సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1595వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా దయతో ఉద్యోగం
2. సంవత్సరం వృధా కాకుండా దయ చూపిన బాబా
3. బాబాకి చెప్పుకున్నంతనే పూర్తైన పని

బాబా దయతో ఉద్యోగం


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!!!

సద్గురు సాయినాథుని శరత్ బాబూజీ కి జై!!!


సాయిబంధువులకు నా నమస్కారాలు. నా పేరు మాధురి. మాకు ఒక పాప. తను యుఎస్‌లో తన ఫ్రెండ్స్‌తో కలిసుంటూ MS చేసింది. రెండు సంవత్సరాల చదువు ఒకటిన్నర సంవత్సరంలోనే పూర్తి చేసింది. అయితే తన కోర్సు పూర్తైన వెంటనే యుఎస్‌లో ఆర్థికమాంద్యం మొదలైంది. అందువల్ల మా అమ్మాయి చాలా ఉద్యోగాలకు ప్రయత్నించినప్పటికీ ఇంటర్వ్యూకి పిలుపు రాలేదు. కొన్ని ఇంటర్వ్యూలకి వెళ్ళినా తను సెలెక్ట్ కాలేదు. మాకు చాలా బాధేసింది. అప్పుడు నేను, "బాబా! పాపకి ఉద్యోగం వచ్చేలా అనుగ్రహించండి" అని బాబాని వేడుకున్నాను. తర్వాత బాబా దయవల్ల ఒక బ్యాంకు ఇంటర్వ్యూకి పిలువు వచ్చింది. మా అమ్మాయి ఆ ఇంటర్వ్యూ బాగానే చేసానని చెప్పింది. బ్యాంకువాళ్ళు మా అమ్మాయి ఆ ఉద్యోగానికి సెలెక్ట్ అయిందని కూడా చెప్పారు. తర్వాత బ్యాంకువాళ్ళు చాలా ఇన్వెస్టిగేషన్స్ చేసి జాయినింగ్ డేటు చెప్పారు. కానీ అంతలోనే వాయిదా వేశారు. మళ్ళీ జాయినింగ్ డేట్ చెప్పి, మళ్ళీ వాయిదా వేశారు. ఆ ఉద్యోగం వస్తుందని మేము చాలా ఆశపడ్డాం. అలాంటిది అలా వాయిదా వేస్తూండేసరికి మాకు ఏమీ అర్థం కాలేదు. మేము బాబానే నమ్ముకున్నాము. చివరికి బాబా దయతో యుఎస్ కాలమానం ప్రకారం 2023, జూలై 17న మా అమ్మాయి ఆ ఉద్యోగంలో చేరింది. మేము చాలా ఆనందపడ్డాము. అంతా బాబా దయ. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. మీ దయ మా అందరిపైనా ఇలాగే ఉండాలని మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నాను తండ్రీ".


సంవత్సరం వృధా కాకుండా దయ చూపిన బాబా


ఓం శ్రీసాయినాథాయ నమః!!! ముందుగా బాబాకు నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలని. నేను హైదరాబాదు నివాసిని. 2018లో హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ బాబా మందిరం పక్కన ఉన్న ఒక ప్రయివేట్ కంపెనీ కార్యాలయానికి నాకు బదిలీ అయింది. 2019, ఏప్రిల్ నెలలో బాబా నన్ను తమ చెంతకు చేర్చుకున్నారు. నెమ్మదిగా ఆయన మీద నమ్మకం కుదిరింది. రోజూ పొద్దున్న, సాయంత్రం బాబాని దర్శించుకోవడం, హారతులు వినడం చేస్తుంటాను. సచ్చరిత్ర పారాయణ వల్ల నేను చాలా తెలుసుకున్నాను.  ఈరోజు సొంత ఆఫీస్ పెట్టుకొని ఒక మంచిస్థితిలో ఉండడానికి బాబానే కారణం. అందుకే ఈ జీవితం బాబా పెట్టిన బిక్ష అని భావిస్తాను. 2023లో మా పాపని ఒక ప్రముఖ కాలేజీలో బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ చేశాను. ఆ కాలేజీకి యూనివర్సిటీ అనుమతులన్నీ ఉన్నాయని అనుకున్నాము. కానీ కొన్ని కారణాల వల్ల ఆ కాలేజీకి యూనివర్సిటీ అనుమతి రాలేదు. దాంతో మేము ఒక సంవత్సరం వృధా అవుతుందని కంగారుపడ్డాము. ఆ సమయంలో నేను, "ఈ సమస్య గురించి నువ్వే చూసుకోవాలి బాబా" అని బాబాకి మొరపెట్టుకున్నాను. తరువాత 2023, జూలై 20, గురువారంనాడు గవర్నమెంట్ స్పెషల్ జీవో ప్రకారం ఈ సంవత్సరం వృధా కాకుండా ఆ కాలేజీ విద్యార్థులను ఇంజనీరింగ్ JNTUలో కొనసాగించేలా అనుమతించారు. అలా బాబా నా సమస్యను అర్థం చేసుకుని ప్రేమతో పరిష్కరించారు. "బాబా! మీకు నా శతకోటి వందనాలు. పాప ఆరోగ్యం, భవిష్యత్తు కూడా బాగుండేలా చూడు స్వామి. నా సమస్యలు మీకు తెలుసు బాబా. అన్నిటినీ తీర్చి నా జీవితంలో ముందుకు సాగేలా ఆశీర్వదించు తండ్రీ".


బాబాకి చెప్పుకున్నంతనే పూర్తైన పని


నా పేరు రమ్యశ్రీ. నా భర్త ఉద్యోగరీత్యా మేము బెంగళూరులో నివాసముంటున్నాము. నేను డ్వాక్రా గ్రూపు సభ్యురాలిని. 2023, జూలై 22న మా డ్వాక్రా గ్రూపు సభ్యులందరికీ 'kyc' చేయించడానికి మా సొంత ఊరు వెళ్ళాను. అందరి 'kyc' అయింది కానీ, నాది కాలేదు. జూలై 24, సోమవారం నుండి మా అమ్మయికి పరీక్షలు ఉన్నందున మేము బెంగళూర్ తిరిగి వెళ్లిపోవాల్సి ఉంది. అందువల్ల నేను బాబాను తలుచుకొని, "బాబా! నా 'kyc' త్వరగా పూర్తయ్యేలే దయ చూపండి" అని  మనస్ఫూర్తిగా వేడుకున్నాను. అలా అనుకున్న ఒక్క నిమిషం తర్వాత నా 'kyc' పని పూర్తి అయింది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".


10 comments:

  1. ఓం సాయి రామ్ మీ ఆశీస్సులతో నా ఆరోగ్యం కుదుట పడింది.కొంచెం ఆలోచనలు మారిపోయేలాగ ఆశీస్సులు యియ్యవలెను తండ్రి.నీ దయ తో నాలో మార్పు వచ్చింది.నరకం అనుభవించాను.ఆ పరిస్థితి మళ్లీ రాకుండా కాపాడు తండ్రీ

    ReplyDelete
  2. ఓం సాయిరామ్

    ReplyDelete
  3. Saibaba eeroju madava schoolki vellaledu. Baba madava manasu maarchi social studies notes complete cheselaga choodu swamy ninne nammu kunnanu swamy naaku enka dikku evaru leru swamy pl baba . Studies meeda interest kaligela cheye swamy

    ReplyDelete
  4. Om Sri Sai Ram Swami 🎉🎉🎉

    ReplyDelete
  5. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  6. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  7. Om Sai Ram Sri Sai Ram Jaya Sai Ram

    ReplyDelete
  8. Baba me daya valana Kalyan ki marriage ipoindi na health bagu cheyandi pl house problem solve cheyandi Rashmi ki pregnancy vachhatatlu chai thandi meku sathakoti vandanalu varidaru kaladi undala cheyandi pl

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo