సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1621వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఆశ్రయిస్తే ఆదుకోకుండా వుండరు సాయి
2. నెలసరి సమస్యను తప్పించి శిరిడీ దర్శనం చేయించిన బాబా

ఆశ్రయిస్తే ఆదుకోకుండా వుండరు సాయి

ఓం సాయిదేవాయ నమః!!! సాయిభక్తులకు నమస్కారాలు. నేను ఒక సాయిభక్తురాలిని. ఒకరోజు హాస్టల్లో ఉన్న మా పెద్దబాబు తనకి కడుపునొప్పి అని ఫోన్ చేశాడు. నాకు ఎందుకో అది అపెండిక్స్ ఏమోనని చాలా భయమేసింది. స్కూలువాళ్ళు బాబుని హాస్పిటల్‌కి తీసుకొని వెళితే అక్కడ టెస్టులు చేశారు. నేను భయపడినట్లే రిపోర్టులో అపెండిక్స్ అని వచ్చింది. అప్పుడు, "టాబ్లెట్‌తో రెండు రోజుల్లో తగ్గితే సరే, లేకపోతే 2 రోజుల తరువాత మళ్ళీ స్కాన్ తీద్దాం. ఒకవేళ ఇన్ఫెక్షన్ ఎక్కువైనట్లైతే అపేరేషన్ చెయ్యాలి" అన్నారు. నేను హాస్పిటల్లో పని చేస్తున్నందున ఒకసారి మా మేడమ్‌ని, సార్‌ని అడుగుదామనిపించి అడిగితే, వాళ్లు "మనకు తెలిసిన డాక్టర్ ఉన్నారు. వెళ్ళి కలవండి. అలాగే వెళ్ళేముందు ఇంకోసారి స్కాన్ తీసి రిపోర్టు తీసుకొని వెళ్లండి" అని చెప్పారు. సరేనని మేము స్కాన్ చేయించాం. ఆ రిపోర్టులో కూడా అలానే వచ్చింది. కానీ ఆ డాక్టర్ "ఇది అపెండిక్స్ అవునో, కాదో  ఖచ్చితంగా చెప్పలేం. ఒక చిన్న అపెరేషన్ చేసి చూద్దాం. ఆ ప్రాసెస్‌లో చిన్న చిన్న రంధ్రాలు వేసి చూస్తాం. అది అపెండిక్స్ ఐతే దాన్ని తీసేస్తాం. అపెండిక్స్ కాకుండా పేగు ఇన్ఫెకషన్ ఐతే దానికి తగ్గట్టు చికిత్స ఇద్దాం. అయితే పేగు ఇన్ఫెక్షన్ ఐతే ఆపెరేషన్ చేసినా మళ్ళీ రావచ్చు" అన్నారు. నేను, "అలా చేయడం నాకు ఇష్టం లేదు. బాబుకి 12 సంవత్సరాలు అంతే. ఈ చిన్న వయసులో ఇదంతా వద్దు" అని అన్నాను. డాక్టరు, "సరే, మీరు నిర్ణయించుకోండి" అని చెప్పారు. మేము ఇంటికి వచ్చేశాము. ఏమి చేయాలో నాకు అర్థంకాక సాయికి చెప్పుకొని ఆయన మీద నమ్మకం ఉంచాను. తర్వాత మా మేడంకి ఫోన్ చేసి ఆ డాక్టరు ఏం చెప్పారో చెప్పాను. మేడం, "ఒక 10 నిమిషాలు. సార్‌తో నేను మాట్లాడుతాను" అని ఫోన్ పెట్టేశారు. కాసేపటి తర్వాత మళ్ళీ కాల్ చేసి, "అమ్మా! మీరు CT స్కాన్ చేయించండి. ఆ రిపోర్టులో అపెండిక్స్‌కి సంబంధించి ఏమి లేదని వస్తే కేవలం టాబ్లెట్లతో నయమైపోతుంది. లేదు, అపెండిక్స్ అని వస్తే ఆపరేషన్ చేయాల్సి వస్తుంది" అన్నారు. ఇంట్లో వాళ్ళందరూ కూడా స్కాన్ చేయిస్తే మంచిదే అంటే స్కాన్ చేయించాం. అందులో అపెండిక్స్ ఏమి లేదని వచ్చిందని సార్ చెప్పారు. అప్పుడు మేము ఊపిరి పీల్చుకునాం. డాక్టరు కొన్ని మందులిచ్చి 7 రోజులకి మళ్ళీ రమ్మన్నారు. అప్పుడు వెళ్తే సార్, "సమస్యేమీ లేదు. ఫుడ్ కంట్రోల్ చేసి 10 రోజులు టాబ్లెట్లు వాడి ఆపేయండి" అన్నారు. ఇప్పుడు బాబు బాగానే వున్నాడు. ఇదంతా సాయి దయ. ఆయన్ని ఆశ్రయిస్తే ఆదుకోకుండా వుండరు. "చాలా చాలా ధన్యవాదాలు సాయి".


నెలసరి సమస్యను తప్పించి శిరిడీ దర్శనం చేయించిన బాబా

నేను ఒక సాయిభక్తురాలిని. మాది హైదరాబాద్. నేను మొదటిసారి సాయిబాబా గురించి ఈనాడు పేపరులో చదివాను. అప్పుడు నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నాను. నేను పదవతరగతి చదువుతున్నప్పుడు మొదటిసారి శిరిడీ వెళ్ళాను. ఒక నెలముందు మా నాన్న, తన స్నేహితుల కుటుంబాలు కలిసి 13వ తారీఖున బస్సులో శిరిడీ, శనిశింగణాపూర్, నాసిక్, త్రయంబకేశ్వరం, పండరీపురం, ఔరంగాబాద్ టూర్ వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. నాకేమో ప్రతినెలా సరిగ్గా 13వ తారీఖు నెలసరి వస్తుంది. నేను నెలసరి సమయంలో అంతకుముందెప్పుడూ, ఎక్కడికీ వెళ్ళనందున నాకు చాలా భయమేసింది. అయితే ఆ నెల ఏడవ తారీఖునే నాకు నెలసరి వచ్చేసింది. మొదటిసారి అలా ముందుగా రావడంతో నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. మనసులో బాబాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ టూరుకి వెళ్లి మొదటిసారి శిరిడీ దర్శించి, బాబా దర్శనం చేసుకొని వచ్చాను. అలా అప్పటినుంచి ఇప్పటివరకూ ఎన్నో విషయాల్లో బాబా నాకు సహాయం చేస్తూనే ఉన్నారు. "శతకోటి నమస్కారాలు బాబా".

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


15 comments:

  1. Sai nannu vamsi ni kalupu baba sai

    ReplyDelete
  2. ఓం సాయి రామ్ నాకు బుద్ధి రావటం లేదు.ఏ పాపం ఎరుగని నా భర్తని మనస్సు లో తిడుతున్నాను.నా మానసిక పరిస్థితి బాగా లేదు.మందులు వాడుతున్నా కానీ మార్పు లేదు.అందుకని చావే శరణ్యం అని సాయిని ఆ కోరిక తీర్చినట్టు అడుగుతున్నాను

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. Thondara padakandi. Meeku Problems vastunnayi antey God mee previous janma yokka bad Karma ni clear chestunnaru

      https://youtu.be/3FpaaSQCPZA?si=OTwruNHzZGwR3l_O

      Delete
  3. ఓం సాయిరామ్

    ReplyDelete
  4. Ma papa ki stomach pain tagela chudu baba please🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  5. Om sai ram 🙏🙏🙏🙏

    ReplyDelete
  6. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  7. Omsaisri Sai Jai Sai 🙏🙏🙏🙏🙏 kapadu Tandri 🙏🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  8. ఓం శ్రీ సాయి రామ్

    ReplyDelete
  9. ఓం శ్రీ సాయి రామ్

    ReplyDelete
  10. ఓం సాయి రామ్ నిన్ను ఆశ్రయించిన తర్వాత నాకు భయం లేదు.మా కుటుంబం అంతా చల్లగా ఉండేలాగ ఆశీస్సులు యియ్యవలెను సాయి బాబా

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo