సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1618వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  • శ్రీసాయి అనురాగ తరంగాలు

సాయిబంధువులకు నమస్కారం. నేను ఒక సాయిభక్తురాలిని. మా అమ్మానాన్నలకు మేము ఐదుగురు అమ్మాయిలం. మేము వాళ్ళ 50వ పెళ్లిరోజు చిన్న వేడుకలా చేయాలని నిర్ణయించుకున్నాము. నేను సంవత్సరం ముందు ఆంటే 2022, ఫిబ్రవరిలో బాబాతో విషయాన్ని చెప్పుకొని, "తండ్రీ! ఏ ఆటంకం లేకుండా అంతా సవ్యంగా జరిగేలా చూసే బాధ్యత మీదే" అని వేడుకున్నాను. అయితే ఈ సంవత్సరం ఫిబ్రవరి వచ్చేసరికి ట్రైన్లు నడవలేదు. దాంతో అందరం ఆలోచించుకొని ఒక వారం రోజుల తర్వాత ఫంక్షన్ చేయాలని నిర్ణయించుకొని ఫోన్ చేసి అందరినీ ఫంక్షన్‌‌కు ఆహ్వానించాం. బట్టలు తీసుకున్నాము. ఫంక్షన్‌‌కి ఒకరోజు ముందుగా వెళ్లి కావాల్సిన సామాన్లు తెచ్చుకుని భోజనాలు ఏర్పాటు చేశాం. బాబా ఇచ్చిన బహుమతి ఏంటంటే, ఇంటి అల్లుళ్ళు అందరూ కలిసికట్టుగా పని చేశారు. అది చూసి ఆశ్చర్యపోవడం మా వంతు అయింది. ఇంకా ఎప్పుడూ పదేపదే పోయే పవర్ ఆరోజు రాత్రి అసలు పోనీలేదు బాబా. ఈ ఆనందాన్ని ఒక పేపర్ మీద వ్రాసి మా అమ్మాయికిచ్చి, "ఏమైనా తప్పులుంటే చూడమ"ని చెప్పినట్లు నాకు గుర్తు. కానీ మా అమ్మాయి తనకు ఇవ్వలేదని అంది. ఎంత వెతికినా ఆ పేపర్ దొరకలేదు. దాంతో మళ్లీ వ్రాస్తాను, వ్రాస్తాను అనుకోవడం తప్ప వ్రాయడం మాత్రం కాలేదు. అప్పుడు నేను బాబాతో, "ఎలాగూ మా చెల్లికి సంబంధాలు చూస్తున్నాం. మీ దయవల్ల ఒక మంచి అబ్బాయితో తన వివాహం కుదిరితే, ఆ అనుభవంతోపాటు ఈ అనుభవం కూడా వ్రాసి బ్లాగులో పంచుకుంటాన"ని చెప్పుకున్నాను. అంతకుముందు ఎంత ప్రయత్నించినా కానిది బాబాకు చెప్పుకున్నంతనే మా చెల్లికి సంబంధం కుదిరింది. ఆ అబ్బాయివాళ్ళు గురువారంనాడే మా చెల్లిని చూడ్డానికి వచ్చారు. వాళ్లకి మా సంబంధం నచ్చి ఒకే చేసుకున్నారు. నిశ్చితార్థం కూడా అయింది. 12 రోజులలో పెళ్లి. ఇంకో ముఖ్య విషయమేమిటంటే ఆ అబ్బాయి పేరు 'సాయి'

ఒకరోజు మధ్యాహ్నం వంట చేసి టైమ్ చూస్తే ఒకటి గంట అవుతుంది. నాకు చాలా ఆకలిగా ఉండటంతో మావారిని భోజనానికి రమ్మంటే, రానన్నారు. "బాబా! ఎప్పుడూ కలిసే తింటాం. నాకు బాగా ఆకలిగా ఉంది. ఆయనేమో రానంటున్నారు" అని అనుకుంటూ కాసేపు విశ్రాంతి తీసుకుందామని పడుకుంటున్నాను. అంతలో మావారు వచ్చి తినడానికి రమ్మన్నారు. నేను ఎంత ఆశ్చర్యపోయానో చెప్పలేను. ఆ రోజంతా అదే ఆలోచిస్తూ ఉండిపోయాను. మరొకసారి కూడా ఇలాగే అనుభవమైంది. అంటే బాబా అమ్మ. అన్నపూర్ణేశ్వరి అమ్మవారు బాబా ఒకటే!

ఒకసారి మావారు క్రెడిట్ కార్డు ద్వారా 20,000 రూపాయలు వాడుకున్నారు. తర్వాత ఆ డబ్బు కట్టాల్సి వచ్చినప్పుడు బండి అమ్మేసి కడతానన్నారు. నేను ఎంత చెప్పినా వినలేదు. అసలు ఆయన ఏది చెప్పినా వినరు. మా ప్రతి అవసరానికి ఉపయోగపడే టూవీలరు ఇప్పుడు 20 వేల రూపాయల కోసం అమ్మేస్తే మరొకసారి డబ్బులు అవసరమైతే ఏం చేస్తారని నాకు చాలా కోపమొచ్చి బాధగా అనిపించింది. రెండు, మూడు రోజులు తర్వాత బాబాకు చెప్పుకోవాలనిపించి వెంటనే, "బాబా! నువ్వేం చేస్తావో, ఎలా సర్దుబాటు చేస్తావుగానీ బండి అమ్మకుండా చూసే బాధ్యత నీదే తండ్రీ" అని మనసులో అనుకున్నాను. బాబా దయతో ఇప్పటివరకు అయితే బండి అమ్మే అవసరం లేకుండా చేశారు.

నేను, మా అమ్మాయి ప్రతి గురువారం బాబా గుడికి వెళ్తుంటాము. లా ఒకసారి గుడికి వెళ్లినప్పుడు అక్కడ మా అమ్మాయి ఒక శ్లోకం చదువుతుంటే, "ఏంటి?" అని అడిగాను. తను చెప్పింది కానీ, నాకు అర్థం కాలేదు. తర్వాత తను పని మీద బెంగళూరు వెళుతూ ఆ శ్లోకం నాకు వాట్సాప్‌లో పంపి ఏ కష్టమొచ్చినా కృష్ణుడు తప్పక తీరుస్తాడని చెప్పింది. తర్వాత చాలా సంవత్సరాలుగా ఉన్న ఒక సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది. ఆ సమస్య వల్ల అందరికంటే ఎక్కువగా ఇబ్బందిపడేది నేను మాత్రమే. అందుచేత ఆ శ్లోకం ఆపకుండా చదువుతూనే ఉన్నాను. ఇప్పటికైతే కాస్త ఉపశమనంగా ఉంది. నా సాయినాథుడు మా అమ్మాయి ద్వారా నాకిచ్చిన ఆ కృష్ణుని శ్లోకం నన్ను దైర్యంగా ముందుకు నడిపిస్తుంది.

2023, ఆగస్టు మూడో వారంలో ఒక నాలుగు రోజులపాటు నేను విపరీరితమైన చెవినొప్పితో చాలా ఇబ్బందిపడ్డాను. రాత్రిపూట నొప్పి మరీ ఎక్కువగా ఉండేది. నాలుగవ రోజు మందులు వేసుకున్న కూడా నొప్పి అస్సలు తగ్గలేదు. అప్పుడు, "ప్లీజ్ బాబా! కాస్త నా నొప్పి తగ్గించండి. తగ్గితే మీ అనుగ్రహాన్ని అందరితో పంచుకుంటాన"ని బాబాకి చెప్పుకున్నాను. అంతే, పది నిమిషాల్లో నొప్పి తగ్గి ప్రశాంతంగా పడుకున్నాను. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".


13 comments:

  1. ఓం సాయిరామ్

    ReplyDelete
  2. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  3. ఓం సాయిరామ్

    ReplyDelete
  4. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  5. Om sairam Baba ma Chelli ki machi pelli sambandam kudirela chudu baba

    ReplyDelete
  6. Sai baba pl bless my son saimadava in his studies, career, knowledge, behavior. Pl teach how to behave with wife to my husband.

    ReplyDelete
  7. Jai Sai 🙏🙏🙏 Jai Sai kapadu Tandri 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  8. Baba maa vari arogyam bagunday la chudandi baba

    ReplyDelete
  9. Thank you for giving this very good opportunity to me

    ReplyDelete
  10. Ma nanna maku eschina mata nelabettukonela cheyyu sai baba.....

    ReplyDelete
  11. Om Sairam. Jai jai Sairam

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo