సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1585వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. వెంటనే బాబా ఎలా పలికారో చూడండి!
2. తలచిన వెంటనే సమస్య తీర్సే సాయినాథుడు

వెంటనే బాబా ఎలా పలికారో చూడండి!


సాయిభక్తులందరికీ నమస్కారం. నా పేరు గౌతమి. ఈ మధ్య నేను ఒక నాలుగు రోజులు కడుపునొప్పితో బాధపడ్డాను. ఎన్ని మందులు వేసుకున్నా తగ్గలేదు. అప్పుడు ఒకరోజు బాబాకి మనసారా దణ్ణం పెట్టుకొని, "నొప్పి తగ్గించండి బాబా" అని అనుకొని ఊదీ నీళ్లు త్రాగాను. ఆశ్చర్యం! మరుసటిరోజు తెల్లవారేసరికి నొప్పిలేదు. అంతటి మహిమ ఊదీకి ఉంది. "ధన్యవాదాలు బాబా. మీ దయతో ఇప్పుడు నా ఆరోగ్యం బాగుంది తండ్రీ".


2023, జూలై 19, ఉదయం మేము ఉండే అపార్ట్మెంట్ లిఫ్ట్ పని చేయలేదు. వాచ్‌మెన్, "రాత్రి నుంచి ఎన్నిసార్లు ప్రయత్నించినా పని చేయట్లేదమ్మా" అని చెప్పాడు. మేము ఉండేది మూడో ఫ్లోర్‌లో. నాకు ముగ్గురు పిల్లలు(మొదట పాప, తర్వాత కవల పిల్లలు - బాబు, పాప). నేను ఉద్యోగస్తురాలిని అయినందున రోజూ ఉదయం 7:30కి వెళ్లి సాయంత్రం 6:00కి తిరిగి వస్తాను. అందుచేత మా అత్తయ్యగారు ఉన్నప్పటికీ పిల్లల్ని చూడటానికి ఒక అమ్మాయిని పెట్టుకున్నాను. అలాగే ఇతరత్రా పనులకి కూడా మనుషులని పెట్టుకుని నేను ఉద్యోగానికి వెళ్తుంటాను. మా పనివాళ్లందరికీ ఆరోగ్య సమస్యలున్నందు వల్ల వాళ్ళు మెట్లు ఎక్కి రాలేని పరిస్థితి. వాళ్ళు రాకపోతే నేను ఉద్యోగానికి వెళ్ళలేను. పోనీ సెలవు పెడదామంటే సెలవులన్నీ అయిపోయాయి. అందువల్ల, "బాబా! లిఫ్ట్ పని చేసేలా చేయండి, నేను వెళ్ళాలి. లిఫ్ట్ పని చేసినట్లయితే మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. అద్భుతం! 5 నిమిషాల్లో వాచ్‌మెన్ వచ్చి "అమ్మా!  ఏమైందో తెలీదుగాని లిఫ్ట్ పని చేస్తుంది" అని చెప్పాడు. వెంటనే బాబా ఎలా పలికారో చూసారా!  మావారు ఆశ్చర్యంగా, "అలా ఎలా పని చేస్తోంది. ఇప్పటివరకు లేదు కదా!" అని అన్నారు. అప్పుడు నేను, "నేను బాబాని లిఫ్ట్ పని చేయించండి అని అడిగాను. ఆయన వెంటనే చేసారు" అన్నాను. పని వాళ్ళందరూ ఎవరి సమయానికి వాళ్ళు వచ్చారు. నేను ఉద్యోగానికి వెళ్ళిపోయాను. "ధన్యవాదాలు బాబా. ఇలా ప్రతి విషయంలో నాకు సహాయం చేయండి బాబా. నా బాబు విషయంలో  మిమ్నల్ని రోజూ ఒకటి అడుగుతున్నాను. నా కోరిక నెరివేరేలా అనుగ్రహించి మళ్ళీ నా అనుభవాన్ని బ్లాగులో పంచుకునేలా చేయండి తండ్రీ. మీకు శతకోటి వందనాలు బాబా".


తలచిన వెంటనే సమస్య తీర్సే సాయినాథుడు


ఓం నమో శ్రీసాయినాథాయ!!! సాయిబంధువులకు నమస్కారం. నా పేరు లక్ష్మి. ఈమధ్య మా ఇంటి ముందున్న రోడ్లు ఎత్తు బాగా పెంచారు. దాంతో మా ఇల్లు చాలా కిందికి అయిపోయి డ్రైనేజ్ సమస్య వచ్చింది. మేము ఆ ఇల్లు కట్టుకొని 28 సంవత్సరాలు అవుతుంది. ఆ ఇంటిని కట్టిన మేస్త్రీ ఇప్పుడు లేడు. అందువల్ల నేను, "వేరే ఎవరైనా మంచి పనివాణ్ణి చూపించమ"ని బాబాని వేడుకున్నాను. మన సాయితండ్రి దయవల్ల మా ఇంటికి సమీపంలో ఉన్న వేరేవాళ్ళు  తమ వద్ద పని చేస్తున్న ఒక అతన్ని పంపించి మా పని బాగా జరిగేలా చేశారు.


8 సంవత్సరాలుగా మా ఇంటిలో అద్దెకు ఉంటున్న వాళ్ళు ఈమధ్య ఇల్లు కట్టుకుని వెళ్ళిపోయారు. అప్పుడు నేను, "మంచివాళ్ళు అద్దెకి వచ్చేలా చూడు తండ్రీ" అని బాబాతో చెప్పుకున్నాను. బాబా దయవలన వెంటనే వేరేవాళ్లు అద్దెకు వచ్చారు. కానీ నేను బ్లాగులో పంచుకోవడానికి అశ్రద్ద చేసాను. వాళ్ళు 4 నెలలు ఉన్నాక బదిలీ అయి మా ఇల్లు ఖాళీ చేసారు. మరలా మన సాయితండ్రిని వేడుకున్నాను. ఆయన దయతో వెంటనే వేరేవాళ్లు అద్దెకి వచ్చారు. మన సాయినాథుని తలచుకుంటే చాలు, అన్నీ ఆయనే చూసుకుంటారు. "ధన్యవాదాలు సాయితండ్రి. సదా అందరికీ తోడు-నీడగా ఉండి కాపాడు తండ్రీ".


ఓం నమో శ్రీసాయినాథాయ నమః!!!


8 comments:

  1. ఓం సాయిరామ్

    ReplyDelete
  2. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  3. Sai nannu marchipoyava thandri

    ReplyDelete
  4. Saibaba eeroju saimadava emi thinakunda velladu Swami madavani kanipettukomi undu swamy, saimadava ki anni subjects loA1 vaste anubhavanni blogli panchukuntanu

    ReplyDelete
  5. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  6. Om 🕉 Sai ram om 🕉 Sai Ram om 🕉 Sai Ram om 🕉 Sai Ram.

    ReplyDelete
  7. ఓం శ్రీ సాయి రామ్

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo