'సుపుత్ర ప్రాప్తిరస్తు' అని దీవించినట్లే పుత్రుణ్ణి ప్రసాదించిన సాయి
శ్రీ సాయినాథునికి నా సాష్టాంగ నమస్కారాలు. నేను ఒక సాయిభక్తురాలిని. నేను చిన్న వయసులో ఉన్నప్పటినుండే మా ఇంట్లో సాయిని పూజిస్తుండేవాళ్లు. అందువల్ల సాయి గురించి నాకు చిన్నతనం నుండి తెలుసు. ఆ వయసు నుండే నేను సాయిని నమ్ముకుంటున్నాను. నాకు 2018లో వివాహమైంది. వివాహమైన 8నెలలకి నాకు PCOS సమస్య ఉందని తెలిసి నేను చాలా బాధపడ్డాను. ఆరోజు నుంచి నేను పిల్లల కోసం బాబానే నమ్ముకున్నాను. వేరే ఏ దేవుళ్ళకీ మొక్కలేదు. ఎందుకంటే, అన్ని రూపాలూ సాయివే అని నేను నమ్ముతాను. నేను హోమియోపతి మందులు వాడటం మొదలుపెట్టాను. కానీ నేను 5 సంవత్సరాల వరకు నేను గర్భవతిని కాలేదు. ఇక అప్పుడు నేను అల్లోపతి వైద్యం చేయించుకుందామని హాస్పిటల్‌కి వెళ్లడం మొదలుపెట్టాను. ఒక నెలరోజులకు మా అన్నయ్య నన్ను గురుచరిత్ర చదవమని చెప్పాడు. సరేనని నేను గురుచరిత్ర పారాయణ మొదలుపెట్టాను. మూడవరోజు నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో నేను మా స్నేహితులతో కలిసి శ్రీశైలంలో ఉన్నాను. అక్కడ నేనొక చోట మెట్ల మీద కూర్చుని ఉండగా నా పక్కన ఒక ముస్లిం పండితుడు కూర్చుని ఏవో మంత్రాలు చదవసాగాడు. నేను భయపడి అక్కడ నుంచి లేవబోయాను. ఇంతలో పక్కన ఒక పూజారి కనిపించి, "లేవకు, లేవకు, అక్కడే కూర్చో!" అని చెప్పారు. నేను అలాగే కదలకుండా కూర్చున్నాను. ఇంతలో ఆ ముస్లిం పండితుడు ఒక బ్రాహ్మణుని రూపంలోకి మారి నన్ను చూసి, 'సుపుత్ర ప్రాప్తిరస్తు!' అని దీవించి, "నువ్వు ఒక్కటి అడిగావు. నేను మూడు ఇస్తున్నాను" అని లేచి అక్కడనుంచి బయటకి వెళ్ళారు. బయటకి వెళ్ళగానే ఆయన రూపం మరల మారిపోయింది. ఈసారి ఆయన ఎర్రబట్టలు ధరించి ఉన్నారు, ముఖాన పెద్ద బొట్టు ఉంది. అప్పుడు ఆయన ఏదో అన్నారు(కానీ నాకు అది గుర్తులేదు). అంతటితో ఆ కల ముగిసింది. నేను నిద్రలేచాక కలలో కనిపించిన ఆ ముస్లిం పండితుడు ఖచ్చితంగా సాయే అని నాకు అనిపించింది. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలనంటే, ఆ ముస్లిం పండితుడు ఒక బ్రాహ్మణ పూజారిలా మారిపోయారు. అలా అన్ని మతాల సంప్రదాయాలను తనలో ఇముడ్చుకున్నది మన సాయి మాత్రమే. కనుక వారు ఖచ్చితంగా మన సాయే. అప్పుడు నేను ఎంత ఆనందపడ్డానో మాటల్లో చెప్పలేను.
సరిగ్గా ఆ కల వచ్చిన 6 నెలలకి నేను అల్లోపతి మందులు వాడటం మొదలుపెట్టి 7 నెలల పూర్తైంది. నాకు ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టరు అమెరికా వెళ్లడంతో 8వ నెల ట్రీట్మెంట్ ఆగిపోయింది. సరిగ్గా అప్పుడే తెలిసిన ఒకరి శిరిడీ ప్రయాణం రద్దు అయితే వాళ్ల స్థానంలో నాకు అనుకోకుండా శిరిడీ వెళ్లే అవకాశం వచ్చింది. అప్పటికే నాకు నెలసరి రావాలి, కానీ రాలేదు. శిరిడీ వెళ్లొచ్చాక డాక్టరు దగ్గరకి వెళదామని శిరిడీ వెళ్లి, వచ్చిన వెంటనే హాస్పిటల్‌కి వెళదామని బయలుదేరాను. ఇంటినుంచి బయటకు వెళ్ళగానే మా ఇంటి ఎదురుగా ఉన్న ఆంజనేయస్వామి గుడి వద్ద బాబా పల్లకి కనిపించింది(సాధారణంగా ఆ సమయంలో పల్లకి రాదు). బాబా పల్లకిని చూడగానే నా మనసుకెందుకో హాస్పటల్లో మంచి వార్త వినబోతున్నాననిపించింది. బాబానే నా మనసుకి అలా అనిపించేట్టు చేశారని ఖచ్చితమైన నా నమ్మకం. సరే, నేను హాస్పిటల్‌కి వెళ్ళాక డాక్టర్ టెస్ట్ చేసి నేను గర్భవతినని నిర్ధారించారు. ఆశ్చర్యమేమిటంటే నేను ట్రీట్మెంట్ తీసుకున్న 7 నెలలు నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాలేదు. 8వ నెలలో శిరిడీ వెళ్లి రాగానే కన్ఫర్మ్ అయింది. అంతా బాబా అనుగ్రహం.
5 నెలలో బాబా, మాస్టరుగారు నాకు ఆపరేషన్ చేస్తునట్టు కల వచ్చింది. 8వ నెల చివరిలో డాక్టరు స్కాన్ చేసి నాకు ఉమ్మనీరు తక్కువగా ఉందని చెప్పి, పెరగడానికి ఏదో మెడిసిన్ పాకెట్లు ఇచ్చారు. నేను చాలా భయపడి బాబాను శరణువేడాను. ఆ తర్వాత 3 వారాలకి డాక్టర్ చెక్ చేసి అప్పటికప్పుడే ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఆరోజు అనుకోకుండా గురువారం(2023, జూన్ 15) అయింది. ఆపరేషన్ థియేటర్‌లో బాబా ఫోటో దర్శనమిచ్చింది. బాబాని చూడగానే నేను ఆయన్ని స్మరించుకుని నమస్కారం చేసుకున్నాను. ఆపరేషన్ అంతా ప్రశాంతంగా జరిగి నాకు బాబు పుట్టాడు. ఇదంతా కేవలం బాబా అనుగ్రహం వల్లనే సాధ్యమైంది. బాబాను నమ్ముకుంటే మనకి ఏది మంచిదో తప్పకుండా చేస్తారు. కలలో, 'సుపుత్ర ప్రాప్తిరస్తు!' అని దీవించి, "నువ్వు ఒకటి అడిగితే నేను మూడు ఇస్తున్నాను" అన్న బాబా నేను కోరుకున్న సంతానాన్ని అనుగ్రహించి బాబు రూపంలో ఒకటి ఇచ్చారు, మిగతా రెండు ఏమి ఇస్తారో అని ఎదురుచూస్తున్నాను. బాబా వాటిని అనుగ్రహించిన వెంటనే ఆయన అనుగ్రహాన్ని మరల బ్లాగులో పంచుకుంటాను. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
ఓం సాయిరామ్
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
saibaba pl bless my son saimadava in his studies, health, behaviour, concentration on his studies .
ReplyDeleteOmsaisri Sai Jai Sai 🙏🙏🙏 kapadu Tandri 🙏🙏🙏🙏🙏🙏
ReplyDeleteOm sairam 🙏
ReplyDeleteAndhari jeevitham nilabedthav sai nannu mathram
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteSARVAM SREE SHIRIDI SAINAADHA MAHAARAAJAA ANUGRAHAME KADAA..
ReplyDelete🙏🙏🙏🙏🙏🕉🙏🙏🙏🙏🙏
SAIRAM SAIRAM SAIRAM SAIRAM SAIRAM SAIRAM SAIRAM SAIRAM SAIRAM SAIRAM SAIRAM