ఈ భాగంలో అనుభవాలు:
- శ్రీసాయి అనుగ్రహ లీలలు - 20వ భాగం
నా పేరు సాయిబాబు. 1999వ సంవత్సరంలో మా ఇంటి హాల్లో ఉన్న అలమరాలో ఒక మెర్క్యూరీ బాబా విగ్రహం ఉండేది. ఆ రోజుల్లో సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు పవర్ కట్ ఉండేది. ఆ సమయంలో ఆ మెర్క్యురీ విగ్రహం మెరుస్తూ కనిపిస్తుండేది. చీకటిలో మెర్క్యురీ మెరవడం మామూలేగాని ఆ చిన్న విగ్రహం 3 అంగుళాలు పైకి లేచి గాలిలో తన చుట్టూ తనే తిరుగుతుండేది. అలా రోజూ జరుగుతుండేది. మొదట్లో మేము ఆశ్చర్యపోయినప్పటికీ అది భ్రమకాదని, నిజమేనని మా ఇంట్లో అందరమూ బాబాకి నమస్కారం చేసాము. కొన్నిరోజులకి ఒక సాయిభక్తుడు మా సాయితత్వం చూసి తన కూతుర్ని కొంతకాలం మా ఇంట్లో ఉంచారు(అతను మరెవరో కాదు. తన సొంత ఖర్చులతో బాబాకి చిన్న మందిరం నిర్మించాడని గతంలో పంచుకున్న అనుభవాలలో చెప్పాను కదా! అతనే ఆ భక్తుడు). ఆ అమ్మాయి మా ఇంటికొచ్చిన కొత్తలో సాయంత్రం పవర్ కట్ అయినప్పుడు బాబా మెర్క్యురీ విగ్రహం పైకి లేచి గాల్లో తిరగడం చూసి గట్టిగా కేకవేసి మమ్మల్ని పిలిచి మాకు చూపించింది. అప్పుడు మేము వివరంగా బాబా గురించి తనకి చెప్పి భయపడవద్దు అన్నాం.
2019వ సంవత్సరం శ్రావణమాసంలో బెంగళూరులో ఉన్న మా అమ్మాయి అమ్మవారి పూజ శ్రద్ధ, నిష్టలతో చేసింది. రెండో శుక్రవారం మా అమ్మాయి కుటుంబం తమిళనాడులోని శ్రీపురంలోని గోల్డెన్ టెంపుల్‌కి కారులో బయలుదేరారు. వాళ్లతో నా భార్య కూడా ఉంది. అప్పటివరకు చేస్తున్న ఉపవాసాల వలనో, పని ఎక్కువైనందువలనో గానీ దారిలో మా అమ్మాయి అస్వస్థతకు గురైంది. అక్కడ టెంపుల్‌కు సంబంధించిన పెద్ద హాస్పిటల్లో చూపించారు. అక్కడి డాక్టర్లు మా అమ్మాయిని చూసి పరీక్ష చేసి కిడ్నీకి సంబంధించిన ఇన్ఫెక్షన్ అని ఎమ్మారై స్కాన్ తీశారు. నా భార్య ఇంట్లో ఉన్న నాకు ఫోన్ చేసి విషయం చెప్పింది. నేను వెంటనే బాబా ఫోటో ముందు నిలబడి, "మా అమ్మాయి ఎటువంటి అస్వస్థకు గురైనా వెంటనే తనకి నయం చేయండి" అని ప్రార్థించాను. తర్వాత డాక్టర్లు స్కానింగ్ రిపోర్ట్ చూసి ఆశ్చర్యపోతూ, "అంతా నార్మల్‌గా ఉంది. కిడ్నీలు బాగున్నాయి. ఇది ఎలా సాధ్యం?" అని అనుకోని జనరల్‌గా ఏవో మందులు వ్రాసిచ్చారు. మా అమ్మాయి ఆ మందులు ఒక్కరోజు మాత్రమే వాడి ఆపేసింది. ఎందుకంటే, బాబా దివ్య ఔషధం ఊదీ ముందు అదెంత? బాబా దయవల్ల అమ్మాయికి అంతా మామూలుగానే ఉండింది. ఒక నెల తర్వాత అకస్మాత్తుగా తనకి కడుపులో నొప్పి వచ్చింది. స్కానింగ్ తీయించుకుందామని వెళుతూ నాకు ఫోన్ చేసి విషయం చెప్పారు. అప్పుడు నేను మా ఊర్లో మా ఇంట్లో టీవీలో మధ్యాహ్న హారతి ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నాను. నేను టీవీలో కనిపిస్తున్న బాబా ముందు నిలబడి, "బాబా! అమ్మాయికి సుస్తీగా ఉందట. స్కానింగ్ తీయించుకోవడానికి వెళ్తున్నారట. నీవు తక్షణమే మా అమ్మాయి వద్దకు వెళ్లి, తనకి స్వస్థత చేకూర్చు తండ్రి. స్కానింగ్‌లో అంతా మామూలుగానే ఉండేటట్లు చూడు బాబా" అని బాబాతో చెప్పుకున్నాను. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, నేను అలా వేడుకున్న తక్షణమే ఒక నిమిషం పాటు టీవీ స్క్రీన్ అంతా నల్లగా అయిపోయి ఏమీ కనిపించలేదు. ఒక నిమిషం తర్వాత మళ్లీ యధావిధిగా బాబా హారతి వచ్చింది. ఏమై ఉంటుందో ఊహించండి! నేను 'నీవు తక్షణమే మా అమ్మాయి వద్దకు వెళ్లి, తనకి స్వస్థత చేకూర్చు తండ్రి' అని బాబాను వేడుకున్నానుగా ఆయన నా ముందున్న టీవీలో నుండి బెంగళూరులో ఉన్న మా అమ్మాయి దగ్గరకి వెళ్లి తనకు నయం చేసి, ఒక్క నిమిషంలోనే తిరిగి వచ్చారు. అందుకే ఆ ఒక్క నిమిషం పాటు బాబా కనిపించలేదు. స్కానింగ్ రిపోర్ట్ ఎటువంటి అస్వస్థత లేదని మామూలుగా వచ్చింది. అంతా బాబా కృపాకటాక్షం.
2019లో ఒకరోజు నేను, నా భార్య గుంటూరు వెళదామని బయల్దేరాము. అలా ఎప్పుడు బయటకి వెళ్లినా మా వూరి పెట్రోలు బంకులో పెట్రోల్ వేయించుకుని వెళ్ళడం నాకలవాటు. కానీ ఆ రోజు ఎందుకో ఊరిలోని బంకులో కాకుండా ముందుకు వెళ్ళి బైపాస్లో వున్న మరో బంకులో పెట్రోలు పోయించుకోడానికి ఆగాను. కారు బోనెట్ తెరిచి 300/- పెట్రోల్ వేయమన్నాను. అంతలో నా భార్య నన్ను పిలిచి "బాటిల్లో పోయించమ"ని చెప్పింది. ఆ మాటకు నాకు కోపమొచ్చింది కానీ, 'తను అలా చెప్పిందంటే ఏదో కారణం ఉండే ఉంటుంద'ని బాటిల్లో పెట్రోలు పోయించుకున్నాను. అక్కడినుండి కొంచం దూరం ముందుకు వెళ్ళి, రోడ్డు ప్రక్కన కారు ఆపి బాటిల్లోని పెట్రోలు కారులో పోద్దామని బాటిల్ మూత తీసి పోసేసరికి నా కాళ్ళ మీద తడి అయినట్లు అనిపించింది. అయినా నేను పట్టించుకోకుండా పెట్రోలు మొత్తం కారులో పోసాను. అయితే పెట్రోల్ కారు ట్యాంకులోనికి వెళ్ళకుండా మొత్తం నేలపాలై క్రింద పెద్ద మడుగైంది. అది చూసి భయంతో నాకు ఏం చేయలో అర్ధం కాలేదు. మా మెకానిక్‌కి ఫోన్ చేసి విషయం చెపితే, ఐదు నిముషాల తర్వాత ఆలోచించుకొని అరగంటలో వస్తానన్నాడు. అంతసేపు మేము ఎక్కడ వెయిట్ చేస్తాం? పోనీ కారు స్టార్ట్ చేద్దామంటే ఎమన్నా అవుతుందేమోనని భయం. అంతలో బాబా మాకు ఒక ప్రేరణనిచ్చారు. మేము వెంటనే మెకానిక్‌కి ఫోన్ చేసి, "కారు స్టార్ట్ చేస్తే ఏమైనా ప్రాబ్లమా?" అని అడిగాము. అతను, "ఏం కాదు" అని అన్నాడు. మేము బాబా మీద భారమేసి కారు స్టార్ట్ చేసి, ఎంత దూరం వెళ్ళగలిగితే అంత దూరం వెళదామని గ్యారేజ్ వైపు బయల్దేరాము. కారులో బాబా విగ్రహం వుంది. ఆయన దయవల్ల కారు మధ్యలో ఎక్కడా ఆగకుండా గ్యారేజ్ వద్దకి చేరుకుంది. మెకానిక్ వచ్చిందాక అక్కడెక్కడో నడిరోడ్డు మీద వెయిట్ చేయాల్సిన పని లేకుందా బాబా మమ్మల్ని క్షేమంగా అక్కడికి చేర్చారు. మెకానిక్ చూసి, "పెట్రోలు పైపు కట్టైయింది" అని దాన్ని తీసి కొత్తది వేసాడు. ఒకవేళ మేము బంకులో పెట్రోల్ వేయించుకున్నట్లయితే మొత్తం పెట్రోలు నేల పాలైన సంగతి కారులో కూర్చుని పెట్రోల్ పోయగానే అక్కడున్న వెహికిల్స్‌కి అడ్డం కాకుండా త్వరగా వెళ్ళిపోదామనుకునే మాకు తెలిసే అవకాశం ఉండదు. ఫలితంగా ఏదైనా ప్రమాదం జరిగి ఉండేది. అలా జరగకుండా నా భార్యకి సిక్స్త్ సెన్స్ ద్వారా బాటిల్లో పెట్రోల్ పట్టుకోమని హెచ్చరించి, ప్రమాదం జరగకుండా కాపాడారు బాబా. ఇలా సదా మా వెంటే వుండి మమ్మల్ని రక్షిస్తూ ఉంటారు బాబా.
ముందు భాగం కోసం బాబా పాదుకలు తాకండి. |
|
తరువాయి భాగం కోసం బాబా పాదాలు తాకండి.
|
Om Sairam
ReplyDeleteSai always be with me
ఓం సాయిరామ్
ReplyDeleteSai na Bartha manasu nannu ardham cheskunela marchu sai na thappu yemaina unte nannu kshaminchamani cheppu sai thanu nannu barya ga swikarinchi kapuraniki thiskellela chudu baba sai Valla talli thandrulu nannu ardham cheskoni nannu kodali ga swikarinchali sai na kapuranni nilaabettandi sai Miru kalipina bandham mire nilabettandi baba sai I'm sairam
ReplyDeleteOm Sri Sainathaya namah
ReplyDelete