సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1635వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  • శ్రీసాయి అనుగ్రహ లీలలు - 25వ భాగం

నా పేరు సాయిబాబు. బాబా మన మదిలోని భావాలను నెరవేరుస్తారు. అందుకు సంబంధించి సాయి సచ్చరిత్రలోనేకాక నాకు కూడా అనుభవాలున్నాయి. అటువంటి ఒక సంఘటనను ఇప్పుడు చెప్తాను. ఒక గురువారంనాడు నేను బాబాకి కొబ్బరికాయ కొడదామనుకున్నాను. ఆరోజు మధ్యాహ్నం మా అమ్మాయి, అల్లుడు షాపింగ్‌కని బయటికి వెళ్తుంటే నేను వాళ్లతో, 'ఒక కొబ్బరికాయ తీసుకొని రమ్మ'ని చెప్పబోయాను. కానీ ఎందుకో ఆ మాట నా నోటి నుండి బయటకు రాలేదు. కొంతసేపైన తర్వాత మ్రొక్కుకున్నది నేనే కాబట్టి, నేనే బయటికి వెళ్లి కొబ్బరికాయ తీసుకొద్దామని అనుకున్నాను కాని, వెళ్ళలేదు. బజారుకు వెళ్లిన మా అమ్మాయివాళ్ళు తిరిగి వస్తుంటే దారిలో ఓ చోట రోడ్డుకి అవతలి వైపు నిండుగా ఉన్న కొబ్బరికాయల బండి కనిపించింది. మా అమ్మాయికి ఒక కొబ్బరికాయ తీసుకోవాలని అనిపించినప్పటికీ రోడ్డుకి మరోవైపు ఉన్న వాళ్ళ కారును పార్క్ చేసేందుకు సరైన సదుపాయం లేకపోవడం వల్ల కొబ్బరికాయ తీసుకోకుండానే వచ్చేసారు. తరువాత నేను బయటికి వెళ్దామని బయలుదేరాను. కానీ పెద్ద వర్షం పడి రోడ్డు అంతా బురదగా ఉన్నందున వెళ్లలేకపోయాను. సాయంత్రం 6:00 గంటలకి బాబాకి పూజ చేయడానికని అపార్ట్మెంటు కింద ఉన్న మందిరానికి వెళ్లి తలుపు తీసి లైట్ వేశాను. అంతే, బాబాకి ఎదురుగా ఉన్నది చూడగానే ఆప్రయత్నంగా నా కళ్ళల్లో నీళ్లు వచ్చేసాయి. ఎదురుగా ఉన్నదేమిటో ఈపాటికే మీరు గ్రహించి ఉంటారనుకుంటున్నాను. అది పెద్ద సైజులో ఉన్న ఒక కొబ్బరికాయ. మా ఇంట్లో ఎవరూ కొబ్బరికాయ తేలేదు. అలాంటప్పుడు అది అక్కడికి వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే, ఆ మందిరం తాళం వేసి ఉంటుంది. మేము తప్ప ఎవరూ ఆ తాళం తీయరు. సరే, పూజయ్యాక సచ్చరిత్ర తీసి చదువుతుంటే 'శిరిడీలో బాబా పాదాల వద్ద కొబ్బరికాయ సమర్పించి మ్రొక్కు తీర్చుకున్నాను' అని వచ్చింది. అంత పెద్ద పుస్తకం తెరవగానే నా కళ్ళకు ఆ వాక్యమే కనిపించేలా బాబా ఎందుకు చేసారో, ఆ కొబ్బరికాయ అక్కడ ఎవరు పెట్టి ఉంటారో ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉంటుంది. బాబా కోట్లాది భక్తులను జాగ్రత్తగా కాపాడుకుంటూ కూడా నా మనసులో ఉన్నదాన్ని తీర్చడం జన్మజన్మల పుణ్యం.

బాబాని ప్రశ్న అడిగినప్పుడు ఆయన ఇచ్చే సమాధానాలు ఒక్కోసారి ప్రశ్నార్థకంగా, మనల్ని ఆలోచింపజేసేవిగా ఉంటాయి. తరువాతగాని ఆయన అలా ఎందుకు జవాబు ఇచ్చారో మనకు అర్థం కాదు. అలాంటి ఒక అనుభవాన్ని ఇప్పుడు చదవండి. మేము మామూలుగా శని, ఆదివారాల్లో ఎక్కడికైనా ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్తాము. కానీ కరోనా కారణంగా 2020 సంవత్సరం మార్చి నుండి జూన్ వరకు సుమారు మూడున్నర నెలలు మేము కాలు బయటపెట్టకుండా ఇంట్లోనే గడిపాము. అలా ఉండగా జూన్ 27న మా అల్లుడి ఆఫీసు స్నేహితుడు తన బంధువు పెళ్ళని "మీరు అందరూ తప్పకుండా రావాల"ని శుభలేఖ ఇచ్చి వెళ్ళాడు. మాకు మా అల్లుడి స్నేహితుడు బాగా తెలుసుగానీ, అతని బంధువు తెలియదు. అలాంటప్పుడు పెళ్ళికి ఎలా వెళ్లడమని అనుకున్నాం. కానీ బాబా ఉన్నారుగా. ఆయన్ని 'పెళ్లికి వెళ్లాలా, వద్దా' అని అడిగితే, 'వెళ్ళమ'ని జవాబు వచ్చింది. బాబా చెప్పాక ఇక తప్పదు కదా! మా అల్లుడి స్నేహితునితో కారులో పెళ్ళికని ఆ ఊరు వెళ్ళాము. అక్కడున్న వారం రోజులలో ప్రతిరోజూ మేము ఆ ఊరిలోని బాబా మందిరం దర్శించుకుంటూ అనుకోకుండా మందిరం పక్కనే ఉన్న రెండు ఫ్లాట్లు  తీసుకున్నాము. కాదు, బాబానే ఇప్పించారు. వాటికోసమే 'పెళ్ళికి వెళ్ళమ'ని బాబా అనుమతి ఇచ్చి ఉంటారు. లేకపోతే కొత్త ప్రదేశానికి అంత దూరం వెళ్లే ప్రసక్తే ఉండదు. పెళ్లి అయ్యాక గురుపౌర్ణమి వస్తుండడంతో తిరుగు ప్రయాణమవుదామని, చివరిసారిగా బాబాను దర్శించుకోవాలని గుడికి వెళ్ళాం. అప్పుడు గుడి మేనేజ్మెంట్ ఒకరు మాకు పరిచయమయ్యారు. అతను మాటల మధ్యలో "హోస్పేటలో ఉన్న లోటస్ మందిరం చాలా పెద్దది. కరోనా కారణంగా బయట భక్తులను అనుమతించడం లేదు. కానీ మీరు వెళ్తానంటే, నేను ఫోన్ చేసి అక్కడ పూజారికి చెప్తాను. ఆయన మీకు దగ్గరుండి బాబా దర్శనం చేయిస్తారు" అని చెప్పారు. మేము, "అంతకన్నా మాకు కావలసిందేముంది?" అని గురుపౌర్ణమి సందర్భంగా కొన్ని వస్తువులిచ్చి, సాయి కోటి వ్రాయడానికి కొన్ని పుస్తకాలు తీసుకుని, ధన్యవాదాలు చెప్పి వచ్చాము. మరుసటిరోజు తిరిగి బెంగళూరుకి ప్రయాణమై దారిలో హోస్పేట్‌‌లోని బాబా లోటస్ మందిరం దర్శించాము. ఆ మందిరం అద్భుతంగా నిర్మించారు. 135 అడుగుల సాయి స్తూపం, పలు అభినయాలతో బాబా విగ్రహాలు అద్భుతంగా ఉన్నాయి. నిలువెత్తు బాబా మూర్తి ఆకర్షనీయంగా ఉంది. వారి పాదాల వద్ద ఆశీర్వచనం తీసుకొని సాయంత్రానికి ఇల్లు చేరాం. అదే మేము లాక్ డౌన్‌‌లో ఏం వెళతాములే అని బాబాని అడక్కుండా ఉంటే ఇంట్లోనే ఉండేవాళ్ళం. కానీ బాబాని అడిగి ఆయన సమాధానానికి కట్టుబడి వెళితే అన్ని పనులు ఎలా కలిసి వచ్చేలా చేశారో చూసారా! అందుకే విషయమేదైనా బాబాని అడిగి, ఆయన జవాబును మనసా, వాచా పాటించాలి. మంచే జరుగుతుందిగానీ చెడు జరగదు. అదే నిజమైన భక్తి.

ఒకసారి నేను ఒక్కడినే శిరిడీ వెళ్లాను. ఒక్కడినే అంటే ఒక్కడినే కాదు బాబా తోడుంటారుగా! శిరిడీలో మూడవరోజు మధ్యాహ్నం సాయి ప్రసాదాలయంలో ప్రసాదం స్వీకరించి సంస్థాన్ బస్సుకోసం వేచి ఉండగా ఐదు నిమిషాల తర్వాత నాకు కళ్ళు తిరిగినట్లు అనిపించి పక్కనే ఉన్న బెంచి మీద కూర్చున్నాను. రానురాను కళ్ళు తిరగడం ఎక్కువై కళ్ళు తెరవలేకపోయాను. అంతలో బస్సు వచ్చింది. నాలుగు అడుగులు వేసి ఎలాగో బస్సెక్కి కూర్చున్నాను. ఆ బస్సు సరాసరి 1500 గదులున్న సాయి ఆశ్రమం కాంప్లెక్స్ కు వెళ్ళింది. కానీ నేను దిగాల్సింది బాబా మందిరం దగ్గర. కళ్ళు మూసుకొని ఉన్నందువల్ల బస్సు ఎటు వెళ్తుందో చూసుకోలేదు. సరే కాంప్లెక్స్‌లో ఇంకో బస్సు ఉంటే, ఆ బస్సెక్కి మందిరం దగ్గర దిగి పక్కనే ఉన్న రాయి మీద కూర్చున్నాను. బస్సు ఎలా ఎక్కానో, ఎలా దిగానో నాకే తెలీదుగాని కళ్ళు తెరిచి చూడలేకపోతున్నాను. బాబాని తలుచుకొని, "బాబా! మీరే వచ్చి నన్ను నా రూముకి చేర్చాలి తండ్రి" అని వేడుకున్నాను. అంతే, ఒక్క క్షణంలో నా ముందు ఒక ఆటో ఆగింది. డ్రైవర్ సీటులో ఉన్నతను "ఎక్కడికి వెళ్లాలి" అని అడిగాడు. నేను నా రూము అడ్రస్ చెప్పి, "తెలుసా?" అన్నాను. అతను, "నాకు అన్నీ తెలుసు. నువ్వు ఎక్కు" అని హిందీలో అన్నాడు. నేను ఆటో ఎక్కి కళ్ళు మూసుకుని కూర్చున్నాను. నేను అతనికి నా రూమున్న ప్రదేశం పేరు మాత్రమే చెప్పినా అతను సరాసరి నా రూమున్న బిల్డింగ్ ముందుకి తీసుకెళ్లి, ఆటో ఆపి, "నీకు ఏమైంది?" అని అడిగాడు. నేను, "కళ్ళు తిరుగుతున్నాయి" అని చెప్పాను. "కొబ్బరినీళ్ళు త్రాగు. తగ్గిపోతుంది" అని చెప్పాడు. కానీ ఆటో డబ్బులు అడగలేదు. నేను 50 రూపాయలు అతనికిచ్చి నా గదికి వెళ్లి కొంచం ఊదీ నీళ్లలో కలుపుకొని తాగి పడుకున్నాను. గంటసేపటికి కళ్ళు తిరగడం తగ్గి, నేను మామూలు అయ్యాను. బాబా సన్నిధిలో, ఆయన సమక్షంలో మనం సురక్షితం కదా! నేను ఎప్పుడు శిరిడీ వెళ్లినా ఒకటి, రెండు రోజులు నాకు నలతగా ఉంటుంది. ఆ సంవత్సరంలో రావాల్సిన పెద్ద అస్వస్థతను బాబా శిరిడీలో అలా చిన్న దానితో తీసేస్తారు. "ధన్యవాదాలు బాబా".

2020, జూలై 10, శుక్రవారంనాడు నేను, మా అమ్మాయి యధావిధిగా బాబా పూజ చేసాము. పూజ పూర్తైన తర్వాత మా అమ్మాయి, "బాబా విగ్రహం దగ్గర నుండి మంచి లడ్డు వాసన వస్తోంది. మీకు కూడా అలా వస్తుందా?" అని నన్ను అడిగింది. నేను, "నాకు ఏ వాసనా రావడం లేదు" అని చెప్పాను. అదేరోజు సాయంత్రం నేను కింద ఉన్న బాబా మందిరానికి వెళ్ళి పూజ చేద్దామని తలుపు తాళం తీస్తే, అక్కడ ప్రసాదం ప్లేటులో ఒక లడ్డు వుంది. మేము తప్పితే ఆ మందిరంలో ఎవరూ పూజ చేయరు. మరి అది అక్కడికి ఎలా వచ్చిందో? ఎవరు పెట్టారో? ఆ లడ్డు వాసన మా అమ్మాయికి ఎలా చేరిందో? అన్నీ అర్థంకాని ప్రశ్నలే. ఎందుకంటే, బాబా మందిరం ఉండేది అపార్టుమెంట్ బేస్మెంట్ బయట, మా అమ్మాయివాళ్ళ ప్లాటు ఉండేది నాలుగో అంతస్సులో మరోవైపున. అదే బాబా లీల. ఆయన వాసన ద్యారా వెళ్ళి తమ ప్రసాదాన్ని తీసుకోమని సంకేతమిచ్చారు, మా నోరు తీపి చేశారు.

 


ముందు భాగం కోసం
బాబా పాదుకలు తాకండి.




 


 


తరువాయి భాగం కోసం
బాబా పాదాలు తాకండి.

 



15 comments:

  1. Baba, bless my children and fulfill their wishes in education. Baba, release Chandrababu Naidu from jail.

    ReplyDelete
  2. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  3. sai babu gaari I'm jealous of you sir.meekù baba chupisthunna leelalu maakuda konni jarigithe bagundu. naku job evvu baba. pls

    ReplyDelete
    Replies
    1. Do hearth full babapuja.everything o.k

      Delete
  4. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  5. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  6. Sai baba pl bless my son sai madava in his studies, career, behaviour concentration on his studies . Also keep safe my husband, mother-in-law

    ReplyDelete
  7. Omnsairam🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  8. Omsaisri Sai Jai Sai 🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  9. ఓం శ్రీ సాయి రామ్

    ReplyDelete
  10. Om sai ram. Chaala adrushtavanthulu miru. Baba sada thodu undugaaka

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo