సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1617వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • చెప్పకుండానే భక్తుల కష్టాలు తీర్చే కల్పతరువు మన సాయినాథుడు

ఓం శ్రీసాయినాథాయ నమః!!! సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. నా పేరు సూర్యకళ. నా వయసు 49 సంవత్సరాలు. నేను ఇంటర్ చదువుతున్నప్పుడు తొలిసారి బాబా పేరు విన్నాను. అప్పుడు మా ఇంటికి దగ్గరలో బాబా ఆలయం కట్టారు. నేను అప్పుడప్పుడు బాబా దర్శనం చేసుకోవడానికి వెళ్తుండేదాన్ని. ఎందుకో బాబా విగ్రహానికి నమస్కరించుకున్నప్పుడు నేను ఒక విధమైన ప్రశాంతతను గమనించాను. ఆయన నాకు బాగా పరిచయమైన వ్యక్తులా, చాలా ప్రేమను చూపించే ఒక తాతలా నాకు అనుభవమయ్యేది. కొంతకాలానికి ఇంటర్ పూర్తై డిగ్రీ చదవడానికి కాకినాడ వెళ్లాను. అక్కడ తొలిసారి శ్రీసాయి సచ్చరిత్ర పారాయణ చేశాను. ప్రతి గురువారం విధిగా పూజ చేసుకొని స్నేహితులతో కలిసి గుడికి వెళ్తుండేదాన్ని. అలా రోజులు గడిచాయి. నా డిగ్రీ పూర్తై సొంతూరుకు తిరిగి వచ్చాను. నా తల్లిదండ్రులు నాకు వివాహం చేయాలని ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే మా నాన్నకి పెద్దగా ఆస్తిపాస్తులు లేవు. ఉన్నది ఒక ఇల్లు. దాన్ని అమ్మి నా పెళ్లి చేయాలి అనుకున్నారు. బాబా దయవల్ల మంచి సంబంధం కుదిరింది. అయితే పెళ్ళికి మూడు నెలలే సమయం ఉండగా మా ఇంటిని కొనడానికి ఎవరూ రాకపోవడంతో అమ్మానాన్న చాలా బెంగ పెట్టుకున్నారు. అప్పుడొకరోజు నేను మనసు బాగోలేక బాబా గుడికి వెళ్లి, బాబా ముందు కూర్చుని, ఆయనని చూస్తూ ఉండిపోయాను. నా మనసులో బాధ ఆయనకికాక ఎవరికి తెలుసు. ఎప్పటిలానే చిరునవ్వుతో చూసారు బాబా. తర్వాత నేను ఇంటికి వచ్చాక నాన్న బయటనుండి ఆనందంగా ఇంటికి వచ్చారు. విషయమేమిటంటే, బాబా గుడి పూజారి మా కుటుంబానికి బాగా పరిచయస్తులు. ఆయన, 'ఒక బాబా భక్తుడు మరియు మా టీచరుగారు మా ఇల్లు కొనుక్కోడానికి ఆసక్తి చూపిస్తున్నార'ని చెప్పారట.  అంతే, ఒక నెలలోనే వాళ్ళు మా ఇల్లు కొనుక్కోవడం, నా వివాహం ఏ ఆటంకం లేకుండా వైభవంగా జరిగిపోవడం జరిగిపోయాయి. చెప్పకుండానే భక్తుల కష్టాలు తీర్చే కల్పతరువు మన సాయినాథుడు.

అప్పట్నుంచి శ్రీసాయిబాబా నా జీవితంలో ఒక భాగంగా, కష్టాల్లో తోడుగా నేను వేసే ప్రతి అడుగులో ధైర్యాన్నిస్తూ వెంట ఉన్నారు. నేను రెండోసారి గర్భవతిగా ఉన్నప్పుడు బాబా తమ వచనం ద్వారా "నీకు ఒక కుమారుడు జన్మించును" అని చెప్పారు. దాంతో నేను అందరికీ నాకు కొడుకు పుడతాడని చాలా నమ్మకముగా చెప్తూండేదాన్ని. బాబా చెప్పినట్లే నాకు కొడుకు పుట్టాడు. అది కూడా గురువారంనాడు. తర్వాత నా జీవితం మంచిగా సాగుతుండగా నాకు తీవ్రమైన అనారోగ్యం చేసింది. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. డాక్టర్లు నరాలకు సంబంధించిన వ్యాధి అని, మందులు వాడమని చెప్పారు. ఆ మందులు వాడుతుంటే విపరీతమైన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. ముఖ్యంగా ఆ మందులు నా బ్రెయిన్ పై పనిచేసి నేను చాలా నీరసించిపోయాను. కనీసం నా పిల్లల్ని కూడా చూసుకోలేని పరిస్థితి. ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే నన్ను అలా చూసి ఇంట్లో అందరూ బెంగ పెట్టేసుకున్నారు. అలా రోజులు గడుస్తుండగా ఒకరోజు నేను మావారితో, "నన్ను ఒకసారి శిరిడీకి తీసుకుని వెళ్తారా?" అని అడిగాను. అది విని ఇంట్లో అందరూ చాలా భయపడిపోయారు. నీరసంతో అంత దూర ప్రయాణం ఎలా అని ఆలోచించసాగారు. మావారు బాగా ఆలోచించి, "సరే వెళ్దాం" అని వెంటనే రిజర్వేషన్ చేసి నన్ను శిరిడీ తీసుకెళ్లారు. బాబా దర్శనం కోసం నేను, మావారు బాబా సమాధి మందిరంలోకి అడుగుపెట్టాము. దూరం నుంచి బాబా కనిపిస్తూనే నాకు తెలియకుండానే నా కన్నుల నుంచి నీళ్లు ధారపాతమయ్యాయి. బాబాని సమీపించే కొలది కన్నీళ్ల కారణంగా విగ్రహం మసకబారింది. సమాధి ముందు నిల్చొని బాబాని దర్శించుకుంటూ కన్నీళ్లు కారుస్తుంటే ఎప్పుడు వేశారో తెలీదుగానీ పూజారి నా తల మీద నుంచి ఒక చిన్నపాటి బాబా శాలువ ఒకటి కప్పారు.  ఒక్కసారిగా ఒక విధమైన సువాసన, అది ఏమిటో అనుభవమవుతున్నా మాటల్లో చెప్పలేను. మరీ చెప్పాలి అంటే, గంధం, విభూది కలిసిన ఒక ప్రత్యేక సువాసన నన్ను అమాంతం కమ్మేసింది(ఇప్పటికీ నాకు మనసు బాలేనప్పుడు ఆ వస్త్రాన్ని గుండెలకు హత్తుకుంటే చాలు, భారం అంతా పోతుంది). దర్శనానంతరం ఇంటికి వచ్చేసాము. మరునాడు మా అమ్మ నన్ను మా ఊరు తీసుకొని వెళ్లి, అక్కడ ఒక నరాల స్పెషలిటీకి చూపించింది. ఆయన, "ముందు మీరు వాడుతున్న మందులు వాడటం ఆపేయండి. అవి మెదడు మీద విపరీతమైన ప్రభావాన్ని చూపుతున్నాయ"ని చెప్పి ఒకే ఒక టాబ్లెట్ రాత్రి వేసుకోమని ఇచ్చారు. దాంతో నా ఆరోగ్యం మెరుగుపడింది. ఇప్పుడు ఏ ఆరోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉన్నాను. ఇది ఆ సాయినాథుని లీలే కదా?

ఈమధ్య మా పాపకి వివాహం కుదిరింది. నేను తొందరపడక కొంచెం ఆలోచించి చేయాలని, "బాబా! మంచిదైతే ముందుకు నడిపించు" అని బాబాని వేడుకున్నాను. ఆయన భరోసా ఇచ్చి నిశ్చితార్థం, పాప అత్తవారింట అడుగుపెట్టడం మొదలైన అన్నీ శుభకార్యాలు గురువారం జరిగేలా చేసి మమ్మల్ని ఆనందంపజేశారు. అంతేకాదు, పాప అత్తింటివాళ్ళు  కూడా బాబా భక్తులే. బాబాతో నాకున్న ఈ అనుభవాలన్నీ ఒక పాంప్లెట్‌‌గా వేసి సాయి మందిరాల్లో ఇవ్వాలని నాకు ఆలోచన ఉండేది. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఈమధ్య ఒకరోజు ఫేస్బుక్ చూస్తుండగా ఈ 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు కనిపించింది. అప్పుడు నాకు చాలా ఆశ్చర్యంగానూ, ఆనందంగానూ అనిపించింది. ఈ బ్లాగులో నా అనుభవాలను పంచుకుంటే ఇంకా ఎంతోమంది భక్తులకు చేరుతాయి కదా అనిపించి వెంటనే వ్రాసి బ్లాగుకి పంపాను. అందరికీ నమస్కారాలు.


15 comments:

  1. Chaduvutunte adupu vastundi...miru adrustavantulu amma🙏

    ReplyDelete
  2. ఓం సాయిరామ్

    ReplyDelete
  3. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  4. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  5. Please help us at this tough time Baba

    ReplyDelete
  6. ఓం సాయి రామ్

    ReplyDelete
  7. Pls help me baba said😥

    ReplyDelete
  8. Pls help me baba sai 😥

    ReplyDelete
  9. Baba, bless my children and fulfill their wishes. Baba, save me from this critical condition.

    ReplyDelete
  10. ఓం శ్రీ సాయి ఓం శ్రీ సాయి

    ReplyDelete
  11. Omsaisri Sai Jai Sai 🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  12. Om Sairam.
    Baba ! Kindly bless my son with Good Health and Long Life free from ailments.🙏🏻

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo