సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1775వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబాపై భారమేస్తే అంతా ఆయన చూసుకుంటారు
2. బాబాను నమ్ముకుంటే వెన్నంటి ఉండి నడిపిస్తారు

బాబాపై భారమేస్తే అంతా ఆయన చూసుకుంటారు


సాయిబంధువులందరికీ నమస్కారాలు. నేను ఒక సాయిభక్తురాలిని. సాయిబాబానే నాకు అన్నీ. తల్లి, తండ్రి, గురువు, దైవం సర్వస్వం. సాయి లేకుండా నేను ఒక ర సెకను కూడా ఉండలేను. బాబా దయతో చెన్నై యూనివర్సిటీలో నేను చేస్తున్న నా పిహెచ్‌డి ఎలాంటి సమస్యలు లేకుండా సజావుగా నడిచి చివరిగా థీసిస్ సబ్మిషన్ సమయం వచ్చింది. ఇతర స్టూడెంట్స్ అందరూ వాళ్ళవాళ్ళ థీసిస్ కోసం 10, 11 రోజులు యూనివర్సిటీలో ఉండగా నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే, నేను ఉండేది హైదరాబాద్‌లో కాగా యూనివర్సిటీ ఉండేది చెన్నైలో. చివరికి బాబా మీద నమ్మకంతో 2 రోజులలో కర్రెక్షన్స్ చేయించుకొని, బుక్ సబ్మిట్ చేసి తిరిగి వచ్చేద్దామని రిటర్న్ టికెట్ కూడా బుక్ చేసుకొని చెన్నై వెళ్ళాను. అయితే మొదటిరోజు కరెక్షన్స్ అస్సలు కాలేదు. మా గైడ్, "చాలా కరెక్షన్స్ ఉన్నాయి. ఇలానే ప్రింట్ చేస్తే బుక్ రిసబ్మిషన్‌కి వస్తుంది" అని అంది. అది నిజమే, దాదాపు అందరి బుక్స్ రిసబ్మిషన్‌కి వచ్చాయి. అందువల్ల నేను ఏడ్చుకుంటూ, "బాబా! నువ్వే నా బుక్ మొత్తం కరెక్షన్ చేయి. ఏదో ఒక రూపంలో రిసబ్మిషన్‌కి రాకుండా నా బుక్ బైండింగ్ ఐయ్యేలా చేయి" అని అనుకున్నాను. మధ్యాహ్నం 3:30కి జిరాక్స్ షాపుకి వెళ్తే, "6 గంటలకి షాపు క్లోజ్ చేసి మళ్ళీ రేపు ఉదయం తీస్తాం. పుస్తకం రేపు ఇస్తాను" అని అన్నారు. అయితే మరుసటిరోజు మధ్యాహ్నం 3కి నేను థీసిస్ సబ్మిట్ చేయాల్సి ఉంది. అదీకాక మరో సమస్య కూడా ఉంది. అదేమిటంటే, చెన్నైలో 15 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నందున మా గైడ్ యూనివర్సిటీ సెలవు ఉండొచ్చు అని అంది. అదే జరిగితే రెండోరోజు కూడా పని పూర్తి కాదు. నా టికెట్ వేస్ట్ అవుతుంది. కాబట్టి, 'ఆమ్మో.. అలా అయితే ఎలా బాబా?' అనుకున్నాను. బాబా దయవల్ల మరుసటిరోజు అస్సలు వ్యర్థం కాలేదు, నా బుక్ సబ్మిషన్ కూడా అయింది. జిరాక్స్ షాపులో అమ్మాయి చాలా శాంతంగా, వేగంగా నా బుక్ బైండ్ చేసి ఇచ్చింది. ఇతర షాపుల్లో బుక్ బైండింగ్‌కి రెండు రోజులు తీసుకున్నారట. ఆ విషయం తెలిసాక బాబాని ఏదో రూపంలో వచ్చి చేయమన్నందుకు ఆ అమ్మాయి రూపంలో నాకు సహాయం చేసారని అనుకున్నాను. బాబా కృపవల్ల నా బుక్ రిసబ్మిషన్‌కి రాలేదు, వైవా కూడా ప్రశాంతంగా జరిగింది. అంతా సవ్యంగా జరిగేలా బాబానే చూసుకున్నారు. బాబాపై భారమేస్తే అంతా ఆయన చూసుకుంటారు. నిజంగా బాబా అంటే చాలు పలుకుతారు. ఆయన అడుగడుగునా నాతో ఉన్నారు. నన్ను, నా కుటుంబాన్ని కాపాడుతున్నారు. ఆ సాయినాథుని చల్లని నీడలో అందరం చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. "సాయి.. సాయి అంతా నువ్వే. మీకు చాలా చాలా ధన్యవాదాలు".


సమర్థ సద్గురు సాయి మహారాజ్ కీ జై!!!


బాబాను నమ్ముకుంటే వెన్నంటి ఉండి నడిపిస్తారు


నా పేరు దేవప్రసాద్. నేను 2024, జనవరి 14వ తేదీన శిరిడీ వెళ్లడానికి పది రోజులముందు టిక్కెట్లు బుక్ చేసుకున్నాను. తీరా రేపు ఉదయం ప్రయాణమునగా ముందురోజు రాత్రి నాకు జ్వరం వచ్చింది. రాత్రి 2.30 అప్పుడు లేచి డోలో టాబ్లెట్ వేసుకున్నాను. ఉదయం 8.00 గంటలకు నేను రైలు ఎక్కాల్సి ఉండగా 7.00 గంటల వరకు నా ఆరోగ్యం మెరుగుపడక హుషారుగా లేను. అందువల్ల నా భార్య, "మీ ఆరోగ్యం బాగలేదు. తోడు కూడా ఎవరూ లేరు. ఈ స్థితిలో వెళ్లోద్దు" అంది. అప్పుడు నేను బాబానే అడుగుదామని టాస్(బొమ్మ, బొరుసు) వేస్తే, 'వెళ్ళమ'ని బాబా సమాధానం వచ్చింది. ఇక నేనేమీ ఆలోచించకుండా బయలుదేరి రైలు ఎక్కాను. ఆరోజు సాయంత్రం వరకు నాకు నీరసంగానే ఉంది. కానీ రాత్రికి నా ఆరోగ్యం కుదుటపడింది. మరుసటిరోజు సోమవారం ఉదయం 10.00 గంటలకి శిరిడీ చేరుకున్నాను. బాబా దయవల్ల మందిరానికి దగ్గరకి రూమ్ దొరికింది. ఆరోజు రెండుసార్లు బాబా దర్శనం చేసుకొని బాబాను తలుచుకొని సచ్చరిత్ర పారాయణ మొదలుపెట్టి బుధవారం సాయంత్రంకి పూర్తి చేసాను. అప్పుడు శుక్రవారం తిరుగు ప్రయాణమయ్యేందుకు టికెట్ బుక్ చేసుకుంటానని బాబాకి చెప్పుకొని గురువారంనాడు తత్కాల్‌లో టికెట్ కోసం ప్రయత్నించాను. బాబా దయవల్ల టికెట్ బుక్ అయింది. గురు, శుక్రవారాల్లో రెండోసారి పారాయణ చేసి శుక్రవారం సాయంత్రం 7.30 రైలు ఎక్కి మా ఇంటికి క్షేమంగా చేరుకున్నాను. ఈ శిరిడీ ప్రయాణంలో బాబా నాకు తోడుగా ఉండి అన్ని విధాలుగా సహాయం చేసారు. బాబాను నమ్ముకుంటే వెన్నంటి ఉండి నడిపిస్తారు. బాబాకు నేను ఎంతో ఋణపడి ఉన్నాను. "ధన్యవాదాలు బాబా".


22 comments:

  1. Om Sairam!! Baba meere nannu aadukovali. Antha meede bharam thandri!!

    ReplyDelete
  2. ఓం సాయిరామ్

    ReplyDelete
  3. Om sai ram sarada atha arogyam bagunde la chudu tandri, me daya valla purtiga kolukune la chayandi tandri

    ReplyDelete
  4. Omsaisri Sai Jai Jai Sai 🙏🙏🙏🙏 kapadu Tandri 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  5. Om Sri Sai Raksha 🙏🙏🙏

    ReplyDelete
  6. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  7. Baba please bless my child 🙏

    ReplyDelete
  8. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  9. Baba, provide peace and wellness to my parents 🙏🙏

    ReplyDelete
  10. Baba, take care of my son 💐💐💐💐

    ReplyDelete
  11. Om Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏💐💐

    ReplyDelete
  12. Baba, bless Aishwarya 🙏🙏

    ReplyDelete
  13. I am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings forever 🙏🙏💐💐

    ReplyDelete
  14. Om sairam 🙏🙏🙏🙏🙏
    Tandri Baba mee daya to meemu kalustamu ani nammakam vundi Baba 🙏🙏🙏🙏🙏
    Nee daya valana na job success cheyyandi Baba 🙏🙏🙏🙏
    Om sai ram🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  15. ఓం శ్రీ సాయిరాం

    ReplyDelete
  16. Baba,meru vennanti vundi ee vishyam ni migatha vishayalu lage gattu ekkinchandi please....chala bayam anipisthundi kani meru nilabedtharu ane dariyam kuda vasthundi....maa valla evaru ebbandi padakunda ee vishayam ni close cheyandi please 🙏🙏🙏🙏🙏🥺🥺🥺🥺🥺

    ReplyDelete
  17. Maa samasyalu valana alisipothunnanu thandri🙏
    Kapadu baba🙏baba🙏

    ReplyDelete
  18. sai baba, maa bangaru thandri madava bharam antha meede baba. tammudiki udyogam vachhelaga chudandi baba. Maa attagariki naa meeda kopam povali baba

    ReplyDelete
  19. ఓం సాయిరామ్
    మీరు మాట ఇచ్చినట్టు రేపు గృహప్రవేశానికి రండి బాబా

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo