- బాబా అద్భుతాలు ఏం చెప్పను?
సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. నా పేరు పద్మజ. ఏ జన్మ పుణ్యమో, ఋణమో మరి నాకు సాయి సాంగత్యం లభించడం. ఆయన నాకు మంచి గురువు, స్నేహితుడు. నేను నాకు ఏ చిన్న సమస్య వచ్చినా సాయికి చెప్పుకుంటాను, ఆయన ఏదో రకంగా నాకు సహాయం అందిస్తారు. సాయి నా జీవితంలో చేసిన సహాయానికి ఎలా కృతజ్ఞతలు తెలుపుకోవాలో నాకు తెలియట్లేదు. ఎందుకంటే, ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. నేను ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో రిసెప్షనిస్ట్‌గా పని చేశాను. అక్కడ జీతం చాలా తక్కువైనగాని చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందువల్ల నేను ఐదు సంవత్సరాలపాటు అదే హాస్పిటల్లో పని చేసుకుంటూ ఉండేదాన్ని. ఇక అప్పుడు నా జీతం పెంచాల్సిన సమయం రావడంతో హెడ్ ఆఫీసువాళ్ళు, "అక్కడ ఉండే పనికి జీతం పెంచడం కష్టం. కాబట్టి మిమ్మల్ని వేరే పొజిషన్‌కి ప్రమోట్ చేస్తాము. దానికోసం మీరు హైదరాబాద్‌లో ట్రైనింగ్ అవ్వాలి" అన్నారు. నాకు అది ఇష్టం లేదు. వాళ్ళు చెప్పే పని కూడా నాకు నచ్చలేదు. అందువల్ల, "నేను ఒక్కదాన్నే ఇంకో ఉద్యోగం వెతుక్కోలేను సాయి. ఈ ఉద్యోగానికి కూడా నేను, నా స్నేహితురాలు కలిసి వచ్చాము. ఇప్పుడు ఇక్కడ మానేస్తే మరో ఉద్యోగం దొరుకుతుందో, దొరకదో. దయచేసి మీ నిర్ణయం తెలియజేయండి సాయి" అని బాబా దగ్గర చీటీలు వేసాను. చీటీలో ఉద్యోగం మానేయాలని వచ్చింది. ఒక్క నిమిషం నాకు ఏమీ అర్థం కాలేదు. ‘హఠాత్తుగా ఉద్యోగం మానేసి ఇంకొక ఉద్యోగం ఎక్కడ చూసుకోవాలి? ఒక్క నెల ఉద్యోగం లేకపోయినా ఇంట్లో ఇబ్బందిపడతారు. మరి బాబా ఇలా చెప్తున్నారేంటి?’ అని దిగులుగా అనిపించింది. రెండు రోజుల తర్వాత హెడ్ ఆఫీసు నుంచి మెయిన్ సార్ వచ్చి, "నువ్వు ట్రైనింగ్ కోసం హైదరాబాద్ రావాలి" అని అన్నారు. నేను ఆయనతో, "నాకు ఆ వర్క్ ఇష్టం లేదు సార్. నాకు జీతం పెంచనవసరం లేదు. నేను ఇదే జీతంతో కొనసాగుతాను సార్. ఈ ఉద్యోగం మా ఇంటికి చాలా దగ్గరగా ఉంటుంది సార్" అని చెప్పాను. కానీ ఆయన, "అలా కుదరదు" అన్నారు. ఇక అప్పుడు, "నేను ఉద్యోగం మానేస్తాన"ని సార్‌తో చెప్పాను. అందుకాయన, "వద్దు. నువ్వు ఐదు సంవత్సరాల నుంచి ఉన్నావు కాదమ్మా, నీ ఇష్టం, నువ్వు కోరుకున్నట్లే ఈ ఉద్యోగంలోనే కొనసాగు. జీతం పెంచుతాం" అని అన్నారు. కానీ నేను నా మనసులో, "బాబా ఏమో ఉద్యోగం మానేసి వేరే ఉద్యోగం చూసుకోమన్నారు. వీళ్ళేమో జీతం కూడా పెంచారు" అని బాబా చీటీల మీద సందేహపడ్డాను. మనుషులం కదా! సరే, బాబా దగ్గరకి వెళ్లి మళ్ళీ చీటీలు వేసాను. మళ్ళీ వేరే ఉద్యోగం చూసుకో అని వచ్చింది. నాకు ఏమీ అర్థం కాలేదు. 'వీళ్ళు నా జీతం పెంచారు, నా ఇష్టానికి విలువ ఇచ్చారు. అయినా బాబా ఉద్యోగం మానేయమంటున్నారేంటి?' అని మళ్ళీ బాబా దగ్గర చీటీలు వేశాను. అప్పుడు, 'ఇక్కడే ఉంటే సమస్య అవుతుంద'ని వచ్చింది. అయినా నేను పట్టించుకోకుండా ఆ ఉద్యోగంలో కొనసాగాను. సరిగ్గా రెండు రోజులు తర్వాత మా మేనేజర్ నాకు తెలియకుండా నా స్థానంలో వేరే అమ్మాయిని తీసుకోమని హెడ్ ఆఫీసువాళ్లకి చెప్పారని నాకు తెలిసింది. అదికాక ఏ కారణం లేకపోయినా నాపై చాలా అరవడం, నా పనిలో కావాలని తప్పులు చూపడం మొదలుపెట్టారు. అందువల్ల నాకు, నా మేనేజర్‌కి మధ్య పెద్ద గొడవ జరిగింది. అప్పుడు నాకు బాబా నన్నెందుకు ఉద్యోగం మానేయమన్నారో అర్థమైంది. నేను అక్కడ ఇబ్బందిపడతానని బాబాకు ముందుగానే తెలుసు. ఆయన చెప్పినా నేను వినలేదు, ఆయన మాట విని అప్పుడే వెళ్ళిపోయుంటే అసలు గొడవే జరిగేది కాదు. చీటీలు వేసి కూడా అంతా సానుకూలంగా ఉందని నేను బాబా మాట పట్టించుకోలేదు. తల్లిలా బాబా అన్నీ మనకు ముందుగానే చెప్పినా మనం పట్టించుకోము. అనుభవించాకే బాబా మాటల్లోనే అర్థం మనకు తెలుస్తుంది.
నా మేనేజర్ హింస భరించలేక నేను హఠాత్తుగా చెప్పాపెట్టకుండా ఆ ఉద్యోగం మానేశాను. అలా చెప్పకుండా మానేయడం వల్ల నాకు రావాల్సిన జీతం ఇవ్వకుండా ఆపేశారు. నేను ఉద్యోగం మానేసింది గురువారంనాడు. ఆరోజు రాత్రి నేను, మా పిన్ని బాబా ఆరతికి వెళ్ళాం. అప్పుడు నేను పిన్నితో, "నా జీతం ఆపేశారు. ఇంట్లో ఇబ్బంది అవుతుంది" అని చెప్పి బాబా ముందు కన్నీళ్లు పెట్టుకున్నాను. మరుసటిరోజు పొద్దున్న మళ్ళీ బాబా గుడికి వెళ్లి, "సాయీ! నేను చాలా పిరికిదాన్ని. ఒక్కదాన్నే ఇంకో ఉద్యోగం వెతుక్కోవాలంటే నాకు చాలా భయమని నీకు తెలుసు కదా! నాకు కొన్ని EMIలు ఉన్నాయి. అవి పోనూ ఇంట్లో ఎంత ఖర్చు ఉంటుందో మీకు తెలుసు. ఒక్క నెల జీతం లేకపోయినా నా కుటుంబం ఇబ్బందిపడుతుంది. నా కుటుంబానికి సరిపోయే జీతం వచ్చే ఉద్యోగం దొరికేలా చూడండి. ఇక మీ ఇష్టం. అంతా మీ చేతిలో పెట్టాను. నా బాధ్యత మీదే" అని దణ్ణం పెట్టుకున్నాను. తర్వాత నేను బయటికి వస్తుంటే ఆ గుడి మేనేజర్ నన్ను పిలిచి, "ఎందుకమ్మా రాత్రి ఏడుస్తున్నావు?" అని అడిగారు. నేను అతనితో నా ఉద్యోగం, జీతం గురించి చెప్పాను. అప్పుడు ఆ మేనేజర్ అన్న, "నేను ప్రతినెలా చెకప్ కోసం ఒక హాస్పిటల్‌కి వెళ్తాను. ఆ హాస్పిటల్ చాలా బాగుంటుంది. అక్కడ అడిగి చెప్తాను" అన్నారు. నేను సరేనని ఒక ఐదు రోజులు చూశాను. ఐదు రోజుల తర్వాత ఆ అన్న, "అక్కడ ఖాళీ లేదమ్మా. వేరే ఎక్కడైనా చూసుకో" అని అన్నారు. కానీ ఆ అన్న చెప్పిన హాస్పిటల్ టైమింగ్స్(ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు) నాకు చాలా బాగా నచ్చాయి. అందుచేత అక్కడ ఉద్యోగం లేనందుకు నాకు ఏడుపొచ్చేసింది. ఇంకా ఇలా కాదని రెజ్యూమ్ తీసుకొని నాకు తెలిసిన అన్ని చోట్ల ఉద్యోగ ప్రయత్నాలు చేశాను. దాదాపు బుధవారంనాడు అన్నీ చోట్ల తిరిగేసాను. కానీ ఎక్కడా నాకు ఉద్యోగం దొరకలేదు. ఒకవేళ ఉన్నా నాకు నచ్చక పోవడం, అది నాకు సరైనది కాదని బాబా చూపించడం జరిగింది. అలా అంతా ప్రతికూలంగా ఉండేసరికి మనుషులం కదా! బాబాను నిందించడం మొదలుపెట్టాను. "బాబా! నన్ను ఉద్యోగం మానేయమన్నావు. సరే, దారి చూపిస్తావని ఆశగా వెళ్తే, ఎక్కడికి వెళ్లినా అక్కడ వ్యతిరేకంగా జరుగుతుంది. నాకేంటి ఈ పరీక్ష? నాతోపాటు నా కుటుంబం కూడా ఇబ్బందిపడతారు. దయచేసి నాకు సహాయం చేయండి సాయి" అని కన్నీటితో బాబాను ప్రార్థించి బుధవారంనాడు నేను పడిన బాధ అంతాఇంతా కాదు. ఇక అప్పుడు బాబా అద్భుతం చేశారు. నా జీవితంలోని బెస్ట్ మిరాకిల్ అది. నేను ఎప్పటికీ మర్చిపోలేను.
ఆరోజు తిరిగి తిరిగి అలిసిపోయిన నేను బాబా ఎదురుగా కూర్చుని, "నా పరిస్థితి ఏంటి?" అని దిగులుపడుతుంటే 'బాగా గుడిలో మేనేజర్ అన్న చెప్పిన జాబ్ టైమింగ్స్ చాలా బాగున్నాయి. అసలు ఆ ఉద్యోగం ఏమిటి?' అనిపించి గూగుల్లో సెర్చ్ చేశాను. సైట్ ఓపెన్ చేయగానే బాబా ఫోటో దర్శనమిచ్చింది. బాబాని చూడగానే నాకు ఎందుకో చాలా ధైర్యంగా అనిపించి, "సాయీ! నేను ఇక్కడ పని చేస్తాను. నాకెందుకో ఇక్కడ ఉద్యోగం దొరుకుతుందనిపిస్తుంది. ఏ పని మొదలుపెట్టినా ముందుగా మీకు చెప్పుకొని ప్రారంభిస్తే ఖచ్చితంగా ఆ పని జరుగుతుంది. రేపు గురువారం కదా! మీకు పూజ చేసి, మీకు చెప్పుకొని వెళ్తాను" అని బాబాకు దణ్ణం పెట్టుకున్నాను. తర్వాత సాయంత్రం మరుసటిరోజు గురువారం పూజకి పూలు తెచ్చుకుందామని బజారుకు వెళ్లి బాబా గుడి బయట నిల్చున్నాను. అప్పుడు మేనేజర్ అన్న కనిపిస్తే, "అన్నా! నేను మీరు చెప్పిన హాస్పిటల్‌కి రేపు ఒకసారి వెళ్లి నా రెజ్యుమ్ ఇచ్చేసి వస్తాను. మీరు చెప్పేదానికి, నేను వెళ్లి వాళ్ళకి కనిపించి రెజ్యుమ్ ఇచ్చి మాట్లాడడానికి తేడా ఉంటుంది కదా!" అని అన్నాను. ఆ అన్న, "సరే, వెళ్ళు అమ్మా. నాకు అక్కడ తెలిసిన అతను ఉన్నారు. నేను కూడా ఒక మాట చెప్తాను" అని అన్నారు. మరుసటిరోజు గురువారం నేను చాలా నమ్మకంతో బాబా పూజలో నా రెజ్యుమ్ ఉంచి, "సాయీ! సైట్ ఓపెన్ చేయగానే మొదట మీరే కనిపించారు. అక్కడ టైమింగ్ చాలా బాగుంది. అక్కడ నేను ఉద్యోగం చేస్తాను" అని బాబాతో చెప్పుకొని పూజ పూర్తి చేశాను. తర్వాత ముందు బాబా గుడికి వెళ్లి, బాబాకి చెప్పుకొని వెళ్దామని బయలుదేరుతుంటే సరిగ్గా అప్పుడే నాకు నెలసరి వచ్చేసింది. "సాయీ! మీకు చెప్పుకొని వెళ్తే జయం కలుగుతుందని ఎంతో నమ్మకంగా అనుకుంటే ఇలా జరిగింది. అంటే ఈ ఉద్యోగం నాకు రాదా?" అని ఏడ్చేసాను. తర్వాత కనీసం గుడి బయటనుండైన బాబాని దర్శించుకుందామని గుడికి వెళ్లి బాబా ఎదురుగా నిల్చొని నా రెజ్యుమ్ ఆయనకి చూపిస్తూ దణ్ణం పెట్టుకున్నాను. తర్వాత మేనేజర్ అన్నకి కాల్ చేద్దామనుకొనేలోపు అతనే నన్ను చూసి నాకు ఫోన్ చేసి, "అక్కడ ఉద్యోగాలేవీ ఖాళీ లేవటమ్మా. నీకు వేరే చోట ఉద్యోగం ఇప్పిస్తాను. నువ్వు వెళ్లి అక్కడ రెజ్యుమ్ ఇచ్చి వచ్చేయ్" అని అన్నారు. కానీ నాకు, 'ఈరోజు గురువారం. ఆ హాస్పిటల్ సైట్‌లో నాకు సాయి కనిపించారు. అక్కడ ఖచ్చితంగా నాకు ఉద్యోగం ఉంటుంద'ని ఎంతో నమ్మకంగా అనిపించింది. అసలు మిరాకిల్ ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదుగాని నేను ఆ హాస్పిటల్‌కి వెళ్ళడానికి అరగంట ముందు రిసెప్షన్‌లో ఉండే అతనిని మేనేజర్‌గా ప్రమోట్ చేస్తున్నామని, అతని స్థానంలో ఇంకొకరిని తీసుకోండి అని అక్కడ స్టాఫ్‌కి ఫోన్ వచ్చింది అంట. ఆ తర్వాత నేను వెళ్లడంతో నన్ను ఆ ఉద్యోగంలోకి తీసుకున్నారు. అక్కడ ఉండే అతనికి ప్రమోషన్ రావడం, నన్ను ఆయన స్థానంలో తీసుకోవడం నిజంగా అద్భుతం అనిపించింది నాకు. ఇంకో విషయం, నేను వెబ్సైటులో చూసిన బాబా అక్కడ రిసెప్షన్లో ఉన్నారు. ఆయనని చూడగానే నాకు కన్నీరు ఆగలేదు.
తర్వాత చెన్నైలో ట్రైనింగ్ ఉంటుందని చెప్పారు. దాంతో ఈ ఉద్యోగం పోయినట్లే అని మళ్ళీ నాకు బాధ మొదలైంది. ఎందుకంటే, నేను మా ఇల్లు దాటి వెళ్ళను, మా నాన్న ఒప్పుకోరు. "ఏంటి బాబా ఇలా చేశారు?" అని అనుకుంటూ వస్తూ దారిలో అక్కడ రిసెప్షన్‌లో ఉన్న అతనిని, "ఇక్కడ జీతం ఎంత ఉంటుంద"ని అడిగాను. అతను చెప్పింది విని షాకయ్యాను. కారణం అక్కడ జీతం నేను ఊహించిన దానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువ. సాయికి అసలు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు అర్థం కాలేదు. ఇంకేమీ ఆలోచించకుండా వెంటనే చెన్నైలో ట్రైనింగ్‌కి ఓకే చెప్పేసాను. ఇంట్లో కూడా ఒప్పుకున్నారు. జూమ్‌లోనే ఇంటర్వ్యూ జరిగింది. నా డాక్యుమెంట్లు అన్నీ వాట్సాప్‌లో సబ్మిట్ చేసాను. ముందు గురువారం బాబా దగ్గర ఎంత ఏడ్చానో మరుసటి గురువారంకి అంతకు మించిన ఆనందం ఇచ్చారు సాయి. అంత జీతం నేను కలలో కూడా ఊహించలేదు. మా ఇంటికి చాలా దగ్గరలో పని. టైమింగ్ అయితే సూపర్ అసలు. నేను ఎప్పటికీ సాయి ఋణం తీర్చుకోలేను. సరే, తర్వాత ఒక వారం వరకు నాకు వాళ్ళ దగ్గర నుండి ఫోన్ రాకపోయేసరికి ఏమైందో అనుకున్నాను. కానీ మంగళవారంనాడు ఫోన్ చేసి నన్ను ట్రైనింగ్‌కి పిలిచారు. అయితే మొదటిసారి ఇల్లు వదిలి ఒక్కదాన్నే వెళ్ళడానికి నాకు చాలా భయమేసింది. అందువల్ల నాతోపాటు నాకు తోడుగా నేను రోజూ పూజ చేసే సాయిని తీసుకొని వెళ్ళిపోయాను. నేను బుధవారం చెన్నై చేరుకోగా గురువారం నా ట్రైనింగ్ మొదలైంది. అద్భుతం ఏమిటంటే, ఆ హెడ్ ఆఫీస్ హాస్పిటల్ సార్ బాబా భక్తుడు. అక్కడ ఎక్కడ కూర్చున్న కనిపించేలా హాస్పిటల్ అంతా సాయిబాబానే. నా ఆనందానికి అవధులు లేవు. మూడో అంతస్థులో పెద్ద బాబా విగ్రహం ఉంది. నేను ప్రతిరోజూ మొదట బాబాకి దణ్ణం పెట్టుకొని, తిరిగి వచ్చేటప్పుడు కూడా బాబాకి చెప్పుకొని వచ్చేదాన్ని. సాయి నాతోనే ఉన్నారు. అడుగడుగునా నాకు సహాయం చేస్తున్నారు అనిపించేది నాకు.
ఇకపోతే, చెన్నైలో బాషా సమస్యగా అనిపించి ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలి, ఏం చేయాలని నాకు చాలా భయంగా ఉండేది. ఐతే నేను ఎక్కడ కూర్చున్నా ముందుగా నాకు ఎదురుగా సాయి కనిపించేవారు. హాస్టల్‌కోసం వెళ్తే అక్కడ కూడా ఎదురుగా సాయి ఉన్నారు. ఆ హాస్టల్లో చాలా గదులు చూశాను. కానీ ప్రతిగదిలో 6 నుండి 8 బెడ్లు ఉండటం నాకస్సలు నచ్చలేదు. అప్పుడు "సాయీ! నాకు సహాయం చేయండి" అని మనసులో అనుకోగానే ఆ హాస్టల్ వార్డెన్, "రెండో అంతస్తులో ఒక గది ఉంది. అందులో నాలుగు బెడ్లు ఉన్నాయ"ని అన్నారు. వెళ్లి చూస్తూ, ఆ హాస్టల్ మొత్తానికి ఆ గది ఒక్కటే చాలా శుభ్రంగా ఉంది. మనసులోనే బాబాకి కృతజ్ఞతలు తెలుపుకున్నాను. అయితే ఆ గదిలో ఉండేవాళ్ళు తమ డ్యూటీ పూర్తి చేసుకొని రాత్రి పదికి వచ్చేవాళ్ళు. నాకేమో ట్రైనింగ్ మధ్యాహ్నం 3:30కి పూర్తైపోయేది. అందువల్ల వాళ్ళు వచ్చేవరకు నేను ఒంటరిగా ఉండాల్సి వచ్చేది. అసలే ఒంటరిగా ఉండటం అలవాటు లేని నాకు ఒంటరితనం వల్ల ఇంట్లో అందరూ గుర్తొచ్చి ఒక్క రోజుకే చాలా దిగులుగా అనిపించి హాస్పిటల్లోని మూడో అంతస్తులో ఉన్న బాబా దగ్గరకి వెళ్లి, "నేను ఇక్కడ ఉండలేను సాయి. ఇంటికి వెళ్ళిపోదాం. నా గదిలోని వాళ్ళు రాత్రి ఏ సమయానికి వస్తున్నారు. ఒక్కదాన్నే ఉండాల్సి వస్తుంది" అని దణ్ణం పెట్టుకున్నాను. తర్వాత ట్రైనింగ్ పూర్తిచేసుకొని ఏడుస్తూ హాస్పిటల్ క్యాబ్లో హాస్టల్‌కి వెళ్తే, ఆశ్చర్యం! హాస్టల్లోని నా గదిలో ఒక అమ్మాయి ఉంది. ఆ రోజు తన పుట్టినరోజుని తను సెలవులో ఉంది. నిజానికి నేను ఆ రోజు హాస్పిటల్ వద్దు, ఏమీ వద్దు, ట్రైనింగ్ ఆపేసి ఇంటికి వెళ్లిపోదామనుకున్నాను. కానీ సాయి ఆ అమ్మాయిని నాకు తోడుగా ఉంచారు. నేను తనని, "ఈరోజు గురువారం. నాకు గురువారంనాడు సాయిబాబా గుడికి వెళ్లడం అలవాటు" అని అన్నాను. తను మన హాస్టల్కి దగ్గర్లోనే సాయిబాబా గుడి ఉందని, ఆ గుడి లొకేషన్ చెప్పింది. నేను తెలియని ప్రదేశమైనా సాయి మీద భారమేసి అక్కడికి వెళ్ళాను. ఆ అమ్మాయి చెప్పినట్లు హాస్టల్‌కి దగ్గరలోనే బాబా గుడి ఉంది. ఆ రోజు నుంచి రోజూ ట్రైనింగ్ పూర్తి చేసుకొని గదికి రాగానే స్నానం చేసి గుడికి వెళ్లి సాయంత్రం అంతా సాయి దగ్గరే ఉండేదాన్ని. అలా నా ఒంటరితనానికి బాబానే నాకు తోడు అయ్యారు. అయితే ఆ గుడిలో పూజారి సాయంత్రం హారతి ఐదు నిమిషాలే పాడేవారు. ఒకరోజు నేను నా మనసులో, "సాయీ! హారతి పాడి చాలా రోజులు అయినట్టు అనిపిస్తుంది. ఇంటికి వెళ్తేనే మళ్లీ మీ హారతి" అని అనుకున్నాను. మరుసటిరోజు హాస్పిటల్‌లోని ఒక సార్, "ఇక్కడ మైలాపూర్‌లోని సాయిబాబా గుడి చాలా బాగుంటుంది" అని అన్నారు. ఆరోజు ఆదివారం అయినందున నా గదిలో ఒక సిస్టర్ ఉన్నారు. నేను తనని, "మైలాపూర్ ఇక్కడి నుండి ఎంత దూరమ"ని అడిగాను. తను, "10 నిమిషాల ప్రయాణ దూరం" అని అంది. నేను తనతో, "నాకు తోడు వస్తావా?" అని అడిగితే, "నా ఆరోగ్యం బాగోలేద"ని తను చెప్పింది. నేను, 'సరే పర్లేదు. అక్కడ బాగుంటుందంట. కానీ నాకేమో ఆ గుడి అడ్రస్ తెలీదు. నేను బాబాని చూడలేను' అని అనుకుని ప్రశాంతంగా కూర్చొని సాయిభక్తుల అనుభవాలు చదువుకోసాగాను. ఐదు నిమిషాల్లో ఇంకో సిస్టర్ వచ్చి, "నేను షాపింగ్‌కి వెళ్తాను. చీర ఎక్స్చేంజ్ చేసుకోవాలి. వస్తావా?" అని నేను ముందు అడిగిన సిస్టర్‌ని అడిగింది. నాకేమో ఆరోగ్యం బాగాలేదన్న ఆ సిస్టర్ షాపింగ్ అనగానే రెడీ అయిపోయి నాతో, "ఏమీ అనుకోకు. నాకు గుడి అంటే ఇంట్రెస్ట్ లేదు" అని అంది. నేను, "పర్లేదు. నేనేమీ అలా అనుకోను" అని అన్నాను. వాళ్లు నన్ను కూడా షాపింగ్‌కి రమ్మన్నారు. నేను గదిలో ఒంటరిగా ఉండటమెందుకని వాళ్లతో వెళ్ళాను. దారిలో నేను ఒక సిస్టర్‌ని, "షాపింగ్ ఎక్కడా?" అని అడిగాను. అందుకు తను మైలాపూర్ అంది. అది విన్నాక నేను పొందిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. నేను ఏ గుడికి అయితే వెళ్లాలనుకున్నానో ఆ గుడి పక్కనే వల్ల షాపింగ్. వాళ్ళు షాపింగ్ చేసుకుంటుంటే నేను సాయిబాబా గుడికి వెళ్లి బాబా దగ్గర కూర్చున్నాను. అప్పుడు హారతి మొదలైంది. వెంటనే, 'నిన్న బాబా దగ్గర హారతి పాడి చాలా రోజులు అయిందనుకున్నాను' అని గుర్తొచ్చి ముందురోజు నేను అలా అనుకోవడం, పక్క రోజు సార్ నాకు మైలాపూర్ బాబా గురించి చెప్పడం, అనుకోకుండా నేను ఇక్కడికి రావడం, హారతికి హాజరు అవ్వడం నిజంగా సాయిబాబా అద్భుతం అనిపించింది. ఆయన అద్భుతాలను తలుచుకుంటే నాకు కన్నీరు ఆగట్లేదు. చివరిగా ఈ అనుభవానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన బాబా అనుగ్రహ చిహ్నాలు:
- నేను పాత ఉద్యోగం మానేసింది గురువారం.
- కొత్త ఉద్యోగానికి ఇంటర్వ్యూ జరిగింది గురువారం.
- చెన్నైలో ట్రైనింగ్ మొదలైంది గురువారం.
- మళ్లీ మా ఊరిలో కొత్త ఉద్యోగంలో జాయిన్ అయింది గురువారం.
అంతా సాయి దయ. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 🙏🙏
ReplyDeleteBaba, take care of my son 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏💐💐
ReplyDeleteBaba, bless Aishwarya 🙏🙏
ReplyDeleteOm sai ram anta anukunnattu jarige la chudandi
ReplyDeleteI am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings forever 🙏🙏💐💐
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteMee experience chala bagundi sai.
ReplyDeleteOm sairam
DeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Baba Kalyan ki marriage chai thandri pl meku satha koti vandanalu vadini bless cheyandi
ReplyDeleteOm Sairam🙏
ReplyDeleteBaba please take care of my child
ReplyDeleteOm sairam
ReplyDeleteOm Sri Sai Raksha🙏🙏🙏
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteఓం శ్రీ సాయి రామ్
ReplyDeleteBaba,meru naa cheyyi vadilipettaru ane dairyam thechukuni orpuga vundataniki try chesthunna....naa valla evaru bhada padakunda ee situation antha set ayyela cheyandi Baba 🥺🥺🥺🥺🥺....naa anubhavam ede blog lo panchukunta 🙏🙏🙏🙏🙏
ReplyDeleteVacheddam bayataki anukune prathisari meru edoka miracle chesi nilabeduthune vacharu....inka bills credit avvakapothe memu situation ni handle cheylemu ane situation ki vachesindi meku theliyani vishayam kadu....aa bills kuda credit ayyela chudandi baba....naa cheyyi vadili pettakandi meru lekapothe memu enni days survive ayyevallam kadu naku 100% thelusu aa vishayam....mee mede baram vesthunna .....Sainada anugrahinchandi please 🙏🙏🙏🙏🙏
DeleteSai na bartha ante naku pranam mamalni dhuram cheyyodhu sai mamalni edharni kalapandi sai
ReplyDeleteBaba ma pillalu bagundali baba y
ReplyDeleteBaba pillalaki mere raksha baba
ReplyDeleteOm Sai Ram
ReplyDelete