సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1627వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
 1. సాయి దీవెనలు
 2. కోరికలు నెరవేర్చే కల్పతరువు మన సాయి

సాయి దీవెనలు

సాయినాథ్ మహారాజ్ కీ జై!!! నేను ఒక సాయి భక్తురాలిని. సాయితో నాకు అనుబంధం ఎలా మొదలైందంటే, నేను నాలుగో తరగతి చదువుతున్నప్పుడు నా చెవికమ్మ ఒకటి ఎక్కడో పడిపోయింది. ఆ విషయం ఇంట్లో తెలిస్తే అమ్మ కోప్పడుతుందన్న భయంతో సాయికి దణ్ణం పెట్టుకున్నాను. అప్పుడే సాయితో నాకు పరిచయం జరిగింది. నేను భయంతో, "సాయీ! నా చెవి పోగు దొరికేలా చేయండి" అని అనుకుంటూ ఆ చెవిపోగు కోసం వెతికాను. కానీ  బయట ఎక్కడా దొరకలేదు. దాంతో ఇంటికి వచ్చి మంచం మీద పడుకుని ఏడుస్తుంటే, మంచానికున్న వైరులో చెవిపోగు దొరికింది. అప్పటినుంచి నేను సాయినే నమ్ముకున్నాను.

ఈ మధ్యనే ఈ 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నాకు కనిపించింది. అందులో ఒక భక్తురాలు తన ఇంట్లో ఫ్యాన్ చెడిపోతే సాయికి మొక్కుకున్నాక పని చేసిందని పంచుకున్నారు. అదే సమయంలో మా ఇంట్లోని ఫ్రిడ్జ్ స్టెబిలైజర్ పని చేయడం లేదు. అందువల్ల నేను కూడా "నా ఫ్రిడ్జ్ బాగయ్యేలా చూడమ"ని సాయితో అనుకున్నాను. అనుకోవడమే ఆలస్యం స్టెబిలైజర్ రెండు లైట్లు వెలిగి ఫ్రిడ్జ్ పని చేయడం ప్రారంభించింది. ఇది సాయి లీలకాక ఇంకేంటి?

2023, ఆగస్టులో నా భర్తకి తన తలలో నరం ఒకటి కొట్టుకుంటున్నట్లు తెలుస్తుండేది. ఆయనకు షుగర్ వ్యాధి ఉన్నందున అదేమైనా సమస్య అవుతుందేమోనని బాగా భయపడ్డాము. నేను, "సాయీ! మీ దయవలన ఆయనకు ఏ సమస్య లేదని డాక్టర్ చెప్తే, మీ అనుగ్రహం బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి చెప్పుకున్నాను. 2023, ఆగస్టు 19, శనివారం రోజున డాక్టర్ దగ్గరకి వెళితే, ఆయన చూసి, "ఒత్తిడి వలన అలా అవుతుంది. భయపడాల్సిందేమీ లేదు" అని చెప్పారు. అది విన్నాక నా మనసు స్థిమితపడి బాబాకి ధన్యవాదాలు చెప్పుకున్నాను.

ఒకసారి నేను పొత్తికడుపులో నొప్పితో రెండు రోజులు ఇబ్బందిపడ్డాను. మూడో రోజు సాయి ఊదీ కడుపు మీద రాసుకొని,  కొంచెం నీళ్లలో వేసుకొని తాగాను. అంతే, రెండు రోజులు నుండి ఉన్న కడుపునొప్పి వెంటనే తగ్గిపోయింది. ఇలా బాబా లీలలు నా జీవితంలో అనేకం. "ధన్యవాదాలు బాబా. ఇంకొక కఠినమైన సమస్యను గట్టెక్కించమని మిమ్మల్ని ప్రార్థిస్తూనే ఉన్నాను. నాకు మీరు తప్ప ఇంకెవరూ దిక్కులేరు బాబా. త్వరలో ఆ సమస్య నుంచి బయటపడేస్తారని ఎదురు చూస్తున్నాను తండ్రీ".


కోరికలు నెరవేర్చే కల్పతరువు మన సాయి

సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు మాధవి. నా జీవితంలో నా సాయితండ్రి చేసిన లీలలు అన్నీఇన్నీ కావు. నేను అడిగిన ప్రతి ప్రశ్నకు వెంటనే సమాధానమిచ్చి నేను ఉన్నాను అంటారు. నా సాయే నా ధైర్యం. మా అబ్బాయి సాప్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల తను చేస్తున్న ప్రాజెక్ట్ పూర్తి కావడంతో కొత్త ప్రాజెక్ట్ కోసం కంపెనీవాళ్లు కొంత సమయమిచ్చారు. ఆలోగా ప్రాజెక్ట్ రాకపోతే 'లాస్ ఆఫ్ పే' అన్నారు. నాకు చాలా బాధేసి, "సాయీ! అబ్బాయికి మంచి ప్రాజెక్ట్ ఇవ్వండి. మీ అనుగ్రహం మీ బ్లాగు ద్వారా తోటి సాయిభక్తులతో పంచుకుంటాను" అని సాయికి దణ్ణం పెట్టుకున్నాను. బాబా దయతో ఒక వారంలో మా కోరిక తీర్చేారు. మాకు చాలా ఆనందమేసింది. మన కోరికలు నెరవేర్చే కల్పతరువు మన సాయి. అందరికీ ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. "ధన్యవాదాలు బాబా".

ఓంసాయి శ్రీసాయి జయజయసాయి.


14 comments:

 1. Replies
  1. Kindly let me know how to share our experience in Saiblagu
   From smt B.Surekha

   Delete
 2. Om sri sainathaya namaha
  Om sri sainathaya namaha
  Om sri sainathaya namaha
  Om sri sainathaya namaha
  Om sri sainathaya namaha

  ReplyDelete
 3. ఓం సాయిరామ్

  ReplyDelete
 4. Om sai ram 🙏🙏🙏🙏

  ReplyDelete
 5. Baba me valla naku jatigina manchi kuda e blog lo vachela chudu baba nenu epudo pampinchani ipati varaku publish cheyaledu

  ReplyDelete
 6. Baba, bless my children and fulfill their wishes in education. Baba bless us to visit Shirdi eagerly with my family.

  ReplyDelete
 7. Sai baba pl bless my son sai madava in his studies , health and reduce his angryness

  ReplyDelete
 8. Om Sai Ram
  Sai always be with me

  ReplyDelete
 9. Om Sai Ram please give me good health

  ReplyDelete
 10. Om Sai Sri Sai jeya jeya sai om Sai Sri Sai jeya jeya sai always be with me

  ReplyDelete
 11. Omsaisri Sai Jai Sai 🙏🙏🙏🙏🙏

  ReplyDelete
 12. Baba ma babu us lo unnadu . Job poyindi . Kotha job kosam chala tention padutunnadu manchi job vachela nuve chudali baba .repu oka interview undi annadu adi manchiga chepi select ayyela chudu baba

  ReplyDelete

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo