1. బిడ్డల ప్రతి ఒక్క ఆలోచనను గమనిస్తుండే బాబా
2. బాబాతో చెప్పుకున్న తర్వాత చాలావరకు తగ్గిన పదేళ్ల బాధ
బిడ్డల ప్రతి ఒక్క ఆలోచనను గమనిస్తుండే బాబా
సాయిబంధువులందరికీ నమస్కారం. బాబా ప్రేమకు పాత్రులమవ్వడం మన జన్మజన్మల పుణ్యఫలం. నా పేరు అనురాధ. మా ఇంట్లో పనిచేసే అమ్మాయి మా ఇంట్లోనే కాకుండా మా ఇంటికి దగ్గరలో ఉండే వేరే అపార్ట్మెంట్లలో కూడా పని చేస్తుంటుంది. తను నాకెప్పుడైనా తన సమస్యల గురించి చెప్తే నేను తనతో, "బాబాని నమ్ముకో. నీ సమస్యలు ఆయనకి విన్నవించుకో. ఆయన తప్పకుండా నీ సమస్యలు తీరుస్తార"ని చెప్తూ ఉంటాను. 2023, జనవరిలో ఆ అమ్మాయికి తను పనిచేసే ఒక ఇంటి యజమాని 2023వ సంవత్సరం క్యాలెండర్లు రెండు ఇచ్చారు. ఆ అమ్మాయి ఒక క్యాలెండర్ తీసుకొని మా ఇంటికి వచ్చింది. తన పని అయిపోయాక ఆ క్యాలెండర్ నాకు చూపించి, "ఆ ఇంటి యజమాని నాకు రెండు క్యాలెండర్లు ఇచ్చారు. ఒకటి అపార్ట్మెంట్ సెక్యూరిటీ గార్డుకి ఇచ్చాను. రెండో క్యాలెండర్ మా ఇంటికి తీసుకు వెళుతున్నాన"ని చెప్పింది. నేను తనతో, "బాబా 'తనకి తన ఫోటోకి బేధం లేద'ని సాయి సచ్చరిత్రలో నిరూపణ ఇచ్చారు. ఆయన న్యూ ఇయర్‌లో మీ ఇంటికి వస్తున్నారు. నీ సమస్యలు తీరుస్తారు" అని చెప్పి, "సరే, ఈసారి నీకు బాబా క్యాలెండర్ ఇస్తే నాకివ్వు" అని అడిగాను. తను సరే అని చెప్పి వెళ్ళిపోయింది. ఇదంతా జరగడానికి ఒక వారం ముందు ఫేస్బుక్ పేజీలో "మీ ఇంటికి వస్తున్నాను" అన్న బాబా మెసేజ్ నా కంటపడింది. అప్పుడు నేను 'బాబా ఏ రూపంలో రూపంలో వస్తారో! అయినా ఇది ఇంతకీ నాకు సంబంధించిన మెసేజేనా?' అని అనుకున్నాను. తరువాత ఆ సంగతి పూర్తిగా మర్చిపోయాను. కానీ పనమ్మాయి తెచ్చిన క్యాలెండర్ చూడగానే హఠాత్తుగా నాకు ఆ మెసేజ్ గుర్తుకు వచ్చింది. తను వెళ్లిపోయిన తర్వాత అనేక రకాల ఆలోచనలతో నా మనసు నిండిపోగా, "బాబా! ఎప్పుడూ మీ గురించే ఆ అమ్మాయితో చెప్తుంటాను. తనకి తెలుసు మీరంటే నాకెంతో ప్రేమో! కానీ తను గురువారంనాడు మీ న్యూ ఇయర్ క్యాలెండరు సెక్యూరిటీ గార్డుకిచ్చి వచ్చింది. మీకు నా మీద ప్రేమ ఉంటే, ఆ అమ్మాయికి ప్రేరణనిచ్చి ఆ క్యాలెండర్ నాకు ఇచ్చేలా చేసేవారు కదా!" అని అనుకున్నాను. కరుణాసాగరుడైన సాయితండ్రి బిడ్డలు బాధపడడం చూడలేరు కదా! అప్పుడే అద్భుతం చేసారు. కాలింగ్ బెల్ మ్రోగితే, ఎవరా అని తలుపు తీసాను. సాయితండ్రి న్యూ ఇయర్ క్యాలెండరుతో పనమ్మాయి ఎదురుగా ఉంది. తను, "అమ్మా! సెక్యూరిటీ గార్డు దగ్గరికి వెళ్లి, 'మేడంకి బాబా అంటే చాలా ఇష్టం' అని చెప్పి నీకిచ్చిన క్యాలెండర్ ఇవ్వమని అడిగాను. అతను వెంటనే సరేనని, 'ఈ క్యాలెండర్ మీకు ఇవ్వమ'ని ఇచ్చాడమ్మా" అని ఆ క్యాలెండరు నాకు ఇచ్చింది. అప్పటి నా ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను. న్యూ ఇయర్ మొదటి నెలలో, అదీ గురువారం రోజున బాబా క్యాలెండరు రూపంలో మన ఇంటికొస్తే సాయి బిడ్డలందరికీ సాక్షాత్తు బాబా వచ్చినట్లేగా! అలా ఫేసుబుక్లో బాబా ఇచ్చిన మెసేజ్ సత్యమని నిరూపణ అయింది. బాబా సదా తన బిడ్డల హృదయమందు అంతరాత్మగా కొలువైయుండి ఆ బిడ్డలా ప్రతి ఒక్క ఆలోచన గమనిస్తుంటారని నిర్ధారణ అయింది. అందుకే బాబా బిడ్డలమైన మనం మంచి ఆలోచనలతో పనులు చేస్తూ ఆ తండ్రికి తగ్గ బిడ్డలమవ్వడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన కానుక. "తండ్రీ సాయినాథా! మీకు చాలా చాలా ధన్యవాదాలు. మీరు నాపై చూపించిన ప్రేమను సాయిబంధువులతో పంచుకోవడంలో ఆలస్యం చేసినందుకు మనస్ఫూర్తిగా మీకు క్షమాపణలు వేడుకుంటున్నాను".
సర్వం సాయినాథార్పణమస్తు!!!
బాబాతో చెప్పుకున్న తర్వాత చాలావరకు తగ్గిన పదేళ్ల బాధ
సాయిబంధువులకు నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. నేను పది సంవత్సరాలుగా గర్భసంచి వాపుతో(bulky uterus) సమస్యతో బాధపడుతున్నాను. ఆ బాధ కలిగినప్పుడు నాకు నరకంలా ఉండేది. నాకు బాబా అంటే నమ్మకం. గత నాలుగు నెలలుగా అంటే సుమారు 2023, మార్చి నుండి నేను ఈ బ్లాగులోని సాయి భక్తుల అనుభవాలు చదువుతున్నాను. అప్పుడొకసారి నేను, "బాబా! నా బాధని శాశ్వతంగా పోగొడితే, మీ అనుగ్రహాన్ని సాయి భక్తుల అనుభవమాలికలో పంచుకుంటాను" అని బాబాకి దణ్ణం పెట్టుకొని హోమియో మందులతోపాటు ఊదీ కలిపిన నీళ్లు త్రాగడం మొదలుపెట్టాను. బాబా దయవల్ల బాధ చాలావరకు తగ్గింది. "ధన్యవాదాలు బాబా. ఇంకా కొంచం సమస్య ఉంది. దాన్ని కూడా శాశ్వతంగా తీసేయండి. అలాగే నాకు ఫ్యాటీ లివర్ అనే మరో ఆరోగ్య సమస్య ఉన్నట్లు డాక్టరు చెప్పారు. ఆ సమస్య నుండి కూడా నన్ను కాపాడండి బాబా"
ఓం సాయినాథాయ నమః!!!
Om Sai Ram
ReplyDeleteNa korikanu teerchu sai thandri
Sarvejano sukhinobhavanthu
ఓం సాయి రామ్ నాకు జబ్బు మళ్ళీ రాకుండా కాపాడు తండ్రీ.నీకు జీవితాం రుణ పడి ఉంటా.నరకం నుండి తప్పించావు.మంచి ఆలోచనలు వుండేలాగ ఆశీస్సులు యియ్యవలెను సాయి భగవాను.నీ పాదాలు నా అశ్వ్వువులతో కడిగాను.ఫలితం చూపించావు.బాబా తండ్రి.నీకుశత కోటి నమస్కా రాలు.
ReplyDeleteసాయి నా భర్త మనసు మార్చు సాయి తను నన్ను అర్థం చేసుకుని కాపురానికి తీసుకెళ్ళి ఎలా చూడండి తండ్రి నమ్ముకునే ఎదురు చూస్తున్నాను స్వామి భర్త దూరం అయిపోయాయి నేను పడే నరకం అవమానాలు మీకు తెలుసు సాయి నామీద దయ చూస్తూ బాబా నన్ను నా భర్తని కలుపు బాబ
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Saibaba pl bless my son saimadava in his studies career behaviour respect for elders helping others don't get angry etc also my husband to understand me don't shout on woman sai
ReplyDeleteNa experience ela post cheyyalo evarina cheppara, anthaka mundu mobile number ki pampanu, ipudu response ledu a number nunchi, ela post cheyyali na experience e blog ki
ReplyDeleteSai nenu health issues tho suffer avuthuna, na Babu kuda autism tho bhada paduthun adu,na husbend job, maku 🇺🇸 lo home konukkunela anugrahinchu thadri
ReplyDelete