సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1625వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • ఏ ఆటంకాలు లేకుండా మొక్కులు తీర్చేలా దయచూపిన బాబా

అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!

నాపేరు చైతన్య. మేము హైదరాబాదులో ఉంటాం. మా కుటుంబం, మా తోడికోడలు కుటుంబం, మా అత్తయ్యవాళ్ళ కుటుంబం కలసి తిరుపతి వెళ్ళడానికి ప్లాన్ చేసుకొని 2023, జూలై 31న తిరుమల దర్శనం కోసం ముందుగా దర్శనం టికెట్లు, రూమ్స్ బుక్ చేసుకున్నాము. అప్పుడు నేను సప్త శనివారాల వ్రతం మొదలుపెట్టి, "బాబా! మేము తిరుపతి వెళ్ళడానికి ముందు నా ఈ ఏడు శనివారాల వ్రతం ఏ ఆటంకాలు లేకుండా పూర్తయ్యేలా చూడండి" అని అనుకున్నాను. బాబా ఆశీస్సులతో, ఆ వెంకటేశ్వరస్వామి దయవల్ల తిరుపతి వెళ్లడానికి ముందే నా వ్రతం పూర్తైంది

ఇకపోతే, మా తోడికోడలువాళ్ళు అమెరికాలో ఉంటారు. వాళ్ళు అంతదూరం నుంచి తమ మొక్కలు తీర్చుకోవడానికి వస్తున్నందున నేను బాబాని, "మా బావగారి కుటుంబం అమెరికా నుండి వస్తున్నారు. వాళ్లకు ఏ అనారోగ్య సమస్యలు రాకుండా చూసి, వాళ్ళ తమ మొక్కులు తీర్చుకొని ఆరోగ్యంగా, క్షేమంగా అమెరికాకు తిరిగి వెళ్లేలా చూడండి" అని వేడుకున్నాను. వాళ్లు అమెరికా నుంచి వచ్చిన సమయంలో ఇక్కడ వర్షాలు ఆగకుండా పడుతున్నాయి. మా తోడికోడలువాళ్లకి చిన్నబాబు ఉన్నాడు. అమెరికా వాతావరణం వేరు, ఇక్కడి వాతావరం వేరు. పైగా వర్షాలు పడుతున్నాయి. అందువల్ల వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వస్తే చాలా ఇబ్బందవుతుంది. అదీకాక మా తోడికోడలు తిరుమల కొండ మెట్లకు పసుపు-కుంకుమ పెడుతూ కొండెక్కుతానని మ్రొక్కుకుంది. వర్షం పడితే ఆ మొక్కు తీర్చుకోవడానికి చాలా ఇబ్బందవుతుంది. ఆ కారణాల వల్ల 'మా తిరుపతి ప్రయాణం ఎలా జరుగుతుందో!' అని మాకు చాలా భయమేసింది. మా బావగారు కూడా తమకంటే ముందు అమెరికా నుండి ఇండియా వచ్చిన తమ ఫ్రెండ్స్‌వాళ్ళకి వర్షాల వల్ల చాలా సమస్యలు వచ్చాయని చాలా భయపడ్డారు. ఇటువంటి పరిస్థితుల్లో నేను బాబాని, "బాబా! వాళ్లకు ఆరోగ్య సమస్యలు ఏమీ రాకుండా ఆరోగ్యంగా ఉండేలా చూడండి. అలాగే వర్షాలు తగ్గి ఏ ఆటంకాలు లేకుండా వాళ్ళు మొక్కులు తీర్చుకొనెలా చూడండి. మా తిరుమల ప్రయాణం అంతా సవ్యంగా జరిగితే, మీ అనుగ్రహాన్ని సాయిబంధువులతో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా దయవల్ల మేము తిరుపతికి ప్రయాణమయ్యే ముందురోజుకి వర్షాలు తగ్గాయి. ప్రయాణంలో మా ముందు వెళ్లే వాహనాల మీద బాబా అడుగడుగునా దర్శనమిస్తూ 'నేనుండగా మీకు భయం ఎందుకు?' అని అభయం ఇచ్చారు. మేము తిరుపతి చేరుకున్నాక మా తోడికోడలు మ్రొక్కుననుసరించి మెట్ల మార్గం గుండా తిరుమలకి వెళ్ళాము. అప్పుడు రూమ్స్ కోసం వెళితే, ముందుగా మూడు రూములు బుక్ చేసుకున్నప్పటికీ రెండు రూములే మాకు వచ్చాయి. కానీ మేము 12 మందిమి ఉన్నాము. అందువల్ల రెండు రూములు సరిపోవు. తప్పనిసరిగా మూడు రూములు కావాలి. అందువల్ల, "బాబా! ఎలాగైనా మాకు ఇంకో రూమ్ దొరికేలా చూడండి" అని ఆయన మీద భారమేసి సిఆర్‌వో ఆఫీసులో మా వివరాలన్నీ ఇచ్చి రూముకి వచ్చాము. తిరుపతిలో రూమ్స్ దొరకాలంటే ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. కానీ బాబా మీద భారం వేస్తే ఎంత అసాధ్యన్నైనా సాధ్యం చేస్తారు. ఒక గంటలో మాకు ఇంకో రూము దొరికింది. మేము సంతోషంగా మా మొక్కలు చెల్లించుకొని, వెంకటేశ్వరుని దర్శించుకున్నాము. తర్వాత మేము తిరుమల నుండి కిందకు దిగి కాళహస్తి, ఒంటిమిట్ట, మహానంది, శ్రీశైల క్షేత్రాలు దర్శించాము. అడుగడుగునా బాబా  నేనున్నానంటూ అభయమిస్తూ మాకు ఏ ఇబ్బందులు లేకుండా అన్ని దర్శనాలు చాలా బాగా జరిపించారు. ఆయన దయతో శ్రీశైలంలో మాకు మల్లికార్జునస్వామి స్పర్శ దర్శనం కూడా లభించింది. ఆ సాయినాథుడే అన్ని దర్శనాలు చేయించినట్లు నాకనిపించింది. చాలా సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చాం. తర్వాత మా బావగారు వాళ్ళు క్షేమంగా అమెరికాకు చేరుకున్నారు. బాబా మీద భారం వేస్తే ఆయనే మనల్ని సురక్షితంగా భవసాగరాన్ని దాటిస్తారు. మనం ఆయన మీద దృఢవిశ్వాసంతో ఉంటే చాలు. "ధన్యవాదాలు బాబా. ప్రస్తుతం మేము కడుతున్న ఇంటికోసం మీ దయవల్ల కొంత ధనం అందింది. మిగతా ధనం కూడా ఎలాగోలా సమకోరేలా ఏదో ఒక రూపంలో సహాయం చేసి గృహప్రవేశం ఏ ఆటంకాలు లేకుండా జరిగేలా చూడండి బాబా. మాకున్న ఆర్థిక ఇబ్బందులు తీరేలా ఏదైనా ఆదాయ మార్గాన్ని చూపండి బాబా. మేము నిన్నే నమ్ముకున్నాం బాబా. చివరిగా మీ కృపాదృష్టి మా అందరి మీద ఉంచండి. తెలిసీతెలియక చేసే మా తప్పులును మన్నించండి తండ్రీ. పిల్లలకి సద్భుద్ధిని, జ్ఞానాన్ని ప్రసాదించండి. ఎల్లప్పుడూ మీ నామస్మరణలో ఉండే భాగ్యాన్ని ప్రసాదించండి".


18 comments:

  1. Om Sri Samartha Sadguru Sachidananda Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  2. ఓం సాయి రామ్ నిన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చాం.సాయి బాబా ఆ మందులు పడేలాగ ఆశీస్సులు యియ్యవలెను సాయి.నేను చాలా సంవత్సరాల నుండి మానసిక బాధలు పడుతున్నాను.నాకు ప్రశాంతత యివ్వు సాయి.నా ఆలోచనలు పాస్ టివ్గ గా మారే లాగా సహాయం చేయండి తండ్రి.

    ReplyDelete
    Replies
    1. Baba will be always there
      Baba is testing you
      I know very well you will get out of this bad situation
      Soon you will be happy with babas grace

      Delete
  3. ఓం సాయిరామ్

    ReplyDelete
  4. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  5. sai baba pl bless my son saimadava in his studies, career, ethics, remenberance and also monitor my husband's behaviour to wife, son in positive way swamy

    ReplyDelete
  6. Baba, bless my children and fulfill their wishes in education.

    ReplyDelete
  7. Baba, our TMX is under breakdown now. Make it ready fast Baba.

    ReplyDelete
  8. Om Sai Ram
    Sai always be with me

    ReplyDelete
  9. Om sairam Mee aashirwadam na Pina undela chudu baba antha manche jarigela chudu baba

    ReplyDelete
  10. ఓం శ్రీ సాయి

    ReplyDelete
  11. ఓం శ్రీ సాయి రామ్

    ReplyDelete
  12. Baba mi dhayavalla Naku hand noppi taggindhi miku chala dhanyawadalu Baba elage appudu miru Naku toduga undandi Baba mire nakudhikku

    ReplyDelete
  13. Omsaisri Sai Jai Sai 🙏🙏🙏🙏🙏 kapadu Tandri

    ReplyDelete
  14. Om Sree Sainathaya namaha
    Om Sree Sainathaya namaha
    Om Sree Sainathaya namaha
    Om Sree Sainathaya namaha
    Om Sree Sainathaya namaha
    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    SaiBaba Swami !
    Kindly bless my son with Good Health ,Very Long and Happy Life

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo