సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1592వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఆఫీసు సమస్యలు పరిష్కరించిన బాబా
2. బాబా చూపిన అద్భుత అనుగ్రహం

ఆఫీసు సమస్యలు పరిష్కరించిన బాబా


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!! నా దైవం సాయినాథునికి శతకోటి వందనాలు. నా పేరు అమర్నాథ్. నేను నా ఉద్యోగరీత్యా ప్రతిదినము ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్ని నా పరిధిలోనే పరిష్కారం అవుతాయి. కొన్ని నా పరిధికి మించి ఉంటాయి. అలాంటి విషయాల్లో నేను చాలా సంఘర్షణకు లోన్ కావాల్సి వస్తుంది. మా దగ్గర పనిచేసే ఒక లోకల్ కాంట్రాక్టరుకి పేమెంట్ ఇవ్వడం చాలా ఆలస్యమైంది. అతను రోజూ నాకు ఫోన్ చేసే సతాయిస్తుండేవాడు. నేను రోజూ "త్వరగా ఈ సమస్యను పరిష్కరించమ"ని బాబాను ప్రార్థిస్తుండేవాడిని. కానీ అతని పేమెంట్ హెడ్ ఆఫీసువాళ్ళు రిలీజ్ చేయకపోవడం వల్ల సమస్య పరిష్కారమయ్యేది కాదు. చివరికి 2023, మేలో ఆ కాంట్రాక్టర్ తన పేమెంట్ కోసం నానా గందరగోళం చేశాడు. నా మీద కేసు కూడా పెట్టి నన్ను చాలా క్షోభకు గురిచేశాడు. తన టిప్పర్లు ఫ్యాక్టరీ గేటుకి అడ్డంగా నిలిపి నానా యాగీ చేసాడు. హెడ్ ఆఫీసువాళ్ళు అక్కడే పరిష్కరించుకోండి అంటారు. ఇతను నేను చెప్పేది వినేవాడు కాదు. ఇటువంటి పరిస్థితుల్లో నేను బాబాని, "ఈ సమస్యను త్వరగా పరిష్కరించి ఈ సమస్య నుండి నన్ను బయటపడేయండి బాబా" అని గట్టిగా ప్రార్థించాను. బాబా దయవల్ల ఆఖరికి పోలీసుస్టేషన్‌లో పంచాయతీ జరిగి త్వరలో అతనికి డబ్బులు ఇచ్చేస్తామని రాజీ కుదుర్చుకున్నాము. అలాగే 2023, జూలై 22న అతని డబ్బులు అతనికి ఇచ్చేసాము. బాబా దయతో ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది.


2023, జూలైలో మా సైట్ నుండి కొన్ని టిప్పర్లు ఆంధ్రాకి పంపించాము. వాటిని ఒక ఇంజనీరు తీసుకొని వెళ్లాడు. అతను దారి తప్పి మాములుగా వెళ్లాల్సిన దారిలో కాకుండా వేరే దారిలో టిప్పర్లను తీసుకొని వెళ్ళాడు. ఆ దారిలో కొన్ని టిప్పర్లు చేడిపోయి చాలా ఇబ్బంది అయింది. అదికాక ఆ దారిలో టోల్ గేట్లు, ఆర్టీవో సమస్యలు చాలా ఎక్కువ. కొన్ని టిప్పర్లకి ఫిట్నెస్ కూడా అయిపోతుంది. అందువల్ల నేను బాబాని తలుచుకొని "అన్ని టిప్పర్లు సక్రమంగా గమ్యం చేరితే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా దయవల్ల తర్వాత ఏ ఇబ్బంది లేకుండా టిప్పర్లన్నీ సక్రమంగా గమ్యం చేరాయి. "ధన్యవాదాలు సాయినాథ. నేను నా పిల్లలు చదువు గురించి కొన్ని కోరికలు కోరుకున్నాను. త్వరలో వాటిని తీర్చు సాయి. త్వరలో కుటుంబసమేతంగా శిరిడీ వచ్చి మీ దర్శనం చేసుకుంటాను. నా రోజువారీ కార్యక్రమాలు ఆనందంగా జరిగేటట్లు ఆశీర్వదించు సాయి".


సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!!!


బాబా చూపిన అద్భుత అనుగ్రహం


సాయిభక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు మోహన్. సుమారు 2023, మేలో నేను సీరియస్‌గా ఒక సింగిల్ రూముకోసం వెతకడం ప్రారంభించాను. కానీ ఇంటి యజమానులు కుటుంబం లేనందున సింగిల్ రూము కూడా అద్దెకి ఇవ్వడానికి ఇష్టపడలేదు. అందువల్ల 2 నెలలు తిరిగితిరిగి నా పరిస్థితి చాలా దారుణంగా తయారైనప్పటికీ నాకు రూము దొరకలేదు. చివరిగా జూలై నెల ఆరంభంలో ఒకరోజు ఉదయం నేను బాబా గుడికి వెళ్లి "బాబా! ప్రస్తుతం ఉంటున్న ఇంటికి ఈరోజే ఆఖరిరోజు. అద్దె ఎక్కువగా అడుగుతున్నందున ఖాళీ చేస్తున్నాను. ఈరోజు మీరు నాకు ఒక సింగిల్ రూమ్ చూపించినట్లైతే నేను మీకు చాలా కృతజ్ఞుడై ఉంటాను. మీ అనుగ్రహాన్ని బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాను. మీరు నాకు రూమ్ చూపకుంటే ఉద్యోగం వదిలేసి నేను తిరిగి నా స్వగ్రామానికి వెళ్ళిపోతాను" అని గట్టిగా బాబాని ప్రార్థించి ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు చాలా తీవ్రంగా రూముకోసం వెతికాను. కాని ఒక్క ఇల్లు కూడా అందుబాటులో దొరకలేదు. చివరికి నేను బాబాను మరోసారి ప్రార్థించి భోజనం చేయకుండానే నిరాశతో నా ఆఫీసుకు వెళ్తూ ఒక నల్ల కారు ఒక పాత అపార్ట్‌మెంట్‌‌లోకి వెళ్లడం చూసాను. ఆ అపార్ట్‌మెంట్‌లో పది ఇల్లులున్నా ఒక్క కుటుంబం కూడా అందులో నివాసముండట్లేదు. నేను పరుగున వెళ్లి ఆ కారు యజమానిని, "సార్! మీరు ఈ అపార్ట్మెంట్ ఓనరా?" అని అడిగాను. అందుకతను, "నేను ఓనర్‌ని కాదు. నేను ఈ అపార్టుమెంటులో నా ఆఫీసుకోసం డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు అద్దెకు తీసుకున్నాను. కానీ ఒక బెడ్‌రూమ్ మాత్రమే వాడుకుంటున్నాను" అని చెప్పి, "ఇంతకీ నీ సమస్య ఏమిటి?" అని నన్ను అడిగారు. "నేను ఒక సింగల్ రూమ్‌కోసం వెతుకుతున్నాన"ని అతనితో చెప్పాను. అప్పుడు అతను, "కావాలంటే మీరు నా ఫ్లాట్‌లో ఉండొచ్చు. మీకు అభ్యంతరం లేకపోతే వేరే బెడ్‌రూమ్‌లో మీరు ఉండండి" అని అన్నారు. అది విని నా ఆనందానికి హద్దులు లేవు. 'సాయినాథా' అని ఊపిరి తీసుకున్నాను. తరువాత నేను అతనితో, "నాకు అభ్యంతరం లేదు. నేను అద్దె ఎంత ఇవ్వాలి?" అని అడిగాను. అందుకతను, "మీ ఇష్టం. మీరు ఇచ్చినా, ఇవ్వకపోయినా ఒకే" అని అన్నారు. అది విని నేను పూర్తిగా ఆశ్చర్యంలో మునిగిపోయాను. బాబా ఆశీస్సులతో నేనిప్పుడు అతని ఫ్లాట్‌లోనే సంతోషంగా ఉంటున్నాను. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".


6 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. ఓం సాయిరామ్

    ReplyDelete
  3. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  4. Saibaba pl bless my son sai madava to concentrate on his studies, behaviour, respect elders, dont show angry to anybody , also I pray to give patience to my husband, respect woman , dont get angry baba. I trusted you only baba to motivate both my son and husband.

    ReplyDelete
  5. నేను బ్లాగ్ లో నా అనుభవాలు పంచుకోవడానికి ఎలా ఎంటర్ అవ్వాలో తెలియడం లేదు

    ReplyDelete
  6. Sai na vamsi manasu marchukoni nakosam thirigi vachesela chudu baba sai nannu bary ga swikarinchela chudu said naku a Bart ha tho kalisi brathike adhrustanni prasadinchu baba sai

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo