున మేము బెంగళూర్ తిరిగి వెళ్లిపోవాల్సి ఉంది. అందువల్ల నేను బాబాను తలుచుకొని, "బాబా! నా 'kyc' త్వరగా పూర్తయితే మీ అనుగ్రహాన్ని బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాను" అని మనస్ఫూర్తిగా వేడుకున్నాను. అలా అనుకున్న ఒక్క నిమిషం తర్వాత నా 'kyc' పని పూర్తి అయింది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
ఓం సాయి రామ్ మీ ఆశీస్సులతో నా ఆరోగ్యం కుదుట పడింది.కొంచెం ఆలోచనలు మారిపోయేలాగ ఆశీస్సులు యియ్యవలెను తండ్రి.నీ దయ తో నాలో మార్పు వచ్చింది.నరకం అనుభవించాను.ఆ పరిస్థితి మళ్లీ రాకుండా కాపాడు తండ్రీ
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteOm sairam 🙏
ReplyDeleteSaibaba eeroju madava schoolki vellaledu. Baba madava manasu maarchi social studies notes complete cheselaga choodu swamy ninne nammu kunnanu swamy naaku enka dikku evaru leru swamy pl baba . Studies meeda interest kaligela cheye swamy
ReplyDeleteOm Sri Sai Ram Swami 🎉🎉🎉
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sai Ram Sri Sai Ram Jaya Sai Ram
ReplyDeleteOm Sri Sainathaya namah
ReplyDelete