1. రాబోయే కష్టాన్ని కాస్త ముందుగానే తెలియజేసి జాగ్రత్తపడేలా చేసిన బాబా
2. స్మరణతో పొందిన బాబా అనుగ్రహం
రాబోయే కష్టాన్ని కాస్త ముందుగానే తెలియజేసి జాగ్రత్తపడేలా చేసిన బాబా
సాయిభక్తులందరికీ నమస్కారం. నా పేరు ఆశదీప్తి. నేను హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ ఐటీ కంపెనీలో పని చేస్తున్నాను. 2023 జూలై 6న నేను ఆఫీసు వర్క్ చేయడానికి లాగిన్ అయ్యేసరికి అదివరకు నేను చేసిన వర్క్‌లోని మార్పుల వల్ల బిల్డ్ బ్రేక్ (కొన్ని సినారియోస్ పని చేయకపోవడం) అయిందని ఒక ఇష్యూ రైజ్ చేసి నాకు అసైన్ చేశారు. అది క్రిటికల్ ఇష్యూ. దానివల్ల ఆ ప్రాజెక్టులో పనిచేసేవాళ్ళు చాలామంది బ్లాక్ అయ్యారు. నా వల్ల ఇతరులు ఇబ్బంది పడుతున్నారన్న ఊహ కూడా నాకు ఎంతో బాధను కలిగిస్తుంది. అందుచేత వెంటనే చాలా టెన్షన్‌గా పని మొదలుపెట్టాను. అలా నేను టెన్షన్‌గా పనిచేస్తుంటే ఆఫీసులోని వేరే అమ్మాయి నాకు మెసేజ్ చేసి, 'నేను చేసిన చేంజెస్ వల్ల తన చేంజెస్ డిలీట్ అయిపోయాయ'ని తెలియపరిచింది. చెక్ చేస్తే తను చెప్పింది నిజమే అని తేలింది. అయితే ఆ తప్పు ఎలా జరిగిందో నాకు అర్థం కాలేదు. వెంటనే తనకి క్షమాపణ చెప్పి, "మరోసారి ఇటువంటి తప్పు జరగకుండా చూసుకుంటాను" అని హామీ ఇచ్చాను. కానీ సాయంత్రానికి ఆ సెకండ్ ఇష్యూ బాగా ఎస్కలేట్ అయ్యి పైస్థాయి నుండి నాకు కాల్ వచ్చింది. నేను వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళు వినిపించుకునే పరిస్థితిలో ఉన్నట్టు నాకు అనిపించలేదు. ఆ సమయంలో మా టీం లీడ్ నాకు సపోర్ట్‌గా మాట్లాడి పరిస్థితి చక్కబెట్టే ప్రయత్నం చేశారు. అయినా అవతలివాళ్ళు పెద్దగా సంతృప్తి చెందినట్టు నాకు అనిపించలేదు. అయినా చేసేదిలేక నేను సాయినాథుని తలుచుకొని ఊరుకున్నాను. తర్వాత, "బాబా! ఈరోజు రాత్రికల్లా ఈ రెండు ఇష్యూస్ పూర్తి అవ్వాలి. అలా అయితే మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. ఆ రాత్రి 2గంటల వరకు కూర్చొని నేను ఆ క్రిటికల్ ఇష్యూకి ఫిక్స్ పెట్టాను. కానీ నా చేంజెస్ పుష్ చేయలేదు. ఎందుకంటే, ఇంకా కొంత టెస్టింగ్ మిగిలి ఉంది. రేపు పొద్దున్న పూర్తి చేద్దామని పడుకున్నాను. ఉదయం లేచి చూస్తే నా చేంజెస్ లేకుండానే ఆ ఇష్యూ పరిష్కరమైపోయి వుంది. ముందు నాకేమీ అర్థం కాలేదుగానీ తర్వాత అంతా సాయినాథుని అనుగ్రహం అనిపించింది. ఆ మరుసటిరోజు నేను పెట్టిన ఫిక్స్‌ని పోస్ట్ చేశాను. సరిగ్గా ఒక వారానికి అంటే జూలై 12వ తారీఖున నా ఫిక్స్ లేని బిల్డ్‌తోనే టెస్టింగ్‌వాళ్ళు టెస్టింగ్ స్టార్ట్ చేసి ఒక ఆరేడు ఇష్యూస్ వరకు రైజ్ చేసారు. నేను వెంటనే అలర్ట్ అయ్యి ఇది ఆల్రెడీ ఫిక్స్ చేశాను. లేటెస్ట్ బిల్డ్‌తో టెస్ట్ చేయండని అన్ని ఇష్యూస్‌కి కామెంట్ చేశాను. ఆ సాయినాథుని దయవల్ల వాళ్ళు లేటెస్ట్ చేంజెస్‌తో టెస్ట్ చేసి ఇష్యూ రిజాల్వయింది అని చెప్పారు. ఈ విధంగా బాబా నాకు రాబోయే కష్టాన్ని కాస్త ముందుగానే తెలియజేసి నేను జాగ్రత్తపడేలా చేశారు. లేకపోతే 12వ తారీఖున నాపై ఒత్తిడి మామూలుగా ఉండేది కాదు. "థాంక్యూ సాయితండ్రీ. మరోసారి నావల్ల ఇటువంటి తప్పులు జరగకుండా ఎవరూ నావల్ల ఇబ్బందిపడకుండా చూడు తండ్రీ. అలాగే ఆఫీసులో ఒత్తిడి కాస్త తగ్గి కొంచెం ప్రశాంతంగా ఉండేలాగా చేయి తండ్రీ".
స్మరణతో పొందిన బాబా అనుగ్రహం
సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు గోపాలకృష్ణ. 2023, మార్చ్ నెలలో ఒకరోజు నేను మా పొలం పనుల నిమిత్తం పొలానికి వెళ్ళాను. అక్కడ కాసేపు పని చేసాక కొద్దిగా విశ్రాంతి తీసుకుందామని దగ్గరలో ఉన్న చెట్టు దగ్గరకి వెళ్లి ఫోన్లో వాట్సాప్ మెసేజెస్ చూద్దామనుకుంటే మొబైల్ ఆన్ అవ్వలేదు. కనీసం ఎవరికైనా ఫోన్ చేద్దామన్నా వీలు లేకుండా పోయింది. నేను బాబాని తలుచుకొని 'ఓంసాయి శ్రీసాయి జయజయసాయి' అని స్మరించసాగాను. ఆశ్చర్యం! అకస్మాత్తుగా ఫోన్ ఆన్ అయింది. వెంటనే ఒకరికి ఫోన్ చేసి, వాట్సాప్ గ్రూపు తెరిచి చూసాను. నాకు చాలా సంతోషంగా అనిపించి బాబాకి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. "ధన్యవాదాలు బాబా. మీ దయవల్ల మా కుటుంబసభ్యులందరం బాగానే ఉన్నాం. కానీ ఈమధ్య మా పిన్ని(పెంచిన తల్లి. అమ్మ అనే పిలుస్తాను) ఆరోగ్యం బాగాలేదని హాస్పిటల్కి వెళ్తే ENT డాక్టర్ సర్జరీ చేయాలని అన్నారు. తన ఆరోగ్యం బాగుండాలని మిమ్మల్ని రోజూ ప్రార్ధిస్తున్నాను. సర్జరీ మంచిగా జరిగి అమ్మ ఆరోగ్యం మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను బాబా. ఆలస్యంగా నా అనుభవాన్ని పంచుకున్నందుకు క్షమించండి. చివరిగా అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ అవకాశాన్నిచ్చిన మీకు మనసారా మరోసారి కృతజ్ఞతలు".
సర్వం శ్రీసాయినాథార్పణమస్తు!!!
ఓం సాయిరామ్
ReplyDeleteSai
ReplyDeleteShaminchandi sai
ReplyDeleteOm Sai ram
DeleteSai
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sairam
ReplyDeleteSai always be with me
Sai baba today My son is writing Telugu, Maths exams , pl be with him , bless him to write the exams well .
ReplyDeleteSai baba my white colour phone is at our residence only by the grace of sai baba. Pl teach to my husband and mother in law to understand me and my son sai madava .
ReplyDeleteOm sri Sai Ram
ReplyDeleteOmsaikapaduTandri
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDelete