1. బాబా కరుణ వల్ల మంచిగా జరిగిన ఆపరేషన్స్
2. సాయిదేవుని నమ్ముకుంటే మంచే జరుగుతుంది
బాబా కరుణ వల్ల మంచిగా జరిగిన ఆపరేషన్స్
సాయిభక్తులకు నా నమస్కారం. నా పేరు తేజు. బాబా నా జీవితంలో చేసిన మేలును మీతో పంచుకుంటున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. 2023, జూన్ నెలలో ఒకరోజు మా నాన్నగారికి గ్యాస్ట్రిక్ నొప్పి వచ్చింది. డాక్టరుకి చూపిస్తే మందులిచ్చారు. వాటితో నొప్పి తగ్గింది, కానీ మళ్ళీ రెండోరోజు అలాగే నొప్పి వచ్చింది. అలా వారంరోజులు మా నాన్న గ్యాస్ట్రిక్ నొప్పితో బాధపడ్డారు. అప్పుడు అప్పటివరకు నాన్నని చూస్తున్న డాక్టర్, "హాస్పిటల్‌కి తీసుకువెళ్ళండి" అని చెప్పారు. దాంతో మేము నాన్నని హాస్పిటల్‌కి తీసుకుకెళ్తే టెస్టులు చేసి, నాన్నకి హార్ట్ ప్రాబ్లం ఉందనీ, గుండెలో నాలుగు వాల్స్ పూడుకుపోయాయనీ, ఆపరేషన్ చేయాలనీ చెప్పారు. నాన్నని వేరే హాస్పిటల్‌కి తీసుకువెళ్తే, అక్కడ కూడా అదే చెప్పారు. అప్పుడు నేను బాబా దగ్గరకి వెళ్లి, "బాబా! మా నాన్నని కాపాడు. నాకు మీరే దిక్కు. మీ దయ లేనిదే మేమెవరమూ ఏమీ చేయలేము" అని కన్నీళ్లు పెట్టుకుంటూ బాబాను ప్రార్థించాను. బాబా కరుణ వల్ల నాన్నకి ఆపరేషన్ మంచిగా జరిగింది. కానీ ఆపరేషన్‌కి నాన్న రియాక్ట్ అవ్వాలని డాక్టరు చెప్పారు. బాబా దయవల్ల నాన్న రియాక్ట్ అయ్యారు. తర్వాత వారంరోజులకి నాన్న డిశ్చార్జ్ అయి క్షేమంగా ఇంటికి వచ్చారు. ఆలోపు మా మామయ్యగారికి వెన్నుపూస ఆపరేషన్ చేయాలన్నారు. నాకు ఏం చేయాలో అర్థంకాక బాబాకి చెప్పుకున్నాను. బాబా దయవల్ల మామయ్య ఆపరేషన్ కూడా మంచిగా జరిగింది. బాబా దయవల్ల ఇప్పుడు నాన్న, మామయ్య చాలా బాగున్నారు. ఇదంతా బాబా నా మీద చూపించిన కృప. "ధన్యవాదాలు బాబా. మీ ప్రేమకు నేను సదా మీకు ఋణపడి ఉంటాను తండ్రీ".
సాయిదేవుని నమ్ముకుంటే మంచే జరుగుతుంది
ఓం శ్రీసాయినాథాయ నమః!!! అందరికీ నమస్కారం. నా పేరు అశోక్ కుమార్. నాకు ఈ 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ పరిచయమై కేవలం ఒక వారమే అయ్యింది. ఈ వారంరోజుల్లో నేను సాయిభక్తుల అనుభవాలు చాలా చదివాను. నాకు కూడా ఈ వారంలో సాయిదేవుని దయవల్ల ఒక సమస్య తీరింది. దాన్నే నేనిప్పుడు ఈ బ్లాగ్ ద్వారా మీ అందరితో పంచుకుంటున్నాను. 2023, జూలై 21, శుక్రవారంనాడు నేను పనిచేసే యూనివర్సిటీ పేపర్లు దిద్దే పని నాకు అప్పగించింది. ఆ పని ఒక మూడు రోజులు, అంటే శుక్రవారం, శనివారం మరియు ఆదివారం ఉంటుంది. కానీ ఆదివారంనాడు నేను ఖచ్చితంగా హాజరుకావాల్సిన ముఖ్యమైన మీటింగ్ ఒకటి ఉంది. అందువల్ల ఆ పేపర్లు దిద్దే పనివల్ల నేను మీటింగ్‌కి హాజరవగలనో, లేదో అని చాలా భయపడ్డాను. ఈ బ్లాగులోని సాయిభక్తుల అనుభవాలు చదివి, "ఏ ఆటంకం లేకుండా నేను మీటింగ్‌కి హాజరయ్యేలా చూడండి బాబా" అని సాయిదేవుని వేడుకున్నాను. ఒకవేళ నేను కోరుకున్నట్లు జరిగితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటానని కూడా అనుకున్నాను. నిజంగా ఆ సాయిదేవుడు కృప చూపారు. ఆదివారం పేపర్ దిద్దే పని రద్దు అయింది. దాంతో నేను ఏ ఆటంకం లేకుండా మీటింగ్‌కి హాజరయ్యాను.
తరువాత జూలై 25, మంగళవారంనాడు నాకు ఒక ఊరు వెళ్లే పని పడింది. అయితే ఆరోజు నేను ఖచ్చితంగా కాలేజీకి వెళ్లాల్సి ఉంది. అప్పుడు కూడా నేను, "ఏ ఆటంకం లేకుండా నేను వూరికి వెళ్లగలిగేలా దయచూపు బాబా" అని సాయిదేవుని వేడుకున్నాను. నిజంగా చాలా అద్భుతం జరిగింది. అనుకోకుండా ఆరోజు బంద్ జరిగి కాలేజీకి సెలవు ఇచ్చారు. నేను ఏ ఇబ్బందీ లేకుండా ఊరికి వెళ్లి, నా పని పూర్తిచేసుకొని వచ్చాను. ఆ సాయిదేవుని కృపతోనే ఇదంతా జరిగిందని నేను నమ్ముతున్నాను. బాబాను నమ్ముకుంటే అంతా మంచే జరుగుతుంది. "ధన్యవాదాలు సాయిదేవా!".
Sai na vamsi nakosam vachesela chudu sai
ReplyDeleteBaba, bless my children and fulfill their wishes.
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
ఓం సాయిరామ్
ReplyDeleteOm Sri Sainathaya namah
ReplyDeleteఓం శ్రీ సాయిరాం ఓం శ్రీ సాయిరాం
ReplyDeleteOm Sri Sai Ram
ReplyDeleteOm Sai Sri Sai Jai Sai 🙏🙏🙏
ReplyDeleteOm sairam 🙏
ReplyDelete