సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1616వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా కృప
2. అడిగిన వెంటనే సమస్యలన్నిటినీ పరిష్కరించి మార్గాన్ని సుగమం చేస్తున్న సాయినాథుడు


బాబా కృప

జై సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై|
జై సద్గురు శ్రీసాయినాథుని శరత్ బాబూజీ కి జై||

నా పేరు పార్ధసారధి. 2023, ఫిబ్రవరి నెలలో నా గుండెల్లో కొద్దిగా నొప్పిగా ఉంటుండేది. అలా చాలారోజులు ఇబ్బందిపెట్టాక ఒకరోజు రాత్రి నొప్పి ఎక్కువగా అనిపించింది. హార్ట్ ఎటాక్ ఏమోనని నేను చాలా భయపడి బాబాను తలుచుకున్నాను. అంతే, ఉన్నటుండి నొప్పి తగ్గింది. మరుసటిరోజు నేను హార్ట్ హాస్పిటల్కి వెళ్ళాను. డాక్టరు చూసి, టెస్టులు చేసి, "మీకు ఉన్నది గుండెనొప్పి కాదు, గ్యాస్టిక్ పెయిన్" అని చెప్పి గ్యాస్టిక్ టాబ్లెట్లు ఇచ్చారు. కానీ నొప్పి తగ్గలేదు. అప్పుడు నేను గ్యాస్టిక్ డాక్టర్ దగ్గరకి వెళ్ళాను. ఆ డాక్టర్ చూసి ఎండోస్కోపీ చేయాలని అన్నారు. సరేనని మరుసటిరోజు మళ్ళీ హాస్పిటల్‌కి వెళ్లి ఎండోస్కోపీ టెస్టు చేయించుకుంటే ప్రేగుపూత అని రిపోర్టు వచ్చింది. డాక్టరు దానికి మందులు ఇచ్చారు. రెండు వారాల తరవాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే డాక్టరు పేగుపూత తగ్గిందని రెండు నెలలకు గ్యాస్టిక్ టాబ్లెట్లు ఇచ్చారు. అయితే నా గుండెలో నొప్పి వస్తూనే ఉండేది. నాకు భయమేసి మళ్ళీ హార్ట్ డాక్టర్ దగ్గరకి వెళ్లి 'నొప్పి ఉంటుంద'ని 2డి ఎకో టెస్టు చేయించుకున్నాను. ఆ సమయమంతా నేను బాబానే తలుచుకున్నాను. తరువాత డాక్టరు రిపోర్టు చూసి, "మీ హార్ట్లో ఎటువంటి సమస్య లేదు. మీకున్నది గ్యాస్టిక్ నొప్పి" అని చెప్పి మందులు వాడమన్నారు. మందులు వాడుతూ ఉంటే క్రమంగా నొప్పి తగ్గుతూ వచ్చి పూర్తిగా తగ్గింది. బాబానే నాకు అండగా ఉండి నన్ను పూర్తి  ఆరోగ్యవంతుడిని చేసారు.

తరువాత కొద్ది నెలలకు నాకు తలనొప్పి వచ్చింది. నిజానికి నా చిన్నప్పటి నుండి అప్పుడప్పుడు నాకు తలనొప్పి వస్తుంటుంది. టాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది. కానీ ఈసారి తలనొప్పి వచ్చినప్పుడు ఎందుకైనా మంచిదని బ్రెయిన్ డాక్టర్ వద్దకి వెళ్ళాను. డాక్టరు చెక్ చేసి, "మీకు బీపీ వుందా?" అని అడిగారు. నేను, "లేదు" అని చెప్పాను. కానీ డాక్టరు, "మీకు బీపీ ఉంది. ప్రస్తుతం 160/100 ఉంది" అని చెప్పి  సిటీ స్కాన్ వ్రాసారు. స్కాన్ తీసేటపుడు నేను బాబాని తలుచుకున్నాను. రిపోర్టు వచ్చాక డాక్టరు, "బ్రెయిన్ అంత బాగానే వుంది" అని చెప్పి బీపీకి టాబ్లెట్లు ఇచ్చారు. బాబానే నాయందు ఉండి నాకు ఎటువంటి బ్రెయిన్ సమస్య లేకుండా కాపాడారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. మీ ప్రేమకు నేను కృతజ్ఞుడనై ఉన్నాను. ఇలాగే బీపీని కూడా తగ్గేలా చేయండి బాబా. ప్రస్తుతం ఉద్యోగం లేని నాకు తొందరలోనే ఒక మంచి ఉద్యోగం చూపించు బాబా. మా నాయనమ్మకు థైరాయిడ్ కాన్సర్ ఉంది. డాక్టరు థైరాయిడ్ గడ్డ మెడ చుట్టూ ఉందని, గొoతుకి హోల్ పెట్టి పైపు వేయాలని చెప్పారు. వయసురీత్యా ఆమె తట్టుకోలేరని పైపు పెట్టించలేదు. బాబా, మీరు నాయనమ్మను మీ పాదాల వద్ద అట్టిపెట్టుకొని ఆమెను ఆ ఆరోగ్య సమస్య నుండి కాపాడండి".


అడిగిన వెంటనే సమస్యలన్నిటినీ పరిష్కరించి మార్గాన్ని సుగమం చేస్తున్న సాయినాథుడు

శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!

నేను ఒక సాయిభక్తురాలిని. నాకు ఏ చిన్న సమస్య వచ్చినా, ఎంతటి ఇబ్బంది ఎదురైనా నేను సాయినాథుణ్ణి స్మరించి వారి నామాన్ని స్మరిస్తాను. అంతే, ఆ సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. మేము సాయినాథుని ఆశీస్సులతో ఒక ఇల్లు కట్టుకుంటున్నాము. ఆ ఇంటికి సంబంధించి కరెంట్ కనెక్షన్ విషయంలో మాకు ఒక కష్టం వచ్చింది. మేము కరెంట్ కనెక్షన్ కోసం విద్యుత్ డిపార్ట్‌మెంట్‌‌కి వెళితే వాళ్ళు, "ప్రభుత్వ డిపి(differential pressure flow meter) మేము ఇప్పుడు మంజూరు చేయలేము. మీరే డిపి, ట్రాన్స్‌ఫార్మర్, వైర్ మొత్తం అన్నీ తెచ్చుకోండి" అని అన్నారు. వాటన్నిటికీ 10 లక్ష రూపాయల వరకు ఖర్చు అవుంతుంది. అప్పటికే ఇంటి కింద చాలా ఖర్చు అయినందున కరెంట్ కనెక్షన్ కోసం మాదగ్గర ఇంకా అంత డబ్బు లేదు. అందువల్ల నేను, "ప్లీజ్ బాబా, మీరే ఎలాగైనా కరెంట్‌వాళ్ళు డిపి ఇవ్వడానికి ఒప్పుకొనేలా చేసి, మాకు కనెక్షన్ వచ్చేలా చేయండి" అని సాయినాథుని ప్రార్థించాను. ఒక రెండురోజుల తర్వాత కరెంట్ డిపార్ట్మెంట్‌వాళ్ళు, "మేము ప్రభుత్వ డిపి పెట్టడానికి కొటేషన్ ఇస్తాము. మీరు కేవలం ఒక ట్రాన్స్‌ఫార్మర్ తెచ్చుకోండి చాలు" అని చెప్పారు. "చాలా థాంక్స్ సాయిదేవా! మా వెన్నంటుండి అడిగిన వెంటనే సమస్యలన్నిటినీ పరిష్కరించి మార్గాన్ని సుగమం చేస్తున్నావు. ఐ లవ్ యు సాయిదేవా. మీ ప్రసాదంగా నాకు ఒక మగబిడ్డని అనుగ్రహించావు తండ్రీ. అందుకు మీకు ధన్యవాదాలు. నా కొడుకు కూడా మీ భక్తుడయ్యేలా దయచూపు తండ్రీ. ఎల్లవేళలా మీ నామాన్నే స్మరించే బుద్దిని, భాగ్యాన్ని మాకు ప్రసాదించండి తండ్రీ".

జై బోలో సాయినాథ్ మహారాజ్ కీ జై!!!


13 comments:

  1. ఓం సాయిరామ్

    ReplyDelete
  2. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  3. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  4. ఓం శ్రీ సాయి రామ్

    ReplyDelete
  5. Sai madava, Sai baba pl bless my son sai madava in his studies , career, health , knowledge , memory power

    ReplyDelete
  6. Sai Nanu rakshinchu na jeevithanni nnilabettu sai

    ReplyDelete
  7. Om Sai Ram Baba please bless my husband.He is suffering with asthma.2times he underwent angiogram.please give him, children, and grand children full aaush and long life.please bless me . my last breath will be in my husband lap.This is my desire please Sai Tandri bless my desire.please remove my karma with your blessings.

    ReplyDelete
  8. Om Sai Ram with my fears.i am not trusting you.very sorry Sai tandri.you take me into your folds.please bless me to trust you tandri

    ReplyDelete
  9. Omsaisri Sai Jai Sai 🙏🙏🙏🙏🙏 kapadu Tandri

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo