1. బాబా అనుగ్రహం
2. బాబా దయతో తీరిన ఆరోగ్య సమస్యలు
బాబా అనుగ్రహం
బాబా భక్తులందరికీ నమస్కారం. నా పేరు విజయలక్ష్మి. 2023, డిసెంబర్ నెలలో మేము ఒక అల్మారా కొన్నాము. దాన్ని షాపువాళ్ళు మా ఇంటికి తీసుకొచ్చారు. మేము ఉండేది మొదటి అంతస్తులో. ఆ అల్మరా చాలా బరువుగా ఉండటం వల్ల వాళ్ళు దాన్ని పైకి తీసుకొని రావడానికి చాలా ఇబ్బందిపడ్డారు. సమయానికి మావారు ఇంటిలో లేరు, డ్యూటీకి వెళ్లారు. సమీపంలో సహాయం చేసేవాళ్ళు కూడా ఎవరూ లేరు. వాళ్ళు ఇద్దరూ ఎంత ప్రయత్నించినప్పటికీ అల్మరాను పైకి తీసుకొని రాలేక చివరికి నాతో, "మేడమ్! చాలానే డామేజ్ అయ్యేలా ఉంది. ఏం చేయమంటారు?" అని అన్నారు. నేను మావారికి ఫోన్ చేస్తే, "వాళ్ళని వాళ్ల మనుషుల్ని పిలిపించుకోమను" అని చెప్పారు. అదే విషయం వాళ్ళతో చెపితే, వాళ్ళు మరో ఇద్దరిని పిలిచారు. అయితే ఆ నలుగురు కూడా అల్మరా ఎక్కించడానికి చాలా ఇబ్బందిపడ్డారు. అప్పుడు నేను, "బాబా! వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎలాగైనా ఆ అల్మరా పైకి తీసుకొచ్చేలా చేయండి. మీ అనుగ్రహాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. బాబా దయతో వాళ్ళు అల్మారాను పైకి తీసుకొచ్చి పెట్టారు. పెద్ద డ్యామేజ్ ఏమీ అవ్వకుండా కింద కొంచం వంగింది అంతే. అయితే నేను ఈ అనుభవాన్ని బ్లాగుకి పంపడం మర్చిపోయాను. తర్వాత 2024, జనవరి 22 సాయంత్రం మావారు తన బంగారు ఉంగరాన్ని తన చెల్లి వాళ్ళింట్లో ఎక్కడో పెట్టి మార్చిపోయారు. ఎంత వెతికినా కనిపించలేదు. నేను వెంటనే బాబాని తలుచుకొని సమాధానం కోసం క్వశ్చన్ అండ్ ఆన్సర్ సైట్‌లో చూస్తే, 'బాబాకు మిఠాయిలు సమర్పించి మార్చిపోయిన వాటికి క్షమాపణలు చెపితే కోరుకున్నవి సిద్ధిస్తాయి' అని వచ్చింది. అది చదివాక నాకు ధైర్యం వచ్చి వెంటనే, "బాబా! మీ అనుగ్రహాన్ని బ్లాగుకు పంపుతానని మర్చిపోయాను. నన్ను క్షమించండి సాయి. మావారి ఉంగరం దొరికితే నా అనుభవాన్ని బ్లాగుకి పంపిస్తాను" అని బాబాను వేడుకున్నాను. కొద్దిసేపటికి పని ఉందని మావారు మళ్లీ తన చెల్లి వాళ్ళింటికి వెళ్తే ఉంగరం దొరికింది. అంతకుముందు ఎంత వెతికినా దొరకనిది బాబాకి క్షమాపణలు చెప్పుకోగానే దొరికింది. మనం మన అనుభవాలు పంచుకోవడం మర్చిపోయిన బాబా వాటిని మనకి గుర్తు చేస్తారు. ఎందుకంటే, అది ఇంకొకరికి సమాధానం అవుతుంది. "బాబా! నా ఆలస్యానికి మన్నించండి. ఎల్లప్పుడూ మీ భక్తులను కాపాడుతూ ఉండు బాబా".
బాబా దయతో తీరిన ఆరోగ్య సమస్యలు
సాయిభక్తులందరికీ నా నమస్కారాలు. నా పేరు వెంకటేష్. బాబా దయవలన నాకు ఒక పాప, ఒక బాబు ఉన్నారు. బాబుకి 11 నెలలప్పుడు 2023, నవంబర్‌లో ఒకరోజు తన తల మీద కొద్దిగా ద్రవం వస్తూ బంకలా అంటుకోసాగింది. మాకు భయమేసి డాక్టరుకి ఫోన్ చేస్తే, "రేపు రండి" అన్నారు. అప్పుడు అర్‌ఏమ్‌పి డాక్టరుకి చూపిస్తే, చెల్ది(అదొక రకమైన ఇన్ఫెక్షన్) అన్నారు. దేనికైనా మంచిదని డాక్టరుకి చూపిస్తే, "అది స్కిన్ ఇన్ఫెక్షన్" అని ఒక షాంపూ, ఆయింట్మెంట్ ఇచ్చారు. నేను, "బాబా! మీ దయవలన బాబుకి తొందరగా తగ్గితే, మీ అనుగ్రహాన్ని మన 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు ద్వారా తోటి సాయి భక్తులతో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా దయవలన బాబుకి తగ్గింది.
2024, జనవరిలో సంక్రాంతి పండుగ ముందురోజు మా అక్క ఫ్లోర్ క్లీన్ చేస్తూ కింద పడిపోవడంతో తన కుడి చేయి వాచింది. నాకు భయమేసి, "బాబా! దయతో అక్కకి ఫ్రాక్చర్ కాకుండా చూడు" అని బాబాని ప్రార్థించాను. తర్వాత డాక్టర్ దగ్గరకి వెళ్తే, ఎక్స్‌రే తీసి చిన్నగా ఎయిర్ క్రాక్ అయిందని 10 రోజులు మందులు వాడి రమ్మన్నారు. బాబా దయవలన దెబ్బ చిన్నగా తగిలింది. "ధన్యవాదాలు బాబా. అక్కకి తగ్గిపోయేలా చూడు తండ్రీ".
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!!
Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 🙏🙏
ReplyDeleteBaba, take care of my son 💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏💐💐
ReplyDeleteBaba, bless Aishwarya 🙏🙏
ReplyDeleteI am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings forever 🙏🙏💐💐
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteOm sai ram, nenu korukunnavi jarige la chudu tandri
ReplyDeleteOmsaisri Sai Jai Jai Sai 🙏🙏🙏 kapadu Tandri 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ReplyDelete🌺🌺🙏🙏 Om Sai Ram 🙏🙏🌺🌺
ReplyDeleteOm Sri Sai Raksha 🙏🙏🙏
ReplyDeleteOm Sairam!!!
ReplyDeleteMa pillalu bagundali baba please
ReplyDeleteBaba Kalyan ki marriage chai thandri pl meku satha koti vandanalu vadini bless cheyandi
ReplyDeletesai baba maa sai madava bharam antha meede baba
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sairam 🙏
ReplyDeleteOm Sri Sainathaya Namah
ReplyDeleteBaba ,nenu emina papam chesthe daniki kshaminchandi please....naa valla naa chuttu vunna vallu ebbandi paduthunnaru please ee problem solve ayyela cheyandi Baba 🙏🙏🙏🙏🙏🙏🥺🥺🥺🥺🥺
ReplyDeleteKapadu tandri🙏
ReplyDeleteDayachoopu baba🙏
ఓం శ్రీ సాయి రామ్
ReplyDelete