1. చిరకాల కోరికను తీర్చిన బాబా2. హెల్త్ బాగుచేసి హ్యాపీ చేసిన సాయితాత
చిరకాల కోరికను తీర్చిన బాబా
సాయిభక్తులందరికీ నమస్తే. నా పేరు ప్రసన్న. మాది కాకినాడ. నేను చిన్నప్పటినుండి సాయిభక్తురాలిని. నాకు 33 సంవత్సరాలు వచ్చాక ఈ సంవత్సరం అంటే 2023, మే నెలలో శిరిడీ దర్శించే భాగ్యం దక్కింది. ఇన్ని సంవత్సరాలకు బాబాను దర్శించే అవకాశం వచ్చినందుకు నేను ఎంతో అదృష్టంగా భావించాను. అసలు ఈ భాగ్యం నాకు అనుకోకుండా వచ్చింది. మా పిల్లలు హాలిడే ట్రిప్ అంటే మా కుటుంబమంతా బయలుదేరి తమిళనాడులోని పాండిచ్చేరి, వేలంకన్ని చూసాక ఊటీ వెళదామనుకున్నాము. కానీ మావారు నాకోసం శిరిడీ వెళదామన్నారు. నేను చాలా ఆశ్చర్యపోయాను. అప్పటికి మావారు తన స్నేహితులతో 2 సార్లు శిరిడీ వెళ్లొచ్చారు. నేను మాత్రం అదే మొదటిసారి. ఇలా బాబా ఆశీర్వదించారని చాలా సంతోషపడ్డాను. 2 రోజుల ప్రయాణం చేసి శిరిడీ చేరుకున్నాము. ఆరోజు బుధవారం, పైగా మధ్యాహ్న సమయం కావటం వల్ల భక్తుల రద్దీ తక్కువగా వుంది. సమాధి మందిరంలో అడుగుపెడుతూనే నా మనసు పులకించిపోయింది. బాబా నన్ను చూసి, నవ్వుతున్నట్లు కనిపించేసరికి ఆనందం పట్టలేకపోయాను. తృప్తిగా బాబాను దర్శించుకొని బయటకి వచ్చాక గురుస్థానం, లెండి, ద్వారకామాయి తదితర ప్రదేశాలన్నీ చూసాము. నా చిరకాల కోరికను తీర్చినందుకు మావారికి కృతజ్ఞతలు చెప్పాను. "ధన్యవాదాలు బాబా. ఎవరైతే శిరిడీ దర్శించాలని ఆశపడుతున్నారో వాళ్లందరికీ మీ దర్శన భాగ్యం కలిగించు తండ్రి".
మావారు ఆఫ్రికాలో ఉద్యోగం చేస్తున్నారు. ఆయన పని సముద్రంలోని ఆయిల్ రిగ్‌లో ఉంటుంది. ఆయన ఆఫ్రికా చేరుకున్నాక తన స్టాఫ్ హౌస్‌లో ఉన్నారు. కొన్నిరోజులకి ఆయన ఆయిల్ రిగ్‌కి వెళ్లాల్సి ఉండగా ఒకరోజు ఒక దొంగ మావారు ఉంటున్న స్టాఫ్ హౌస్‌లోకి దూరి మావారివి, మరికొంతమంది ఇతరులవి చాలా వస్తువులు తీసుకొని పారిపోయాడు. ఆ వస్తువులలో మావారి పాస్‌పోర్ట్, రిగ్‌కి తీసుకొని వెళ్లాల్సిన డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి. అవి లేకుండా రిగ్‌కి వెళ్ళడం కుదరదన్నారు. మేము చాలా కంగారుపడ్డాము, బాధపడ్డాము. సాయిబాబాని "ఈ ఆపద నుండి గట్టెక్కించమని ప్రార్థించాము. 3 రోజులు అక్కడి పోలీస్ స్టేషన్ల చుట్టు తిరిగాక మూడో రోజు సాయంత్రం ఆఫీసువాళ్ళు అవి లేకపోయినా మావారిని రిగ్‌కి పంపడానికి ఒప్పుకున్నారు. బాబా వల్లే ఇది సాధ్యమైందని మాకు మనశాంతిగా అనిపించింది. ఇలా మా జీవితంలో సాయి లీలలు అనేకం. సాయి దయవల్ల మేము ఏ లోటూ లేకుండా ఉన్నాము. "ధన్యవాదాలు బాబా. మీ దయవల్ల పోయిన వస్తువులు దొరకాలని కోరుకుంటున్నాను. అవి దొరికినంతనే మీ అనుగ్రహం బ్లాగులో పంచుకుంటాను తండ్రీ".
శ్రీ సమర్ధ సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై!!!
హెల్త్ బాగుచేసి హ్యాపీ చేసిన సాయితాత
ఓం శ్రీసాయినాథాయ నమః. నా పేరు మణి. 20 సవంత్సరలుగా బాబా నాకు తెలుసు. నా జీవితంలో అనేక సందర్భాలలో బాబా నాకు సహాయం అందించారు. 2023, ఆగస్టు నెల చివరిలో మా మనవరాలికి అస్తమాను జ్వరం రావడంతో డాక్టర్ దగ్గరకి తీసుకొని వెళ్లారు. డాక్టరు బ్లడ్ టెస్టు చేసి, "బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉంది" అని మందులు వ్రాశారు. ఆ మందులు వాడుతున్నా జ్వరం వస్తూనే ఉండేది. ఆ సమయంలో నేను ఫోన్ చేసి మా మానవరాలితో, "బాబా తాతను తలుచుకో తల్లీ" అని చెప్పి, ఊదీ మహిమ గురించి చెప్పి, "అందరినీ బాబానే చూసుకుంటారు. ఊదీ పెట్టుకొని 'సాయి.. సాయి' అని అనుకో" అని చెప్పాను. ఆ తర్వాత నేను, "బాబా! పాపకి మరలా జ్వరం రాకుండా చూడండి. మీ అనుగ్రహం 'సాయి మహారాజ్ సన్నిధి' ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాను సాయి" అని అనుకున్నాను. బాబా దయతో మాటిమాటికి వచ్చే జ్వరం పూర్తిగా మాయమైంది. నా మనవరాలు నాకు ఫోన్ చేసి, "అమ్మమ్మా! సాయితాత నా హెల్త్ బాగుచేసి హ్యాపీ చేశారు" అని చెప్పింది. తను అలా చెప్తుంటే నాకు చాలా సంతోషంగా అనిపించింది. సాయిబాబా సర్వాంతర్యామి. ఆయనను నమ్మి కొలిచేవారి జీవితం ధన్యం. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
శ్రీ సమర్ధ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!!!
Baba, bless my children and fulfill their wishes in education. Baba, save Chandrababu Naidu .
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteOm sairam 🙏
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sairam
ReplyDeleteSai always be with me
saibaba please bless my son sai madava in his studies, health, behaviour and know about moral values. Also change the life of my husband and mother-in-law
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteOm sai ram
ReplyDeleteఓం శ్రీ సాయి రామ్ ఓం శ్రీ సాయి రామ్
ReplyDeleteOm Sai Nadhaya Namaha
ReplyDeleteOm Sai Ram baba manchi arogyam ivvu baba
ReplyDelete