1. బాబా దయతో ఆరోగ్యం2. బాబా దయ
బాబా దయతో ఆరోగ్యం
సాయిభక్తులందరికీ నమస్కారం. నా పేరు వెంకటేష్. 2023, జూలై 18న ఉదయం నుండి నాకు కడుపునొప్పిగా ఉండటంతోపాటు విరోచనాలు అవుతుంటే టాబ్లెట్లు వేసుకొని డ్యూటీ చేసాను. ఆరోజు సాయంత్రం డ్యూటీ పూర్తి చేసుకొని ఇంటికి వచ్చేసరికి జ్వరం, ఒప్పునొప్పులు, చలి, నీరసంగా అనిపించింది. నేను టాబ్లెట్లు వేసుకొని, "బాబా! నాకు నయమై రేపు డ్యూటీకి వెళ్లాలా దయచూపు తండ్రీ" అని బాబాకి చెప్పుకొని పడుకున్నాను. తర్వాత మా పాప, "నాన్నా! ఈ ఊదీ నీళ్ళు త్రాగు" అని ఊదీ నీళ్ళు ఇచ్చింది. నేను అవి త్రాగి పడుకున్నాను. రాత్రి 11 గంటలప్పుడు నా ఒళ్ళంతా అలర్జీలా వచ్చి గుచ్చుకుంటున్నట్లు అనిపించింది. ఆ సమయంలో చుట్టుపక్కల మశూచి(అమ్మవారు) ఉన్నందువల్ల నాకు భయమేసి, "బాబా! నాకు అవేమీ లేకుండా చూడు తండ్రీ" అని బాబాను ప్రార్థించాను. బాబా దయవలన గుచ్చుకోవడం, జ్వరం, ఒళ్లునొప్పులు మొదలైన అన్నీ తగ్గాయి. దాంతో నేను సంతోషంగా ఆఫీసుకి వెళ్ళాను. "ధన్యవాదాలు సాయి".
మాకు 8 నెలల వయసున్న బాబు ఉన్నాడు. తను మాకు బాబా వరప్రసాదం. 2023, జూలై 21న నేను డ్యూటీ నుంచి ఇంటికి వచ్చేసరికి బాబు డల్‌గా ఏడుస్తున్నాడు. సరేనని ఎత్తుకుంటే వాడి ఒళ్ళు, తల వేడిగా వున్నాయి. మా ఇంటి యజమాని RMP డాక్టర్. అతను టెంపరేచర్ చెక్ చేస్తే, 102 డిగ్రీల జ్వరం ఉంది. నేను వెంటనే, "బాబా! బాబుకి జ్వరం తగ్గేలా చూడు తండ్రీ" అని బాబాను ప్రార్థించాను. మరుసటిరోజు ఉదయం బాబుని నా భార్యతో గుంటూరులోని డాక్టర్ దగ్గరకి పంపాను. డాక్టరు చెక్ చేసి, "రెండు రోజులకి మందులు ఇస్తున్నాను. వీటిని వాడి తగ్గకపోతే మళ్ళీ రండి" అని అన్నారు. నేను, "సాయినాథా! బాబుకి తగ్గిపోయేలా దయచూపండి" అని వేడుకున్నాను. బాబా దయవలన బాబుకి జ్వరం తగ్గిపోయింది. తర్వాత బాబు శరీరంపై ఎర్రటి దద్దుర్లు వచ్చాయి. ఆ సమయంలో పిల్లలకు అమ్మవారు పోస్తున్నందున నాకు భయమేసి, "బాబా! మీ దయతో బాబుకి అమ్మవారు రాకుండా చూడండి" అని అనుకున్నాను. తర్వాత మా పెద్దమ్మని పిలిచి చూపిస్తే, "అది అమ్మవారు కాదులే" అన్నారు. "చాలా చాలా ధన్యవాదాలు సాయి".
బాబా దయ

