1. చెప్పుకున్నంతనే లభిస్తున్న బాబా అనుగ్రహం
2. బాబా చెప్పినట్లే అందిన డబ్బులు
చెప్పుకున్నంతనే లభిస్తున్న బాబా అనుగ్రహం
అందరికీ నమస్కారం. సాయిబాబాకి పాదాభివందనాలు. నా పేరు మౌనిక. నాకు పెళ్ళై ఒక పాప వుంది. నేను డిగ్రీ చదువుతున్నప్పటినుంచి బాబా భక్తురాలిని. బాబా ఎల్లవేళలా నాకు తోడుగా ఉన్నారు. నాకు ఏది కావాలన్నా తల్లిదండ్రులని ఎంత చనువుగా అడుగుతామో అంత చనువుగా బాబాని అడుగుతాను. ఆయన ప్రేమతో నాకు కావాల్సింది ఇస్తారు. పెళ్లయ్యాక ఉద్యోగం చేయడానికి కుదరక నేను ఒక చిన్న వ్యాపారం పెట్టుకున్నాను. ఆ వ్యాపారంలో ఏమైనా మార్పులు చేర్పులు జరిగినా, "బాబా! నీదే భారం అయ్యా. నేను ఏమీ చేయలేను" అని అనుకుంటాను. నిజంగా మీరు నమ్మరు. ఒక గంటలో నాకు మార్పు తెలుస్తుంది. అలా చాలా జరిగాయి.
మాది టైలరింగ్ మరియు మగ్గం వర్క్ షాప్. మాకు వ్యాపారం నడిచే సీజన్ కన్నా అన్‌సీజన్ ఎక్కువగా ఉంటుంది. బుకింగ్స్ కూడా సరిగా ఉండవు. పైగా కరోనా తరువాత వ్యాపారం ఎప్పుడు మంచిగా నడుస్తుందో, ఎప్పుడు నడవదో తెలియటం లేదు. అలాంటి పరిస్థితుల్లో, 'ఇలా అయితే వ్యాపారం ఏం చేయాలి? ఇదే కొనసాగితే వ్యాపారం మూసేయాల్సి వస్తుందని' చాలా బాధగా ఉంటుంది. కానీ నాకున్న ఆధారం అదొక్కటే. మావారిది చిన్న ఉద్యోగం. అందువలన ఆదాయం సరిగా లేకపోతే మాకు చాలా కష్టమైపోతోంది. అందువల్ల నేను బాబాని తలచుకొని, "సాయీ! నాకు ఈ పరిస్థితి ఏమిటి తండ్రీ? బుకింగ్స్ మరియు ఆర్డర్స్ రాకపోతే నేను ఎలా జీవనం సాగించాలి? వర్క్ వచ్చేలా చేయి తండ్రీ. మీరే నాకు ఉన్న తోడు. కాబట్టి మీరే సహాయం చేసి మా కష్టానికి తగ్గ ఫలితమివ్వాలి నాయనా" అని బాబాతో చెప్పుకుంటాను. అంతే, ఒక గంట తరువాత బుకింగ్స్ వస్తాయి. ఆరోజు కనీసం 3 ఆర్డర్స్ అయినా ఉంటాయి. అలాగే ఒక్కోసారి ఆర్డర్స్ పూర్తైయ్యాక డబ్బులు రాకుండా ఆగిపోతాయి. కష్టపడి పని చేసిన తర్వాత ఇన్కమ్ రాకపోతే ఎంత ఏడుపొస్తుందో చెప్పలేను. అలాంటప్పుడు కూడా నేను, "ప్లీజ్ సాయీ! కస్టమర్స్ వచ్చి పూర్తైన ఆర్డర్స్ తీసుకొని వెళ్ళాలి" అని బాబాకి విన్నవించుకుంటాను. అంతే, ఆరోజు సాయంత్రం లోపు కస్టమర్ వస్తారు. లేకుంటే వాళ్ళ దగ్గర నుంచి నాకు కాల్ అయినా వస్తుంది.
కరోనా వల్ల మన ఆరోగ్యాలే కాదు, చాలామంది మధ్యతరగతి కుటుంబీకులు ఆర్ధికంగా నష్టపోయారు. వాళ్లలో మేము కూడా ఒకరం. మేము ఆర్ధికంగా చాలా బాధపడుతున్నాo. అందుకని మేము లోన్‌కి అప్లై చేశాం. కానీ మాకు సొంతిల్లు లేకపోవడం వల్ల లోన్ ప్రాసెస్‌లో ఇబ్బందులు వచ్చాయి. మేము దాదాపు మాకు లోన్ రాదు అని అనుకున్నాం. అటువంటి సమయంలో నేను మనసులో, "బాబా! నాకు సహాయం చేయటానికి ఎవరూ లేరు. మీరే నాకు సహాయం చేయాలి. ఈ లోన్ మాకు సెంక్షన్ అయితే మీ అనుగ్రహాన్ని బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాను" అని బాబాకి చెప్పుకున్నాను. బాబా దయవల్ల కొన్నిరోజులకు మాకు లోన్ వచ్చింది. "ధన్యవాదాలు సాయినాథా. మాకు ఇంకొక భాధ ఉంది, దాన్ని కూడా నెరవేర్చి ఇంకొకసారి నా అనుభవాన్ని పంచుకునే అవకాశం ఇవ్వండి తండ్రీ".
సమర్థ సద్గురు శ్రీసాయినాథ్ మహారాజ్ కి జై!!!
బాబా చెప్పినట్లే అందిన డబ్బులు
సాయిభక్తులందరికీ నమస్కారాలు. నా పేరు నందకిషోర్. నేను తొలిసారి నా అనుభవం ఈ బ్లాగులో పంచుకుంటున్నాను. నాకు ఒకరి నుంచి డబ్బులు రావలిసి ఉండగా నేను దాని గురించి టెన్షన్ పడుతుండేవాడిని. ఆ సమయంలో నేను, "బాబా! నాకు రావాల్సిన డబ్బులు వస్తే, మీ అనుగ్రహాన్ని మీ బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాను. అలాగే గుడిలో ప్రసాదం పంచిపెడతాను" అని బాబాకి చెప్పుకున్నాను. తరువాత ఒకరోజు రాత్రి డబ్బులు గురించి టెన్షన్ వచ్చి సరిగా నిద్రపోలేకపోయాను. మర్నాడు ఉదయం లేచి ఈ బ్లాగు చూస్తే, "నీ డబ్బు ఎక్కడికీ పోదు. నీ దగ్గరకే వస్తుంది. నేను ఉన్నాను" అని బాబా సందేశం కనిపించింది. దాన్ని నాకోసమే బాబా పంపించారని భావించాను. బాబా దయవలన 2023, జూలై 29న డబ్బులు నాకు అందాయి. "ధన్యవాదాలు బాబా. అందరినీ చల్లగా చూడు తండ్రీ".
Om Sai Sri Sai jaisa please Blessed Allsaidevoters
ReplyDeleteOm sairam 🙏
ReplyDeleteఓం బాయిరామ్
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sairam
ReplyDeleteSai always be with me
Sai baba pl bless my son sai madava in his studies, career, health, understanding power in his life
ReplyDeleteOmsaikapaduTandri
ReplyDeleteఓం శ్రీ సాయి రామ్ ఓం శ్రీ సాయి రామ్
ReplyDeleteOm Sai nathaya namah
ReplyDeleteBless my children and fulfill their wishes
ReplyDeleteGive good health to my colleague and cure his cancer.
ReplyDeleteOm Sai. Sadguru Sainath ki koti koti pranam
ReplyDeleteSai ram
ReplyDelete