1. బాబాను నమ్ముకుంటే ఏదైనా జరుగుతుంది
2. పెద్దది అనుకున్న సమస్యను చిన్నది చేసేసిన బాబా
బాబాను నమ్ముకుంటే ఏదైనా జరుగుతుంది
ఓం శ్రీ సాయినాథాయ నమః!!! నేనొక చిన్న సాయిభక్తురాలిని. మాది నంద్యాల జిల్లా, ఆళ్లగడ్డ. మేము మా ఆస్తి విషయంలో ఒక పెద్ద సమస్యలో ఇరుక్కుపోయాం. దానికోసం మేము 2012లో కోర్టులో కేసు వేశాము. కానీ 2014 వరకు ఆ కేసు అస్సలు ముందుకు సాగలేదు. ఆ విషయంగా బాధపడుతుంటే, మా బాబాయి, "బాబాను నమ్ముకో! ఆయన సచ్చరిత్ర పారాయణ చేయి!" అని నాకు సలహా ఇచ్చారు. నేను ఆయన చెప్పినట్లే బాబాపై నమ్మకముంచి ఆరోజు నుంచి సచ్చరిత్ర పారాయణ చేస్తున్నాను. బాబా దయవల్ల 7 సంవత్సరాల తర్వాత 2021, డిసెంబరులో మా ఆస్తిపై మాకు హక్కు వచ్చింది. మేము చాలా సంతోషించాము. అయితే, మావారి అన్నదమ్ములు పైకోర్టుకు వెళ్లారు. మేము మాత్రం 'బాబాను నమ్ముకుంటే ఆయనే మాకు దారి చూపిస్తార'ని నమ్మకంతో ఉన్నాము. వాళ్ల మనసు మారి అందరం సంతోషంగా ఉండాలని బాబాను ప్రార్థిస్తున్నాను. నా ఈ అనుభవం పంచుకోవాలని చాలారోజుల నుంచి అనుకుంటున్నాను కానీ, ఎలా పంపాలో తెలియక చాలా ఆలస్యం జరిగింది. "బాబా! నన్ను క్షమించండి. సదా మీ స్మరణలో ఉండేలా అనుగ్రహించండి బాబా".
మాకు ఇద్దరు అబ్బాయిలు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న పెద్దబ్బాయికి వివాహమై తన కుటుంబం చాలా సంతోషంగా ఉంది. కానీ చిన్నబ్బాయి పెళ్లి విషయంలో నేను చాలా భయపడుతూ ఉండేదాన్ని. ఎందుకంటే, ఈ కాలంలో అబ్బాయికి పెళ్లి చేయాలంటే ఒక పెద్ద సమస్య అయిపోయింది. అదీకాక, మా చిన్నబ్బాయి మూలానక్షత్రంలో పుట్టాడు. ఆ నక్షత్రంలో పుట్టినవారికి పెళ్లి ఆలస్యమవుతుందని అందరూ అనేవాళ్ళు. నేను బాబాను నమ్ముకొని భారం ఆయన మీద పెడితే ఆయన చమత్కారం చేశారు. మొదట వచ్చిన సంబంధమే కుదిరింది. ఒక్క నెలలో నిశ్చితార్థం, పెళ్లి రెండూ అయిపోయాయి. సంవత్సరంలో వాళ్ళకి బాబు కూడా పుట్టాడు. ఇదంతా బాబా దయ. నాకు చాలా సంతోషంగా ఉంది. బాబాను నమ్ముకుంటే ఏదైనా జరుగుతుంది. "ధన్యవాదాలు బాబా. చిన్నబ్బాయికి జీతం తక్కువగా ఉంది బాబా. మీ దయతో వాడు ఏదైనా కంపెనీకి మారితే జీతం పెరుగుతుందని ఆశపడుతున్నాను బాబా. దయచూపు తండ్రీ. అలాగే ఎల్లప్పుడూ మీ చల్లని చూపు అందరిపైనా ఉండేలా అనుగ్రహించు బాబా".
ఓం శ్రీ సాయినాథార్పణమస్తు!!!
పెద్దది అనుకున్న సమస్యను చిన్నది చేసేసిన బాబా
సాయిభక్తులకు నమస్కారం. నా పేరు ఉష. నేను నా చిన్నతనం నుంచి సాయిభక్తురాలిని. పెద్ద పెద్ద ప్రమాదాల నుండి బాబా నన్ను చాలాసార్లు రక్షించారు. గురువుగా, దైవంగా నా సాయితండ్రి కరుణ నాకు ఎప్పుడూ ఉంది. అది నా పూర్వజన్మ సుకృతమనిపిస్తుంది. 2023, జూలై 10న నాకు విపరీతమైన నడుమునొప్పి వచ్చింది. పెయిన్ రిలీఫ్ టాబ్లెట్ వేసుకున్నా నొప్పి తగ్గలేదు. “నొప్పి తగ్గించమ”ని బాబాని వేడుకున్నప్పటికీ నొప్పి తగ్గలేదు. బాబా ‘వైద్యుల అవసరం ఉంద’ని సూచించారు. దాంతో డాక్టరుని సంప్రదిస్తే, ఎక్స్-రే తీసి, “డిస్క్ జారింది” అని MRI టెస్టుకి వ్రాశారు. అప్పుడు నేను బాబాకు నమస్కరించుకుని, “సమస్య మందులతో తగ్గిపోవాలి. ఆపరేషన్ అవసరం రాకూడద”ని వేడుకున్నాను. బాబా దయవల్ల డాక్టర్ MRI రిపోర్ట్ చూసి, “ఫిజియో ఎక్సర్సైజ్‌తో తగ్గుతుంది. భవిష్యత్తులో ఇబ్బందికలగకుండా మీ జీవన విధానం మార్చుకోండి” అని చెప్పారు. నిజంగా బాబా పెద్దది అనుకున్న సమస్యను చిన్నది చేసేశారు. నా ఆరోగ్యం పట్ల నాకన్నా సాయినాథునికే ఎక్కువ శ్రద్ధ. ఇలా ఎందుకు అన్నానంటే, పైన చెప్పిన సమస్య వచ్చాక ఒకరోజు కారు గుద్ది నేను బండి మీద నుంచి పడిపోయాను. కానీ నా ఒంటిపై చిన్న గీత కూడా పడలేదు. నాకేమీ కాలేదని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నా అదృష్టం, సాయినాథుడే దయతో నన్ను రక్షించారు. “నాకు, నా కుటుంబానికి ఎల్లవేళలా మీ ఆశీస్సులు ఉన్నందుకు నేను కృతజ్ఞురాలిని సాయిదేవా. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి తండ్రీ”.
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!!
Om Sai Ram
ReplyDeleteSai thandri na korikanu teerchandi
Sarvejano sukhinobhavanthu
సాయితో నా అనుభవాన్ని పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteOm sai ram 🙏🙏🙏🙏
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sai Sri Sai Jai Sai kapadu Tandri 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ReplyDeletePlease help me at this tough time Baba
ReplyDeleteసాయి రామ్ మా చేతుల్లో ఏమీ లేదు.మీ ఆశీస్సులతో మేము జీవించాలని అనుకుంటాము.మా కర్మ ను మీ రే తగ్గించి మాకు సంతోషం ప్రశాంతత యియ్యవలెను.ఓం సాయి రామ్
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai
ReplyDeleteఓం శ్రీ సాయి రామ్
ReplyDeleteOm Sai ram
ReplyDelete