1. బాబా మీద భారమేస్తే ఆయనే చూసుకుంటారనటానికి నిదర్శనం
2. ఎంతో బాధలో ఓదార్పునిచ్చిన బాబా
బాబా మీద భారమేస్తే ఆయనే చూసుకుంటారనటానికి నిదర్శనం
బాబాకి, బాబా భక్తులకు నా నమస్కారాలు. నా పేరు లక్ష్మి. మా కుటుంబమంతా కలిసి 2022, నవంబరు నెలలో శిరిడీ వెళ్ళాము. అప్పుడు మా చిన్నబాబు పదవ తరగతి చదువుతున్నాడు. నేను బాబాని, "సాయీ! నా చిన్నకొడుకుకి పదవ తరగతిలో మంచి మార్కులు వస్తే, నేను వాడిని ఒక్కరోజు కోసం మీ దర్శనానికి శిరిడీ తీసుకువస్తాను" అని మ్రొక్కుకున్నాను. బాబా దయవల్ల బాబు పదవ తరగతిలో ఫస్ట్ క్లాసులో పాసు అయ్యాడు. వెంటనే శిరిడీ వెళదాం అంటే నాకు ఆరోగ్యం బాగోక ఆపరేషన్ అయ్యింది. కొంచెం ఆరోగ్యం కుదుటపడ్డాక 2023, జూన్ 29, గురువారం శిరిడీ వెళదామనుకుంటే ట్రైన్ టికెట్లు అందుబాటులో లేవు. మా తమ్ముడితో చెప్తే, తను తత్కాల్ టికెట్ బుక్ చేశాడు. మేము గురువారంనాడు బయలుదేరి శుక్రవారం శిరిడీ చేరుకొని, బాబా దర్శనం చేసుకొని అదేరోజు తిరిగి వచ్చేద్దామని అనుకున్నప్పటికీ అంతదూరము వెళ్లి ఒక్కరోజు కూడా శిరిడీలో ఉండకుండా వచ్చేయడానికి నా మనసు ఇష్టపడలేదు. అదలా ఉంచితే, గురువారంనాడు మా తమ్ముడు మరుసటిరోజు మా తిరిగి ప్రయాణానికి తత్కాల్ టికెట్ తీద్దామని ప్రయత్నిస్తే సర్వర్ పని చేయలేదు. తను అదే విషయం మాతో చెప్పి, "జనరల్ బోగీలో అయినా హైదరాబాదు వరకు వచ్చేస్తే హైదరాబాదు నుంచి టికెట్ అవుతాది" అన్నాడు. నేను, "అలా వచ్చినా హైదరాబాదులో ఒకరోజు ఉండాలి. అదేదో ఆ ఒక్క రోజు శిరిడీలోనే ఉండి శనివారం బయలుదేరుతాము" అన్నాను. అందుకు మా తమ్ముడు నా మీద కోప్పడి, "తత్కాల్ టికెట్‌ని నమ్మకూడదు" అని అన్నాడు. కానీ నేను, "బాబా! మేము రావటం మీ అనుగ్రహం. మీ దర్శనం చేయించి తిరిగి ఇంటికి పంపించే బాధ్యత కూడా మీదే" అని బాబాతో చెప్పుకొని భారమంతా ఆయన మీద వేసి పూర్తి విశ్వాసంతో ఉన్నాను. అదే విషయాన్ని మా అమ్మకి, నా చిన్నకొడుకుకి చెప్పాను. మేము శుక్రవారం శిరిడీ చేరుకొని బాబా దర్శనం చేసుకున్నాము. తర్వాత మా తమ్ముడు పోన్ చేసి, "తత్కాల్ టికెట్ బుక్ అయ్యింది" అని చెప్పాడు. బాబా మీద భారమేస్తే ఆయనే చూసుకుంటారనటానికి ఇదే నిదర్శనం. ఇది ఒక అనుభవం మాత్రమే, ఇలాంటి అనుభవాలు బాబా నాకు చాలా ప్రసాదించారు. "ధన్యవాదాలు బాబా".
ఎంతో బాధలో ఓదార్పునిచ్చిన బాబా
సాయి మహారాజుకి వందనాలు. నా పేరు జయ. నాకు 3 సంవత్సరాల చిన్నబాబు ఉన్నాడు. వాడు చెప్పిన మాట వినడు, చాలా అల్లరి చేస్తాడు. అందువల్ల నేను, నా భర్త చాలా బాధపడుతున్నాం. నేను సంవత్సరం నుంచి గురుచరిత్ర లేదా సాయి సచ్చరిత్ర చదవాలని అనుకున్నప్ప్పటికీ బాబు వల్ల చేయలేకపోయాను. దాంతో ఏదో నిరాశ ఏ పని చేయలనిపించేది కాదు. ఇలా ఉండగా 2023, ఆగష్టు 10న సాయిబాబా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సైట్‌లో చూస్తే కాకడ హారతి చేయమని, గురుచరిత్ర పారాయణ చేయమని వచ్చింది. దాంతో మరుసటిరోజు గురుచరిత్ర చదవడం మొదలుపెట్టాను కానీ, తలనొప్పి రావడంతో మధ్యలో ఆపేసాను. ఇంతలో బాబు లేచి చికాకుగా క్రిందపడి ఏడవడం మొదలుపెట్టాడు. ఎదురుగా బాబా ఫోటో ఉంటే, "సాయీ! వీడు ఏడుపు ఆపితే, గురుచరిత్ర పారాయణ కొనసాగిస్తాను" అని చెప్పుకున్నాను. హఠాత్తుగా బాబు ఏడుపు ఆపేశాడు. నాకు వింతగా అనిపించి పారాయణ మొదలుపెట్టి పూర్తి చేశాను.
అదేరోజు సాయంత్రం సాయినవగురువారాల పూజ ఉంది. నేను మావారితో, "నేను పూజ చేసుకుంటాను. ఏదో విధంగా బాబుని బయటకి తీసుకుపోండి" అని నేను దాక్కున్నాను. తర్వాత మావారు మెయిన్ డోర్ తీయగానే బాబు 'అమ్మా' అని అనకుండానే మావారితో బయటకి వెళ్ళిపోయాడు. నిజానికి నేను, మావారు ఉంటేనే వాడు ఆడతాడు, లేకపోతే ఇంటి నుండి అడుగు కూడా బయటపెట్టడు. అలాంటిది నేను లేకుండానే బాబు వెళ్లిపోయేసరికి నేను బాబా వైపు చూసాను. ఆయన్ని చూస్తూనే నాకు ఏడుపొచ్చింది. ఎంతో బాధలో ఉన్న మాకు బాబా ఓదార్పునిచ్చారు. ఈ అనుభవాల ద్వారా సాయి ఒక అదృశ్యమైన శక్తి అని, నిరతరం తలుచుకుంటే మనల్ని మన జీవితాలలో ముందుకి నడిపిస్తారని అర్దం అయింది. ఆయన ఫోటో రూపంలో స్వయంగా మనతో మాట్లాడుతున్నారు. ఎంత అదృష్టమో! ఈ జన్మకి ఇంకేమి కావాలి? "ధన్యవాదాలు బాబా".
ఓం సాయి రామ్ నా భర్తకి, నా బిడ్డలకి నూరేళ్ళ ఆయుష్ యివ్వు సాయి బాబా.నా కొడుకు, నా భర్త కి సంపూర్ణ ఆరోగ్యం ఆశీస్సులు యియ్యవలెను సాయి బాబా.ఈ సహాయం చేసి పెట్టు గురు దేవా.నా ఆలోచనలు మంచి గా లేవు.నీవు నా కుటుంబం అంతా చల్లగా ఉండే అవకాశం యియ్యవలెను తండ్రి
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
ఓం సాయిరామ్
ReplyDeleteఓం శ్రీ సాయి రామ్ ఓం శ్రీ సాయి రామ్
ReplyDeleteOm sai ram
ReplyDeleteBaba na barthaki thondaraga thagi
Hospital nundi intiki velthe na anubavani blog lo panchukuntani thandri neve dhiku baba
Om sai Sri Sai Jaya Jaya sai.
Om Sai Ram
ReplyDeleteSai always be with me
Baba na papa health bavundali baba🙏
ReplyDelete