1. సాయినాథుడు చూపిన కరుణ
2. నార్మల్ రిపోర్టు వచ్చేలా దయచూపిన బాబా
మా అమ్మకి 48 సంవత్సరాలు. ఒకసారి తనని చాలా ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. అప్పుడు నేను అమ్మకి ఫుల్ బాడీ చెకప్ చేయించాలని అనుకున్నాను. కానీ నాకు పెళ్లి నిశ్చయమవ్వడం వల్ల కుదరలేదు. అందువల్ల నేను బాబాను, "అమ్మకి ఎటువంటి సమస్యా లేకుండా చూడు తండ్రీ. అలా జరిగితే మీ అనుగ్రహాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు ద్వారా తోటి సాయిభక్తులతో పంచుకుంటాను" అని వేడుకొని కొన్ని రక్త పరీక్షలు మాత్రం చేయించాను. ఆ రిపోర్టుల్లో ఎటువంటి తేడా లేకపోవడంతో నా అనుభవాన్ని బ్లాగుకి పంపాను. కానీ బ్లాగు నిర్వహించే సాయి అన్నయ్య, "ఫుల్ బాడీ చెకప్ చేయించాకనే మీ అనుభవం పూర్తైనట్టు, కాబట్టి ఆ చెకప్ అయ్యాక పూర్తిగా బాబా అనుగ్రహాన్ని పంపండి" అని అన్నారు. ఆ తర్వాత మేము డాక్టర్ని సంప్రదిస్తే, "ఆరునెలల వేచి చూసి, అప్పుడు ఫుల్ బాడీ చెకప్ చేద్దాం" అన్నారు. సరేనని డాక్టర్ సలహా మేరకు ఆరునెలల తర్వాత ఫుల్ బాడీ చెకప్‌కి బయలుదేరాము. అప్పుడు నేను బాబాకి దణ్ణం పెట్టుకొని, "బాబా! చిన్న సమస్యలతో బయటపడేలా అనుగ్రహించు తండ్రీ" అని వేడుకున్నాను. బాబా నా మోర ఆలకించారు. డాక్టరు, 'అమ్మకి కొలెస్ట్రాల్ స్థాయి ఎక్కువగా ఉంది, B12 తక్కువగా ఉంది, ఇంకా లంగ్స్‌లో అలర్జీ ఉంద"ని చెప్పారు. అవి తప్ప పెద్ద సమస్యలు ఏమీ లేవు. "ధన్యవాదాలు బాబా. దయతో ఈ వయసులో అమ్మకి పెద్ద సమస్యలు లేకుండా చూశావు తండ్రీ. ఇలాగే తన ఆరోగ్యం కుదుటపడేలా అనుగ్రహించు తండ్రీ. చదువు అంటే ప్రాణమైన నేను ఇప్పటివరకు నా CA పూర్తి చేయలేకపోయాను బాబా. ఆ కారణంగా నేను, అమ్మ వేదనను అనుభవిస్తున్నాం. దయచేసి CA పూర్తి చేసేందుకు అవసరమైన శ్రద్ధను, ఏకాగ్రతను ప్రసాదించండి బాబా. మీ దయ ఉంటేనే నేను పూర్తిగా చేయగలను బాబా. అనుగ్రహించండి బాబా".
నార్మల్ రిపోర్టు వచ్చేలా దయచూపిన బాబా
నా పేరు యమున. నాకు నా చిన్నప్పటి నుండి సాయిబాబా అంటే చాలా నమ్మకం. 2023, ఆగస్టు నెల మూడో వారం మొదలుకొని వారం రోజులపాటు నేను కడుపునొప్పితో బాధపడ్డాను. టాబ్లెట్లు వేసుకున్న కూడా నొప్పి తగ్గలేదు. అప్పుడు డాక్టరుని సంప్రదిస్తే, "అబ్డోమెన్ స్కాన్ చేయాలి. అపెండిక్స్ అయుండొచ్చు" అన్నారు. అది విని నేను చాలా భయపడి మనసులో బాబా ప్రార్థించడం మొదలుపెట్టి, "బాబా! నాకు ఈ కడుపునొప్పి తగ్గితే, మీ అనుగ్రహం తోటి సాయి భక్తులతో పంచుకుంటాను" అని మొక్కుకున్నాను. బాబా దయవల్ల స్కాన్ రిపోర్టు నార్మల్ అని వచ్చింది. నేను నా జీవితాంతం బాబాకి ఋణపడి ఉంటాను. "ధన్యవాదాలు బాబా".
సాయినాథ్ కి జై!!!
Jai shree Sainath Maharaj ki jai
ReplyDeleteOm sai ram 🙏🙏🙏🙏
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteOm sairam
ReplyDelete🙏🙏🙏🙏🙏
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sairam
ReplyDeleteSai always be with me
sai baba pl bless my son sai madava always in his studies, concentration, went to tuition , memory power.
ReplyDeleteOm Sri Sainathaya namah
ReplyDeleteOmsaisri Sai Jai Sai 🙏🙏🙏🙏🙏
ReplyDelete