- శ్రీసాయి అనుగ్రహశీస్సులు - మొదటి భాగం
సాయిభక్తులందరికీ నమస్కారం. నేను ఒక సాయిభక్తురాలిని. నేను ఇప్పుడు మీ అందరితో బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను పంచుకుంటున్నాను. బాబాకి ఎప్పుడు, ఏది, ఎలా ఇవ్వాలో బాగా తెలుసు. నేను CA చదువుతున్నాను. సరిగ్గా నా పరీక్షలకు ఒక నెల ముందు మా పక్కింటి అక్క ‘గ్లోబల్ మహాపారాయణ’ ఉంది. అందులో జాయిన్ అవ్వు” అని నాకు సలహా ఇచ్చింది. నేను సంతోషంగా సరేనని ఆ అక్క ద్వారా మహాపారాయణ గ్రూపులో జాయిన్ అయ్యాను. అదే భాగ్యమనుకున్నంతలో ఈ బ్లాగు నా కంటపడింది. చాలా చాలా అదృష్టంగా భావించాను. అప్పటినుండి ఈ బ్లాగులోని భక్తులు అనుభవాలు చదవడం మొదలుపెట్టాను. బాబా అనుగ్రహానికి నా ఒళ్ళు పులకించిపోయేది. నాకు నాన్న(బాబా)గారి మీద మరింత ప్రేమ పెరిగింది. చిన్న చిన్న కోరికలు కూడా తీరుస్తూ బిడ్డలకి సంతోషం ఇస్తున్నారు. మనం కోరేవి చిన్నవే అయినా ఆ సమయంలో అవి మనకి పెద్దవిగానే అనిపిస్తాయి. ఆ విషయం బాబాకి తెలుసు కాబట్టి వాటిని తీరుస్తూ మనపై అపారమైన ప్రేమను కురిపిస్తున్నారు. అదృష్టం అంటే మనదే కదా!
ఒకరోజు రాత్రి నేను బ్లాగులో భక్తుల అనుభవాలు చదువుతుంటే నాకు ఒకటే ఏడుపొచ్చేసింది. నేను చచ్చిపోతే బాబాకి పూజలు చేసుకోలేను కదా! వచ్చే జన్మ ఎలాంటిది వస్తుందో తెలీదని ఏడ్చాను. మరుసటిరోజు ఉదయం బ్లాగు ద్వారా బాబా ఫోటోతో సహా “ఈ జన్మలోనే కాదు. ప్రతి జన్మలో నేను నీతోనే వుంటాను. ముందు జన్మలో కూడా నేను నీతోనే ఉన్నాను” అని మెసేజ్ వచ్చింది. ఆవిధంగా ఫోటో రూపంలో బాబా నాతో మాట్లాడారు. ఇంతకన్నా అదృష్టం ఏముంటుంది మన బాబా భక్తులకు?
నాకు ఒక మనిషి అంటే చాలా ఇష్టం. ఒకసారి "అతని నుండి నాకు కాల్ వస్తే, 21 గుంజీలు తీస్తాను" అని బాబాకి చెప్పుకున్నాను. అంతే, అతని కాల్ వచ్చింది. నేను అతని మాయలో పడి సరిగ్గా చదువుకొనేదాన్ని కూడా కాదు. ఎప్పుడూ అతని మెసేజ్ కోసం ఎదురు చూస్తుండేదాన్ని. అలా ఉండి ఉండి చివరికి చాలా చిరాకొచ్చి, "బాబా! అతనిని నా మనసులో నుండి తీసేయండి. అదే జరిగితే మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాని వేడుకున్నాను. అదేం మాయో బాబా అతనిని నా మనసు నుండి తీసేసారు. దాంతో నేను ప్రశాంతంగా చదువుకున్నాను. అలా బాబా అనుగ్రహించాక నేను ఆయనకి రెండు రూపాయలు దక్షిణ సమర్పించుకున్నాను. "ధన్యవాదాలు బాబా. అతనిని నా మనుసులో నుండి పూర్తిగా మీరే తీసేయాలి బాబా".
ఒక గురువారంనాడు యూట్యూబ్‌లో నా చదువుకి సంబంధించిన ఒక క్లాసు ఫలానా టైముకి రిలీజ్ అవుతుందని పెట్టారు. అది రిలీజ్ కావడానికి ఇంకా సమయం ఉండటంతో నేను ఈలోపు బాబా గుడికి వెళ్ళొద్దామని వెళ్ళాను. బాబా దర్శనం బాగా అయింది. ఇంటికి వచ్చాక చూస్తే, నా క్లాసు కాకుండా వేరేవాళ్ళ క్లాసు 30 నిముషాల్లో రిలీజ్ అవుతుందని ఉంది. అంతే, నాకు చిరాకు, ఏడుపు అన్ని వచ్చాయి. బాధతో, “బాబా! ఈరోజు నా క్లాసు రిలీజ్ అయ్యేలా చేయండి. మీ అనుగ్రహం బ్లాగు ద్వారా తోటి సాయి భక్తులతో పంచుకుంటాను” అని బాబాకి చెప్పుకున్నాను. అంతే, పది నిముషాల్లో నా క్లాసు రిలీజ్ చేసారు. అది బాబా చేసిన అద్భుతం. లేకపోతే నేను 12 గంటల వరకు ఖాళీగా ఉండాల్సి వచ్చేది. “లవ్ యు బాబా”.
సరిగ్గా పరీక్షలకు ప్రిపేర్ అయ్యే సమయంలో నాకు అస్సలు ఇంట్రస్ట్ ఒచ్చేది కాదు. అప్పుడు నేను, “బాబా! నాకు ఇంట్రస్ట్ వచ్చేలా చేసి మీ బిడ్డని చదివించండి” అని బాబాకి చెప్పుకొని ‘ఓం శ్రీసాయి సులోచనాయ నమః’ అనే నామాన్ని 21 సార్లు అనుకోని చదవడం మొదలుపెట్టేదాన్ని. బాబా దయవలన ఇంటరెస్ట్ లేని నాకు ఇంటరెస్ట్ వచ్చి చక్కగా చదువుకొనేదాన్ని.
నేను నా హాల్ టికెట్ బాబా పాదాల దగ్గర ఉంచి తరువాత పరీక్ష వ్రాయాలని బలంగా అనుకొని మా ఇంటికి దగ్గరలో ఉన్న బాబా గుడికి వెళ్లి పంతులుగారికి నా హాల్ టికెట్ ఇస్తే, ఆయన ఏదో అలా పెట్టేసి ఇచ్చారు. నేను, “బాబా! ఏంటి ఇలా?” అని చాలా నిరాశ చెందాను. బాబా తమ బిడ్డలు బాధలో ఉంటే చూడలేరు కదా! మరుసటిరోజు శనివారం నేను మళ్ళీ నా హాల్ టికెట్ తీసుకొని గుడికి వెళ్ళాను. ఈసారి బాబా తమ పాదాల వద్ద 10 నిమిషాలపాటు నా హాల్ టికెట్ ఉంచేలా అనుగ్రహించారు. అంతసేపు ఉండనిచ్చిన తర్వాత పంతులుగారు హాల్ టికెట్ బాబా పాదాలకి తాకించి నాకు ఇచ్చారు. నేను చాలా సంతోషించాను.
నా పరీక్షలకి కాలిక్యులేటర్ చాలా అవసరం. కానీ నా దగ్గరున్న కాలిక్యులేటర్ కొని 3సంవత్సరాలైంది. అది ఎంతవరకూ పనిచేస్తుందో తెలీదు. పరీక్ష మధ్యలో పని చేయకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కొత్తది కొనాలంటే 1000 రూపాయలు కావాలి. అంత ఓపిక కూడా లేదు. ఇంక బాబాపైనే భారమేసి "బాబా పరీక్షలు అయ్యేంతవరకు నా కాలిక్యులేటర్ ఆగిపోకుండా పనిచేసేలా మీరే చేయాలి. అలా జరిగితే మీ అనుగ్రహం తోటి భక్తులతో పంచుకుంటాను” అని మ్రొక్కుకున్నాను. చాలామంది పరీక్షకి రెండేసి కాలిక్యులేటర్ తెచ్చుకోగా నేను మాత్రం నా దగ్గరున్న ఆ కాలిక్యులేటర్‌తోనే పరీక్షలకి వెళ్ళాను. బాబా దయవల్ల అది మద్యలో ఎక్కడా ఆగిపోలేదు. ఇలా బాబా నా పరీక్షలకు ముందు చాలా అనుభవాలు ఇచ్చారు. అందువల్ల నన్ను పరీక్షల్లో కూడా పాస్ అయ్యేలా అనుగ్రహిస్తారని భారం ఆయనపై వేసి ధైర్యంగా ఉన్నాను. “ధన్యవాదాలు బాబా. మిమ్మల్ని తలుచుకొని మీ మీద భారమేసి నా CA పరీక్షలు వ్రాసాను. పాసయ్యేలా చూడండి బాబా”.
నేను 6వ తరగతి చదువుతున్నప్పుడు 50 రూపాయలు నోటు ఎక్కడో పడేసుకున్నాను. అప్పుడు నాకు చాలా భయమేసి, "బాబా! ఆ 50 రూపాయలు దొరికితే 108 సార్లు 'ఓం సాయిరాం' అని వ్రాస్తాన"ని అనుకొని ఆ డబ్బుల కోసం రోడ్డు అంతా వెతికాను. కానీ ఆ నోటు ఎక్కడా కనపడలేదు. చివరికి అంతకుముందు నేను వెళ్లిన ఒక షాపు దగ్గర ఆ నోటు దొరికింది. అక్కడ చాలామంది తిరుగుతున్నప్పటికీ బాబా దయవల్ల ఆ నోటు నాకే దొరికినందుకు నాకు చాలా సంతోషంగా అనిపించింది.
ఒకసారి నేను 2000 రూపాయలు ఎక్కడో పెట్టేసి మార్చిపోయాను. అస్సలు గుర్తు లేదు. "బాబా! ఆ డబ్బు దొరికితే, మీకు బిస్కెట్లు నివేదిస్తాను. అలాగే మీ అనుగ్రహం బ్లాగులో పంచుకుంటాను" అని మొక్కుకున్నాను. అంతే, ఆ డబ్బు ఎక్కడపెట్టానో గుర్తు వచ్చింది. ఇంకా అనుకున్నట్టు బాబాకి బిస్కెట్ ప్యాకెట్లు నివేదించి నా మొక్కు తీర్చుకున్నాను. ఇంకోసారి నేను నా ఫోన్ పిన్ మర్చిపోయి, "బాబా! పిన్ గుర్తు రావాలి. మీ అనుగ్రహం బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా దయవల్ల ఆ పిన్ గుర్తొచ్చింది. అలానే 2023, జూలై 28న ఒక ముఖ్యమైన పేపర్‌ని ఏదో బుక్‌లో పెట్టి మార్చిపోయాను. ఎంతకీ దొరకలేదు. అప్పుడు, "బాబా! ఆ పేపర్ దొరికేలా చూడండి. మీ అనుగ్రహం బ్లాగులో పంచుకుంటాను" అని మ్రొక్కుకున్నాను. అంతే, ఒక్క నిమిషంలో ఆ పేపర్ దొరికేసింది. "ధన్యవాదాలు బాబా. నా మ్రొక్కులన్నీ ఒక పుస్తకంలో వ్రాసుకున్నాను. ఆ పుస్తకం ఎక్కడపోయిందో కనపడట్లేదు. ఆ పుస్తకం కనిపించి అందరి దేవుళ్ల మొక్కులు సంతోషంగా తీర్చుకునే అదృష్టం ఇవ్వు బాబా".
నాకు ఒక అబ్బాయి 1500 రూపాయలు ఇవ్వాల్సి ఉండగా నేను ఎన్నిసార్లు అడిగినా అతను ఇవ్వలేదు. అలా ఒక ఏడాది గడిచిపోయింది. దాంతో ఆ డబ్బులు ఇస్తే ఇచ్చాడు, లేకపోతే లేదని అనుకున్నాను. తర్వాత ఒకరోజు ఇంస్టాగ్రామ్ ఓపెన్ చేయగానే 'నీ ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి' అని బాబా సందేశం వచ్చింది. అది చూసి నాకేం ఆర్థిక సమస్యలున్నాయి అనుకున్నాను. కానీ మరుసటిరోజు నేను ఆ అబ్బాయిని కనీసం 500 రూపాయలైనా ఇమ్మని అడిగితే, తను వెంటనే ఇచ్చాడు. ఒక సంవత్సరం నుండి ఇవ్వని అబ్బాయి వెంటనే ఇచ్చాడంటే అది బాబా అద్భుతం కాకపోతే మరేంటి? "ధన్యవాదాలు బాబా. మిగిలిన 1000 రూపాయలు కూడా ఇచ్చేలా అనుగ్రహించండి తండ్రి".
నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్లినా ప్రతిసారీ ఆలస్యంగా రాత్రి 8 గంటలకి తిరిగి మా ఇంటికి వచ్చేదాన్ని. దారిలో బాబా గుడిలో, "బాబా! ఇంటికి వెళ్ళాక మా అమ్మ నన్ను ఏం అనకూడదు" అని బాబాకి దణ్ణం పెట్టుకొని మరీ వచ్చేదాన్ని. బాబా దయవల్ల మా అమ్మ ఎప్పుడూ నన్ను ఏమీ అనలేదు.
ఒక శనివారంనాడు నేను వెంకటేశ్వరస్వామికి హుండీ దీపం పెట్టుకున్నాను. ఆరోజు మా డాడీకి, నాకు గొడవ అయింది. నేను, "బాబా! దీపం కొండెక్కే అంతవరకు డాడీ ఫ్యాన్ ఆన్ చేయకుండా చూడండి. అలా అయితే మీ అనుగ్రహం మీ బ్లాగులో పంచుకుంటాన"ని అనుకున్నాను. అదేం మాయానో మా డాడీ ఆరోజు ఫ్యాన్ అస్సలు వేయలేదు. దీపం పూర్తిగా వెలిగింది. నా కోరిక వేరవేరినందుకు గుడిలో బాబాకి 2 రూపాయలు సమర్పించుకున్నాను. మరికొన్ని అనుభవాలు రేపటి భాగంలో పంచుకుంటాను.
Baba naa jeevitamu neku ankitamu. Naa padu thinking change cheyali baba swamy. Om sai ram🙏🙏🙏 you reduced my depression. Thank you🙏🙏 baba sai. I love you❤ tandri. Please give full aaush to my husband, children and grand children bless🙏🙏🙏 them sai..
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sairam
ReplyDeleteSai always be with me
Sai madava ki baaga chaduvu meeda interest kaligetattu cheyandi baba, adi vokkate Naa korika Naa jeevithamlo
ReplyDeleteOm sai ram,sai ram , Sai Baba
ReplyDeleteOm Sai Sri Sai Jai Sai 🙏🙏🙏 kapadu Tandri
ReplyDeleteబాబా నాకు మనసులో చాలా బాధగా ఉందీ బాబా నాకు ఏదైన మంచి ఉద్యోగం వచ్చేలా చేయండీ బాబా నిన్నే నమ్ముకున్న బాబా ఓం శ్రీ సాయి రాం
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteOm Sai Ram
Om Sai Ram
Om Sai Ram
Om Sai Ram