ఈ భాగంలో అనుభవం:
- శ్రీసాయి అనుగ్రహ లీలలు - 23వ భాగం
నా పేరు సాయిబాబు. ఇప్పుడు నాకు, మా అమ్మాయికి బాబా చూపిన మరో మహాద్భుతం గురించి చదవండి. బెంగుళూరులోని మా అమ్మాయివాళ్ళ ఇంటి హాల్లో పెద్ద బాబా ఒరిజనల్ ఫోటో(క్రూర్చుని వున్నది) గోడకు తగిలించి ఉంటుంది. వాళ్ళు రోజూ నిబద్ధతగా ఆ ఫొటోకు పూజ చేస్తారు. ఎక్కువగా ఆ బాబాని చూస్తూ ఉంటారు. అంటే హాల్లో కూర్చున్నా, అటూ ఇటూ నడుస్తున్నా బాబా ముఖం చూస్తూ ఉంటారు. అలా రోజు మొత్తంలో ఎన్నోసార్లు ఆయన్ని చూస్తూ ఎవరికి వారు ఆయనతో మౌనంగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళింట్లో ఉన్నప్పుడు నేను కూడా అలాగే బాబాతో అనుసంధానమవుతూ ఉంటాను. 2020, జనవరిలో నేను మా అమ్మాయి వాళ్ళింటికి వెళ్ళాను. అప్పుడొకరోజు అర్ధరాత్రి నాకు మెలకువ వచ్చి ఎదురుగా వున్న బాబా ఫోటోని చూసాను. ఒక్క క్షణంపాటు నాకు ఏమీ అర్థం కాలేదు. కారణం, బాబా ఆ ఫొటోలో ఏ పొజిషన్లో కూర్చుని వున్నారో, అలాగే ఆ ఫోటో ప్రేములో నుండి బయటకు వచ్చి తల మెల్లగా అటూ ఇటూ త్రిప్పి చూస్తూ కన్పించారు. నేను భ్రమేమో అనుకున్నాను. కానీ మరుసటిరోజు అర్ధరాత్రి కూడా అలాగే ఫోటో ఫ్రేమ్‌లో నుండి బాబా బయటికి వచ్చారు. ఆయనను అలా ఎంతసేపు చూశానో నాకే తెలియలేదు. అది నిజం, భ్రమ కాదు. మరుసటిరోజు ఉదయం పూజ అయ్యాక ఆ విషయం మా అమ్మాయికి చెప్పాను. అప్పుడు మా అమ్మాయి మా అల్లుడితో "ఈ విషయం మీకు ఎన్నోసార్లు చెప్పాను. ఇప్పుడైనా ఇది భ్రమకాదు, నిజమని నమ్ముతావా?" అని అంది. అంటే తనకి కూడా ఆవిధంగా చాలాసార్లు బాబా దర్శనం జరిగిందని చెప్పకనే చెప్పింది. నారాకోడూరులోని మా ఇల్లే బాబా గుడి.. అలాగే బెంగుళూరులోని మా అమ్మాయివాళ్ళ ఇల్లు కూడా బాబా మందిరం. మా అమ్మాయి వాళ్ళు తాముండే అపార్టుమెంట్లో క్రింది బేస్మెంట్‌లో కూడా చిన్న బాబా గుడి కట్టుకుని పూజలు చేస్తున్నారు. అలా బాబా తమ ఒడిలో మమ్మల్ని సేద తీరుస్తున్నందుకు ధన్యులం.
2020, మార్చిలో మా అమ్మాయి తాను కొంచం కొంచెంగా దాచుకున్న డబ్బుతో కొద్దిగా బంగారం కొనుక్కోవాలని అనుకుంది. ఆ విషయంగా నన్ను, 'ఇప్పుడు తీసుకోవాలా? వద్దా?' అని బాబాని అడగమంది. బాబాని అడిగితే, "వద్దు; రేటు తగ్గుతుంది" అని సెలవిచ్చారు. తర్వాత ఆదివారంనాడు కొనవచ్చా అని అడిగితే, అప్పుడు కూడా 'వద్ద'ని వచ్చింది. అలా సోమ, మంగళ, బుధ వారాల్లో కూడా బాబా సమాధానం వద్దు అనే వచ్చింది. మరునాడు గురువారం యధావిధిగా పూజయ్యాక బాబాని 'ఇప్పుడు కొనవచ్చా' అని అడిగితే, కొనమని అనుమతి ఇచ్చారు బాబా. దాంతో ఆయన సూచించిన షాపుకి వెళితే, దాచుకున్న డబ్బుకి ఎక్కువ బంగారం వచ్చింది. ఆరోజు ఒక్కరోజే బంగారం ధర చాలా చాలా తక్కువ ఉంది, మజూరీ కూడా చాలా తక్కువ వేశారు. రెండు తీసుకుందామని వెళితే నాలుగు ఇప్పించారు బాబా. మరునాడు(శుక్రవారం) మళ్ళీ రేటు పెరిగింది. అన్ని విషయాల్లో బాబా మీద ఆధారపడి, ఆయన సలహా ప్రకారం నడుచుకోవడం వల్ల ఎప్పుడు, ఎలా జరిపించాలో అలా జరిపిస్తారు ఆయన.
2020, మార్చి 23న మా మనవడి పుట్టినరోజు. ఆ రోజున మేము తిరుపతిలో ఉందామనుకొని వారం ముందు నుండి ప్రతిరోజూ బాబాను అనుమతి అడుగుతుంటే, ఆయన అనుమతి ఇవ్వలేదు. ఎందుకో మాకు అప్పుడు అర్థం కాలేదు. 20వ తేదీన వార్తల్లో 'తిరుమలలో భక్తులకు దర్శనానికి అనుమతి లేద'ని చూసాము. తరువాత లాక్‌డౌన్ కూడా పెట్టారు. అందుకే తిరుమల వెళ్ళడానికి బాబా మాకు అనుమతించలేదని మాకప్పుడు అర్థమైంది.
2020, మార్చి 28, సాయంత్రం నేను యదావిధిగా బాబా పూజ చేసి, అనంతరం సాయి సచ్చరిత్ర పుస్తకం నా చేతిలోకి తీసుకున్నాను. ప్రక్కనే కూర్చున్న మా మనుమడికి బాబాతత్వం బోధపడాలని, "సాయీష్, నేను కళ్ళు మూసుకొని సచ్చరిత్ర పుస్తకం తెరుస్తాను. బాబా నేనీరోజు పారాయణ గ్రూపుకోసం చదవాల్సిన 42వ అధ్యాయమున్న పేజీ తెరిపిస్తారు చూడు" అని కళ్ళు మూసుకొని సచ్చరిత్ర పుస్తకం తెరిచి, "ఏ అధ్యాయం వచ్చింది" అని సాయీష్‌ని అడిగాను. తను, '42' అని చెప్పాడు. ఆ అధ్యాయం చదివిన తర్వాత, నేను నా రోజువారీ పారాయణలోని భాగంగా 38వ అధ్యాయం చదవాల్సి ఉండగా మా మనవాడి ముందు మళ్ళీ కళ్ళు మూసుకొని పుస్తకం తెరిచాను. 38వ అధ్యాయమే వచ్చింది. ఆ అధ్యాయం చదివిన తర్వాత వాడికి అర్ధమయ్యేలా, "నువ్వు కూడా బాబాని పూజించు. ఆయన్ని ఎంతగా పూజిస్తే, అంతగా ఫలితం వుంటుంద"ని చెప్పాను. పిల్లలకు ఇలాంటి లీలలే త్వరగా అర్ధమవుతాయి. ఇకపోతే, నేను మరుసటిరోజు సాయంత్రం కూడా కళ్ళు మూసుకుని సచ్చరిత్ర పుస్తకం తెరిచాను. నిజానికి నేను రోజూ అలానే చేస్తాను. సరిగ్గా నేను ఆరోజు చదవాల్సిన అధ్యాయాన్నే చూపిస్తారు బాబా. కానీ ముందురోజు జరిగిన లీలకు కలి ప్రభావం వల్ల నాలో వీసమెత్తు అహం వచ్చిందనుకుంటా ఆరోజు నేను చదవాల్సిన 39వ అధ్యాయం రాలేదు. రెండోసారి ప్రయత్నించినా 39 అధ్యాయం రాకుండా మరొక పేజీ వచ్చింది. ఇక అప్పుడు బాబాను క్షమాపణ అడిగి మూడవసారి పుస్తకం తెరిస్తే, 39వ అధ్యాయం వచ్చింది. దీనిని బట్టి బాబా దగ్గర అహం, క్రోధం లాంటివి పనికిరావని అర్థమైంది.
ముందు భాగం కోసం బాబా పాదుకలు తాకండి. |
|
తరువాయి భాగం కోసం బాబా పాదాలు తాకండి.
|
సాయి గురు దేవా.నాకు ధైర్యం యివ్వు సాయి.వర్తమాన కాలం లో నేను సంతోషంగా వుండేలాగ ఆశీస్సులు అందించు బాబా.భవిష్యతు లో కూడా నేను మా ఆయన సంతోషంగా ఉండేలాగ ఆశీస్సులు యియ్యవలెను సాయి.నేను చెడు ఆలోచనలు తో సంతోషం పోగొడుతున్నాను.కాపాడు తండ్రి.ఓం సాయి రామ్
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteసాయి నన్ను నా భర్తని కలుపు సాయి
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteSai always be with me
OmsaikapaduTandri 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ReplyDeleteSai madava pl bless my son saimadava in his studies, health, interest on studies forever baba
ReplyDeleteOm sai ram.
ReplyDeletePlease help us at this tough time Baba
ReplyDeleteBaba, bless my children and fulfill their wishes. My son will get money without any problem. I will share in sai blog.
ReplyDeleteBaba ma vennante undi mamalni sada kapadu baba🙏🙏
ReplyDeleteSai Ram maku santanam prasadinchu tandri
ReplyDeleteOm shree Sai Ram baba nannu Runa baadalu nundi kaapadu thandri nuvve naaku pillala ki dikku om jai shree Sai Ram
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Baba thana manasu marchi nannu pillalni Baga chusukunela ఆశీర్వదించి బాబా ఈ బాధ బరించలేను
ReplyDeleteసా యి ram మా కష్ట నీ కి ప్రతి falem ఈవు శ్రీ సాయి రామ్
ReplyDeleteఓం శ్రీ సాయి రామ్ 🙏🙏🙏🙏
ReplyDelete