సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1620వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబాకి చెప్పుకుంటే చాలు - కష్టం తొలగిపోతుంది
2. 2022లో బాబా అనుగ్రహం

బాబాకి చెప్పుకుంటే చాలు - కష్టం తొలగిపోతుంది

సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు ఆశదీప్తి. 2023, ఆగస్టు రెండోవారంలో ఒకరోజు మా ఎనిమిది సంవత్సరాల బాబు అపార్ట్మెంట్లో కింద సైకిల్ తొక్కుతుంటే ఎదురుగా ఇంకొక అబ్బాయి అడ్డు వచ్చాడు. దాంతో బాబు సడన్ బ్రేక్ వేసాడు. అందువల్ల పాపం మా బాబు సైకిల్ మీద నుండి ముందుకు పడిపోయాడు. ఆ ఘటనలో సైకిల్ రాడ్ బాబు తొడ భాగంలో గట్టిగా తగిలింది. బాబు ఏడుస్తూ ఇంటికి వస్తే, నేను ఉరుకోబెట్టి నిద్రపుచ్చాను. కానీ నాలుగు రోజులు గడిచినా వాపు, నొప్పి తగ్గలేదు. డాక్టర్ అపాయింట్మెంట్ బుక్ చేస్తే, మేమెప్పుడూ వెళ్లే డాక్టరు అందుబాటులో లేకపోవడంతో అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయింది. మామూలుగా నేను ఎప్పుడు, ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే బాబాని వేడుకుంటాను, కానీ ఈసారి ఎందుకో నాలుగు రోజులైనా బాబాను వేడుకోలేదు. అసలు ఆలోచన కూడా రాలేదు. అలా ఎందుకు జరిగిందో నాకు అర్థం కాలేదు. నాలుగో రోజు బాబా పూజ చేసుకుంటుంటే హఠాత్తుగా నాకు ఆ విషయం జ్ఞాపకం వచ్చి వెంటనే బాబాని, "బాబుకి నొప్పి తగ్గేలా చూడు తండ్రీ. చాలా ఇబ్బందిపడుతున్నాడు" అని వేడుకొని, నిద్రపోతున్న బాబుకి ఊదీ పెట్టాను. అలాగే బాబా ప్రేరణ కలిగించారేమో మా చెల్లికి(డాక్టర్) ఫోన్ చేసి, తనని అడిగి పారిసెట్మాల్ టాబ్లెట్ బాబుకి వేశాను. మరుసటిరోజుకల్లా బాబుకి నొప్పి చాలావరకు తగ్గి రెండురోజుల్లో పూర్తిగా తగ్గిపోయింది.

ఈమధ్య ఆఫీసులో పని వల్ల ఒత్తిడి ఎక్కువై శని, ఆదివారాల్లో కూడా పని చేయవలసి వస్తుంది. బాబా దయవల్ల 2023, ఆగస్టు 11, శుక్రవారంనాడు నేను చేస్తున్నా ఫీచర్ చాలావరకు పూర్తవ్వడంతో డెమో ఇచ్చాం. దాంతో నేను కాస్త రిలాక్స్ అవుదామని ఆగస్టు 12, శనివారంనాడు అనంతగిరి హిల్స్ చూడటానికి హైదరాబాదు నుండి బయలుదేరాం. బయలుదేరేముందు నేను బాబాని, "ట్రిప్ బాగా జరిగి ఇంటికి క్షేమంగా తిరిగి వచ్చేలా చూడండి బాబా" అని వేడుకున్నాను. అక్కడ కొండ ఎక్కేటప్పుడు పైవరకు బాగానే వెళ్ళాం కానీ, తిరిగి వచ్చేటప్పుడు కొండ దిగుతుంటే నా కాళ్లు బాగా వణికాయి. అప్పుడు నేను బాబాను తలుచుకొని దిగసాగాను. బాబా దయవల్ల ఆయన్ని తలుచుకున్నప్పటి నుండి ఎటువంటి ఇబ్బంది అనిపించలేదు. క్షేమంగా కిందికి దిగాను. తర్వాత కోటిపల్లి రిజర్వాయర్ దగ్గర బోటింగ్ కూడా చేసి బాగా ఎంజాయ్ చేశాము. నేను అనుకున్నట్టుగానే మొత్తం అన్ని ప్రదేశాలు చూసి సంతోషంగా గడిపి ఇంటికి తిరిగి వచ్చాం. "చాలా సంతోషం బాబా. ఎల్లప్పుడూ మా వెంట ఉండి మమ్మల్ని రక్షిస్తూ ఉండు తండ్రీ". 


2022లో బాబా అనుగ్రహం 

అందరికీ నమస్కారం. నా పేరు గిరి. 2022, జనవరి 1, ఉదయం నా మనసుకు ఒక విచిత్రమైన భావన కలిగింది. అదేమిటంటే, 'ఈరోజు సంవత్సరంలో మొదటిరోజు కదా! నా సాయినాథుడు ఏదో ఒక రూపంలో నా ఇంటికి వస్తే బాగుంటుంది. ఈ సంవత్సరం మొత్తం బాబా ఆశీస్సులు మాకు ఉంటాయ'ని. కాసేపు అదే ఆలోచనతో గడిపి, 'సాయంత్రం వరకు చూద్దాం. బాబా ఏ రూపంలోనైనా వస్తారేమో! నా మనస్సుకు తృప్తి కలుగుతుందేమో!' అని ఎంతో ఉత్సుకతతో ఎదురుచూడసాగాను. ఉదయం 11 గంటల సమయంలో పోస్ట్ మాన్ వచ్చి ఒక కవరు నాకిచ్చి వెళ్ళాడు. ఆ కవరును చూసిన మరుక్షణం నాకు కన్నీరు ఆగలేదు. ఎందుకంటే, ఆ కవరు శిరిడీ సాయిబాబా సంస్థాన్ నుంచి వచ్చింది. కవరు విప్పి చూస్తే, అందులో ఊదీ మరియు గతంలో నేను ఎప్పుడో సంస్థాన్‌కి  పంపిన డబ్బుకు సంబంధించిన రశీదు ఉంది. అలా నా భావనకు తగినట్లు ఊదీ రూపంలో బాబా మా ఇంటికి రావడమే కాదు, ఆయన అనుగ్రహంతో మేము ఆ సంవత్సరం ఒక నూతన గృహం కూడా కొనుక్కొని సుఖసంతోషాలతో ఉన్నాం. నిజమైన ఆర్తి ఉంటే మన మనస్సును ఆనందడోలికల్లోనే ఉంచుతారు మన బాబా.


13 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. ఓం సాయిరామ్

    ReplyDelete
  3. సాయి బాబా తండ్రి . రేపు కుంకుమ పూజ కు నా వెంట రా తండ్రి.నాకు ధైర్యం యివ్వు తండ్రి.నా ఆరోగ్యం బాగా లేదు.నేను పూజ సంతోషంగా చేసుకునే లాగా ఆశీస్సులు యియ్యవలెను దేవా.ఈ సహాయం చేయి తండ్రి.నాకు పాడు ఆలోచనలు రాకుండా కాపాడు తండ్రీ.ఈ లీల నీ బ్లాగ్ లో పంచుకుంటాను .ఓం సాయి రామ్

    ReplyDelete
  4. Baba, my son got his amount without any problem. Bless my children and fulfill their wishes. Cure my back pain problem

    ReplyDelete
  5. Baba,Solve my back pain problem.

    ReplyDelete
  6. Om sai ram 🙏🙏🙏🙏

    ReplyDelete
  7. Sai baba pl bless my son sai madava to go to tuition centre which he is not attending since two days . Pl take care of himself.

    ReplyDelete
  8. ఓం శ్రీ సాయి రామ్

    ReplyDelete
  9. ఓం శ్రీ సాయి రామ్

    ReplyDelete
  10. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  11. Baba Naku sahayam cheyyandi baba

    ReplyDelete
  12. Omsaisri Sai Jai Sai 🙏🙏🙏🙏🙏 ka paduTandri omsairam

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo