1. చెప్పుకుంటే బాధను తీర్చే సాయినాథుడు
2. కరుణతో జ్వరం తగ్గించిన సాయి
3. విచారణ జరగకుండా అనుగ్రహించిన బాబా
చెప్పుకుంటే బాధను తీర్చే సాయినాథుడు
అందరికీ నమస్కారం. నా పేరు అనుజ. నేను 1996 నుండి బాబాని కొలుస్తున్నాను. ఏ సమస్య వచ్చినా, సంతోషం వచ్చినా బాబాతో పంచుకోవడం నాకు అలవాటు. ఈమధ్య మా ఇంట్లోని వాటర్ ట్యాంకులో నీళ్లు నింపాక ఒక గంటకల్లా ఖాళీ అయిపోతుండేది. ఎక్కడా లీకవుతున్నట్లు కనిపించకపోవడంతో ఏం చేయాలో మాకెవరికీ అర్థం కాలేదు. అప్పుడు బాబాని తలుచుకొని, "ఈ సమస్యకి పరిష్కారమార్గం చూపిస్తే, మీ అనుగ్రహాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాను" అని మొక్కుకున్నాను. బాబా దయతో మరుసటిరోజు తెల్లారుతూనే ఆ సమస్యకి పరిష్కారం చూపించారు. లీకేజీ ఎక్కడ ఉందో కనిపెట్టగలిగాము. దానిని రిపేర్ చేయించడానికి సమయం పట్టినప్పటికీ బాబాని తలుచుకోగానే పరిష్కారం చూపినందుకు బాబాకి ధన్యవాదాలు.
ఒకసారి మావారికి హఠాత్తుగా తల తిరుగుతుండేసరికి ఏ సమస్య వుందో అని మాకు భయమేసింది. హాస్పిటల్‌కి తీసుకొని వెళ్తే, డాక్టర్ కొన్ని టెస్టులు వ్రాసారు. నేను, "బాబా! టెస్టులు అన్నీ నార్మల్ రావాలి. షుగర్ వల్లనే ఆ సమస్య అయుండాలి. ఇంకే పెద్ద సమస్య ఉండకూడదు. అలా అయితే మీ అనుగ్రహం బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాను" అని బాబాకి మొక్కుకున్నాను. దయ గల తండ్రి నా మొర ఆలకించారు. నేను కోరుకున్నట్లే షుగర్ సమస్య అని రిపోర్ట్ వచ్చింది. పెద్దగా సమస్య లేకపోవడం వల్ల మాకు చాలా ఉపశమనంగా అనిపించింది. ఇలా మాకు ఎప్పుడు, ఏ ఆపద వచ్చినా ఆ సాయినాథుడిని వేడుకుంటాము. ఆయన ఆ బాధను తీరుస్తూ ఉంటారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. మమ్మల్ని ఎప్పుడూ విడువకు బాబా. నా చేయి పట్టుకొని నడిపించు బాబా. ఎప్పుడూ మిమ్మల్ని గుర్తుంచుకునేలా చూడు బాబా".
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!!!
కరుణతో జ్వరం తగ్గించిన సాయి
ఓం శ్రీసాయినాథాయ నమః!!! నేనొక సాధారణ సాయి భక్తురాలిని. 2024, జనవరి 13న, అర్థరాత్రి ఒంటిగంటప్పుడు మా 16 నెలల పాప ఒళ్ళు వేడిగా ఉండటం నేను గమనించాను. కానీ అది జ్వరమా లేక చలికాలంలో దుప్పటి కప్పుకున్నప్పుడు మామూలుగా అనిపించే వెచ్చదనమో నేను చాలాసేపటి వరకు తెలుసుకోలేకపోయాను. చివరికి తెల్లవారుజామున 4:30 సమయంలో టెంపరేచర్ చూస్తే జ్వరం 101 వరకు వుంది. అంత ఎక్కువ జ్వరం ఉండేసరికి, పాపకి 8 నెలలప్పుడు కూడా ఒకసారి ఇలానే హైఫీవర్ వస్తే హాస్పిటల్లో చేర్చాల్సిన విషయం గుర్తొచ్చి నాకు చాలా భయమేసింది. అదీకాక పొరపాటున నేను, నా భర్త టాబ్లెట్ల మోతాదు సరిగ్గా చూసుకోకుండా పాపకి ఒక టాబ్లెట్ ఇవ్వడానికి బదులు రెండు టాబ్లెట్లు ఇచ్చాం. అసలే చిన్నపాప మోతాదు ఎక్కువైతే ఏమవుతుందోనని నాకు మరింత భయమేసింది. దాంతో నా భర్త తెలిసిన డాక్టర్ని ఆ విషయం గురించి విచారించే ప్రయత్నంలో పడగా నేను మాత్రం నా ఇష్టదైవాలైన ఆంజనేయస్వామిని, ఆ సాయినాథుని ప్రార్థించాను. వారి దయవల్ల ఉదయం నిద్రలేచేసరికి పాపకి జ్వరం తగ్గి అంత నార్మల్‌గా వుంది. కానీ రాత్రి పడుకునే సమయానికి మళ్లీ జ్వరం 101 దాటింది. నా భర్త డాక్టర్ని అడిగితే, "ఒకసారి ఓవర్ డోస్ ఇచ్చినందువల్ల 24 గంటల పూర్తయ్యే వరకు మళ్లీ టాబ్లెట్ వేయొద్ద"ని అన్నారు. అందువల్ల పాపకి టాబ్లెట్ ఇవ్వలేదు. పాప జ్వరంతో పడుకొలేక మసులుతా వుంటే నేను తన బాధ చూడలేక తనని నా ఒడిలో పడుకోబెట్టుకొని 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అని రాత్రి 2:30 వరకు జపించాను. అప్పుడు టెంపరేచర్ చూస్తే, జ్వరం ఇంకా పెరిగి వుంది. దాంతో డాక్టర్ చెప్పిన 24 గంటలు పూర్తి కావడానికి 2 గంటల ముందే సాయిని తలుచుకొని పాపకి టాబ్లెట్ వేసి, "స్వామీ! నా బిడ్డకి జ్వరం తగ్గిపోతే, మీ అనుగ్రహం బ్లాగు ద్వారా తోటి సాయి భక్తులతో పంచుకుంటాన"ని మొక్కుకున్నాను. ఆ స్వామి దయవల్ల ఉదయం నిద్రలేచేసరికి నా బిడ్డకి జ్వరం తగ్గింది. "సాయినాథ తండ్రీ! మీ దయకి, కరుణకి ఎన్నో కృతజ్ఞతలు. సదా కరుణతో నా బిడ్డని ఇలాగే చల్లగా చూడు స్వామీ".
విచారణ జరగకుండా అనుగ్రహించిన బాబా
సాయిబంధువులకు నమస్కారం. నా పేరు జ్ఞానేశ్వరి. మా అమ్మాయి తన భర్తతో విడాకులు తీసుకుంది. తనకి 6 సంవత్సరాల బాబు ఉన్నాడు. ఆ బాబుకి సంబంధించి కోర్టులో చైల్డ్ కస్టడీ విషయం నడుస్తుంది. ఇలా ఉండగా బాబు తండ్రి 2024, సంక్రాంతి పండక్కి బాబుని తన ఇంటికి పంపవలసిందిగా కోర్టులో పిటిషన్ వేసాడు. అది జనవరి 10న విచారణకు వస్తే, కోర్టు దాన్ని మరుసటి రోజుకి వాయిదా వేసింది. మాకు మాత్రం బాబుని వాళ్ళ ఇంటికి పంపడం ఇష్టం లేదు. అందువల్ల మేము చాలా టెన్షన్ పడ్డాము. నేను 11వ తేదీన బాబాకి 7 వారాల సాయి దివ్యపూజ చేస్తూ, "బాబా! కోర్టు చైల్డ్ కస్టడీ, విజిటింగ్ బాబు తండ్రికి ఇవ్వకూడదు. ఈరోజు కోర్టులో విచారణ ఏమీ జరగకపోతే మీ అనుగ్రహం 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాను" అని సాయిని వేడుకున్నాను. సాయిబాబా దయ మా మీద ఉంది. ఆరోజు కోర్టులో విచారణ జరగలేదు. బాబుని తన తండ్రి కలవలేదు. ఇదంతా సాయి మహత్యం. “ధన్యవాదాలు బాబా”.
Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 🙏🙏
ReplyDeleteBaba, take care of my son 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏💐💐
ReplyDeleteBaba, bless Aishwarya 🙏🙏
ReplyDeleteI am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings forever 🙏🙏💐💐
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteOm sai ram, anta bagunde la chudandi tandri
ReplyDeleteOmsaisri Sai Jai Jai Sai 🙏🙏🙏🙏🙏 kapadu Tandri 🙏🙏🙏🙏🙏🙏
ReplyDelete🌺🌺🙏🙏 Om Sai Ram 🙏🙏🌺🌺
ReplyDeleteBaba Kalyan ki marriage chai thandri Pl meku satha koti vandanalu
ReplyDeletesaibaba maa bangaru tandri sai madava bharam antha meede baba. maa attagariki naa meeda kopam povali baba.
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri samagra sadguru sainath maharaj ki jai 🙏
ReplyDeleteఓం శ్రీ సాయి రామ్
ReplyDeleteOm Sri SaiRam
ReplyDeleteMa pillalu bagundali baba please
ReplyDeleteBaba,Mee dayathone edantha jaruguthundi ani nammuthunna.....kani ela prathisari postpone avuthu vunte chala bayam vesthundi Baba....naa valla migatha vallu andaru ekkada ebbandi padatharu anedi chala kangaru gaa anipisthundi.... evariki ee vishayam valla ebbandi kalagakunda daru chupandi baba....🙏🙏🙏🙏🙏....mere anni samakurcharu edi kuda mere solve cheyandi Baba 🥺🥺🥺
ReplyDeleteOmsairam
ReplyDelete