1. బాబాకి చెప్పుకుంటే కానిది ఏదీ ఉండదు
2. దేనికీ తగ్గని నడుంనొప్పిని తగ్గించిన బాబా
బాబాకి చెప్పుకుంటే కానిది ఏదీ ఉండదు
ఓం శ్రీ సాయినాథాయ నమః!!! ముందుగా తల్లి, తండ్రి అయిన శ్రీసాయినాథునికి సాష్టాంగ ప్రణామాలు. సాయిబిడ్డలందరికీ నమస్కారం. నేను ఒక సాయిభక్తురాలిని. ఒకరోజు నా చిన్ననాటి స్నేహితురాలు, "మన స్నేహితులందరూ వస్తున్నారు. నువ్వు కూడా రా" అని వాళ్ళ ఊరికి రమ్మని నన్ను పిలిచింది. నేను వెళ్ళాలనుకున్నాను కానీ, నాకు ఆరోగ్యం బాగుండదు. ఎప్పుడూ ఒంటరిగా ఎక్కడికీ వెళ్ళను. అందుకని మావారు నన్ను వెళ్ళవద్దన్నారు. నాకు మాత్రం వెళ్లాలని చాలా అనిపించింది. నేను కష్టమైనా, సుఖమైనా, సంతోషమైనా బాబా దగ్గర చెప్పుకుంటాను. అలాగే ఈ విషయంలో కూడా, "బాబా! వెళితే అందరూ కలుస్తారు. నాకు అందర్నీ చూడాలని ఉంది. కాబట్టి ఒక్కదాన్నైనా వెళ్లాలని అనుకుంటున్నాను. మీరు నాకు తోడుగా ఉండండి" అని బాబాకి చెప్పుకున్నాను. బాబా దయవల్ల అప్పటివరకూ వద్దన్న మావారు, "ట్రైన్ ఎక్కిస్తాను. వెళ్ళు" అని అన్నారు. అది విని నాకు చాలా సంతోషమేసింది. తర్వాత ప్రయాణమయ్యేరోజు బాబాకి నమస్కారం చేసుకొని ఇంటినుండి బయలుదేరాం. మా ఇంటి గేటు దాటి మలుపు తిరగగానే బాబాను ఊరేగిస్తూ ఒక బండి మాకు ఎదురొచ్చింది. నేను ఆనందాశ్చర్యాలకు లోనయ్యాను. బాబా నాకు తోడుగా ఉన్నారని అర్థమైంది. అలాగే నా ప్రయాణంలో అడుగడుగునా బాబా దర్శనమిస్తూ నాకు తోడుగా ఉన్నారు. నాకు ఎటువంటి కష్టం రాలేదు. నా చిన్ననాటి స్నేహితులను కలుసుకొని చాలా సంతోషంగా గడిపి క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చాను.
మేము బాబా అనుగ్రహంతో ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకున్నాము. కాకపోతే మావారి వయస్సు దృష్ట్యా EMI నెలకు 30,000 రూపాయలు కట్టాల్సి వచ్చింది. ఒక సంవత్సరం ఎలాగో గడిచింది. ఇక అప్పుడు "అంత కట్టలేకపోతున్నాం. కాస్త తగ్గించండి" అని బ్యాంకువాళ్ళని అడిగాము. వాళ్ళు మా ప్రయత్నం మేము చేస్తామన్నారు. మేము బాబాకి సమస్య గురించి చెప్పుకొని 11 వారాలు 'సాయి దివ్యపూజ' చేశాము. 11 వారాలు పూర్తయ్యేనాటికి 4,000 రూపాయల EMI తగ్గింది. ఇదంతా బాబా అనుగ్రహమే. బాబాకి చెప్పుకుంటే కానిది ఏదీ ఉండదు. "మీకు కోటానుకోట్ల నమస్కారాలు బాబా".
సర్వం సాయినాథార్పణమస్తు!!!
దేనికీ తగ్గని నడుంనొప్పిని తగ్గించిన బాబా
నా పేరు సృజన. నాకు ఇద్దరు చిన్నపిల్లలు. ఒకసారి ఏం జరిగిందంటే, నాకు బాగా నడుంనొప్పి వచ్చింది. ఎన్ని హాస్పిటల్లో చూపించుకున్నా తగ్గలేదు. డాక్టర్లు, "మూడు నెలలు బెడ్ రెస్ట్‌లో ఉండమ"ని అంటే మా పుట్టింట్లో ఉంటూ నేను బెడ్ రెస్ట్ తీసుకోసాగాను. కానీ మూడు నెలలవుతున్నా నొప్పి తగ్గలేదు. అప్పుడు ఎవరో చెప్తే ఆపరేషన్‌తోనైనా తగ్గుతుందేమోనని ఆపరేషన్‌కి వెళ్లాలని అనుకున్నాము. ఈలోగా మాకు తెలిసినవాళ్ళు, "బాబా పుస్తకం పారాయణ చేస్తే, బాబా కరుణిస్తార"ని చెప్పారు. దాంతో నేను ఆ పుస్తకం చదవటం ప్రారంభించాను. కానీ మొదట్లో నొప్పి అలాగే ఉండటం వల్ల 'ఈ పుస్తకం చదివితే తగ్గుతుందా?' అనే అనుమానం నాలో మొదలై పెరగసాగింది. అయినప్పటికీ నాకు ఇంకొక దారిలేక బాబానే ప్రార్థించాను. పారాయణ మొదలుపెట్టిన వారం లోపల మా బాబాయ్ ఒకరు "సమాధి సిద్ధ యోగలో జాయిన్ అయితే నడుం నొప్పి తగ్గుతుంద"ని చెప్పారు. సరేనని అక్కడ జాయిన్ అయ్యాను. కొద్దిగా ఉపశమనం కనిపించిందిగానీ పూర్తిగా తగ్గలేదు. దాంతో నడుంనొప్పి తగ్గదేమోనని నాకు భయమేసి బాగా ఏడ్చాను. తర్వాత ఒకరోజు రాత్రి కలలో బాబాలాగా కనిపించి ఒక తెల్లబల్లి నా కాలుని తాకింది. అంతే, అప్పటినుంచి కొద్దిగా కూడా నొప్పి లేదు. ఆ తర్వాత మాకు ఒక బాబు జన్మించాడు. ఇదంతా సాయి కృప. "ధన్యవాదాలు బాబా. ఎప్పుడూ ఇలాగే మీరు మాపై కృప చూపించాలని కోరుకుంటున్నాను తండ్రీ".


ఓం సాయిరామ్
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Saibaba eeroju school ki vellinatte maa sai madava school
ReplyDeleteKi velli Baga chaduvukoni manchiprayojakudu avvalani saibabanivedi kuntunnanu baba
Om sai ram
ReplyDeleteOm sai ram
ReplyDeleteOm Sai Sri Sai Jai Sai 🙏🙏🙏 ka paduTandri
ReplyDeleteఓం శ్రీ సాయి రామ్ ఓం శ్రీ సాయి రామ్
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteOm Sai Jai Sai Jai Sai kapadu Tandri
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteOm sri sairam 🙏🙏
ReplyDeleteBaba me daya valana Kalyan ki marriage settle inadi Elanti avarodalu lakunda marriage chai thandi meku sathakoti vandanalu vadini bless chaindi house problem solve cheyandi pl na health bagu cheyandi pl
ReplyDeleteOm sri sairam🙏🙏
ReplyDelete