ఈ భాగంలో అనుభవాలు:
1. దయచూపిన బాబా
2. సాయిబాబా దయ ఉంటే చాలు - అన్ని కష్టాలు తొలిగిపోతాయి
దయచూపిన బాబా
ఓం శ్రీసాయినాథాయ నమః. నేను ఒక సాయిభక్తుడిని. ఒకసారి మా 11 నెలల బాబుకి హఠాత్తుగా జలుబు మొదలైంది. ఆ సమయంలోనే బాబు ఆడుకుంటూ కింద పడిపోయాడు. దాంతో తన ముక్కు నుండి రక్తం కారసాగి బాబు చాలా ఏడ్చాడు. నేను బాబాని తలుచుకొని గుడ్డతో రక్తం కారకుండా అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేశాను. తర్వాత ఎందుకైనా మంచిదని డాక్టర్ దగ్గరకి వెళదామని నేను, నా భార్య బాబుని తీసుకొని బయలుదేరాము. నేను దారి పొడువునా 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అని స్మరించాను. బాబా దయవల్ల హాస్పిటల్‌కి చేరుకున్నాక డాక్టరు చూసి, "బాబు ముక్కులో పెద్ద గాయమేమీ లేదు. కంగారు పడకండి" అని అన్నారు. అది విని నేను సంతోషంగా బాబాకి ధన్యవాదాలు చెప్పుకున్నాను. తర్వాత డాక్టరు, "జలుబు ఉండడం వల్ల గాయం ఆరడానికి కాస్త సమయం పడుతుంది" అని చెప్పి కొన్ని మందులు వ్రాసిచ్చారు. అయితే మరుసటిరోజు బాబు ఆడుకుంటూ మళ్ళీ రెండుసార్లు పడిపోయాడు. దానితో మళ్ళీ ముక్కుకి, పెదవులకి దెబ్బ తగిలింది. ఆ తర్వాత రోజు మళ్ళీ డాక్టర్ దగ్గరకి వెళ్ళి బాబుని చూపిస్తే, డాక్టర్ చూసి, "కొన్నిరోజులు జాగ్రతగా ఉండాల"ని మందులు మార్చారు. నేను జలుబు, దగ్గు ఉండడం వల్ల దెబ్బ తగ్గడానికి చాలా సమయం పడుతుందని బాబాని తలుచుకొని, "బాబా! బాబుకి సమస్య మీద సమస్యలు వస్తున్నాయి. వాడిపై దయ చూపి తనకి తొందరగా తగ్గేలా చూడండి తండ్రీ. మీ అనుగ్రహం బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. బాబా దయవల్ల మూడు రోజుల్లో జలుబు, దగ్గు, ముక్కులోని గాయం అన్నీ తగ్గిపోయాయి. సంతోషంగా బాబాకి ధన్యవాదాలు చెప్పుకున్నాను. కానీ తర్వాత కూడా బాబుకి తరచూ జలుబు, దగ్గు, జ్వరం వస్తుండేవి. అందువల్ల బాబుని ఇద్దరు డాక్టర్ల దగ్గరకి తీసుకెళ్ళి చూపించి చాలా మందులు వాడాము కానీ, జలుబు, దగ్గు, జ్వరం తగ్గినట్టే తగ్గి మరుసటిరోజు ఉదయానికి మళ్లీ వస్తుండేవి. బాబా ఊదీ బాబు నుదుటన పెట్టి, నోట్లో వేయడం చేస్తే జలుబు, దగ్గు తగ్గినా జ్వరం మాత్రం వస్తుండేది. అలా ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నా పూర్తిగా తగ్గలేదు. చివరికి ఒకరోజు నేను, "బాబా! ఈ గురువారం నాటికి బాబుకి మొత్తం అన్నీ తగ్గేటట్లైతే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని ప్రార్థించాను. ఆ తర్వాత బుధవారంనాడు వేరే డాక్టర్ దగ్గరకి బాబుని తీసుకెళ్ళి బ్లడ్ టెస్టు, యూరిన్ టెస్టు చేయించాం. బాబా దయవల్ల అంతా నార్మల్ అని వచ్చింది. అదేరోజు సాయంత్రం శివాలయానికి వెళ్లి తాయత్తు కట్టాము. బాబా దయవల్ల ఆ రాత్రి ఎటువంటి జ్వరం రాలేదు. అంతా మంచిగా ఉంది. ఉదయానికి కూడా బాబు నవ్వుతూ నిద్ర లేచాడు. జ్వరం మళ్లీ రాలేదు. "ధన్యవాదాలు బాబా. మిమ్మల్ని నమ్ముకుంటే ఏదైనా సాధ్యమే బాబా. మిమ్మల్ని నమ్ముకున్న భక్తుల సమస్యలు పరిష్కరించకుండా ఎప్పుడూ వదలవు సాయినాథా! ఇలానే మీ కృప మీ భక్తులందరిపై ఉండేలా చూడు తండ్రీ. నీ దీవెనలు ఎల్లప్పుడూ మీ భక్తులపై ఉండాలని కోరుకుంటున్నాను బాబా".
సాయిబాబా దయ ఉంటే చాలు - అన్ని కష్టాలు తొలిగిపోతాయి
సాయిభక్తులందరికీ నా నమస్కారములు. నా పేరు నందకిషార్. గత మూడు దశబ్దాలుగా సాయిబాబా నా జీవితంలో చాలా సహాయం చేశారు. వాటిలో నుండి రెండు అనుభవాలను నేను ఇప్పుడు మీ అందరితో పంచుకుంటున్నాను. 2022, దీపావళి అప్పుడు మా నాన్నకి ఊపిరి తీసుకోవడం కష్టమైతే ఆయన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఉద్యోగరీత్యా నా తల్లదండ్రులకు దూరంగా ఉన్న నాకు ఆ విషయం తెలిసి ఆ రాత్రి రైలులో బయలుదేరి మరుసటిరోజు ఉదయానికి మా ఊరు చేరుకొని హాస్పిటల్‌కి వెళ్ళాను. ICUలో ఉన్న నాన్న పరిస్థితి చూసి నాకు చాలా భయమేసింది. డాక్టరు, "చాలా కష్టం" అన్నారు. అప్పుడు నేను, "బాబా! నాన్న ఆరోగ్యం కుదుటపడితే మూడు వారాలపాటు మీ మందిరం చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తాన"ని బాబాను వేడుకున్నాను. బాబా దయవలన 5 రోజులలో నాన్న కోలుకొని ఇంటికి వచ్చారు. నేను సంతోషంగా నా మొక్కు చెల్లించుకున్నాను.
మా అబ్బాయికి ఆరునెలల వయసున్నప్పుడు ఒకరోజు రాత్రి నిద్రలో మంచం మీద నుంచి కింద పడిపోయాడు. ఆ సమయంలో మేము కూడా నిద్రలో ఉండటం వలన తను పడిపోవడం గమనించలేదు గానీ తన ఏడుపుకి మేము లేచి చూస్తే, వాడు కిందపడి ఉన్నాడు. అంత చిన్నబాబు ఎత్తైన మంచం నుంచి కిందపడితే ఎంత ప్రమాదమో ఎవరైనా ఊహించగలరు. కానీ సాయిబాబా దయవలన బాబు లేత శరీరానికిగానీ, తలకిగానీ ఏ విధమైన దెబ్బలు తగలలేదు. ఇప్పటికీ ఆ విషయం తలచుకొంటే నాకు భయమేస్తుంది. "ధన్యవాదాలు సాయితండ్రీ. అందరినీ చల్లగా చూడు దేవా".
ఓం సాయిరామ్
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
ఓం శ్రీ సాయి రామ్ మీ కృప వలన నా మానసిక బాధలు కొంచెం తగ్గుతోంది.march నుండి సెప్టెంబర్ వరకు నరకం అనుభవించాను.మీ దయ వలన చాలా బాగుంది.ఆ కొంచెం బాధ కూడా తీసి వెయ్యి సాయి.చెడుగ తిట్టి నా మనసు లో బాధ పడుతున్నాను.ఈ చెడు ఆలోచనలు రాకుండా ఆపు బాబా
ReplyDeleteSai na vamsi nakosam thirigochesela chusu sai
ReplyDeleteOm sai ram🙏🙏
ReplyDeleteBaba always be with me 🙏
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Babu kinda padina ami kakunda baba chayi tho kapadi untadu .. because my father was saved from bike by baba in past around 15 years ago.
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteOmsaisri Sai Jai Sai 🙏🙏🙏🙏🙏
ReplyDelete