సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1596వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఊదీ రూపంలో వ్యక్ష్టమవుతున్న బాబా కృప
2. బాబా ఎల్లప్పుడూ మనతో ఉంటారు - మనం ఆయన మీద విశ్వాసముంచితే చాలు

ఊదీ రూపంలో వ్యక్ష్టమవుతున్న బాబా కృప


ఓం శ్రీసాయినాథాయ నమః!!! నేను ఒక సాయిభక్త రేణువుని. నేను బాబాను దేవునిగా కాకుండా నా కన్నతండ్రిలా భావిస్తాను. ఆయన కూడా నన్ను బిడ్డలా ఆదరిస్తున్నారు. అడుగడుగునా మాకు అండగా ఉంటున్నారు. పూర్వ జన్మలో మేము చేసుకున్న పాపపుణ్యాల చిట్టా బాబాకే తెలుసుగాని ఆయన ప్రేమను పొందుతున్న నేను, నా కుటుంబం చాలా అదృష్టవంతులం. ఆయన ఊదీ మహిమ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎందుకంటే, బాబా కృప ఊదీ రూపంలో ఉందని మన అందరికీ తెలిసిందే. మా అమ్మ వయస్సు 60 సంవత్సరాలు. ఈమధ్య ఒకరోజు అమ్మ నాకు ఫోన్ చేసి, "నిన్నటి నుండి మూత్రంలో రక్తం వస్తుంది, కడుపునొప్పిగా ఉంది" అని చెప్పింది. అమ్మకి కిడ్నీలో స్టోన్ ప్రోబ్లం ఉంది. ఆ సమస్యేనా లేక వేరే ఏదైనా సమస్యా అని నాకు చాలా భయమేసింది. వెంటనే బాబాను ప్రార్థించి నా నుదుటన ఊదీ పెట్టుకొని, మరికొంచెం నోట్లో వేసుకొని, "అమ్మకి ఏం సమస్య కాకుండా చూడు బాబా, తనకి ఏం కానివ్వకు" అని వేడుకున్నాను. ఒక గంట తరువాత అమ్మ "ఇప్పుడు సమస్య ఏం లేదు" అని చెప్పింది. ముందురోజు నుండి ఉన్న సమస్య బాబా ఊదీ వలన వెంటనే తగ్గిపోయినందుకు నిజంగా చాలా ఆనందంగా అనిపించింది. మరుసటిరోజు స్కానింగ్, ఇంకా వేరే పరీక్షలు చేయిస్తే చిన్న ఇన్ఫెక్షన్ అని తెలిసింది. మందులు వాడాక ఇప్పుడు అమ్మకి బాగుంది. "చాలా ధన్యవాదాలు బాబా.  మీకు ఎన్ని నమస్కారాలు పెట్టిన తక్కువే".


ఒకసారి ఒక వారం రోజులపాటు నా కళ్ళు చాలా దురదగా, మంటగా అనిపించాయి. కంట్లో డ్రాప్స్ వేసుకున్న తగ్గలేదు. అప్పుడు నా దగ్గర ఉన్న దత్తుని భస్మం, బాబా ఊదీ కలిపి కళ్ళ చుట్టూ వ్రాసి "తగ్గేలా చూడమ"ని బాబాని వేడుకున్నాను. తరువాత రోజుకి కళ్ళ సమస్య తగ్గిపోయింది.


2023, మార్చిలో ఆరోగ్య సమస్యల వల్ల విపరీతంగా నా తలమీద వెంట్రుకలు ఊడిపోవడం మొదలైంది. మందులు వాడుతున్నా తగ్గలేదు. రెండునెలల వ్యవధిలో నా జడ సగమైంది. నాకు చాలా బాధగా అనిపించి ఒకరోజు కొద్దిగా ఊదీ, దత్త భస్మం నోట్లో వేసుకొని, "ఈ సమస్య తగ్గిపోవాలి" అని అనుకున్నాను. ఆశ్చర్యంగా ఆ వారం నుండి సమస్య కొద్దికొద్దిగా తగ్గుతూ ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. అంతా దత్తసాయి కృప.


నేను ఇదివరకు నా ఫోన్ డిస్‌ప్లే పాడైతే ఊదీ పెట్టిన తరువాత బాగైన అనుభవం మీతో పంచుకున్నాను. అలాంటివే ఇప్పుడు మరో రెండు అనుభవాలు చెప్తాను. అయితే ఇంత చిన్న విషయాలు బాబాతో చెప్పుకోవాలా అని మీరు అనుకుంటారేమోననిపించింది కానీ, మళ్ళీ బాబా ప్రేమను పంచుకోవటానికి బిడియం ఎందుకు అని వ్రాస్తున్నాను. 2023, మే నెలలో ఒకరోజు మధ్యాహ్నం మా ఇంట్లో ఫ్యాన్ హఠాత్తుగా ఆగిపోయింది. అప్పుడు, 'అది ఇక పనిచేయదు. చాలా పాతదైంది. కాబట్టి సాయంత్రం కొత్తది కొనాలి' అని అనుకున్నాం. కానీ ఒక గంట తరువాత నాకెందుకో 'ఊదీ పెడితే పని చేస్తుందేమో!' అని అనిపించింది. అయితే ఫ్యాన్ నాకు అందదు కాబట్టి ఊదీ నా నుదుటన పెట్టుకొని 'ఫ్యాన్ బాగవ్వాలి' అని అనుకున్నాను. కానీ అది బాగవుతుందని అనుకోనందువల్ల ఆ విషయం అంతటితో మర్చిపోయాను. అయితే ఆరోజు సాయంత్రం అలవాటు ప్రకారం ఆ ఫ్యాన్ ఆన్ చేయగానే బాగానే పని చేసి ఈరోజు వరకు పని చేస్తుంది. తరువాత వాటర్ హీటర్ కూడా అలాగే పని చేయకుంటే ఊదీ పెట్టగానే పనిచేసింది. అంతా బాబా దయ. ఆయన లీలలకు అంతులేదు. ఇన్ని లీలలు చూపిస్తున్న బాబా మా జీవితంలోని ఒక పెద్ద సమస్యను మాత్రం తీర్చటం లేదు. Q&A సైట్ ద్వారా సానుకూల సమాధానాలు ఇస్తున్నారు కానీ, సమస్య ఎప్పుడు తీరుతుందో తెలియడం లేదు. అయితే ఇన్ని అనుభవాల ద్వారా మాలో నమ్మకాన్ని నింపుతున్న బాబా, సమయం వచ్చినపుడు ఆ సమస్యను తప్పకుండా తీరుస్తారని నేను అనుకుంటున్నాను. "శతకోటి ధన్యవాదాలు సాయిదేవా".


బాబా ఎల్లప్పుడూ మనతో ఉంటారు - మనం ఆయన మీద విశ్వాసముంచితే చాలు


నా పేరు ప్రసన్న. 2023, జూలై 26, బుధవారంనాడు మా అమ్మ ఆరోగ్యం బాగోలేదని నాకు తెలిసింది. డాక్టర్లు గుండెకు సంబంధించిన సమస్యగా అనుమానించారు. మరుసటిరోజు ఈ బ్లాగు నా కంటపడింది. నేను తోటి భక్తుల అనుభవాలు చదివి, "బాబా! అమ్మ ఆరోగ్యం బాగుంటే, మీ అనుగ్రహాన్ని బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాన"ని బాబాను ప్రార్థించాను. ఒక గంటలో "ప్రమాదమేమీ లేదు. ఇప్పుడు తను బాగానే ఉంద"ని నాకు ఫోన్ వచ్చింది. ఈ అనుభవం బాబా ఎల్లప్పుడూ మనతో ఉంటారని, మనం ఆయన మీద విశ్వాసముంచితే చాలని తెలియజేసింది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".


9 comments:

  1. ఓం సాయి రామ్ నేను వండే ఆహారం లో సాయి ఊదీ మహాత్మ్యము ఆరోగ్యం బాగుపడటం వలన తెలుస్తోంది.ఊదీ బాబా యిచ్చిన అమృతంతో కన్నా విలువైనది.

    ReplyDelete
  2. ఆహారం లో వేస్తాను.మం‌చి ఫలితాలు ఉంటాయి.ఊదీ దివ్య మైన ఔషదం.ఓం సాయి రామ్

    ReplyDelete
  3. OmsaikapaduTandri

    ReplyDelete
  4. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  5. ఓం సాయిరామ్

    ReplyDelete
  6. ఓం శ్రీ సాయిరాం

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo