ఈ భాగంలో అనుభవాలు:
1. బాబా దయతో ఆర్థిక బాధల నుండి విముక్తి
2. కొన్నిగంటల్లో చిన్నారి జ్వరం తగ్గించిన బాబా
3. శస్త్ర చికిత్స లేకుండా మందులతో సరిపెట్టిన బాబా
బాబా దయతో ఆర్థిక బాధల నుండి విముక్తి
నా పేరు స్నేహ. నా స్వస్థలం గోవా అయినప్పటికీ ప్రస్తతం ఉద్యోగరీత్యా యూకేలో ఉంటున్నాను. నేను చాలా కలతల కుటుంబానికి చెందిన దానిని. నాకు మూడు సంవత్సరాల వయసున్నప్పుడు మా అమ్మ చనిపోయింది. మా నాన్న మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ పెళ్ళైన ఒక సంవత్సరం తర్వాత మా సవతి తల్లి నన్ను, నా తమ్ముడిని బానిసల్లా చూడడం మొదలుపెట్టింది. నాకు 7 సంవత్సరాల వయసొచ్చాక మా తమ్ముడ్ని ఒంటరిగా వదిలేసి నేను మా మేనమామ దగ్గర ఉండటానికి వెళ్ళిపోయాను. అప్పటినుండి మా నాన్న నాతో మాట్లాడం మానేశారు. నాకు 19 సంవత్సరాల వయసప్పుడు నేను ఒక హిందూ అబ్బాయిని వివాహం చేసుకొని సాయిబాబాని పూజించడం ప్రారంభించాను. మేము చాలా ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నేను సాయిబాబాని, "మా నాన్న నన్ను మన్నించి, నాకు సహాయం చేసేలా దయ చూపండి బాబా" అని ప్రార్థించడం మొదలుపెట్టాను. ఎందుకంటే, మా నాన్న దగ్గర చాలా డబ్బు ఉండేది. బాబా నా జీవితంలో అతిపెద్ద అద్భుతం చేసారు. అకస్మాత్తుగా మా నాన్న నా మేనమామ ద్వారా నన్ను సంప్రదించి, నాకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఆయన నాకు చాలా పెద్ద మొత్తంలో ధన సహాయం చేసారు. అంతేకాదు బంగారం, కారు, ఇంకా చాలా నాకు కొనిచ్చారు. ఆయన చేసినదానికి థాంక్స్ చెప్పడం అంటే చాలా చిన్న మాట, అందుకే నేను ఆయనకి కృతజ్ఞతలు చెప్పలేకపోయాను. "థాంక్యూ సాయిబాబా".
కొన్నిగంటల్లో చిన్నారి జ్వరం తగ్గించిన బాబా
నేను ఒక సాయిభక్తురాలిని. మేము యుఎస్ఏలో నివాసముంటున్నాము. నేను, నా భర్త ఇద్దరమూ ఐటి ఉద్యోగాలు చేస్తుండటం వల్ల మా షెడ్యూల్ ఎప్పుడూ బిజీగా ఉంటుంది. మాకు ఒక 5 సంవత్సరాల పాప ఉంది. తను తరచుగా అనారోగ్యం పాలవుతుంటుంది. ఒక శుక్రవారం నాటి సాయంత్రం పాప తనకి తలనొప్పిగా ఉందని కొద్దిగానే ఆహారం తీసుకొని తొందరగానే పడుకుంది. మధ్య రాత్రిలో తనకి దగ్గు మొదలైంది. మరుసటిరోజు తనకి 102 డిగ్రీల జ్వరమొచ్చి ఒళ్ళు కాలిపోసాగింది. సమయానికి మావారు బయటకి వెళ్లారు, వారాంతమైనందున మా డాక్టరు క్లినిక్ మూసేసారు. నాకు ఏం చేయాలో అర్థంకాక చాలా ఆందోళన చెందాను. అప్పటికి కొన్నినెలల క్రితమే పాప వాకింగ్ నిమోనియా నుండి కోలుకుని, ఇంకా చాలా బలహీనంగా ఉంది. ఆ సమయంలో నిమోనియా నయం చేయడంలో బాబానే మాకు సహాయం చేసారు. అందుచేత నేను మళ్ళీ బాబా వైపు తిరిగి ఆయనకు శరణుజొచ్చాను. నేను పాపకి ఊదీ ఇచ్చి, 'సాయి రక్షక శరణం', 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అని జపించాను. ఆశ్చర్యంగా కొన్ని గంటల్లో పాప జ్వరం తగ్గడం మొదలుపెట్టి క్రమంగా జ్వరం పూర్తిగా తగ్గిపోయి ఆహారం తీసుకోవడం మొదలుపెట్టింది. సాయిదేవా వల్లనే ఇదంతా సాధ్యమైంది. మొత్తం ప్రపంచం, మన విధి మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు బాబా మాత్రమే మన ఏకైక రక్షకుడు.
శస్త్ర చికిత్స లేకుండా మందులతో సరిపెట్టిన బాబా
నేను ఒక సాయి భక్తురాలిని. నా పేరు జనని. నా అనుభవాన్ని పంచుకోవడం నాకు దక్కిన గౌరవంగా, ఇది నిజమైన ఆశీర్వాదంగా భావిస్తున్నాను. ఇటీవల మా నాన్నకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలడవంతో మేము ఒక డాక్టరుని సంప్రదించాము. ఆ డాక్టరు CT స్కాన్, యాంజియోగ్రామ్ చేయించమని సలహా ఇచ్చారు. సరేనని అవి చేయిస్తే, నాన్న గుండెలో 70 నుండి 80% బ్లాకులున్నాయిని రిపోర్టులో వచ్చింది. దాంతో డాక్టరు శస్త్రచికిత్స అవసరమని మాతో చెప్పారు. మేము సెకండ్ ఒపీనియన్ కోసం మరో డాక్టరుని సంప్రదించాము. ఆ డాక్టర్ మరింత ఖచ్చితమైన రిపోర్టుల కోసం సాంప్రదాయ ఆంజియోగ్రఫీ చేయించమని సూచించారు. ఇదంతా జరుగుతున్న సమయంలో నేను, మా అమ్మ 'శస్త్రచికిత్స లేకుండా మందులతో బ్లాకులు నయమవ్వాలన్న' ఆశతో సాయిబాబాను ఆశ్రయించి, ఆయనపై పూర్తి విశ్వాసంతో చిత్తశుద్దిగా ఆయనను ప్రార్థిస్తూ ఉండేవాళ్ళము. ఆయన దయతో సాంప్రదాయ ఆంజియోగ్రఫీ పరీక్ష అనంతరం డాక్టర్ మమ్మల్ని పిలిచి, "బ్లాకులకు మందులతో చికిత్స చేయవచ్చు. శస్త్రచికిత్స అవసరం లేదు" అన్న గొప్ప వార్త చెప్పారు. అది విని మా కుటుంబంలోని అందరి ఆనందానికి అవధులు లేకుండాపోయింది. నేను నొక్కి చెప్పేది ఏమిటంటే, 'భగవంతునిపై పూర్తి విశ్వాసం కలిగి ఉండటం ముఖ్యం. విశ్వాసంతో అద్భుతాలు జరుగుతాయి'. "మాతో ఉంటూ మేము కోరుకున్నది సాధ్యం చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు బాబా".
Om sairam
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 🙏🙏
ReplyDeleteBaba, take care of my son 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏
ReplyDeleteBaba, bless Aishwarya 💐💐
ReplyDeleteI am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings forever 🙏🙏💐💐
ReplyDeleteBaba Kalyan ki marriage chai thandri pl meku satha koti vandanalu vadini bless cheyandi
ReplyDeleteOm sai ram anta bagunde la chayi tandri
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
sai baba maa bangaru tandri sai madava bharam antha meede baba. madava baaga chaduvukoni praojakudu avvaalani korika.adi neraverchandi baba
ReplyDeleteOm Sairam🙏
ReplyDeleteBaba na meeda Daya chupinchandi thandri antha Mee Daya ashirvadalu baba meere kapadali. Meeru kakapote Naku dikkevaru thandri meede bharam baba. Om Sairam!!
ReplyDeleteఓం శ్రీ సాయి రామ్
ReplyDeleteOmsaisri Jai Jai Sai 🙏🙏🙏🙏🙏 kapadu Tandri omsairamRaksha Raksha omsaisri Jai Jai Sai 🙏🙏🙏
ReplyDeleteBaba,maa problems nundi mammalni gattu ekkinchandi please...naa valla nannu nammukuni vachina evarini bhada pettalenu,mere naku dikku ....andarini gattu ekkinchandi please....naku chala bayam vesthundi kani mee meda drudamina nammakam tho vundataniki naa vanthu prayathnam chesthunna
ReplyDeleteOm Sri Sainathaya Namah
ReplyDeleteBaba ma pillalu bagundali thandri please baba
ReplyDelete🌺🌺🙏🙏 Om Sai Ram 🙏🙏🌺🌺
ReplyDeleteOm sai ram
ReplyDeleteOm Sri Sai Raksha 🙏🙏🙏
ReplyDelete