సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1584వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • నమ్మినవాళ్ళకి తప్పక మేలు జరుగుతుందని నిరూపించిన బాబా

సాయిభక్తులందరికీ నమస్కారాలు. నా పేరు ఉషశ్రీ. చిన్నప్పటినుండి నాకు బాబా అంటే చాలా నమ్మకము. నా జీవితంలో అడుగడుగునా బాబా సహాయం చేస్తూనే ఉన్నారు. వాటిలో నుండి ఇప్పుడు కొన్ని అనుభవాలు పంచుకుంటున్నాను. బాబా దయవల్ల 2021, డిసెంబర్ 9న మాకు పాప పుట్టింది. అందువల్ల మేము తనకి బాబా పేరు కలిసి వచ్చేలా ‘అద్వైత సాయి’ అని నామకరణం చేసుకున్నాము. పాప పుట్టిన నాలుగు రోజుల తర్వాత తనకి జాండిస్ వచ్చింది. మాములుగా అయితే ఒక వారంలో తగ్గిపోతుంది. కానీ మా పాపకు మాత్రం ఎనిమిది వారాల వరకు వుంది. ఎందుకిన్ని రోజులు ఉందని నేను చాలా టెన్షన్ పడ్డాను, ఏమైనా లివర్ ప్రాబ్లెమ్ ఉందేమోనని చాలా భయపడ్డాను. బాలింతరాలినైనా నేను పాప కంటే ఏదీ ఎక్కువ కాదని ప్రతిరోజూ బాబా పూజ చేస్తూ, కిందనే కూర్చుని రెండు వారాలు ఆపకుండా సచ్చరిత్ర పారాయణ చేసాను. బాబా దయవల్ల రోజురోజుకి పాప కళ్ళలో పసుపురంగు తగ్గుతూ రెండు వారాల్లో మాములుగా తెలుపు రంగులోకి వచ్చాయి. నమ్మినవాళ్ళకి తప్పక మేలు జరుగుతుందని బాబా నిరూపించారు.


2022, డిసెంబరులో పాపకి కోవిడ్ వచ్చి నలభైరోజులు చాలా బాధపడింది. ఆ సమయంలో బ్లడ్ సాంపిల్స్, ఇంజెక్షన్స్ వల్ల తను చాలా ఇబ్బందిపడింది. నేను నా మనసులో ప్రతిరోజూ బాబాని తలుచుకొని, "పాపకి తొందరగా తగ్గాల"ని కోరుకున్నాను. చివరికి బాబా దయతో పాపకి నయమైంది.

 

2023, జూన్ నెల చివరిలో కోల్డ్ వైరస్ వల్ల మా పాప ఒక రెండు వారాలు ముక్కు దిబ్బడతో బాగా ఇబ్బంది పడింది. మధ్యలో ఒక రెండుసార్లు జ్వరం కూడా వచ్చింది. నయం కావడానికి కొంచెం సమయం పట్టినా చివరికి తగ్గింది. కానీ వెంటనే మళ్లీ వచ్చింది. అప్పుడు నాకు కొంచెం టెన్షన్ వేసింది. 'ముందు వైరస్ సోకి తగ్గడానికి ఇన్ని రోజులు సమయం పట్టింది. మళ్లీ ఇంకొకసారి వచ్చింది. మళ్లీ ఎంత సమయం పడుతుందో తగ్గడానికి' అని చాలా భయపడ్డాను. వెంటనే బాబాకి పూజ చేసుకొని, "బాబా! పాపకు తొందరగా తగ్గితే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని చెప్పుకున్నాను. అద్భుతం! మరుసటిరోజే పాపకి కోల్డ్ తగ్గిపోయింది


మేము 2023, ఏప్రిల్ నెల చివరిలో హోమ్ లోన్ కోసం అప్లై చేసాము. మాములుగా అప్రూవల్ అయింది, లేనిది పదిరోజులలో చెప్పేస్తారు. కానీ మా విషయంలో రెండు నెలలైనా ఆ డాకుమెంట్స్ కావాలి, ఇవి కావాలని, అన్ని డాకుమెంట్స్ సరిగా సబ్మిట్ చేసినా కూడా ప్రాసెస్ డిలే చేసారు. దాంతో నా భర్త ఆశలు వదిలేసుకున్నారు. నాకు మాత్రం ఖచ్చితంగా బాబా మాకు సహాయం చేస్తారని నమ్మకము ఉండటంతో ప్రతిరోజూ బాబాకి చెప్పుకొని సచ్చరిత్రలో ఒక అధ్యాయం చదవటం మొదలుపెట్టాను. ఇంకా "బాబా! మాకు లోన్ అప్రూవల్ అయితే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని మొక్కుకున్నాను. రెండు రోజుల తర్వాత మా లోన్ అప్రూవల్ అయిందని ఏజెంట్ కాల్ చేసారు. నాకైతే చెప్పలేని ఆనందం కలిగింది. 


ఒకసారి నాకు జలుబు వల్ల చాలా దగ్గు వస్తుండేది. ఆ కారణంగా నాకు రాత్రిళ్ళు చాలా ఇబ్బంది కలుగుతుండేది. నేను మనసులో, "తొందరగా నాకు ఈ ఇబ్బంది నుండి ఉపశమనం కలిగించండి. మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకుంటుండేదాన్ని. కానీ  రెండు రోజులైనా తగ్గలేదు. అప్పుడు మళ్లీ, "బాబా! నాకు ఎందుకు తగ్గట్లేదు? నాకు మీరే దిక్కు" అని బాగా ఆర్తిగా బాబాను వేడుకున్నాను. విచిత్రంగా మరుసటిరోజే జలుబు తగ్గిపోయి చాలా ఉపశమనం కలిగింది. ఇలా నేను బాబాను కోరిక కోరుకున్న ప్రతిసారీ ఆయన నాకు సహాయం చేసారు. నమ్ముకున్న వాళ్ళని బాబా ఎప్పుడూ మోసం చేయరు. మన పక్కనే ఉండి మనల్ని కాపాడుతూ ఉంటారు. మనం వేరే దేశం వెళ్లినా మనతోనే ఉండి కాపాడుతారు. నా జీవితంలో అడుగడుగునా నన్ను, నా కుటుంబాన్ని కాపాడుతూ వస్తున్నారు. బాబాకి సాధ్యం కానిది ఏదీ లేదు. నేను ఆయన భక్తురాలునైనందుకు చాలా గర్వపడుతున్నాను. "బాబా! ఇలాగే నన్ను, నా కుటుంబాన్ని సదా కాపాడండి. మీకు శతకోటి ధన్యవాదాలు బాబా". 

 

అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!!!


13 comments:

  1. ఓం సాయిరామ్

    ReplyDelete
  2. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  3. బాబా మీ రోజున నేను కొత్తగా మానసిక మందులు వాడటం మొదలు పెడుతున్నాను.అవి నాకు పడేలాగ ఆశీస్సులు అందించు బాబా.ఆ మందులు వాడితే చాలా బాధ పెడుతుంది.వాడక పోతే మన్హశాంతి వుండదు.సహాయం చేయి సాయి బాబా.ఓం సాయి రామ్

    ReplyDelete
    Replies
    1. Don’t worry, Baba bless you always 🙏🙏🙏

      Delete
  4. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  5. Sai baba today my son sai madava is writing English and social studies exams pl bless him to write the exams well. Also please guide my mother in law to adjust to live withus. Also I pray that if saimadava get A1 in all subjects I will share that experience in this blog sai

    ReplyDelete
  6. ఓం సాయి రామ్ నా మానసిక సమస్యకి శాశ్వత పరిష్కారం చూపించు బాబా తండ్రి.6నెలల నుండి బాధ పడుతున్నాను . తప్పు అంతా నాదే ఒక చెడు ఆలోచనలు నెగెటివ్ గా మారి . నా జీవితం నరకం అయింది.దాని లోంచి బయటకి రాలేకపోతున్నా.సహాయం చేయి సాయి నాన్న

    ReplyDelete
  7. నాకు పూర్తి ఆరోగ్యం ప్రసాదించిన తర్వాత.నీ అనుగ్రహం, సాయి సన్నిధి లో పంచుకుంటాను.దారి చూపించు బాబా.గురు పౌర్ణమి కి ముందు మీ దర్శనం షిరిడీ లో చేసుకున్నాను.మీ ఆశీస్సులతో రాగలిగాను .ఓం సాయి రామ్

    ReplyDelete
  8. సాయి నా భర్త నన్ను అర్థం చేసుకో నా కోసం తిరిగి వచ్చేసేలా చూడు సాయి నన్ను అర్థం చేసుకుని నిలబెట్టు సాయి భర్తకు దూరంగా ఉంటూ నేను పడే మానసిక బాధ అవమానాలు అన్నీ మీకు తెలుసు సాయి నీ మీద నమ్మకంతో ఎదురుచూస్తున్నాను బాబా కాపాడు బాబా నాకు నా భర్తతో కలిసి బతికే అదృష్టాన్ని ప్రసాదించు బాబా నా జీవితంలో వెలుగు నింపు బాబా నా వలన తల్లిదండ్రులకు కృంగిపోతున్నారు

    ReplyDelete
  9. Om sri Sai Ram baba maa Annayya ki elaainaa pelli ayyelaa chudu baba maa Annayya ki pelli kudirite nenu naa nubhavani panchukunttanu baba om sri Sai Ram

    ReplyDelete
  10. Omsaisrisaijaisaikapdu Tandri

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo