1. 'సాయీ' అనగానే 'ఓయ్' అని మన బాధలను తీర్చే సాయితండ్రి2. బాబా దయతో పూర్తయిన మెడికల్ టెస్ట్
'సాయీ' అనగానే 'ఓయ్' అని మన బాధలను తీర్చే సాయితండ్రి
రాజాధిరాజ యోగిరాజ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!!!
సాయినాథుని పాదపద్మములకు శతకోటి వందనాలు. నా పేరు పుష్పలత. సాయితండ్రి మాపట్ల చూపించిన దయ, కరుణ ఏమని వర్ణించను? నేను, మావారు ఇద్దరమూ ప్రభుత్వ ఉద్యోగులం. ఈమధ్య ప్రభుత్వం తెచ్చిన ఒక జీవో వలన అనుకోకుండా మావారికి బదిలీ అయ్యే పరిస్థితి వచ్చింది. పదవీవిరమణకు ఇంకో సంవత్సరమే ఉన్న సమయంలో బదిలీ అంటే మాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. అదీకాక ఆయన ఒక చోట, నేను ఒక చోట ఉండటమంటే చాలా కష్టంగా ఉంటుంది. అందువల్ల మాకొచ్చిన కఠిన పరిస్థితి విషయంలో మేము మా బాధని బాబాకి నివేదించుకున్నాము. అంతే! రాత్రికి రాత్రి రాష్ట్రవ్యాప్తంగా బదిలీలు ఆగిపోయాయి. ఈ అద్భుతం సాయితండ్రి వల్ల కాక ఇంకెవరివల్ల సాధ్యమవుతుంది? బాబా దయవలన మేము ఆనందంగా ఉన్నాము. మా ఇబ్బందిని తొలగించిన సాయినాథునికి మేము ఎంతో ఋణపడి ఉన్నాము.
మేము మా చిన్నమ్మాయికి పెళ్లి చేసి యుఎస్ పంపించాం. తను వెళ్లిన తరువాత కొన్నాళ్ళకి కరోనా మొదలవడంతో ఐదు సంవత్సరాలవరకు తను ఇండియాకి రాలేకపోయింది. మేము కూడా అమెరికా వెళ్ళలేకపోయాము. కారణం వీసా తీసుకొనే అవకాశం మాకు లభించలేదు. ఇంతలో పాప గర్భవతి అయింది. దాంతో తన దగ్గరకి వెళ్లాలని వీసాకోసం ప్రయత్నిస్తే రెండు సంవత్సరాల వరకు వీసా స్లాట్లు లేవని తెలిసింది. అప్పుడు నేను, "ఇప్పుడు ఎలా బాబా?" అని బాబాని ప్రార్థించాను. బాబా నా మొర ఆలకించారు. అనుకోకుండా వీసా స్లాట్ దొరికి, వీసా అప్రూవ్ అయ్యింది. దాంతో నేను అమెరికా వెళ్ళాను. పాపకి డెలివరీ అప్పుడు ఇబ్బంది ఏర్పడితే, నేను బాబాని శరణువేడాను. ఆ సమయంలో ఒక వాట్సాప్ గ్రూపులో 'గర్భరక్షాంబిక' స్తోత్రం ఎవరో షేర్ చేసారు. నేను ఆ స్తోత్రం మూడుసార్లు పఠించిన తరువాత పాపకు నార్మల్ డెలివరీ అయ్యి బాబు పుట్టాడు. బాబుకు సాయినాథుని పేరే పెట్టుకున్నాము. 'సాయీ' అనగానే 'ఓయ్' అని మన బాధలను తీర్చే ఆ సాయితండ్రి అందరినీ చల్లగా చూడాలని మనసారా కోరుకుంటూ ఆయన దయతో ఇంకా ఎన్నో అనుభవాలు మీ అందరితో పంచుకోవాలని అనుకుంటున్నాను. "ధన్యవాదాలు సాయినాథా. నాకు ఇంకో సమస్య ఉంది తండ్రి. మీ దయవల్ల అది కూడా తొందర్లోనే తీరిపోతుందని నమ్ముతున్నాను తండ్రీ. నేను మిమ్మల్ని ఎల్లప్పుడూ నా హృదయంలో నిలుపుకొని, సదా మిమ్మల్నే స్మరిస్తాను తండ్రీ. మమ్మల్ని కరుణించు బాబా. మీ అనుగ్రహాన్ని ఆలస్యంగా పంచుకున్నందుకు నన్ను క్షమించు తండ్రీ".
సాయినాథ్ మహారాజ్ కి జై!!!
బాబా దయతో పూర్తయిన మెడికల్ టెస్ట్
సాయిబంధువులందరికీ నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని. నేను ఈమధ్య ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగానికి ఎంపికయ్యాను. ఆ ఉద్యోగానికి సంబంధించి పరీక్ష పాసైన తర్వాత రన్నింగ్, మెడికల్ టెస్టులు ఉండగా రన్నింగ్‌కి వెళ్తున్న సమయంలో నేను భయపడి బాబాను ప్రార్థించాను. అప్పుడు ఈ సాయి మహారాజ్ సన్నిధి బ్లాగు ద్వారా, "ఉద్యోగ విషయంలో అంతా సవ్యంగా జరుగుతుంది" అన్న బాబా సందేశం వచ్చింది. బాబా చెప్పినట్లుగానే నేను రన్నింగ్ టెస్టు పాసయ్యాను. తర్వాత నన్ను మెడికల్ టెస్టుకి పంపించారు. టెస్టు పూర్తయిన తర్వాత రిపోర్టులో నా కాలు మీద తామర చిన్నగా ఉందని రీమెడికల్ టెస్టు వ్రాసారు. దాంతో నేను చాలా భయపడ్డాను. ఎందుకంటే, నాకన్న ముందున్న ఇద్దరిని చిన్న చిన్న మెడికల్ సమస్యల కారణంగా రిజెక్ట్ చేసారు. కాబట్టి ఆ టెస్టు పాస్ అయితేనే నాకు ఆ ఉద్యోగం వస్తుంది. అందుచేత నేను బాబాని ప్రార్థించి, 'అంతా సవ్యంగా జరిగితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన'ని అనుకున్నాను. తర్వాత డాక్టర్స్ నాకున్నది చిన్న సమస్య అని, దానివల్ల ఎలాంటి ఇబ్బంది లేదని నా మెడికల్ టెస్ట్ పాస్ చేశారు. ఇదంతా కేవలం బాబా దయవలన మాత్రమే జరిగింది. ఆయన సందేశం ఇచ్చినట్లుగా అంతా సవ్యంగా జరిగింది. తరువాత 2020, జూలై 20న నాకు సెంట్రల్ కానిస్టేబుల్గా ఉద్యోగం వచ్చింది. ఇలా నా జీవితంలో బాబా ఎన్నో అద్భుతాలు చేశారు. మానసింగా నాకు ఎంతో శక్తినిచ్చారు. బాబా దయవల్ల నేను చాలా ఆనందంగా ఉన్నాను. మన జీవితంలో బాబా ఉంటే చాలు. ఆయన చెప్పినట్లు మనం నడుచుకుంటే మన జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. "ధన్యవాదాలు బాబా. మా కుటుంబంలో ఉన్న చిన్న చిన్న సమస్యలను కూడా తీర్చండి సాయి".
సర్వం శ్రీసాయినాథార్పణమస్తు!!!
Om Sai Sri Sai Jai Sai 🙏🙏🙏
ReplyDeleteBless my children and fulfill their wishes. Om sai ram
ReplyDeleteOm sairam 🙏
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
ఓం సాయిరామ్
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Om sai ram
ReplyDeleteఓం శ్రీ సాయిరాం
ReplyDeleteOm sai
ReplyDeleteOm sai ram
ReplyDelete