సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1626వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఎల్లప్పుడూ మనతోనే ఉంటూ మనల్ని నడిపిస్తుంటారు బాబా
2. తలతిరగడడం తగ్గించిన బాబా

ఎల్లప్పుడూ మనతోనే ఉంటూ మనల్ని నడిపిస్తుంటారు బాబా

అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజా యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!!!

సాయిభక్తులందరికీ నమస్కారాలు. నా పేరు దీప. నేను చిన్నప్పటినుండి సాయి భక్తురాలిని. నాకు ఏ చిన్న కష్టమొచ్చినా, బాధ కలిగినా వెంటనే నాకు గుర్తొచ్చేది సాయిబాబానే. నేను చాలాసార్లు సాయి దివ్యపూజ చేశాను. అందులో అనుభవాలు చదివాక నేను కూడా నా అనుభవాలను పంచుకుంటే బాగుండేదని చాలాసార్లు అనుకున్నాను. కానీ ఈ బ్లాగు గురించి, అలాగే ఇందులో అనుభవాలను తెలుపుకోవచ్చనే విషయం తెలియక నా అనుభవాలు పంచుకోలేకపోతున్నందుకు బాధపడుతూ ఉండేదాన్ని. ఇలా ఉండగా 2023 ద్వితీయార్థంలో నాకు ఈ బ్లాగు గురించి తెలిసింది. అయితే అంతలోనే నాకు జ్వరమొచ్చి నెల రోజులైనా నయంకాక చాలా ఇబ్బందిపడ్డాను. డాక్టర్ చాలా టెస్టులు వ్రాశారు. అన్ని టెస్టులు అంటే నాకు భయమేసింది. వెంటనే, "ప్లీజ్ బాబా! రిపోర్టులన్నీ నార్మల్‌గా ఉండాలి. నాకేమీ ఇబ్బందులు ఉండొద్దు" అని బాబాను వేడుకున్నాను. మరుసటిరోజు స్కానింగ్ కోసం బాబాను తలుచుకుంటూ వెళ్తుంటే స్కానింగ్ సెంటరుకు అతి సమీపంలో నాకు సాయిబాబా ఫోటో కనిపించింది. బాబాను చూడగానే నాకు చాలా సంతోషమేసింది. బాబా ఆశీర్వదించారు అనుకున్నాను. నాకు అప్పుడే 'రిపోర్టులు నార్మల్‌గా వస్తాయి' అన్న నమ్మకం కలిగింది. తర్వాత స్కానింగ్ చేస్తున్నప్పుడు డాక్టర్ నన్ను, "ఏమైంద"ని అడిగితే నా సమస్య చెప్పి, "మేడం ఏమైనా ఇబ్బంది ఉందా?" అని అడిగాను. అప్పుడు డాక్టర్, "అంతా నార్మల్‌గా ఉంది. ఏ సమస్య లేద"ని చెప్పింది. నేను చాలా సంతోషించి బాబాకి కృతజ్ఞతలు తెలుపుకున్నాను. బాబా ఎల్లప్పుడూ మనతోనే ఉంటూ మనల్ని నడిపిస్తుంటారు. "ధన్యవాదాలు బాబా".

ఓం సమర్థ సద్గురు శ్రీసాయినాథాయ నమః!!!


తలతిరగడడం తగ్గించిన బాబా


నేను ఒక సాయిభక్తురాలిని. కొన్నిరోజులు క్రితం నా తలంతా తిరుగుతున్నట్లు, ఆ సమయంలో నాకు ఏదో అవుతున్నట్లు ఉండేది. అలా ఒక నెల రోజులు నేను ఆ బాధను అనుభవించాను. కానీ బాబాపై నమ్మకంతో హాస్పిటల్‌కి వెళ్ళలేదు. ఒకరోజు బాబాకి పూజ చేసేటప్పుడు, "బాబా! ఈ తల తిరగడం తగ్గితే, కిచిడీ నైవేద్యంగా పెడతాను, ఒక కొబ్బరికాయ కూడా సమర్పించుకుంటాను" అని బాబాకి మొక్కుకొని ప్రతిరోజూ ఊదీ నీళ్లలో కలిపి తీసుకోసాగాను. రెండు, మూడు రోజులకి ఆ బాధ తగ్గింది. "ధన్యవాదాలు బాబా".


సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు!!!


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo