సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1628వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • శ్రీసాయి అనుగ్రహ లీలలు - 25వ భాగం

నా పేరు సాయిబాబు. 2020, ఏప్రిల్ నెలలో జరగనున్న దానికి సంబంధించి సుమారు ఆరునెలల ముందు నా మదిలో ఒక ఆలోచన మెదిలేలా చేశారు బాబా. ఒకరోజు నేను ‘బాబా సమాధి చెంది వంద సంవత్సరాలు పూర్తైన సందర్భంగా మహాసమాధి ఉత్సవాలు ఊహించనంత ఘనంగా జరిగాయి, భక్తులు లక్షల్లో బాబాని దర్శించారు’ అని ఎంతో ఎంతో ఆనందించాను. వెంటనే నా మనసులో 'ఒక్క భక్తుడు కూడా రాని రోజు ఉంటుందా?’ అని ఒక తలంపు వచ్చింది. ఊహించని ఆ తలపుకి ఒక్క క్షణంపాటు నాకు చాలా చాలా బాధగా, భయంగా, అయోమయంగా అనిపించింది. తల్లి తాబేలులాంటి ఆయన వద్దకు పిల్ల తాబేళ్లమైన మనం ఎలా వెళ్ళకుండా ఉండగలం? అని నాకు వచ్చిన ఆ తలంపు జరగదులే అనుకున్నాను. కాని బాబా "జరుగుతుంది" అని సముధానం ఇచ్చారు. నేను దాన్ని అంగీకరించలేకపోయాను. అంతలో ‘కొన్నిరోజుల వరకు నా దర్శనానికి ఒక్కరు కూడా రారు' అని బాబా తెలియపరిచారు. నేను దాన్ని జీర్ణించుకోలేకపోయాను. ఎందుకంటే, "రోజురోజుకు భక్తులు పెరగడమేగానీ, తరగడం లేదు, ఉండదు. అలాంటిది ఒక్కరు కూడా దర్శనానికి రాకుండా ఉంటారా!” అని అనుకున్నాను. కానీ సరిగ్గా ఆరునెలల తరువాత కరోనా మహమ్మారి కారణంగా అది నిజమైంది. శిరిడీ సంస్థాన్ సమాధి మందిరంలోకి భక్తులను అనుమతించలేదు. బాబా దర్శనం ఎప్పుడు లభిస్తుందో అర్ధంకానీ పరిస్థితులు నెలకొన్నాయి. అప్పటికి 3 నెలల ముందు శిరిడీకి బుక్ చేసుకున్న మా టికెట్లు క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. బాబా జరగబోయే భవిష్యత్తును ముందుగానే సూచించారు. అంతా అయిపోయాక ఇప్పుడు బాబా ముందుగానే సూచించారని తెలుస్తుంది.

2020, ఏప్రిల్ నెలలో ఒకరోజు సాయంత్రం బెంగళూరులో ఉన్న మా అమ్మాయి వాళ్ళింటిలో వాటర్ క్యాన్ ఖాళీ అయి ఇంట్లో నీళ్లు లేవు. నేను మా మనవడితో, "కింద్ర వున్న వాచ్‌‌మెన్‌కి ఫోన్ చేసి కొత్త వాటర్ క్యాను పైకి తీసుకు రమ్మని చెప్పు" అని చెప్పాను. వాడు ఇంటర్‌కమ్‌లో శుభ్రం చేసి వాటర్ క్యాను ఒకటి పైకి తీసుకొని రా అని వాచ్‌మెన్‌తో చెప్పాడు. కొద్దిసేపట్లో అతను క్యాను తీసుకొచ్చి లోపల పెట్టాడు. అది చాలా కొత్తగా నిగనిగలాడుతుంది. ఆశ్చర్యకరమైన విషయమేమిమిటంటే, తర్వాత క్రిందకు వెళ్ళి చూచినప్పుడు వాచ్‌మెన్ దగ్గర అన్నీ పాత క్యానులే వున్నాయి. క్రొత్తవి ఒక్కటి కూడా లేవు. సాధారణంగా వాటిని తెచ్చే ఆటోవాలా దగ్గర కూడా ఎప్పుడూ పాత క్యానులే వుంటాయి. నేను మా మనవడితో కొత్త వాటర్ క్యాన్ తెమ్మని చెప్పినప్పటికీ వాడు ఆ విషయం వాచ్‌మెన్‌కి చెప్పలేదు. నేను కూడా బాబాను ఏమీ అడగలేదు. అయినా అంత చిన్న విషయాన్ని గ్రహించిన బాబా క్రొత్త క్యానే పంపారు

బెంగళూరులో ఉంటున్న మా అమ్మాయివాళ్ళ అపార్ట్మెంట్ బేస్మెంటులో చిన్న బాబా మందిరం ఉండేదని చెప్పాను కదా! దానికి పది అడుగులు దూరంలో ఒక వేపచెట్టు ఉంది(శిరిడీలో లాగే). బాబాకి వేపచెట్టుకి అవినాభావ సంబంధం ఉన్నదని సాయి భక్తులందరికీ తెలిసిన విషయమే కదా! ఒకసారి వాచ్‌మెన్ చిన్న రెమ్మ కూడా మిగల్చకుండా ఆ వేపచెట్టు కొమ్మలన్నీ కొట్టేసి ఆ చెట్టుని మోడు చేశాడు. మేము అది చూసి, "అయ్యో.. ఎందుకలా చేశావు?" అని అడిగితే, "ఆకులు ఎక్కువగా రాలుతుండటం వల్ల ఇక్కడ శుభ్రంగా ఉండటం లేదు" అని అన్నాడు అతను. అప్పుడు నేను, "అది మామూలు చెట్టు కాదు. బాబాకి ఇష్టమైన వేపచెట్టు. పైగా మందిరం పక్కనే ఉంది. కొమ్మలు కూడా మందిరం మీదకి వాలి ఉన్నాయి. తప్పు చేశావు, దానికి శిక్ష తప్పదు" అని అన్నాను. నేను అన్నట్లుగానే అతనికి అమ్మవారు పోసింది. అతని తరఫున మేము బాబాకి క్షమాపణ చెప్పి, "స్వస్థత చేకూర్చమ"ని వేడుకున్నాము. బాబా దయవల్ల అతనికి తొందరగానే నయమైంది. కానీ కొమ్మలు కొట్టేసి రెండు, మూడు నెలలైనా ఆ వేపచెట్టుకు కొత్త చిగుళ్లు రాలేదు. చెట్టు మోడు అంతా ఎండిపోయినట్లు అయిపొయింది. అందరూ చెట్టు మొత్తం తీసేయాలని అన్నారు. ఆ సమయంలో నేనక్కడే ఉన్నాను. తర్వాత శుక్రవారంనాడు మా అమ్మాయి చేత మోడుగా ఉన్న ఆ చెట్టుకు పూజ చేయించి, మొదలులో నీరు పోయించి, "బాబా! మునుపటిలా ఈ చెట్టు మంచిగా ఉండాల"ని బాబాని వేడుకున్నాను. అంతేకాదు ప్రతిరోజూ ఉదయం బాబాకి సమర్పించిన నీళ్లు ఆ చెట్టు మొదలులో పోస్తుండేవాడిని. అంతే, నెల రోజుల్లో ఆ చెట్టుకు చిగుళ్లు వచ్చాయి. అది చూసి దారిలో పోతున్న ఇద్దరు వ్యక్తులు, "నెల కింద పూర్తిగా ఎండిపోయిన చెట్టు, ఇప్పుడిలా ఉంది" అని అనుకుంటూ వెళ్లడం నేను విన్నాను. వారికి తెలియదు 'అది బాబా మహత్యం' అని.

ఒకరోజు సాయంత్రం ఆరు గంటలకు మా అమ్మాయి ప్రక్క అపార్ట్మెంట్‌లో వున్న తన ఫ్రెండు వద్దకు వెళ్తుంటే పూలు అమ్మే బండి ఎదురు వచ్చింది. తను, 'పూల బండి వచ్చింది. ఇంట్లో పూజకు పూలు కావాలి. కానీ చిల్లర డబ్బులు తీసుకొని రాలేదు' అని తన మానాన తను ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోయింది. రాత్రి 9 గంటలప్పుడు మా అల్లుడు అపార్ట్మెంట్ కింద ఉన్న బాబా గుడిలో శేజారతి ఇవ్వడానికి కిందకి వెళితే, ఆ గుడి గట్టు మీద అరకిలో పూలు కవరుతో పెట్టి ఉన్నాయి. అలా ఎవరూ ఉంచే అవకాశం లేదు. ఎందుకంటే, మేము తప్ప ఎవరూ పూజ, సేవ చేయరు. మరి ఆ పూలు అక్కడికి ఎలా వచ్చాయంటే పూజకు పూలు కావాలన్న మా అమ్మాయి మనసు గ్రహించి బాబానే అలా ఏర్పాటు చేసారు. ఇందులో సందేహం లేదు. ఎందుకంటే, అడగకపోయినా మన కోరిక నిర్మలమైనదైతే తప్పక నెరవేరుస్తారు బాబా.

ఒకసారి మా అమ్మాయి సాయి సచ్చరిత్ర 11 సార్లు పారాయణ చేసి చివరగా సాయి సత్యవ్రతం చేయాలని అనుకుంది. రేపు గురువారం పూజ అనగా బుధవారం సాయంత్రం చూస్తే, పూజకు కావాల్సినన్ని పూలు లేవు. దాంతో మా అమ్మాయి, "చాలా పూలతో బాబాకి పూజ చేయాలి. బయటకెళ్ళి తెచ్చుకుందామంటే బాగా వర్షం పడుతుంది. పైగా పైపు లైన్లకోసం తవ్వి ఉండటం వల్ల రోడ్డు అంతా బురదగా ఉంది. ఇప్పుడు ఎలా వెళ్లి తెచ్చుకోవాలి?" అని అనుకుంది. కాసేపటికి నేను మామూలుగా సాయంత్రం పూజ చేసి, హారతి ఇద్దామని అపార్ట్మెంట్ కింద ఉన్న గుడికి వెళ్లి బాబాకి పూజ చేశాను. అంతలో ఒక పూలబండి అబ్బాయి రెండు పెద్ద కవర్ల నిండా గులాబీలు తీసుకొచ్చి, "దేవుడికి పెట్టండి" అని నా చేతిలో పెట్టాడు. ఆ పూలు సుమారు రెండు కిలోలు ఉంటాయి. పువ్వులు ఎలా అనుకుంటే, పూలవాని రూపంలో తన పూజకు తానే పూలు అందించి తమ వ్రతం మాతో చాలా బాగా జరిపించుకున్నారు బాబా. మనసులో నిస్వార్ధమైన భక్తిభావముంటే కోరిక తప్పక నెరవేరుతుంది. "ధన్యవాదాలు బాబా".

 


ముందు భాగం కోసం
బాబా పాదుకలు తాకండి.




 


 


తరువాయి భాగం కోసం
బాబా పాదాలు తాకండి.

 



8 comments:

  1. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  2. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  3. ఓం సాయిరామ్

    ReplyDelete
  4. Omsaisri Sai Jai Sai 🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  5. Sai baba pl blessy son sai madava in his studies, knowledge, memory power and monitor to my husband how to behave with wife and respect to wife to wofe

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo