సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక1590 వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • నమ్ముకున్న భక్తుల సమస్యలను పరిష్కరించకుండా ఎప్పుడూ వదలరు బాబా

నమ్ముకున్న భక్తుల సమస్యలను పరిష్కరించకుండా ఎప్పుడూ వదలరు బాబా


ఓం శ్రీసాయినాథాయ నమః!!! నేను ఒక సాయి భక్తుడిని. నేను చాలాకాలంగా బాబా ఊదీ కోసం వెతుకుతున్నాను. ఆ క్రమంలో నేను చాలామందిని ఊదీ కావాలని అడిగాను కానీ, ఊదీ నాకు లభ్యం కాలేదు. అలాంటిది 2023, జూలై 8, శనివారంనాడు నా స్నేహితుని స్నేహితుడు ఒకతను మా ఇంటికి వచ్చి శిరిడీ ప్రసాదం, ఊదీ నాకు ఇచ్చాడు. ఈ అద్భుతాన్ని నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే, నాకు అతను తెలియదు. అయినప్పటికి అతను మా ఇంటికొచ్చి నాకు ఊదీ ఇచ్చాడంటే నా కష్టాన్ని తెలుసుకుని శ్రీసాయిబాబానే తమ ఊదీని నాకు అతని ద్వారా పంపారని నా ఖచ్చితమైన నమ్మకం.


ఈమధ్య నా భార్యకి ముంబయిలో జరగనునున్న ఒకరోజు ట్రైనింగ్‌కి హాజరవ్వమని ఉత్తర్వులు వచ్చాయి. తను ఆ ట్రైనింగ్‌కి వెళ్లాలంటే ఒక రాత్రి ప్రయాణం చేసి మరుసటిరోజు ఉదయం ముంబయి చేరుకొని, అక్కడ ట్రైనింగ్ చూసుకొని ఆ రాత్రి తిరుగు ప్రయాణమై మర్నాడు ఉదయానికి గాని మా ఇంటికి చేరుకొని పరిస్థితి. ఈలోగా ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితి వస్తే, రైల్వే యాక్సిడెంట్ సెక్షన్‌లో పని చేస్తున్న నేను వెంటనే అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. అదే జరిగితే రాత్రిపూట పదినెలల మా బాబుని చూసుకోవడానికి ఇంట్లో ఎవరూ ఉండరు. ఈ సమస్యను అధిగమించడానికి మేము నా భార్య అక్కని రెండురోజుల కోసం పిలిచాము. కానీ బాబుకు ఆమె దగ్గర అంత చనువు లేదు. అందువల్ల నేను బాబాని తలుచుకొని, "బాబా! ఈ రెండు రోజులూ ఎటువంటి ఎమర్జెన్సీ డ్యూటీ పడకుండా చూసి బాబుని నేను చూసుకొనేటట్లు చేయండి. అలాగే నా భార్య క్షేమంగా ముంబయి వెళ్ళొచ్చేటట్లు చూడండి. అదే జరిగితే నేను మందిరంలో మీకు పాలకోవా నివేదిస్తాను. ఇంకా మీ అనుగ్రహాన్ని మన 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని ప్రార్థించాను. బాబా దయవల్ల ఆ రెండు రోజులు నాకు ఎటువంటి ఇబ్బందీ రాలేదు. కానీ అక్కడ ముంబయిలో నా భార్యకి ఒక పెద్ద సమస్య ఎదురైంది. దానిని బాబా ఎంత అద్భుతంగా పరిష్కరించారో చూడండి.


ముంబయిలో నా భార్య ట్రైనింగ్ పూర్తయ్యాక తిరుగు ప్రయాణానికి సిద్ధమైంది. తను ముందుగా క్యాబ్‌లో దగ్గర్లో ఉన్న లోకల్ రైల్వేస్టేషన్‌కి వెళ్లి, అక్కడినుండి CSMT స్టేషన్‌కి వెళ్లి హుస్సేన్‌సాగర్ ఎక్ష్ప్రెస్స్ అందుకోవాల్సి ఉంది. అయితే వర్షం వల్ల క్యాబ్ డ్రైవరుకి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న లోకల్ రైల్వేస్టేషన్‌కి వెళ్ళడానికి అరగంట కంటే ఎక్కువ సమయం పట్టింది. అక్కడ నా భార్య టికెట్ తీసుకొని CSMT స్టేషన్‌కి వెళ్లే లోకల్ ట్రైన్ ఎక్కింది. నాకెందుకో సమయం సరిపోదనిపించి నా భార్యతో, "వెంటనే ఆ ట్రైన్ దిగేసి కళ్యాణ్ వెళ్ళే లోకల్ ట్రైన్ అందుకోమ"ని చెప్పాను. ఎందుకంటే, తను ఎక్కాల్సిన హుస్సేన్‌సాగర్ ఎక్ష్ప్రెస్స్ CSMT నుండి బయలుదేరి కళ్యాణ్ మీదుగా సోలాపూర్ వస్తుంది. సరే. నేను చెప్పినట్లే నా భార్య ఆ ట్రైన్ దిగేసి కళ్యాణ్ వెళ్ళే లోకల్ ట్రైన్ ఎక్కింది. కానీ ఆ ట్రైన్ రాత్రి 11 గంటలకి కళ్యాణ్ చేరుకుంటుంది. హుస్సేన్‌సాగర్ ఎక్ష్ప్రెస్స్  కళ్యాణ్‌కి చేరుకొనే షెడ్యూల్ టైం రాత్రి 10:40. కాబట్టి ఏదైనా అద్బుతం జరగకుంటే నా భార్య హుసేన్‌సాగర్ ఎక్ష్ప్రెస్స్ అందుకోవడం దాదాపు అసాధ్యం. అటువంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం కేవలం మన బాబా వల్లనే అవుతుంది. అందుకే నేను బాబాని తల్చుకుంటూ "బాబా! తను ట్రైన్ అందుకునేలా చేసినట్లయితే నేను మీ మందిరంకి వచ్చి 101 రూపాయల దక్షిణ సమర్పించుకుంటాను. అలాగే మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని ప్రార్థించాను. నేను అనుకున్నట్లుగానే లోకల్ ట్రైన్ సరిగ్గా 11 గంటలకి కళ్యాణ్ చేరింది. సరిగ్గా 5 నిముషాల తరువాత అంటే 11.05కి హుస్సేన్‌సాగర్ ఎక్ష్ప్రెస్స్ కళ్యాణ్ చేరింది. ఈవిధంగా అస్సలు అందదనుకున్న ట్రైన్ బాబా చేసిన అద్భుతం వల్ల అందింది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా”.


తరువాత నా సొంతూరు పలాసలో శివుని పూజ నిమిత్తం నేను, నా భార్య, మా 10 నెలల బాబు షోలాపూర్ నుండి పలాసకి ప్రయాణం పెట్టుకున్నాము. అయితే మా ప్రయాణం మొదలయ్యేలోపు ఎక్కడైనా ప్రమాదం జరిగితే యాక్సిడెంట్ సెక్షన్లో పని చేస్తున్న నేను వెంటనే వెళ్లాల్సి ఉంటుంది, వెళ్తే గనక పని పూర్తయ్యేవరకు తిరిగి రావడానికి కుదరదు. అందువల్ల నేను బాబాని, "బాబా! ఈరోజు రాత్రి మేము ట్రైన్ ఎక్కబోతున్నాము. అప్పటివరకు ఎటువంటి ఎమర్జెన్సీ వర్క్ రాకుండా చూడు తండ్రీ. అన్ని రాష్ట్రాల్లో తుఫాను హెచ్చరికలు జారీ చేసున్న ఈ సమయంలో మేము ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రైన్ ఎక్కేలా, క్షేమంగా పలాసలో మా ఇంటికి చేరుకునేలా, పూజ బాగా జరిగేలా చూడు తండ్రీ. అవన్నీ జరిగి మేము ఏ ఇబ్బందీ పడకుండా క్షేమంగా తిరిగి షోలాపూర్ చేరుకుంటే మీ అనుగ్రహాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' ద్వారా తోటి సాయిభక్తులతో  పంచుకుంటాను" అని మొక్కుకున్నాను. బాబా దయవల్ల మేము వెళ్ళేరోజు ఎటువంటి ఎమర్జెన్సీ డ్యూటీ నాకు పడలేదు, మేము క్షేమంగా వెళ్లి అక్కడ అన్ని పనులు చక్కగా పూర్తిచేసుకొని, పరమశివుని పూజచేసి, విజయనగరంలో పైడితల్లమ్మకి మొక్కు తీర్చుకొని తిరిగి క్షేమంగా సోలాపూర్ చేరుకున్నాం. మా బాబు ఎక్కువగా ఇబ్బంది పెట్టలేదు. తుఫాన్ వల్ల రైళ్లు ఆలస్యమవుతాయేమోనని భయపడ్డాను కానీ, బాబా దయతో సరైన సమయానికి మమ్మల్ని ఇంటికి చేర్చారు. "ధన్యవాదాలు బాబా. మిమ్మల్ని నమ్ముకున్న భక్తుల సమస్యలను పరిష్కరించకుండా ఎప్పుడూ వదలవు సాయినాథా. ఇలానే మీ కృప మీ భక్తులందరిపై ఉండేలా చూడు తండ్రీ. మీ దీవెనలు ఎల్లప్పుడూ మీ భక్తులకు ఉండాలని కోరుకుంటున్నాను బాబా".


ఓం సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


12 comments:

  1. Om Sai Ram
    Sarvejano sukhinobhavanthu
    Sai Thandri na korikanu teerchu

    ReplyDelete
  2. Om sai ram sai please give me peace.with your blessings you cure me.i am suffering from many years.please give solution.

    ReplyDelete
  3. ఓం సాయిరామ్

    ReplyDelete
  4. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  5. సాయి నవంశీ నా కోసం తిరిగి వచ్చేసేలా చూడు సాయి

    ReplyDelete
  6. Saibaba, pl bless my son saimadava in his studies, behaviour and career remove his anger and know him the life with adjustment. Also I pray that my husband not to show anger on my son and went to apartment .

    ReplyDelete
  7. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  8. Sai ram🙏🙏🙏 with your blessings my health is improveing. Thank you tandri. I am suffering from 7months.i lived in hell. Please cure that disease permanently. Again I started Maha Parayan with your blessings. Please bless me to continue for long time. Please bless my children, husband and grand children with full aaush. Please bless me sumangali death. I want to live happily live. Please bless🙏🙏🙏 Sai tandri

    ReplyDelete
  9. ఓం సద్గురు శ్రీ సాయి రామ్ మహరాజ్ కీ జై ఓం సద్గురు శ్రీ సాయి రామ్ మహరాజ్ కీ జై

    ReplyDelete
  10. ఓం శ్రీసాయినాథాయ నమః

    ReplyDelete
  11. Om Sai Sri Sai jeya jeya sai

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo