1. బిడ్డలని కాపాడిన బాబా
2. బాబా దయతో తగ్గిన దగ్గు, జ్వరం
బిడ్డలని కాపాడిన బాబా
సాయిభక్తులకి నమస్కారం. నా పేరు పావని. సాయి నన్ను ఎన్నోసార్లు ఆదుకున్నారు. ఒకసారి మేము కొన్ని పరిస్థితుల కారణంగా డిగ్రీ చదువుతున్న మా పెద్దబాబుని కొన్ని రోజులు హాస్టల్లో ఉంచాం. మా సమస్యలు కొంత సర్డుకున్నాక బాబుని, "ఇక హాస్టల్లో వద్దు, ఇంటికి వచ్చేయి. ఇంటి నుండే కాలేజీకి వెళ్ళు" అంటే వచ్చాడు. కానీ రెండు రోజులు ఇంటి నుండి కాలేజీకి వెళ్లిన తరువాత, "నేను హాస్టల్లోనే ఉంటాన"ని అనడం మొదలుపెట్టాడు. ఎంత చెప్పినా మాట అస్సలు వినకుండా బ్యాగు సర్దుకోసాగాడు. వాళ్లనాన్న చెప్పినా వినలేదు. దాంతో వాడు చెడు అలవాట్లు నేర్చుకున్నాడని నాకు అనిపించింది. తర్వాత అదే నిజమని తెలిసింది. అంటే, హాస్టల్లో ఉన్న సమయంలో వాడు చెడు అలవాట్లు నేర్చుకున్నాడు. కానీ నేను ఆ విషయం మావారికి చెప్పలేదు. ఆయనకి తెలియక సరే, వాడి ఇష్ట ప్రకారం వాడిని హాస్టల్‌కి పంపించాలనుకొని ఆ విషయం బాబుకి చెప్పటానికి వెళ్లబోయారు. నేను, "ఇప్పుడే చెప్పకండి. మళ్ళీ ఒకసారి అడిగిచుద్దాం" అని అన్నాను. అందుకు మా ఆయన, "వాడు వెళ్తానంటే వెళ్లనివ్వు. నువ్వెందుకు అంత పట్టు పట్టుకొని కూర్చున్నావు. అయినా వాడు బాగానే చదువుతున్నాడుగా" అని అన్నారు. ఇక అప్పుడు మావారికి విషయం చెప్పాను. దాంతో మావారు షాకై బాబుని కొట్టబోయారు. అయినాసరే వాడు హాస్టల్‌కి వెళ్తానని అన్నాడు. అప్పుడు నేను, "బాబా! వాడు మా మాట వినేలా చేయి తండ్రీ. అలాగే వాడు చెడు అలవాట్లు మానేసేలా దయచూపు బాబా" అని బాబాను వేడుకున్నాను. 'వాడు మారితే నా అనుభవాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగు ద్వారా తోటి సాయి భక్తులతో పంచుకుంటాను' అని కూడా అనుకున్నాను. అంతే, పది నిమిషాలలో బాబు వాడంతటవాడే, "ఇంటి దగ్గర నుండే కాలేజీకి వెళ్తాను" అని అన్నాడు. అంతేకాదు, బాబా దయవలన ఇప్పుడు తను చెడు అలవాట్లన్నీ మానేసి చాలా చక్కగా ఉంటున్నాడు. తను మంచిగా మారిపోయాడు. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. తను చెడిపోతున్నాడని మాకు తెలిసేలా చేసి, అలాగే వాడిని మంచి మార్గంలోకి తీసుకొచ్చింది బాబానే. ఇదంతా ఆయన దయే. "కోటి కోటి వందనాలు బాబా".
ఒకసారి మా కుటుంబమంతా ఒక పంక్షన్‌కి వెళ్ళాము. అక్కడ మా చిన్నబాబు భోజనం చేసే సమయంలో ఎక్కువగా ఉన్న మసాలా ఘాటుకి నీళ్లు త్రాగబోయాడు. అంతలో ఏమైందో తెలీదుగానీ ఉన్నట్టుండి కిందపడి గిలగిలా కొట్టుకోసాగాడు. అందరూ వాడి చుట్టూ చేరారు. నాకు ఏమి అర్ధంకాక తింటున్న ప్లేట్ పక్కన పడేసి గబగబా అక్కడికి వెళ్ళాను. అందరూ వాడిని లేపే ప్రయత్నం చేస్తున్నారు. బాబు పరిస్థితి చూసి నాకు మాటలు రాక, లోలోపల "సాయిబాబా.. సాయిబాబా! నా బిడ్డని నువ్వే కాపాడాలి" అని ఏడ్చాను. కానీ మాటలు పైకి రావటం లేదు. ఇంతలో అరుపులు, కేకలతో మిగతా వాళ్ళందరూ కూడా బాబు చుట్టూ చేరారు. నేను అందరి ముందు, "బాబా.. బాబా! నా బిడ్డని కాపాడు తండ్రీ. నాకు నువ్వే దిక్కు" అని గట్టిగా అరిచాను. బాబా దయవల్ల బాబుకి గాలి విసిరి, కాళ్ళుచేతులు రుద్దాక చిన్నగా లేస్తే మంచినీళ్ళు త్రాగించారు. మొత్తానికి బాబా నా బిడ్డని కాపాడారు. కళ్లు తిరిగి పడితే లేస్తారు కదా! కానీ బాబు విషయం అలా కాదు. ఏం జరిగిందో బాబాకే ఎఱుక. మేము మాత్రం చాలా అంటే చాలా భయపడ్డాం. ఇప్పుడు ఈ అనుభవాన్ని వ్రాస్తుంటే కూడా నా కళ్లలో నీళ్ళు వస్తున్నాయి. ఆ రోజు బాధలో నా ఈ అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి'లో పంచుకుంటాననుకున్నానో, లేదో నాకు గుర్తులేదు కానీ, అనుకున్నా, అనుకోకపోయనా బాబా నా బిడ్డని కాపాడారు. అందుకే ఆయన అనుగ్రహాన్ని ఈ బ్లాగు ద్వారా మీ అందరితో పంచుకోవాలనుకున్నాను. బాబాని నమ్ముకుంటే అంతా మంచే జరుగుతుంది. "ధన్యవాదాలు బాబా. నా తప్పులు ఏవైనా ఉంటే క్షమిచండి సాయి".
బాబా దయతో తగ్గిన దగ్గు, జ్వరం
సాయిభక్తులందరికీ నమస్కారం. నా పేరు మల్లీశ్వరి. నాకు 20 సంవత్సరాలుగా బాబాతో అనుబంధం ఉంది. ఆయన నా జీవితంలో ఎన్నో సమస్యల నుండి కాపాడారు. ఈమధ్య 2 సంవత్సరాల మా మనమరాలు దగ్గు, జ్వరంతో చాలా బాధపడింది. మూడోరోజు మేము తనని హాస్పిటల్లో జాయిన్ చేసాం. హాస్పిటల్లో ఆరురోజులు గడిచినా పాపకి దగ్గు, జ్వరం ఎక్కువగా ఉండేసరికి నేను, "బాబా! పాపకి తగ్గితే, మీ అనుగ్రహాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి'లో పంచుకుంటాను" అని అనుకున్నాను. అంతే, మరుసటిరోజు నుండి పాపకి దగ్గు, జ్వరం తగ్గిపోయి ఆడుకోవడం మొదలుపెట్టింది. మనకి వీలైనంతవరకు బాబా చెప్పిన మాటలు పాటిస్తూ, ఓర్పు, విశ్వాసంతో ఉంటే బాబానే మనకు దారి చూపిస్తారు. ఇది నా అనుభవం. "ధన్యవాదాలు సాయితండ్రి. అందరూ బాగుండాలి, అందులో మేమూ ఉండాలి".
Om Sai Sri Sai Jai Sai 🙏🙏🙏🙏🙏
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
నేను పూజ చేసుకునే సమయంలో చాలా చెడు ఆలోచనలు వున్నాయి.చాలా బాధ అనిపించింది. వరలక్ష్మీ దేవి నాకు కీడు జరగకుండా చూడు అమ్మా . నేను సుమంగళి గా కన్నుమూసే అవకాశం కలిగించు.పిల్లలు, మనవలు సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యం ప్రసాదించు అమ్మా.ఓం సాయి రామ్
ReplyDeleteEeroju nenu chala chakkaga ammavari Daya valana Puja chesukonnanu , Sai babani ellappudu nannu, maa familynikapadalani prardhistunnanu
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDelete