సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1619వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా కృపతో సంతానం
2. పుట్టినరోజున బాబా దీవెనలు

బాబా కృపతో సంతానం

ఓం సద్గుర సాయినాథ్ మహారాజ్ కీ జై!!! నా పేరు నాగశ్రీనివాసరావు. మాది సకినేటిపల్లి, కోనసీమ. బాబా నా జీవితంలో చేసిన అద్భుతాన్ని మీ అందరితో పంచుకుంటున్నాను. నాకు 1995లో వివాహం అయింది. అప్పుడు నా వయసు 21 సంవత్సరాలు, నా భార్యకు 18 సంవత్సరాలు. మాకు ఐదు సంవత్సరాల దాకా పిల్లలు కలగలేదు. మాకు పెద్ద పెద్ద డాక్టర్ల దగ్గరకి వెళ్లి చూపించుకొనే స్తోమత లేక నేను, నా భార్య రోజూ చాలా బాధపడుతుండేవాళ్ళం. అది చాలదన్నట్లు చుట్టాలు మొదలుకొని అందరూ మాకు పిల్లలు లేరని హేళనగా మాట్లాడుతుండేవారు. అలా కొన్ని సంవత్సరాలు ఇతరుల సూటిపోటి మాటలతో నేను, నా భార్య చాలా మానసిక వేదనను అనుభవించాము. అప్పుడు ఒకరోజు మా వదినగారు అంటే నా భార్య అక్క, "మీరు సాయిబాబాని నమ్ముకోండి" అని చెప్పింది. అప్పటినుండి మేము సాయిబాబాను పూజించడం మొదలుపెట్టాం. ఏ దేవుని వల్ల కానిది బాబా ఒక్కరి వల్ల సాధ్యమైంది. అదే సంవత్సరం(1999) నా భార్య గర్భవతి అయి 2000 సంవత్సరంలో ఒక మగబిడ్డను ప్రసవించింది. అప్పుడు మేము, "ఎప్పటికైనా శిరిడీ వెళ్లి బాబాని దర్శించుకుందాం" అని అనుకున్నాము. కానీ కాలక్రమంలో చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. ఆర్థిక సమస్యల వల్ల మేము శిరిడీ వెళ్లలేకపోయాం. చివరికి 2020, జనవరిలో నేను, నా భార్య, నా కుమారుడు బాబా దర్శనానికి శిరిడీ బయలుదేరాము. అయితే మొదటిసారి వెళ్తున్నందున మేము ముగ్గురం చాలా భయపడ్డాం. కానీ 'బాబా ఉన్నారు కదా!' అనుకున్నాము. ఆయన భాష రాని మాకు తెలుగు తెలిసినవాళ్ళు ఉన్న దగ్గర రూము దొరికేలా అనుగ్రహించారు. అప్పుడు మా ఆనందానికి అవధులు లేకుండా పోయింది. బాబాని దర్శించుకొని, "మా ఆర్థిక స్తోమత వల్ల ఇప్పటివరకు మిమ్మల్ని దర్శించుకోలేకపోయాం. ఏదేమైనా మీ కృపవల్ల 20 సంవత్సరాలకి మిమ్మల్ని దర్శించి మీ మొక్కు తీర్చుకున్నాం" అని మనసులో బాబా కృతజ్ఞతలు చెప్పుకున్నాము. అలా బాబు పుట్టినప్పుడు 2000లో అనుకున్న మొక్కు 2020లో తీర్చుకున్నాము. అప్పుడుగాని వెళ్లకపోయి ఉంటే మరికొన్ని సంవత్సరాలు పట్టేదేమో మేము శిరిడీ వెళ్ళడానికి. ఎందుకు ఇలా అంటున్నానంటే మేము బాబాను దర్శించుకొని వచ్చిన తర్వాత కొన్ని రోజులకి 2020, మార్చిలో కరోనా ప్రారంభమైంది. అప్పుడు మేము అంతా సాయి మహిమ, ఆయన తమ భక్తులని తమ వద్దకు ఎలా, ఎప్పుడు పిలిపించుకుంటారో ఎవరికీ తెలియదు అనుకున్నాము.

సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!!!


పుట్టినరోజున బాబా దీవెనలు

ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!! నా పేరు సూర్యనారాయణమూర్తి. 2023, ఆగష్టు 6న నా పుట్టినరోజు. ఆరోజు బాబా నన్ను ఎలా ఆశీర్వదించారో నేనిప్పుడు మీతో పంచుకుంటాను. ఆరోజు ఆదివారం కావడంతో అప్పటికే నేను చదువుతున్న శ్రీసాయి సచ్చరిత్రలో మిగిలి ఉన్న 17 అధ్యాయాలను చదివి సచ్చరిత్ర పారాయణ పూర్తి చేయాలని నిర్ణయించుకొని ఉదయం 8.30కు మొదలుపెట్టి 10.15కి పూర్తి చేశాను. అప్పుడు సాయిబాబాకి హారతిచ్చి ఆశీర్వదించమని వేడుకున్నాను. అప్పటివరకు నా ఫోన్ మోగుతూనే ఉంది. చాలామంది స్నేహితులు, బంధువులు నాకు శుభాకాంక్షలు చెప్పాలని ప్రయత్నిస్తున్నారు. కానీ నేను పారాయణ పూర్తయ్యేవరకు ఎవరి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. పారాయణ పూర్తైన తర్వాత నేను పూజ గది నుండి బయటకి వచ్చాక ఎవరెవరు కాల్ చేస్తున్నారో చూద్దామని ఫోన్ చూస్తే, మొదట సాయి భక్తురాలైన నా మేనకోడలు నంబర్ కనిపించింది. నేను వెంటనే తనకి  కాల్ చేస్తే, తను లిఫ్ట్ చేసి "వీడియో కాల్ చేయమ"ని అంది. నేను సరేనని వీడియో కాల్ చేస్తే, ఆశ్చర్యంగా బాగ్ అంబర్‌పేట్‌లోని బాబా గుడిలో బాబా వద్ద ఉన్న తను వీడియోని బాబా వైపుకి తిప్పింది. అదే సమయంలో బాబా మెడ వద్ద నుండి ఒక పువ్వు కిందకు జారిపడింది. ఆవిధంగా బాబా నాకు తమ దర్శనంతో పాటు దీవెనలు ఇచ్చారు. "శతకోటి నమస్కారాలు బాబా. ఇలాగే మనందరినీ ఆశీర్వదించామని ప్రార్థిస్తున్నాను తండ్రీ".


16 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. Om sai ram 🙏🙏🙏🙏

    ReplyDelete
  3. Baba, I am suffering from acute back pain. Pl cure it immediately. I will share in Sai Sannidhi blog.

    ReplyDelete
  4. Baba, bless my children and fulfill their wishes to reach their goals.

    ReplyDelete
  5. ఓం సాయిరామ్

    ReplyDelete
  6. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  7. Om sairam baba antha manche jarigela chudu baba

    ReplyDelete
  8. sai baba pl bless my son sai madava in his studies, health, concentration, knowledge memory power . Also bless my husband with good health, how to behave with moral values sai baba . Also our project of selling of flat at malkajgiri in a smooth manner.

    ReplyDelete
  9. Sai nannu vamsi ni kalupu baba sai

    ReplyDelete
  10. ఓం శ్రీ సాయి రామ్ ఓం శ్రీ సాయి రామ్

    ReplyDelete
  11. నాకు చాలా అనుభవాలు ఉన్నాయి బాబా గారితో పంచుకోవలసినవి వాటిని ఎలా పోస్ట్
    చేయాలో అర్థం కావటం లేదు నా మనసులో ఒక ఆలోచన ఉంది ఆలోచన నెరవేరుస్తారని కచ్చితంగా నమ్ముతున్నాను

    ReplyDelete
  12. సాయి నాకు సహాయం చేయండి.మా అబ్బాయి కి కోపం వచ్చింది.నా తప్పు వుంది.అపోహలు తొలగించండి.ఓం సాయి రామ్.

    ReplyDelete
  13. Omsaisri Sai Jai Sai 🙏🙏🙏 ka paduTandri omsairam

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo