1. భక్తుల మనోవేదనలను తీర్చే కల్పవృక్షం శ్రీసాయిబాబా2. బాబా ఉన్నారు - మనల్ని రక్షిస్తారు
భక్తుల మనోవేదనలను తీర్చే కల్పవృక్షం శ్రీసాయిబాబా.
ఓం శ్రీసాయినాథాయ నమః!!! బాబా భక్తులకు నమస్కారం. నా పేరు నాగరాజ్. మా ఇంట్లో అందరం సాయిబాబా భక్తులం. మనకు ఏ ఆపద వచ్చినా, కష్టం వచ్చినా, దుఃఖం కలిగినా మన అనుకునేవాళ్ళు, బంధువులు, స్నేహితులు ఎవరూ సహాయం చేయడానికి ముందుకు రాకపోవచ్చు కానీ, ఆర్తితో మనస్పూర్తిగా బాబాని ధ్యానించిన మరుక్షణం ఆయన సహాయం ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో అంది తీరుతుంది. ఆ కారుణ్యం ఏదో ఒక్కసారికి మాత్రమే పరిమితం కాదు. కష్టం కలిగిన ప్రతిసారీ లభించే భరోసా. దానికి ఉదాహరణలు నా ఒక్కడి జీవితంలోనే కాదు, కోట్లమంది భక్తుల జీవితాలలో లభిస్తాయి. ఇక విషయానికి వస్తే..
మా అమ్మకి సుమారు 55 ఏళ్ల వయస్సు. అయినా తను ఒక్కతే ఇంటి పనులన్నీ చేసుకుంటూ చాలా ఉత్సాహంగా ఉంటుంది. అటువంటి అమ్మకి ఓ చలికాలంలో ముగ్గు వేస్తుంటే చిన్నగా దగ్గు ప్రారంభమైంది. మొదట్లో ఆ దగ్గుని అమ్మతో సహా మేమెవరమూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ రానురానూ దగ్గు తీవ్రం అవ్వడంతో అమ్మ బాగా ఇబ్బందిపడసాగింది. వెంటనే అమ్మని ఓ పల్మనాలజిస్ట్ దగ్గరకి తీసుకొని వెళ్ళాము. డాక్టరు పరీక్షలన్నీ చేసి అమ్మ ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరిందని చెప్పారు. నాకు మా అమ్మ అంటే ప్రాణమైనందువల్ల ఆ మాట విని నేను తట్టుకోలేకపోయాను. హాస్పిటల్ నుంచి బయటికి రాగానే ఓ పాల వ్యాన్ మీద బాబా ఫోటో కనిపించింది. వెంటనే ఆర్తితో బాబాని, "అమ్మ క్షేమంగా ఉండాలి. అమ్మని కాపాడు బాబా. మా అమ్మ నాకే కాదు, నీకు కూడా అమ్మే" అని కన్నీళ్ళతో దీనంగా వేడుకున్నాను. డాక్టర్ రెండో రోజు వారం రోజులకు మందులు వ్రాసిచ్చారు. అమ్మ క్రమం తప్పకుండా బాబాని ధ్యానిస్తూ ఆ మందులు వాడింది. వారం రోజుల తర్వాత మళ్లీ హాస్పిటల్‌కి తీసుకెళ్లి చెక్ చేయించాం. ఆశ్చర్యం! "అమ్మ నిమ్ము పూర్తిగా తగ్గిపోయింది. చలికాలం కాస్త జాగ్రత్తగా ఉంటే చాలు" అని డాక్టర్ చెప్పారు. ఒక్కసారిగా నాకు ఎంత సంతోషం కలిగిందో మాటల్లో చెప్పలేను. ఉద్విగ్నంగా డాక్టరుకి కృతజ్ఞతలు చెప్పుకుందామని ఆయన వైపు తిరిగితే డాక్టర్ వెనకగా ఆశీర్వదిస్తున్నట్టుగా గోడకి వేలాడదీసిన నిలువెత్తు బాబా ఫోటో దర్శనమిచ్చింది. వారం క్రితం మొదటిసారి మేము హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు ఆ ఫోటో అక్కడ లేదు. "అంటే డాక్టర్ కేవలం నిమిత్తమాత్రుడేనని, మీ వ్యాధులకు, లౌకిక బాధలకు అసలైన వైద్యుడిని, హాజీని నేనే" అని బాబా చెప్పకనే చెప్పారనిపించింది. భక్తుల మనోవేదనలను తీర్చే కల్పవృక్షం శ్రీసాయిబాబా. ఇంతకన్నా ఏం చెప్పాలి శ్రీసాయిబాబా అనుగ్రహం గురించి. ఆయన అనుగ్రహం ఏదో కేవలం ఒక్కసారికే పరిమితం అయిపోయే బిక్షపాత్ర కాదు. అది అంతులేని అక్షయ పాత్ర. ఇలాంటి అనుభవాలు నాకు, నా కుటుంబసభ్యులకు వేలల్లో ఉన్నాయి. నాకే కాదు ఈ భక్తుడికైనా బాబా అనుగ్రహం ప్రార్ధించిన తక్షణమే లభిస్తుంది. కావాల్సిందల్లా కేవలం బాబా పాదాలందు అంతులేని శ్రద్ధ, తీవ్రమైన భక్తి, సబూరీ.. అంతే! "ధన్యవాదాలు బాబా".
బాబా ఉన్నారు - మనల్ని రక్షిస్తారు
సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు రాజేష్. నేను బాగా నమ్మిన నా స్నేహితులే వెనకాల నన్ను మోసం చేస్తుంటే నేనేంతో బాధపడ్డాను, ఈ లోకంలో ఇంకా ఎవరినీ నమ్మకూడదని నిశ్చయించుకున్నాను. అటువంటి సమయంలో ఒకరోజు అనుకోకుండా నేను బాబా మందిరంకి వెళ్ళాను. అప్పుడు, 'నేను ఉన్నాను కదా! నీ బాధ నాతో పంచుకో' అని బాబా నాతో అంటున్నట్లు అనిపించి, 'అది నిజమే కదా!' అని బాబాని ఒక్కటే అడిగాను: "నా స్నేహితులు వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకొని పశ్చాత్తాపపడితే నేను నా అనుభవాన్ని సాయిబంధువులతో పంచుకుంటాను" అని. నిజంగా బాబా సహాయం చేసారు. నా స్నేహితులు నా విషయంలో వాళ్ళు చేసిన తప్పు తెలుసుకొని, "మమ్మల్ని క్షమించు. ఇక మీదట అలా చేయము" అని నాతో చెప్పారు. ఇది బాబా చేసిన అద్భుతం. బాబా ఉన్నారు - మనల్ని రక్షిస్తారు. "ధన్యవాదాలు బాబా".
Om Sri Sai Raksha
ReplyDeleteOm sai ram 🙏🙏🙏🙏
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteHappy rakshabandhan sairam
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Saibaba pl bless my son sai madava in his studies, career, knowledge, memory power, concentration.
ReplyDeletePlease help us at this tough time Baba
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sai ram
ReplyDeleteOm sai ram
ReplyDeleteసాయి నాకు సహాయం చేయి సాయి నా భర్త నన్ను అర్థం చేసుకో నా కోసం తిరిగి వచ్చేసాయి నా చూడు సాయి నన్ను నా భర్తని కలుపు తండ్రి
ReplyDeleteOm .🙏Sri Sainathaya Namaha.🙏🙏🙏🌹
ReplyDeleteOmsaikapaduTandri 🙏🙏🙏🙏🙏
ReplyDelete