ఈ భాగంలో అనుభవం
- శ్రీసాయి అనుగ్రహ లీలలు - 24వ భాగం
నా పేరు సాయిబాబు. 2020, ఏప్రిల్ 2న కోట్లాది బాబా భక్తులలో ఈ చిన్న భక్తునికి బాబా అనుగ్రహించిన లీలను చదవండి. ఆ రోజు బాబా భక్తులకు శుభప్రదమైన గురువారమే కాకుండా శ్రీరామనవమి కూడా. రెండు పుణ్యదినాలు ఒకేరోజు కలిసి రావడం అదృష్టమని చెప్పొచ్చు. ఆరోజు ఉదయాన్నే నేను స్నానాదులు ముగించుకొని బాబాకి నమస్కరిస్తున్న సమయంలో 'ఈరోజు సచ్చరిత్రలోని శ్రీరామనవమికి సంబంధించిన అధ్యాయం చదివితే మంచిది కదా!' అని ఒక చిన్న ఆలోచన నా మదిలో మెదిలింది(ఎందువలనంటే రామనవమినాడు శిరిడీలో రామనవమి ఉత్సవం, కాలాహండీ వైభవంగా జరుపుతారు). పూజాది కార్యక్రమాలు అయిన తరువాత గ్రూపు తరుపున నేను చదవాల్సిన 6, 7 అధ్యాయాలు చదువుదామని కూర్చొని పుస్తకములోని 6వ అధ్యాయం తెరిచాను. నాకు ఆశ్చర్యం, ఆనందం రెండూ ఓకేసారి కలిగాయి. ఎందుకంటే, శ్రీరామనవమి ఉత్సవం గురించి ఆ 6వ అధ్యాయములోనే వుంది. బాబా నా మది కోరికను ఎలా నెరవేర్చరో చూశారా! ఇలాంటి లీలలు ఎన్నో, ఎన్నెన్నో.
2020, ఏప్రిల్ 5వ తేదీన మా అమ్మాయి పుట్టినరోజు. ఆ ముందురోజు ఏదైనా గిఫ్ట్ తీసుకుందామని నేను, నా మనవడు సాయీష్ షాపింగ్ మాల్‌కి వెళ్ళాము. ఆ షాపులోని అలమరాలో కూర్చుని వున్న ఒక బాబా విగ్రహం నన్ను బాగా ఆకర్షించింది. నేను ఆ బాబాను అలాగే చాలాసేపు చూస్తూ ఉండిపోయాను. ఆలోగా సాయీష్ మా ఇద్దరి తరుపున రెండు గిఫ్టులు ప్యాక్ చేయించి తీసుకుని వచ్చాడు. కానీ నాకు ఆ బాబా విగ్రహం తీసుకుందామనిపించి రేటు తెలుసుకుందామంటే, సేల్స్ బాయ్స్ అందరూ క్రింద కౌంటరులో వున్నారు, పైన ఒక్కరు కూడా లేరు. పోనీ నేనే చూద్దామంటే ఆ విగ్రహం ప్రక్కనున్న చిన్న చిన్న బొమ్మలు పడిపోతాయోమోనని ఆ బాబాను ముట్టుకోకుండానే నిలబడిపోయాను. చివరికి సాయీష్ తెచ్చిన ఆ రెండు గిఫ్ట్ ప్యాక్లు తీసుకుని ఇంటికి వెళదామని బయలుదేరిన నాకు, "నేను మీ ఇంటికి వస్తాను. నేను మీ ఇంటికి వస్తాను" అని పదేపదే స్పష్టంగా వినిపించింది. దారిలో నడుస్తున్నానన్న మాటేగానీ నా మనసంతా షాపులోని బాబా మీదే వుంది. ఇంట్లో అడుగుపెడుతూనే మా అల్లుడు, "మీరు వెళ్ళేటప్పుడు చెప్తే, నేను కూడా మీతో వచ్చి ఏదైనా గిఫ్ట్ తీసుకునేవాడిని కదా!" అని అన్నాడు. "సరే, బయల్దేరు మళ్ళీ వెళదాం" అన్నాను నేను. అంతలో మా అమ్మాయి "గోధుమపిండి కూడా తీసుకొని రండి. బాబాకు రోటీలు చేసి పెట్టాలి" అంది. నేను, మా అల్లుడు షాపింగ్‌మాల్‌కు వెళ్లి అంతకుముందు నేను చూసిన అదే బాబా విగ్రహాన్ని గిఫ్ట్ ప్యాక్ చేయించి తీసుకొచ్చాము. ఆ గిఫ్ట్‌ని మా అల్లుడు మరునాడు పుట్టినరోజు కానుకగా మా అమ్మాయికి ఇచ్చాడు. మా అమ్మాయి ఆ ప్యాక్ తెరిచి, 'తన ఇష్టదైవం, ఆరాధ్యదైవమైన సాయినాథుని' చూసి సాక్షాత్తు బాబానే తన పుట్టినరోజున వచ్చి తనని ఆశీర్వదించారని ఎంతో ఉప్పొంగిపోయింది. నేను బాబాని షాపులోనే వదిలేసి వచ్చినా వారు తమన్న మాటను మా ఇంటికి వచ్చి నిలబెట్టుకున్నారు. బాబా అన్న మాట తప్పరు అనడానికి ఇదొక నిదర్శనం. ఆయన దయతో లాక్ డౌన్ సమయంలో ఒక వ్యక్తి ద్వారా కేకు కూడా లభించింది. మరునాడు తెల్లవారుజామున 4-30కి నేను, నా మనవడు టీవీలో శిరిడీ లైవ్ కాకడ హారతి చూస్తుండగా హఠాత్తుగా సాయీష్, "శిరిడీ బాబా, నిన్న పుట్టినరోజున మన ఇంటికి వచ్చిన బాబా ఒక్కరే" అని అన్నాడు. ఎందుకంటే, లైవ్‌లోని బాబా వస్త్రాలు, ముందురోజు మా ఇంటికి వచ్చిన విగ్రహం యొక్క బాబా వస్త్రాలు ఒకేలా వున్నాయి. నిజానికి అప్పటికి అవన్నీ గమనించే వయస్సు, పరిపక్వత నా మనవడికి లేవు. కానీ బాబానే వాడితో ‘మీ ఇంట ఉన్నదీ, శిరిడీలో వున్నదీ నేనే’ అని చాటి చెప్పారు. నమ్మినా, నమ్మకపోయినా ఇదంతా యాదృచ్చికంగా జరిగింది కాదు. మేము "మీ ఇంటికి వస్తానన్నారు, అలాగే వచ్చారు బాబా" అనుకున్నాము. కానీ శ్రావణమాసంలో బాబా ఇంకో అద్భుతం చూపారు. అదేమిటో చూడండి.
బెంగుళూరులో మా అమ్మాయివాళ్ళు ఉంటున్న అపార్ట్మెంట్ బేస్మెంట్లో బాబా మందిరంలో ఉన్న బాబా విగ్రహాన్ని మా అమ్మాయివాళ్లే శిరిడీ నుండి తెచ్చి అక్కడ ప్రతిష్టించారు. అదే సమయంలో ఆ అపార్ట్మెంట్ బిల్డర్ ఒక వినాయకుని విగ్రహం కూడా ఆ మందిరంలో పెట్టించాడు. మా కుటుంబం తప్ప వేరేవాళ్ళు ఆ విగ్రహాలకు పూజ చేసేవారు కాదు. అలా 15 సంవత్సరాలుగా జరుగుతుండగా కొన్ని కారణాల వల్ల 2020లో ఆ విగ్రహాల చోటు మార్చాల్సి వచ్చింది. ఆ విషయం అపార్టుమెంటులో మీటింగ్ పెట్టినా ఎవ్వరూ పట్టంచుకోలేదు. ఇక అప్పుడు మనమే బాబాను తెచ్చి పెట్టాము కనుక మన ఇంటికే వస్తారేమో బాబానే అడిగి తెలుసుకుందామని ఆయన ముందు చీటీలు వేశాము. అయితే బాబా అనుమతి ఇవ్వలేదు. ఏం చేయాలో అర్థంకాక మా అమ్మాయి అక్కడే బాబా ఫోటో ముందు కూర్చుని ఉండగా నేను విచారంగా ప్రక్కగదిలోకి వెళ్ళాను. అప్పుడు “'నేను కదా వస్తానని అన్నాను. కాబట్టి 'ఒక్క విగ్రహాన్నే తీసుకురావాలా?' అని అడుగు” అన్న (బాబా) మాటలు పదేపదే నా చెవిలో విన్పించాయి. నాకప్పుడు ముందు బాబా విగ్రహంతోపాటు వినాయక విగ్రహం కూడా తెచ్చుకోవాలా అని అడిగినందువల్లే బాబా అనుమతించలేదని అర్థమైంది. వెంటనే వెళ్లి ఆ విషయాన్ని మా అమ్మాయికి చెప్పి, “మీరు ఒక్కరే మా ఇంటికి వస్తారా?” అని చీటీలు వేసి బాబాని అడిగితే, "వస్తాన”ని బాబా సమాధానమిచ్చారు. ఇంకేముంది మా ఆనందం అంతాఇంతా కాదు. తర్వాత ఒక బుధవారంనాడు మేము మార్బుల్ మందిరాలు తయారుచేసే షాపుకు వెళ్ళాము. అక్కడ మార్బుల్ మందిరాలు చాలా ఖరీదున్నాయి. ఇప్పుడేం చేయాలని ఆలోచిస్తున్న సమయంలో ప్రక్కనే ఒక మార్బల్ మందిరం మాకు కనిపించింది(బాబానే చూపించారు). ఆ షాపువాళ్ళు ఆ మందిరానికి చిన్న చిన్న మార్పులు, చేర్పుల చేసి బహు అందంగా మలచి అతి తక్కువ ధరకే ఇచ్చారు. అంతేకాదు పుట్టినరోజునాడు వచ్చిన చిన్న బాబా విగ్రహానికి కూడా ఒక చిన్న సింహసనం అమరింది. బాబానే ఆవిధంగా తమకోసం మార్బుల్ మందిరాన్ని, సింహాసనాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మేము 2020, జూలై నెలలో శ్రావణమాసం మొదలైన బుధవారం రోజున బేస్మెంట్లో ఉన్న బాబా విగ్రహాన్ని మా ఇంటికి తీసుకొచ్చి ఆ విగ్రహంతోపాటు పుట్టినరోజు కానుకగా వచ్చిన చిన్న విగ్రహాన్ని కూడా మార్బుల్ మందిరంలో ఉంచి చక్కగా అలంకరించి పూజ చేసాము. ఆ విధంగా "నేను మీ ఇంటికి వస్తాను" అన్న బాబా ముందు ఉత్సవ విగ్రహ రూపంలో వచ్చి, తర్వాత అసలు విగ్రహరూపంలో వచ్చి పూజలు అందుకుంటూ మాతో నాలుగు అరతులు చేయించుకుంటున్నారు.
ముందు భాగం కోసం బాబా పాదుకలు తాకండి. |
|
తరువాయి భాగం కోసం బాబా పాదాలు తాకండి.
|
ఓం సాయిరామ్
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ReplyDeleteOm sai ram baba tho na anubhavam epudu publish chestaru nenu mail send chesi one month avuthundi inka publish avvaledu
ReplyDeleteOm sri sai ram
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Sri సాయి రామ్ బాబా నీ రూపం నాకూ చూపించు సాయి బాబా నా మనసు లో ని రూపం నింపు బాబా
ReplyDeleteSARVAM SREE SHIRIDI SAINAADHA MAHAARAAJAA ANUGRAHAME KADAA SIR..
ReplyDeleteCHAALAA SANTHOSHAM..
SAIRAM SAIRAM SAIRAM SAIRAM SAIRAM SAIRAM SAIRAM SAIRAM SAIRAM SAIRAM SAIRAM
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Omsaisri Sai Jai Sai 🙏🙏🙏🙏🙏
ReplyDeleteఓం శ్రీ సాయినాధాయ నమః 🙏🙏🙏🙏
ReplyDelete