- శ్రీసాయి అనుగ్రహశీస్సులు - రెండవ భాగం
సాయిభక్తులందరికీ నమస్కారం. నేను ఒక సాయిభక్తురాలిని. నేను నిన్నటి భాగంలో కొన్ని అనుభవాలు పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలు పంచుకుంటున్నాను. మా కుటుంబమంతా 2023, ఫిబ్రవరి నుంచి బిక్కవోలు వెళ్లి వినాయకుని దర్శనం చేసుకొని వద్దామని ఎప్పుడు ప్లాన్ చేసినా, ఎన్నిసార్లు వెళదామన్నా ఏదో ప్రమాదం జరగడం, ఆరోగ్యం బాగలేకపోవడం వంటి ఏదో ఒక ఆటంకం వస్తుండేది. చివరికి ఒకసారి ప్లాన్ చేసినప్పుడు నేను బాబా గుడికి వెళ్లి, “బాబా! ఎన్నిసార్లు అక్కడికి వెళ్ళడానికి ప్లాన్ చేసినా ఏదో ఒక ఆటంకం వస్తుంది. ఈసారి ఎలాగైనా వెళ్లి, వినాయకుని దర్శనం చేసుకొని రావాలి బాబా. అలా అయితే మీకు పాలాభిషేకం చేస్తాను” అని బాబాకి మ్రొక్కుకున్నాను. అలా బాబాకి చెప్పుకోవడమే ఆలస్యం అన్నట్లు బిక్కవోలు వెళ్లి మంచిగా దర్శనం చేసుకొని వచ్చాము. సంతోషంగా బాబా మొక్కు కూడా తీర్చాను.
నేను మా అక్కని ఎప్పుడు గుడికి తీసుకెళ్ళమన్నా "స్కూటీ ముగ్గురికి(మేము ముగ్గరం అక్కచెల్లెలం) సరిపోదు. నువ్వే వెళ్లిపో" అని అనేది. ఒక గురుపూర్ణిమనాడు నేను, "బాబా! నేను మా అక్కతో వచ్చి మీ దర్శనం చేసుకోవాలి. అలా అయితే మీ అనుగ్రహం బ్లాగులో పంచుకుంటాను" అని బాబాని ప్రార్థించాను. తరువాత అక్కని అడిగితే వెంటనే, "సరే, రా" అంది. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఆరోజు బాబా దర్శనం చాలా బాగా జరిగింది. ఆ ఆనందంలో తిరిగి ఇంటికి వస్తుంటే దారిలో ఒక లారీ మీది బాబా దర్శనం ఇచ్చారు. నాకు చాలా సంతోషంగా అనిపించింది.
ఒకరోజు నేను బయటకి వెళ్ళేటప్పుడు, “బాబా! ఎలాగైనా ఈరోజు నాకు మీ దర్శనం అవ్వాలి” అని అనుకున్నాను. కానీ ఆ రోజు నాకు బాబా దర్శనం అవ్వలేదు. దాంతో నాకు బాబా మీద కాస్త కోపం వచ్చిందిగాని ‘ఏదో కారణం ఉండే ఉంటుంది’ అనుకున్నాను. అదే నిజమైంది. బాబా నేను ఆరోజు ఏ గుడికైతే వెళ్ళాలనుకున్నానో అదే గుడికి మరుసటిరోజు నన్ను రప్పించుకొని 30 నిమిషాలపాటు తమ దగ్గర ఉంచుకున్నారు. అప్పుడు ‘నిన్న వచ్చుంటే కేవలం దణ్ణం పెట్టుకొని వెళ్ళిపోయేదాన్ని, ఇలా 30 నిమిషాలపాటు బాబా దగ్గర ఉండే అవకాశం ఉండేది కాదు. ఇందుకే బాబా నన్ను నిన్న రానివ్వలేదు' అని అనిపించి చాలా సంతోషపడ్డాను. “లవ్యూ బాబా”
నేను మా ఇంటి దగ్గర పువ్వులు కోయడానికి ఎప్పుడు వెళ్లినా ఒక తాతగారు నన్ను తిట్టేవారు. నిజానికి ఆ చెట్టు వాళ్ళది కాదు. అయినాగానీ ఆ తాత, "ఎక్కువ కోయకు, మేము దేవుడికి పెట్టుకోవాలి" అని అనేవారు. కానీ ఎప్పుడూ పెట్టిందిలేదు. అవి చెట్టుకే ఉండి వాడిపోయేవి. సరే, అసలు విషయానికి వస్తే, నేను ఆ తాత ఏదో ఒకటి అంటరాన్న భయంతో పువ్వులు కోయడానికి వెళ్ళేటప్పుడు, "బాబా! నేను మీకోసం, వినాయకుని కోసం పువ్వులు కోస్తున్నాను. ఆ తాత రాకుండా చూడండి బాబా" అని అనుకొని వెళ్లడం మొదలుపెట్టాను. అలా బాబాని తలుచుకొని వెళ్ళినప్పుడెప్పుడూ ఆ తాత రాలేదు. నేను సంతోషంగా పువ్వులు తెచ్చుకొని బాబాకి, వినాయకునికి, శివునికి పెట్టుకొనేదాన్ని.
ఒకప్పుడు నా జుట్టు చాలా అంటే చాలా రాలిపోతుండేది. అది చూసి నాకు చాలా ఏడుపు వచ్చేది. దాంతో నాకేం చేయాలో తోచక బాబాని తలుచుకొని జుట్టు దువ్వెనతో దువ్వుకొనేదాన్ని. అదేం విచిత్రమో 'బాబా బాబా' అనుకోని దువ్వుతుంటే జుట్టు అంత ఎక్కువగా రాలేది కాదు. "థాంక్యూ బాబా".
ఒకసారి నా ఎడమ కన్ను వాపు వస్తే, ఆ కంటికి ఊదీ రాసాను. బాబా దయవల్ల రెండు రోజులలో ఆ వాపు తగ్గింది. కానీ తరువాత కుడికన్నుకి వాపు రావటం మొదలైంది. వెంటనే బాబా ఊదీ ఆ కంటికి రాసాను. అంతే, ఒక్క రాత్రిలోనే తగ్గిపోయింది. "ధన్యవాదాలు బాబా".
నా ఫ్రండ్ ఒక అబ్బాయి తన CA రిజల్ట్ వచ్చేముందు చాలా భయపడ్డాడు. కారణం తను ఫెయిల్ అవుతాడని తనకి ముందే తెలుసు. కాని వాళ్ళనాన్న తిడతారు, చంపేస్తారని తన భయం. నేను తనకి, "ఏం కాదులే. భయపడకు" అని ధైర్యం చెప్పి, "బాబా! తనని వాళ్ళనాన్న ఏమీ అనకూడదు. అలా అయితే మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా అనుగ్రహించారు. వాళ్ళనాన్న ఆ అబ్బాయిని ఒక్క మాట కూడా అనకుండా, "మళ్ళీ ప్రిపేర్ అవ్వు" అని చెప్పారు. నేను, నా ఫ్రెండ్ సంతోషంగా బాబాకి థాంక్స్ చెప్పుకున్నాం.
మా చెల్లి కాలేజీకి వెళ్ళడానికి ఇంట్లో అందరినీ ఏడిపించేసేది. అప్పుడు నేను బాబాకి ఒకటే చెప్పుకున్నాను, "బాబా! చెల్లి ప్రవర్తనలో మార్పు రావాలి. తనకి చదువు మీద ఆసక్తి కలగాలి. తను రోజూ కాలేజీకి వెళ్ళాలి" అని. తరువాత బాబా అనుగ్రహం వల్ల మా చెల్లి కాలేజీకి వెళ్తూ, అక్కడ తన ఫ్రెండ్స్‌ని చూస్తూ, "నాకు చదువుకోవాలని అనిపిస్తుంది" అని మొదటిసారి మాతో చెప్పింది. అంతకుముందు నేను చూసిన, 'ప్రతిదీ మార్పుకోసం జరుగుతుంది' అనే బాబా మెసేజ్ వాస్తవమైంది. ఇదంతా బాబా అనుగ్రహమే! "ధన్యవాదాలు బాబా. ఇలా మా చెల్లికి బాగా ఇంటరెస్ట్ వచ్చేలా చేసి మంచిగా చదువుకునేలా అనుగ్రహించండి బాబా".
ఒకరోజు ఇంట్లో తిట్టారని మా చెల్లి బయటకి వెళ్లి ఆ రాత్రి ఇంటికి రాలేదు. మేము చాలా భయపడ్డాము కానీ, అమ్మమ్మవాళ్ళింట్లో ఉండి ఉంటుందని మా మనసుకి ధైర్యం చెప్పుకున్నాము. కానీ మర్నాడు ఉదయం అమ్మమ్మవాళ్ళకి కాల్ చేస్తే, చెల్లి అక్కడ లేదని తెలిసింది. ఇంకా మా అమ్మ ఏడవటం మొదలుపెట్టింది. మా చెల్లికి ఫోన్ చేస్తే, స్విచ్ అఫ్ వచ్చింది. ‘ఆడపిల్ల కదా! ఏమైపోయింది’ అని ఒకటే టెన్షన్‌తో చెల్లి ఫ్రెండ్స్ అందరికి కాల్ చేసాం. కానీ చెల్లి ఆచూకి తెలీలేదు. ఉదయం 10 గంటలైనా తను రాలేదు. మా అమ్మ ‘ఏమైపోయింద’ని దారుణంగా ఏడుస్తుంటే నాకు అకస్మాత్తుగా బాబా గుర్తొచ్చి, “బాబా! మా చెల్లి ఎక్కడున్నా ఇంటికి వచ్చేలా చేయండి. మీకు పాలాభిషేకం చేస్తాను. మీ అనుగ్రహం తోటి భక్తులతో పంచుకుంటాను” అని మ్రొక్కుకున్నాను. బాబాని అడగటమే ఆలస్యం అన్నట్లు చెల్లి ఫోన్ ఆన్ చేసింది. ఆయన అనుగ్రహం వల్ల సరిగ్గా ఫోన్‌లో ఛార్జింగ్ అయిపోయే క్షణంలో తను మాకు ఫోన్ చేసింది. ఇంక ఇంటికి రమ్మని అందరం తనని బ్రతిమాలుకొని ఏడ్చాము. తర్వాత తను ఎక్కడుందో తెలుసుకొని వెళ్లి తెచ్చుకున్నాము. బాబాకి అడగాలన్న ఆలోచన రావడం, అడగటం ఆలస్యం – ఆ కష్టాన్ని తీర్చేసారు బాబా. అంతేకాదు, ఆరోజు నుండి చెల్లి ప్రవర్తనలో మార్పు రావటం మొదలైంది. ఇది అంతా బాబా అనుగ్రహమని మేము సంతోషించాం. కానీ ఆరోజు మేము పడ్డ బాధ అంతాఇంతా కాదు. అబ్బాయి అయితే వాడే వస్తాడని వదిలేసే వాళ్ళమేమోగాని అమ్మాయి కదా! ఎక్కడుందో, ఏమైందో, ఎవరో ఏం చేస్తారో అని చాలా భయపడ్డాము. కానీ బాబా అనుగ్రహంతో తను క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చింది. “ధన్యవాదాలు బాబా”.
ఒకరోజు నేను నా మనసులో ఉన్న ఒక అతను నాకు దూరమైపోతున్నాడని చాలా ఏడ్చాను. చివరికి నావల్ల కాక, “బాబా! నా మనసులో నుండి అతనిని తీసేయండి” అని బాబాని అడిగాను. ఇక బాబా చేసిన అద్భుతం చూడండి. ఆరోజు గురువారం. ఉదయం మా ఇంటికి దగ్గరలో ఉన్న బాబా గుడికి వెళ్ళాను. సాయంత్రం మా ఇంటి నుండి 20 నిమిషాల నడక దూరంలో వున్న మరో బాబా గుడికి వెళ్ళాను. వెళ్తూనే బాబా నవ్వుతూ నాకు దర్శనమిచ్చారు. ఆ నవ్వు ఎంతో అద్భుతంగా వుంది. నా మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది. ఆరోజు నేను నా జీవితంలో మొదటిసారి బాబా గుడిలోని సాయంత్రం హారతికి హాజరయ్యాను. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. అందరికీ సంధ్యారతి పేపర్లు ఇచ్చి మమ్మల్నే పాడమన్నారు. ఆ సమయంలో నాకు బ్లాగులోని ఒక భక్తురాలి అనుభవం గుర్తొచ్చింది. ఆమె తనకి ఉద్యోగం చేయాలని ఉంటే, తన ఇంట్లోవాళ్ళు తనకి పెళ్లి చేయాలని అనుకున్నారని, అందుచేత ఆమె బాధపడి, ఆ బాధ నుండి బయటికి రావడానికి మధ్యాహ్న హారతికి వెళ్లానని, హారతి అయ్యాక మా అమ్మ ఫోన్ చేసి నీకు ఇప్పుడే పెళ్లి చేయను, నువ్వు చదువుకో అని చెప్పిందని పంచుకున్నారు. అది గుర్తొచ్చి నేను హారతికి ముందు బాబాని ఒకటే అడిగాను, “బాబా! నా మనసులో నుండి అతనిని తీసేయండి. అతని ఊహలు, ఆలోచనల వలన నేను మీకు పూజ కూడా చేసుకోలేకపోతున్నాను. మీ నుండి దూరం చేసే ఆ ఊహలు, ఆలోచనలు నాకు వద్దు బాబా" అని. అటు పక్కకి, ఇటు పక్కకి కాకుండా బాబాకి ఎదురుగా నిల్చొని హారతి పాడాను. నాకు ఎంతో ప్రశాంతంగా అనిపించింది. ఇంతకన్నా భక్తులకి ఏం కావాలి? అంతటి అదృష్టాన్ని బాబా ఇచ్చారు. ఇంకా నేను అడిగింది చేయకుండా వుంటారా? ఆయన పుణ్యమా అంటూ పక్క రోజు నుండి నా మనసు అతనిపైకి పోవటం తగ్గింది, అందువల్ల బాధ కూడా లేదు.
పైన చెప్పిన అనుభవంలో నాతోపాటు నా ఫ్రెండ్ కూడా గుడికి వచ్చాడు. తను "హారతికి ఉండొద్దు, నేను ఉండను. ఆలస్యం అవుతుంది" అని ఏదేదో అన్నాడు. నేను, "బాబా! తను మీ హారతికి వుండేలా మీరే చూడండి" అని బాబాను అడిగాను. బాబా చేసిన చమత్కారం చూడండి. తను హరతికి ఉండటమే కాదు, ఏమాత్రం తన మనసు మళ్ళకుండా పూర్తి శ్రద్ధతో హారతిని ఆస్వాదించాడు. తనకి కూడా హరతికి హాజరవ్వడం అదే మొదటిసారి. హారతి అయ్యాక నేను అతనిని, “ఎలా అనిపించింది?” అని అడిగితే, తన నోటి నుండి మాటలు రాలేదు. తరువాత “బాగుంది” అని అన్నాడు. అది మా నాన్న(బాబా) అంటే! ఎలాంటి వాళ్ళు అయినా ఆయన దగ్గరకి వెళ్ళాల్సిందే! “ధన్యవాదాలు బాబా. నా మనసులో నుండి అతనిని పూర్తిగా తీసేయండి బాబా. ఇంకా చాలా చాలా మీ అనుగ్రహాలను బ్లాగులో పంచుకొనే మరియు చదివే అదృష్టాన్ని నాకు ఇవ్వండి బాబా. సదా మీపై మాకు భక్తి ఇంకా ఇంకా అధికమయ్యేలా మా అందరినీ అనుగ్రహించండి బాబా. మీరే మా ధైర్యం, మీరే మా దిక్కు బాబా. ఏ చిన్న కష్టం వచ్చినా మీరు ఉన్నారు అన్న నమ్మకం ఇస్తుంది ఈ బ్లాగు. ఇంతకన్నా అదృష్టం మాకు ఇంకేం కావాలి బాబా. డబ్బు లేకపోయినా పర్లేదు, మీ అనుగ్రహం ఉందనే సంతోషంతో బ్రతికేస్తాం బాబా. మీకు మాటిచ్చినట్లుగా మీ అనుగ్రహాలను పంచుకున్నాను. ఇంకా ఏమైన మార్చిపోతే గుర్తుచేయండి బాబా”.
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
ఓం సాయిరామ్
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Sai madava ki baaga chaduvu meeda interest kaligetattu cheyandi baba and Naa husband ki ahamkarm taggelafa chudu swamy
ReplyDeleteబాబా నా భర్త చాలా కోపం గా ఉంటున్నారు. చిన్న చిన్న విషయాలకు కూడా కోప పడి అరుస్తున్నారు. దాని వల్ల నాకు భయం గా ఉండి పని చేయలేక పోతున్న. మనసు బాధ ఉంటుంది. మా అత్తగారు కూడా మేము గొడవ పడాలని చూస్తుంది. ఈ రోజు ఏమి గొడవ అవుతుందో అని భయపడుతూ నాకు బాగా తలా నొప్పి వస్తుంది . ఇంకా నేను ఆఫీస్ కి బండి మీద వెళ్తూ కూడా ఈ ఆలోచన లతో సరిగా నడపలేక పోతున్న. దయ చేసి తన లో మార్పు వచ్చేలా చూడండి బాబా. మా అమ్మగారింటికి పిల్లలతో పాటు మా వారు పంపేల చూడు బాబా.
ReplyDeleteOm Sai Ram. Maa 11 nelala babu ki twaraga dhaggu mariyu jwaram thaggela anugrahinchandi baba
ReplyDeleteBaba na papa ki cold cough tagela chudu baba🙏🙏🙏 please
ReplyDeleteEe November attempt ki naa CA final ayye laga naaku ekagratha, gnapaka sakthi ivvandi Baba !
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteOm sai ram
ReplyDeleteఓం శ్రీ సాయిరాం ఓం శ్రీ సాయిరాం
ReplyDeleteOm Sai Sri Sai Jai Sai 🙏🙏🙏 ka paduTandri omsairam
ReplyDelete