సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1583వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • బాబా ప్రేమ, కరుణలకు నిదర్శనాలు

ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః!!! సాయిభక్తులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు జయలక్ష్మి. నా వయసు 38 సంవత్సరాలు. నాకు 14 సంవత్సరాల వయస్సు ఉన్నప్పటినుండి నేను బాబాను ప్రార్థిస్తున్నాను. బాబా నా ప్రతి కష్టంలో, విజయంలో నాకు తోడుగా నిలిచారు. నేను నా అనుభవాలను పంచుకోవాలని ఎప్పటినుండో ఎదురుచూస్తున్నాను. 'సాయి మహరాజ్ సన్నిధి' అనుభమాలిక ద్వారా ఇన్నాళ్లకు ఆ అదృష్టం నాకు కలిగింది. అందుకు సాయినాథునికి నా కృతజ్ఞతలు.


ఈ అనుభవాలను చదివితే బాబా తమ భక్తులపై ఎంత ప్రేమను, కరుణను చూపిస్తారో అర్థం అవుతుంది. 2007వ సంవత్సరంలో MSc పూర్తి చేసిన తర్వాత ఒక నెల వ్యవధిలో నేను బాబాని ప్రార్థించి ఒక ఇంటర్వ్యూకి వెళ్లాను. బాబా దయవలన నాకు ఆ ఉద్యోగమొచ్చి జూనియర్ లెక్చరర్‌గా నా వృత్తి జీవతాన్ని మొదలుపెట్టి ఇప్పటివరకూ అదే ఉద్యోగంలో కొనసాగుతున్నాను. ఆ ఉద్యోగంలో చేరిన తర్వాత మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూడటం ప్రారంభించారు. మొదట ఒక గవర్నమెంట్ ఉద్యోగి సంబంధం వచ్చింది. పెళ్లిచూపులు జరిగిన తర్వాత మిగతా విషయాల్లో కుదరక జాప్యం కాసాగింది. అప్పటికే బాబా అనుగ్రహం వలన నాకు ఎన్నో బాధల నుండి ఉపశమనం లభించి ఉన్నందున నేను బాబాకు నమస్కరించి, "మీరు ఏ సంబంధం మంచిదని ఖాయం చేస్తారో, ఆ సంబంధాన్ని నేను చేసుకుంటాన"ని ఆయనతో విన్నవించుకున్నాను. కట్నకానుకల విషయంలో ఆ మొదట వచ్చిన సంబంధం కుదరలేదు. తెలిసిన వాళ్లంతా, "ఆ సంబంధం చాలా మంచిది. మీరు అనవసరంగా పోగొట్టుకుంటున్నారు" అని అన్నారు. నేను మాత్రం, 'ఈ సంబంధం బాబాకి ఇష్టం లేదు, ఆయనే మంచి సంబంధం కుదురుస్తార'ని అనుకున్నాను. ఆ సంబంధం తప్పిపోయిన నెల రోజులలో ఒక గురువారంనాడు హనుమాన్ జంక్షన్ నుండి ఒక మంచి సంబంధం వచ్చింది. మరుసటి గురువారానికి నేను వాళ్లకి నచ్చనని సంబంధం ఖాయం చేసుకుని వెళ్లారు. 2008, ఆగస్టులో నా పెళ్లి జరిగింది. అది బాబా నాకు ప్రసాదించిన ఒక వరం. చాలా మంచి కుటుంబాన్ని, మంచి భర్తని, ఆపై ఇద్దరు పిల్లల్ని ఇచ్చి నేను సంతోషంగా జీవించేలా ఆశీర్వదించారు బాబా.


ఇప్పుడు ముందు తప్పిపోయిన గవర్మెంట్ ఉద్యోగి సంబంధం అతని గురించి ఒక విషయం చెప్తాను. అతనికి పెళ్ళైన ఎనిమిది నెలలకి భార్య గర్భవతిగా ఉండగా స్కూల్లో పాఠం చెప్తూ గుండెపోటు వచ్చి అక్కడికక్కడే చనిపోయాడు. బాబా ఆ సంబంధాన్ని తప్పించి నాకు కష్టం రాకుండా కాపాడారు. బాబాను నమ్మినవారికి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగదు. ఆయన తమని నమ్మిన భక్తులకు ఏది మంచిదైతే అదే ఇస్తారు, అంతే తప్ప మనం అడిగినవన్నీ కాదు. ఈ విషయాన్ని అందరూ గమనించాలి.  


పెళ్ళైన నాలుగు నెలల తర్వాత మా ఆయన పనిచేస్తున్న కంపెనీలో ఏదో సమస్య తలెత్తి ఎంతోమంది ఉద్యోగస్తులను ఉద్యోగం నుండి తొలగించారు. అందులో నా భర్త కూడా ఉన్నారు. నేను వచ్చిన కొద్దిరోజులకే ఇలా జరగడంతో నా కుటుంబం నన్ను, 'నేను వచ్చిన తర్వాత మంచి జరగలేద'ని నిందిస్తుందోమోనని నాకు భయమేసింది. నేను బాబాను ప్రార్థించి 'బాబా హారతులు' చదువుతుండగా 'బాబా మూల మహామంత్ర రక్షాస్తోత్రం' నా కంటపడింది. ఆ మంత్రాన్ని రోజూ ఒకసారి, గురువారం 9సార్లు చదివితే అనుకున్న కోరిక నెరవేరుతుందని వ్రాసి ఉంది. నేను ఆ స్తోత్రాన్ని మావారితో పారాయణ చేయించాను. అప్పటివరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా మావారికి వేరే ఉద్యోగం రాలేదు. ఆయన మానసికంగా చాలా బాధపడుతూ ఉండేవారు. అప్పటికీ గర్భవతిగా ఉన్న నాకు కూడా ఎప్పుడూ దిగులుగా అనిపించేది. ఎప్పుడైతే మావారిచేత ఆ స్తోత్రం పారాయణ చేయించానో పేపర్లో ఒక ఉద్యోగ ప్రకటన వచ్చింది. అసలు అనుభవం లేని రంగం, దాని గురించి ఏమీ తెలియదు. అయినప్పటికీ నేను బాబా మీద భారమేసి మావారిని ఆ ఇంటర్వ్యూకి పంపించాను. ఆ ఇంటర్వ్యూకి 60 మంది హాజరయ్యారు. ఆ 60 మంది నుండి ఐదుగురిని సెలెక్ట్ చేశారు. అందులో మావారు ఒకరు. ఈయన చదివిన చదువుకి, ఆ ఉద్యోగానికి ఏ మాత్రం సంబంధం లేకపోయినప్పటికీ పైఅధికారి మావారికి అన్నీ నేర్పించి ఉద్యోగంలో రాణించేలా చేశారు. 2009 నుండి మావారు అదే కంపెనీలో ఉద్యోగం చేస్తూ సాధారణ స్థాయి నుండి మేనేజర్ స్థాయికి ఎదిగారు. ఇంతకంటే బాబా ప్రేమకు, కరుణకు నిదర్శనం ఏం కావాలి?


మావారి ఉద్యోగం పోయినప్పుడు నేను గర్భవతినని చెప్పాను కదా! నాకు ఎనిమిదవ నెల నడుస్తూ ఉండగా ఉమ్మనీరు తగ్గిపోవడంతో నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేసారు. డాక్టరు, "డెలివరీ అవుతుందిగానీ బిడ్డ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేమ"ని చెప్పారు. నాకు బాబా తప్ప మరో దిక్కులేనందున, "బాబా! నా బిడ్డను నాకు దక్కించు" అని బాబాను వేడుకున్నాను. నాతోపాటు నా భర్త, నా కుటుంబమంతా బాబాని ప్రార్థిస్తూనే ఉన్నాం. బాబా దయవలన గురువారం సాయంత్రం స్కానింగ్ చేయించిన తర్వాత, "బాబు వెయిట్ బాగానే ఉన్నాడు. తల్లి, బిడ్డ క్షేమమేన"ని చెప్పారు. అదేరోజు ఎనిమిది గంటలకు ఆపరేషన్ చేసి నా బిడ్డను నాకిచ్చారు. బాబా ప్రసాదించిన ఆ వరానికి మేము 'కీర్తన్ సాయి' అని పేరు పెట్టుకున్నాము. ఎనిమిదో నెలలో బిడ్డ పుట్టడం చాలా అరుదైన సందర్భాలలో జరుగుతుంది. అలా నెలలు నిండకుండా పుట్టిన పిల్లల విషయంలో చాలా సమస్యలు ఎదురౌతాయి. కానీ ఎటువంటి సమస్యా లేకుండా పూర్తి ఆరోగ్యంగా, అదికూడా నాకు ఇష్టమైన గురువారంనాడు నా బాబు పుట్టడం బాబా అనుగ్రహానికి ఒక ప్రత్యక్ష నిదర్శనం. బాబా తమని నమ్మినవారిని ఏ పరిస్థితుల్లోనైనా, ఎంత కష్టం నుండైనా కాపాడతారనడానికి ఇంతకంటే సాక్ష్యం ఉంటుందా? "చాలా చాలా ధన్యవాదాలు బాబా. మీ ప్రేమ, కరుణలు ఎప్పుడూ నాపై, నా కుటుంబంపై ఇలానే ఉండాలి తండ్రీ".


9 comments:

  1. ఓం సాయిరామ్

    ReplyDelete
  2. Saibaba to day my son sai madava is writing hjindi and science exams. Pl bless him to write the exams correctly.

    ReplyDelete
  3. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  4. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  5. OmsaikapaduTandri

    ReplyDelete
  6. Om sai Sri Sai jaya jaya sai

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo