సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1587వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • శ్రీసాయి కరుణావీక్షణలు

సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు పద్మావతి. నా పెద్ద కుమారుడు జర్మనీలో MS చేశాడు. తను 2 సెమిస్టర్‌‌లో ఉన్నపుడు ఇంటర్న్‌షిప్ కొరకు కేవలం 2, 3 కంపెనీలకే అప్లై చేసాడు. వెంటనే వాటిలో ఒక కంపెనీకి సెలెక్ట్ అయి, ఇంటర్న్‌షిప్ పూర్తి చేశాడు. ఇది కేవలం బాబా దయవల్ల మాత్రమే జరిగిందని మా నమ్మకం. ఎందుకంటే, జర్మనీలో మా కుమారుని స్నేహితులు 10, 15 మంది దాదాపు 50 నుండి 100 కంపెనీలకు అప్లై చేసినా కూడా వాళ్ళకి ఇంటర్న్‌షిప్ రాలేదు. అదీకాక కోవిడ్ వల్ల ఎవరినీ అంత తొందరగా సెలెక్ట్ చేయడం లేదు ఆ సమయంలో. అలాంటిది మా కుమారుడు రెండవ అప్లికేషన్‌కే సెలెక్ట్ అయి ఇంటర్న్‌షిప్ పూర్తిచేశాడు.


తరువాత మా కుమారుడు ఇంకో ఇంటెర్న్‌షిప్ కోసం మరో కంపెనీకి అప్లై చేసాడు. ఆ కంపెనీ జర్మనీలోని టాప్ 10 కంపెనీలలో ఒకటి. మా కుమారునికి ఆ కంపెనీలో ఇంటర్న్‌షిప్‌తో పాటు 'తీసిస్' అనగా ప్రాజెక్ట్ వర్క్ కూడా పూర్తి చేయాలని కోరిక. కారణం, చివరి సెమిస్టర్లో ప్రాజెక్ట్ వర్క్ తప్పనిసరిగా చేయవలసి వుంది. మా కుమారుని స్నేహితులు కూడా ఆ కంపెనీకి అప్లై చేసారు. కానీ వాళ్ళు సెలెక్ట్ కాలేదు. మా కుమారుడు నాతో, "ఆ కంపెనీవాళ్ళు అంత తొందరగా సెలెక్ట్ చేయరు. బాబా దయవల్ల నేను సెలెక్ట్ అయితే బాగుంటుందమ్మా" అని అన్నాడు. నేను బాబాను, "మా కుమారుడిని ఆ కంపెనీ సెలెక్ట్ చేసేటట్లు చేయండి బాబా" అని వేడుకున్నాను. తర్వాత మా కుటుంబసభ్యులందరం కలిసి శిరిడీ వెళదామని మా కుమారుడు ఇండియా వచ్చాడు. మావారు 2023, మే 12వ తేదీకి టికెట్లు బుక్ చేశారు. 2023, మే 5వ తేదీన ఆ జర్మనీ కంపెనీవాళ్ళు, 'మే 8న ఇంటర్వూకి హాజరవ్వమ'ని మెయిల్ చేశారు. మా బాబు మే 8న ఇంటర్వూకి హాజరై బాగా పూర్తిచేసాడు. కంపెనీవాళ్ళు, 'త్వరలో ఏ విషయం మెయిల్ ద్వారా తెలియజేస్తామ'ని చెప్పారు. నేను బాబాను, "మా కుమారుడు ఈ ఇంటర్వూలో సెలెక్ట్ అయ్యేటట్లు చూడు తండ్రీ" అని వేడుకున్నాను. నేను 6 రోజుల ముందు శిరిడీలో బాబా సేవకోసం వెళ్లగా మే 12వ తేదీన నా భర్త, కుమారులు శిరిడీ ప్రయాణానికి బయలుదేరి ఇంటినుండి బయటకు వచ్చారు. ఎందుకో మా కుమారునికి  మెయిల్ చూడాలనిపించి చూస్తే, ఆ కంపెనీవాళ్ళు 'మా కుమారుని సెలెక్ట్ చేసినట్లు తెలియజేసి 15వ తేదీన జాయిన్ అవ్వమ'ని మెయిల్ పెట్టి ఉన్నారు. అందరం చాలా సంతోషించాము. ఎందుకంటే, గతంలో ఆ కంపెనీ ఏ ఇంటర్వూ చేసినా నెల రోజులు తరువాతనే రిప్లై ఇచ్చేదట. అలాంటిది 4 రోజులలోనే మాకు రిప్లై ఇచ్చింది. అదికూడా శిరిడీ ప్రయాణానికి బయలుదేరేటప్పుడు రావడం బాబా మిరాకిల్ కాక ఇంకేంటి?.


ఇకపోతే, ఆ సమయంలో మా కుమారుడు ఇండియాలో ఉన్నందున 15వ తేదీన జాయిన్ అవ్వడానికి కుదరదని టెన్షన్ పడ్డాడు. మేము తనతో, "బాబా మీద భారమేసి జూన్ 15న జాయిన్ అవుతానని, అందుకు అనుమతించమని అడుగుతూ మెయిల్ చేయమ"ని చెప్పాము. తను అలాగే చేశాడు. బాబా దయవల్ల జూన్ 12న జాయిన్ అవ్వమని మరుసటిరోజే కంపెనీ రిప్లై ఇచ్చింది. మా కుటుంబసభ్యులందరం శిరిడీలో బాబా దర్శనం చేసుకున్నాము. నాకు 4 హారతులలో పాల్గొనే అవకాశం దక్కింది. శిరిడీకి సమీపంలో ఉన్న సప్తశృంగేరి మాత ఆలయం కూడా దర్శించి మే16న తిరిగి క్షేమంగా ఇంటికి వచ్చాము. మా బాబు మే 31న బయలుదేరి క్షేమంగా జర్మనీ చేరుకొని, జూన్ 12న కంపెనీలో ఎటువంటి ఇబ్బందీ లేకుండా జాయిన్ అయ్యాడు. అంతా బాబా దయ.  "ధన్యవాదాలు బాబా".


నేను గవర్నమెంట్ స్కూలులో టీచరుగా పని చేస్తున్నాను. ఒకరోజు నేను స్కూలుకి వెళ్లి  తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు బస్సు అందుకునే క్రమంలో వడివడిగా నడిచినందువల్ల నేను ముందుకు పడిపోయాను. నా మోకాలు నేలకు తగిలి విపరీతమైన నొప్పి, వాపు వచ్చి నడవడానికి రాలేదు. నేను మోకాలుకి ప్యాక్చర్ అయిందేమోనని భయపడ్డాను. ఇంటికి వచ్చిన తరువాత నా చిన్న కుమారుడు(తను డాక్టర్) చూసి, "ప్యాక్చర్ అవలేదు. 3, 4 రోజులలో తగ్గుతుంద"ని అన్నాడు. నేను బాబాను, "కాలుకి ఎటువంటి ప్యాక్చర్ అవ్వకుండా చూడండి. అలాగే నొప్పి తగ్గించమ"ని చెప్పుకొని రోజూ ఊదీ రాసుకున్నాను. 3, 4 రోజులకు నొప్పి కొద్దిగా తగ్గింది. అయినా నా భయం వల్ల కాలు ఎక్స్-రే తీయిద్దామని నా చిన్న కుమారుడితో చెప్పి హాస్పిటల్‌కి వెళ్లి ఎక్స్-రే తీయించుకున్నాను. ఎటువంటి దెబ్బ లేదని, కేవలం వత్తిడి వల్ల నొప్పి వస్తుందని మందులతో తగ్గుతుందని చెప్పారు. తర్వాత చాలావరకు నొప్పి తగ్గింది. "కాలుకు ఎటువంటి ప్యాక్చర్ లేకుండా చేసినందుకు ధన్యవాదాలు బాబా. నా చిన్న కుమారుడికి తను కోరుకున్న కోర్సుతో మంచి కాలేజీలో మెడికల్ పీజీ సీటు వచ్చేలా దీవించండి. అలాగే నా ఇద్దరు కుమారులకు మంచి భవిష్యత్తును ఇవ్వండి. మా కుటుంబాన్ని, బంధుమిత్రులందరినీ చల్లగా చూడండి తండ్రీ".


11 comments:

  1. ఓం సాయిరామ్

    ReplyDelete
  2. ఓం సాయి రామ్ నేను ఒక మందు వాడుతున్నా దాని వల్ల దురదలు వస్తాయి.దురదలు రాకుండా కాపాడు తండ్రీ.అ మందు తప్పక వాడాలి.పడేలాగ చేయి సాయి.నా మానసిక సమస్యలు తగ్గించు సాయి దేవుడా

    ReplyDelete
  3. Baba nenu bp vachhi Kalu Cheye
    sariga pani cheyatamuledu swami naku nadaka Cheyenne swadinamu ravalani nennu vedukotunanu baba Taggart ganey nenu Australia nudivachaka striding vastanu baba.

    ReplyDelete
  4. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  5. Omsaisrisaijaisaikapdu Tandri

    ReplyDelete
  6. ఓం శ్రీ సాయి రామ్

    ReplyDelete
  7. Om Sai Ram
    Om Sai Ram
    Om Ssi Ram
    Om Sai Ram
    Om Sai Ram

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo