సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1634వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

  1. బాధలు తీర్చి ఎంతో సహాయం చేస్తున్న బాబా
  2. కోరుకున్నట్లు నార్మల్ రిపోర్టులు వచ్చేలా అనుగ్రహించిన బాబా


బాధలు తీర్చి ఎంతో సహాయం చేస్తున్న బాబా

సాయిభక్తులందరికీ నా నమస్కారములు. నా పేరు వెంకటేశ్వరరావు. 2016లో నాకు మడం నొప్పి బాగా ఎక్కువగా వచ్చింది. ఉదయం నిద్రలేచాక కాలు కింద పెడితే ముల్లు మీద పెట్టినట్టు వుండి నొప్పి భరించిలేకపోయేవాడిని. ఎంసీఆర్ చెప్పులు వాడితే తగ్గింది. మరల ఇప్పుడు 2023, జూన్‌లో ఆ నొప్పి వచ్చింది. ఈసారి ఎంసీఆర్ చెప్పులు వాడినా తగ్గలేదు. ఇక అప్పుడు నేను, "బాబా! మీ దయ. నాకు ఈ నొప్పి తగ్గేలా అనుగ్రహించండి" అని అనుకున్నాను. ఒక 30 రోజులకి నొప్పి తగ్గిపోయింది. ఇదంతా బాబా నా మీద చూపించిన కరుణ. ఇది మీకు చిన్న విషయంగా అనిపించవచ్చు కానీ, నాకు మాత్రం పెద్ద సమస్య. నొప్పి అంతలా వుండేది మరి. "ధన్యవాదాలు సాయి".

2023, ఆగస్టు 12న, ఉదయం నిద్రలేచేటప్పటికి మా బాబు బాగానే ఉన్నాడు. కానీ, 7 గంటలప్పుడు హఠాత్తుగా తన శరీరంపై అలర్జీలా వచ్చింది. నాకు భయమేసి, "ఏంటి బాబా?" అని అనుకున్నాను. మా సార్‌వాళ్ళ మామయ్య రిటైర్డ్ గవర్నమెంట్ డాక్టర్. వెంటనే మా బాబు శరీరంపై అలర్జీ వచ్చిన ప్రదేశాన్ని ఫోటో తీసి ఆయనకి వాట్సాప్‌లో పంపించాను. ఆయన చూసి, "ఇది అలర్జీలా వుంది" అని ఒక అంటిమెంట్ పేరు చెప్పి, అది వాడమని చెప్పారు. నేను, "బాబా! బాబుకి అలర్జీ తగ్గేలా దయ చూపండి" అని అనుకున్నాను. బాబా దయవలన ఆ ఆయిట్‌మెంట్ మా ఇంట్లోనే ఉంది. లేదంటే గుంటూరు వెళ్లి తీసుకు రావాల్సి వచ్చేది. ఇంతకుముందు మా బాబుకి జ్వరం వచ్చినప్పుడు దద్దుర్లు వస్తే, డాక్టర్ ఆ ఆయిట్మెంట్ ఇచ్చారు. బాబా దయవలన ఆ ఆయిట్మెంట్ ఇప్పుడు ఉపయోగపడింది. ఆ రోజు సాయంత్రానికి 70 శాతం ఎలర్జీ తగ్గింది. "ధాన్యవాదాలు సాయి. తలచిన వెంటనే నేనున్నాను అంటూ మా బాధలు తీర్చి మాకు ఎంతో సహాయం చేస్తున్నావు బాబా".

సాయి మహారాజ్ కీ జై.


కోరుకున్నట్లు నార్మల్ రిపోర్టులు వచ్చేలా అనుగ్రహించిన బాబా

సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. నా పేరు నాగలక్ష్మి. ఆ మధ్య మేము మా అమ్మాయికి పెళ్లి చేసాము. బాబా దయవల్ల వివాహం నిర్విఘ్నంగా జరిగింది. కానీ ఆ పెళ్లి హడావుడిలో నా ఆరోగ్యం కొంచెం పాడైంది. నేను మామూలుగానే ప్రతి విషయానికీ భయపడుతూ ఉంటాను. నా ఈ భయాన్ని సాయి ఎప్పుడు పొగడతారో ఏమో! సరే, నేను నా ఆరోగ్యం కోసం హైదరాబాద్ వెళ్లి అన్ని టెస్టులు చేయించుకున్నాను. ఆ టెస్టులు చేస్తున్నంతసేపూ నేను బాబా నామజపం చేసుకుంటూ, "బాబా! రిపోర్టులన్నీ నార్మల్ రావాలి" అని బాబాకి వేడుకున్నాను. బాబా దయవల్ల రిపోర్టులన్నీ నార్మల్ వచ్చాయి. "శతకోటి కృతజ్ఞతలు సాయి. నాకున్న బలహీనతను పోగొట్టి నన్ను మంచిగా చేయి సాయి. మీరు ఎప్పుడూ నాకు అండగా ఉండండి సాయి. మమ్మల్ని అనుక్షణం కాపాడండి సాయి".


12 comments:

  1. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  2. Baba, today is my birthday. Bless me Baba.

    ReplyDelete
  3. Baba, bless my children and fulfill their wishes in education.

    ReplyDelete
  4. ఓం సాయిరామ్

    ReplyDelete
  5. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  6. Sai baba pl bless my son sai madava in his studies , health, behaviour . Also show your grace on my husband , mother in law

    ReplyDelete
  7. Om sri sai Nathaya Namo Namaha

    ReplyDelete
  8. Om Sai Ram
    Sai always be with me

    ReplyDelete
  9. ఓం శ్రీ సాయి రామ్

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo