1. ఎప్పుడు అనుగ్రహించాలో బాబాకి తెలుసు2. అడిగింది అనుగ్రహించిన బాబా
ఎప్పుడు అనుగ్రహించాలో బాబాకి తెలుసు
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
నేను ఒక సాయి భక్తురాలిని. నేను 25 సంవత్సరాల నుండి సాయిని కొలుస్తున్నాను. మా అమ్మాయికి పెళ్ళై ఆరు సంవత్సరాలైంది. కానీ వాళ్ళకి పిల్లలు కలగలేదు. నేను 5 సంవత్సరాల నుండి సాయిని నా కూతురుకి సంతానాన్ని అనుగ్రహించమని కోరుతున్నాను. దాదాపు ఒక సంవత్సరం కిందట, "నా కోరిక నేరవేరితే 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో మీ అనుగ్రహం పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. అప్పటినుండి సంవత్సరంపాటు హాస్పిటళ్ళ చుట్టూ తిరుగుతున్నా పిల్లలు కలగకపోవడంతో విసిగిపోయిన మా అమ్మాయి 2023, జూలైలో "ఈ నెల ట్రీట్మెంట్ చేయించుకొని ఆపేస్తాను. ఇక అస్సలు పిల్లలకోసం చూడను. బాబా ఇష్టం, ఆయన ఎప్పుడు ఇస్తే అప్పుడే ఇవ్వని, లేకుంటే లేదు. దత్తత తీసుకుంటాను" అని నిర్ణయించుకొని జూలైలో చివరిసారిగా ట్రీట్మెంట్ తీసుకుంది. బాబా దయవల్ల ఆ ట్రీట్మెంట్ విజయవంతమై అందరికీ సంతోషాన్నిచ్చింది. 5 సంవత్సరాల నుండి ఎదురుచూస్తున్నందువల్ల ప్రెగ్నెట్ అని రిపోర్ట్ రాగానే మా ఆనందానికి అవదులు లేవు. వెంటనే బాబాకి దణ్ణం పెట్టుకొని ధన్యవాదాలు తెలుపుకున్నాము. 6వ వారం స్కానింగ్ చేసి అంతా బాగానే ఉందని డాక్టరు చెప్పారు. బాబా ఆశీర్వాదం వల్లే అమ్మాయి గర్భవతి అయింది కాబట్టి ఆయనే తనని, బిడ్డని చూసుకుంటారని నేను నమ్ముతూ "కాన్పు వరకు అండగా ఉండమ"ని బాబాని వేడుకొని ఆయన మీద భారమేసి పండంటి బిడ్డకోసం ఎదురుచూస్తున్నాను.
ఒకసారి నాకు కాలునొప్పి ఎక్కువగా వచ్చి మందులు వాడినా తగ్గలేదు. అప్పుడు నేను, "నొప్పి తగ్గితే, మీ అనుగ్రహాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' ద్వారా తోటి సాయిభక్తులతో పంచుకుంటాను" అని బాబాకి మొక్కుకున్నాను. మరుసటిరోజు నుండి నొప్పి తగ్గింది. కానీ నేను నా అనుభవం బ్లాగుకి పంపండం వాయిదా వేసాను. తరువాత మళ్ళీ నొప్పి మొదలైంది. అప్పుడు నేను మళ్ళీ బాబాతో, "మీ దయతో అమ్మాయి గర్భవతి అయిన అనుభవాన్ని పంచుకొనేటప్పుడు నా కాలునొప్పికి సంబంధించిన మీ అనుగ్రహం గురించి కూడా పంచుకుంటాను తండ్రీ" అని మ్రొక్కుకున్నాను. వెంటనే నొప్పి తగ్గింది. అంతా బాబా దయ. బాబా లేకుంటే మేము లేము. నేనైతే చిన్న, పెద్ద ఏ సమస్య వచ్చినా మొదట బాబానే వేడుకుంటాను. అంతా ఆయనే చూసుకుంటారు. ఆయన అందరినీ కాపాడుతుంటారు. "ధన్యవాదాలు బాబా. మా కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉండండి బాబా".
అడిగింది అనుగ్రహించిన బాబా
సాయిబంధువులకు నమస్కారం. నా పేరు రేవతి. వేసవి సెలవుల తరువాత తిరిగి స్కూళ్లు తెరిచినప్పుడు మా పాప స్కూలుకి వెళ్ళడానికి చాలా అల్లరి పెట్టేది. రోజూ ఏదో ఒక సాకు చెప్పి స్కూలుకి వెళ్ళేది కాదు. తను అలా స్కూలుకి వెళ్లకపోతుంటే నాకు చాలా బాధేస్తుండేది. అలా ఒక వారం రోజులు గడిచాక నేను బాబాను, "బాబా! పాప అల్లరిపెట్టకుండా చక్కగా స్కూలుకి వెళ్ళాలి. అలాగే తనకు పరీక్షల్లో మంచి మార్కులు రావాలి. అలా అయితే మీ అనుగ్రహాన్ని బ్లాగు ద్వారా తోటి సాయి భక్తులతో పంచుకుంటాను" అని వేడుకున్నాను. ఇక అప్పటినుండి పాప చక్కగా స్కూలుకి వెళుతుండేది. అలాగే మొన్న ఈమధ్యన జరిగిన పరీక్షల్లో తనకి మంచి మార్కులు వచ్చాయి. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. నాకు అన్నీ మీరే బాబా. ప్రతిక్షణం మమ్మల్ని కాపాడుతున్న మీకు చాలా చాలా కృతజ్ఞతలు తండ్రీ".
బోలో సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!!!
ఓం సాయిరామ్
ReplyDeleteసాయి బాబా సాయి నా వంశీ నన్ను అర్థం చేసుకుని నాకోసం తిరిగి వచ్చేసాలో చూడు తండ్రి చాలా ఆలస్యమైపోయింది స్వామి నన్ను నా బర్త్ డే కలుపు తండ్రి నాకు అన్ని దంపత్యాన్ని ప్రసాదించు స్వామి
ReplyDeleteనాకు తెలిసిన ఒక అక్క కూడా తన వైవాహిక జీవితం లో సమస్యలు ఎదురుకొని తన భర్త నుండి కొంచెం నేలలు దూరం గా ఉంది ..అప్పుడు ఆ అక్క సాయి లీలామృతం గురుచరిత్ర ..రెండు గ్రంథాలు ఒకేసరి ద్విసప్తాహం చేసింది.. కరెక్ట్ గా 3 ద్విసప్తహం చేసేటపుడు ఆమె భర్త వచ్చి తనని తీసుకువెళ్లాడు..మీరు ధైర్యాన్ని ..బాబా మీద విశ్వాసాన్ని ఉంచి బాబా చరిత్ర పారాయణ చేయండి..తప్పక త్వరలో బాబా మీ కోరిక తీరుస్తారు
DeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sairam
ReplyDeleteSai always be with me
ఓం శ్రీ సాయి రామ్
ReplyDeletePlease help us at this tough time Baba
ReplyDeleteబాబాగారు మేము సంతోషంగా 50వ పెళ్ళి రోజు జరుపుకోవాలని నా కోరిక.నా భర్త పిల్లలు మనవల వెంట వుండి సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యం కోసం మీ ఆశీస్సులు కావాలి.నేను సుమంగళి గా మీలో ఐక్యం అయిపోవాలి అని నా కోరిక.నా కోరిక నెరవేలాగ ఆశీస్సులు యియ్యవలెను సాయి బాబా.ఓం సాయి రామ్
ReplyDelete