సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1767వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1.  సాయిని నమ్ముకోండి - అంతా ఆయన చూసుకుంటారు  
2. క్లిష్ట పరిస్థితుల్లో ఆదుకున్న బాబా

 సాయిని నమ్ముకోండి - అంతా ఆయన చూసుకుంటారు  


సాయిభక్తులందరికీ నా నమస్కారం. నా పేరు సౌజన్య. సాయిబాబా నాకు చాలాసార్లు సహాయం చేసారు. 2023, సెప్టెంబర్ 20న నేను 9 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు జలుబు, దగ్గుతో చాలా బాధపడ్డాను. నాకు చికిత్స ఇస్తున్న గైనకాలజిస్ట్ ఒక వారానికి టాబ్లెట్లు ఇచ్చారు కానీ, నాకు అస్సలు తగ్గలేదు. దాంతో మేడమ్ ఛాతీ అలర్జీ అని చెకప్ కోసం వేరే డాక్టర్ దగ్గరకి వెళ్ళమని చెప్పారు. నేను అలాగే వెళ్ళాను. ఆ డాక్టర్ 3 రోజులకి టాబ్లెట్లు ఇచ్చారు. వాటితో కాస్త తగ్గింది కానీ, అప్పుడప్పుడు దగ్గు వస్తూ ఉండేది. ఇలా ఉండగా గైనకాలజిస్ట్ మేడమ్, "ఆలస్యం చేయకుండా సి-సెక్షన్ చేయాలి. అక్టోబర్ 12న చేస్తాన"ని చెప్పారు. అప్పుడు నేను, 'సర్జరీ చేసే సమయంలో దగ్గు వస్తే ఎలా?' అన్న ఆలోచనతో చాలా టెన్షన్ పడి సాయిబాబాని నమ్ముకొని 'సాయి సాయి' అని తలుచుకుంటూ అక్టోబర్ 11, సాయంత్రం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. అప్పటికి దగ్గు ఉంది. మేడమ్ ఉదయం 5:30కి సి-సెక్షన్ చేస్తానని అన్నారు. నేను ఆ రాత్రంతా సాయి చాలీసా చాలాసార్లు చదివి, 'సాయి సాయి' అని జపిస్తూ అస్సలు నిద్రపోలేదు. ఉదయం 5 గంటలకి నన్ను ఆపరేషన్ థియేటర్‌లోకి తీసుకెళ్లి ఆక్సిజన్ పెట్టి ఆపరేషన్ ప్రక్రియ మొదలుపెట్టారు. ఆ సమయమంతా నేను 'సాయి సాయి' అని అనుకుంటూ ఉన్నాను. నాకు ఆపరేషన్ చేస్తున్నట్టు అనిపించలేదు, నొప్పి తెలీలేదు. కాసేపటికి నాకు బాబు పుట్టాడని చెప్పారు. సరిగ్గా అదే సమయంలో ఆపరేషన్ థియేటర్‌లో ఉన్న ఒకరి ఫోన్ రింగ్ అయింది. 'సాయి శరణం సాయి శరణం' అన్న ఆ రింగ్ టోన్ సౌండ్ ఒక్క నిమిషంపాటు విన్నాక నేను క రకమైన  పారవశ్యంలోకి వెళ్లిపోయాను. నా మనసుకి చాలా ఆనందంగా అనిపించింది. నిజంగా సాయిబాబా నా తోడుగా ఆపరేషన్ థియేటర్‌లో ఉన్నారనిపించింది. ఆ అనుభూతిని నేను ఇప్పటివరకు మార్చిపోలేదు. ఇంకో విషయం ఏమిటంటే, ఆపరేషన్ జరుగుతున్నంతసేపూ నాకు దగ్గు రాలేదు. ఆపరేషన్ అయినా 2 గంటల తర్వాత దగ్గు మళ్ళీ మొదలైంది. అప్పుడు మందులు ఇస్తే నాకు చాలా ఉపశమనం కలిగింది. నిజంగా బాబా ఆ రోజు నా దగ్గర ఉన్నారు. అక్టోబర్ 12, గురువారం నాడు మా బాబు పుట్టాడు. అంతా బాబా దయ. సాయిని నమ్ముకోండి - అంతా ఆయన చూసుకుంటారు. "ధన్యవాదాలు బాబా. నన్ను నా కుటుంబాన్న్ని సదా రక్షించు తండ్రీ".


క్లిష్ట పరిస్థితుల్లో ఆదుకున్న బాబా


సాయిభక్తులందరికీ నా నమస్కారాలు. నా పేరు ప్రీతి. నా భర్త 'యూఏఈ'లో ఉంటున్నారు. ఆయన 2023, మే నెల వేసవి సెలవుల్లో ఒక నెల రోజులు తనతోపాటు గడపటానికి నాకు, మా ఇద్దరు పిల్లలకు ఫ్లైట్ టిక్కెట్లు బుక్ చేసారు. నాకు అదివరకే బిజినెస్ వీసా ఉండగా పిల్లలకి విజిట్ వీసా తీసుకున్నాము. అయితే విమానాశ్రయంలో మా సామాను చెకింగ్ అప్పుడు సిస్టమ్ మా పిల్లలిద్దరి వీసాలు ఆమోదించింది కానీ, కొన్ని కారణాల వల్ల నా వీసా ఆమోదించలేదు. సిస్టమ్ నా వీసా ఎక్సపైర్ అయినట్లు చూపించసాగింది. దాంతో అధికారులు మీ వీసా ఎక్సపైర్ అయినందున మీరు ‘యూఏఈ’ వెళ్ళలేరని అన్నారు. వెంటనే నేను నా భర్తకి ఫోన్ చేసి విషయం చెప్పాను. ఆయన అధికారులతో బిజినెస్ వీసాకి ఒక సంవత్సరం వాలిడిటీ ఉంటుందని చెప్పి, అందుకు సంబంధించిన సరైన ప్రూఫ్స్ పంపారు. ఆ సమయమంతా నేను బాబాని నిరంతరాయంగా, "ఈ సమస్యను పరిష్కరించండి. మీ అనుగ్రహం తోటి సాయి భక్తలతో పంచుకుంటాను. అలాగే సాయి దివ్యపూజ చేస్తాను" అని వేడుకుంటూ ఉన్నాను. బాబా దయవల్ల అధికారులు నా వీసా ఆమోదించడంతో సమస్య పరిష్కారమై నేను పిల్లలతో ‘యూఏఈ’ వెళ్ళాను. అక్కడినుండి తిరిగి వచ్చేటప్పుడు కూడా విమానాశ్రయంలో మా లగేజ్ విషయంలో కొన్ని సమస్యలు వచ్చాయి. కానీ మన ప్రియమైన సాయినాథుని కృపవల్ల సమస్యలు తొలగిపోయాయి. లేదంటే మేము డొమెస్టిక్ ఫ్లైట్ మిస్ అయ్యేవాళ్ళము. "క్లిష్ట పరిస్థితుల్లో మాతో ఉండి ఆదుకున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు బాబా".


26 comments:

  1. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  2. Baba, provide peace and wellness to my parents 🙏🙏

    ReplyDelete
  3. Baba, take care of my son 💐💐💐💐

    ReplyDelete
  4. Om Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏💐💐

    ReplyDelete
  5. Baba, bless Aishwarya 🙏🙏🙏🙏

    ReplyDelete
  6. I am totally surrendering at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings forever 🙏🙏💐💐

    ReplyDelete
  7. Om Sri Sai Raksha🙏🙏🙏

    ReplyDelete
  8. ఓం సాయిరామ్

    ReplyDelete
  9. Om sai ram, amma nannalani kshamam ga chudandi tandri

    ReplyDelete
  10. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  11. Baba Kalyan ki marriage chai thandri pl meku satha koti vandanalu vadini bless cheyandi

    ReplyDelete
  12. sai baba, maa sai madava bharam antha meede baba. tammudiki manchi udyogam vachhelaga deevinchandi baba

    ReplyDelete
  13. Loan ravali Baba
    Om Sai Ram

    ReplyDelete
  14. Baadhalu theerchu thandri🙏
    Neekanni telusu kapadu baba🙏

    ReplyDelete
  15. Omsaisri Jai Jai Sai kapadu Tandri 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 omsaisri Sai Jai Jai Sai Raksha Raksha Sri Sai Raksha

    ReplyDelete
  16. ఓం శ్రీ సాయిరాం

    ReplyDelete
  17. Sairam mammulanu tvaraga kalapandi baba 🙏🙏🙏🙏Nee meeda enno ashalu pettukunnanu baba eka anta meedaya baba 🙏👏👏👏👏👏

    ReplyDelete
  18. Omesairam.. baba ma vadiki light ga marala snoring modalyindi mee Daya valla rakunda chudu baba complete ga infection thaggali thandri.ma papa mi Daya valla puttindi baba please safe ga chudu baba iddarini please omesairam

    ReplyDelete
  19. 🌺🌺🙏🙏 Om Sai Ram 🙏🙏🌺🌺

    ReplyDelete
  20. Baba mammalni anugrahinchandi baba....Naku chala tension gaa vuntundi....meru natho vunnaru ani thelisi kuda manishi kada bayam podam ledu....mere daya vunchi nannu kapadandi 🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo