1. చెప్పుకున్నంతనే అనుగ్రహించిన బాబా
2. బాబా దయతో స్వామి దర్శనం
చెప్పుకున్నంతనే అనుగ్రహించిన బాబా
సాయిబంధువులందరికీ నమస్కారం. నేను ఒక సాయిభక్తురాలిని. మేము హైదరాబాద్‌లో ఉంటాము. నేను చదువుకునేటప్పుడు కాలేజీకి వెళ్ళే దారిలో ఒక బాబా గుడి ఉండేది. నేను బయటనుండే దణ్ణం పెట్టుకునేదాన్ని. చాలా అరుదుగా మాత్రమే దర్శనానికి గుడి లోపలికి వెళ్ళేదాన్ని. తర్వాత నా పెళ్లి విషయంలో బాబాకి మొక్కుకొని నవగురువార వ్రతం చేసాను. బాబా దయవల్ల మంచి సంబంధం వచ్చి నా పెళ్లి జరిగింది. 3 నెలల తర్వాత నేను గర్భవతినని తేలిసి మేమంతా చాలా సంతోషించాము. మాకు కవలలని చెప్తే నేను బాబాతో సహా అందరి దేవుళ్లని, "నాకు ఒక బాబు, ఒక పాప పుట్టాల"ని మొక్కుకున్నాను. 8వ నెలలో కాన్పు జరిగి నేను కోరుకున్నట్లే పాప, బాబు పుట్టారు. కానీ పిల్లలు బరువు తక్కువగా ఉండడం వల్ల వాళ్ళని NICUలో ఉంచి 10 రోజులు తర్వాత మాకు ఇచ్చారు. అయితే 40 రోజుల తర్వాత పాప చనిపోయింది. బాబు కూడా చాలా సమస్యలు ఎదుర్కొన్నాడు. తను కోలుకోవడానికి 2 సంవత్సరాలు పట్టింది. ఈ పరిస్థితుల కారణంగా నేను దేవుడిని నమ్మడం మానేశాను. అలా రోజులు గడుస్తూ ఉండగా ఈ మధ్యకాలంలో మేము ఆర్థికంగా బాగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ ‘సాయి మహారాజ్ సన్నిధి’ బ్లాగ్ నా కంటపడింది. ఇన్నేళ్లలో నేనెప్పుడూ ఈ బ్లాగును ఎక్కడా చూడలేదు. మొదట్లో తేలికగా తీసుకున్నాను. కానీ నేను ఫేస్బుక్ ఓపెన్ చేసిన ప్రతిసారీ బాబా వచనం గాని, బాబా భక్తుల అనుభవాలు గానీ కనిపిస్తుండేవి. అవి కూడా ఆ సమయంలో నాకున్న సమస్యకు దగ్గరగా ఉండేవి. తద్వారా బాబా నాకు సలహా ఇస్తున్నట్లుగా అనిపించేది.
ఒకరోజు నా చెవిపోగు శీల ఎక్కడో పడిపోయి కనపడలేదు. అప్పుడు నేను, "బాబా! నా చెవిపోగు శీల దొరికేలా చేయండి" అని బాబాను అడిగాను. కానీ నేను ఎంత వెతికినా 10 రోజుల వరకు ఆ చెవిపోగు శీల కనిపించలేదు. నేను ఇంకా దొరకదని నిర్ధారణకు కూడా వచ్చాను. కానీ ఇంతలో నేను 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు తాలూకు ఫేస్బుక్‌లో సాయి భక్తుల అనుభవాలు చదువుతుంటే ఒకరు ఊదీ ప్యాకెట్ కనిపించకపొతే బాబాకి మొక్కుకుంటే దొరికిందని పంచుకున్నారు. అది చదివిన నేను, "బాబా! మీరు అందరికీ అన్నీ ఇస్తున్నారు. మరి నాకెందుకు నా శీల దొరకట్లేదు" అని అనుకుంటూ మా ఇంటి హాల్లోకి రాగానే బాత్రూమ్ లోపల డోర్ దగ్గర ఏదో మెరుస్తూ కనిపించింది. వెళ్లి చూస్తే, అది నా చెవిపోగు శీల. అంతే, ఒక్కసారిగా నా కళ్ళ నుండి నీళ్ళు వచ్చాయి. ఎందుకంటే, అప్పటికి చెవిపోగు శీల కనిపించకుండా పోయి 10 రోజులు అయింది. అది అక్కడే ఉంటే ముందురోజు నేను బాత్రూం కడిగేటప్పుడు పోసిన నీళ్ళకి కొట్టుకొనిపోవాలి. అదీకాక ఆ రోజు ఉదయం నుండి మా పిల్లలు 6, 7 సార్లు అదే బాత్రూమ్‌కి వెళ్లొచ్చారు. ఆ సమయంలో బాత్రూమ్ గుమ్మానికి ఎదురుగా ఉన్న ఆ శీల పిల్లల కాళ్ళకి గుచ్చుకోలేదు. కానీ అలా జరగకుండా బాబాకి చెప్పుకున్నాక నాకు మాత్రమే కనిపించింది. అందుకు సంతోషంగా బాబాకి ధన్యవాదాలు చెప్పుకున్నాను.
మొదటి పాప చనిపోయిన తర్వాత బాబా మాకు మరో పాపని ప్రసాదించారు. మా బాబు, పాప ఇద్దరూ రోజూ మా అపార్ట్మెంట్‌లోని పిల్లలతో ఆడుకుంటుంటారు. ఒకరోజు మా బాబు సరదాగా ఒక అమ్మాయిని కొడితే తనకి గట్టిగా తగిలింది. దాంతో పిల్లలు మా పిల్లల్ని ఆడుకోవడానికి రావొద్దని అన్నారు. అప్పటినుండి మా బాబు ఎంత ప్రయత్నించినా వాళ్ళు మా పిల్లలతో మాట్లాడేవాళ్ళు కాదు, ఆడేవాళ్లు కాదు. దాంతో మా పిల్లలు కిందకు వెళ్ళడం మానేసి నిరుత్సాహంగా ఉంటుండేవాళ్లు. నేను వెళ్లి మాట్లాడితే, "లేదు ఆంటీ. మీ బాబు అందరితోనూ అలాగే ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి మేము తనతో ఆడుకోము" అన్నారు. ఇక అప్పుడు నేను, "బాబా! పిల్లలందరూ కలిసి ఆడుకొనేలా చూడండి" అని అనుకున్నాను. విషయం చిన్నదే కావొచ్చు కాని, పిల్లలు బాగా డల్ అయిపోవడం చూడలేక నేను బాబాకి చెప్పుకున్నాను. రెండురోజుల తర్వాత మా పిల్లలు కిందకి వెళితే, వాళ్ళ ఫ్రెండ్స్ పిలిచి, "ఇవాళ్టి నుంచి అందరం కలిసి ఆడుకుందాం. సాయంత్రం రండి" అని చెప్పారు. మా బాబు సంతోషంగా వచ్చి, "అమ్మా! వాళ్ళు మళ్ళీ నా ఫ్రెండ్స్ అయిపోయారు. కలిసి ఆడుకుందాం రా అని వాళ్లే చెప్పారమ్మా" అని చెప్పాడు. 10 రోజులుగా తను ఎంత బ్రతిమాలుతున్నా, కనీసం పిలిచినా పలకని పిల్లలు బాబాకి చెప్పుకున్నంతనే వాళ్ళంతటవాళ్లే ఆడుకుందాం రమ్మని పిలిచారు. ఇవాల్టి వరకు ఏ ఫిర్యాదులూ లేవు, చక్కగా ఆడుకుంటున్నారు. "ధన్యవాదాలు బాబా..మాకున్న సమస్యలు తీర్చండి బాబా".
సాయినాథ్ మహారాజ్ కీ జై!!!
బాబా దయతో స్వామి దర్శనం
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!! శ్రీసాయినాథునికి నా సాష్టాంగ ప్రణామాలు. సాయిబంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు శశి. ఆరునెలలపాటు మేము యాదగిరిగుట్టకు వెళ్లాలనుకోవడం, ఏవో అవాంతరాలు వచ్చి ఆగిపోవడం జరుగుతూ ఉండేది. అలా చాలాసార్లు జరిగాక ఈమధ్య ఒక ఆదివారం ఉదయం యాదగిరిగుట్టకు వెళదామని ఆన్లైన్‌లో టికెట్ల కోసం చూస్తే, 'ఒకరోజు ముందు బుక్ చేసుకోవాల'ని చూపించింది. మేము ఇక ఇలా కాదు, ఏదైతే అది అవుతుందనుకొని యాదగిరిగుట్టకు బయలుదేరాము. దారిలో నేను బాబాకి దణ్ణం పెట్టుకొని, "తండ్రీ! నేను యాదగిరిగుట్టకు వెళుతున్నాను. మంచిగా నరసింహస్వామి దర్శనం చేయించు. మీ అనుగ్రహం తోటి భక్తులతో పంచుకుంటాను" అని వేడుకున్నాను. మేము గుట్టకు చేరుకునేసరికి సాయంత్రం మూడున్నర అయింది. అక్కడ టికెట్ కౌంటర్‌లో కనుక్కుంటే, "4:30కి బ్రేక్ దర్శనం టికెట్లు ఉన్నాయ"ని చెప్పారు. ఆ టికెట్లు ఆన్లైన్లో అయిపోయాయని చూపించింది. మేము సంతోషంగా ఆ బ్రేక్ దర్శనం టికెట్లు తీసుకొని దర్శనానికి వెళ్ళాము. మేము అనుకున్న దానికంటే ఎంతో ప్రశాంతంగా స్వామిని దర్శించుకొని, గుడి ప్రాంగణంలో కొంతసేపు గడిపి ఇంటికి తిరిగి వచ్చాము. ఇలాగే తిరుపతి వెంకటేశ్వరస్వామి దర్శనం కూడా బాబా దయవలన స్వామికి దగ్గరగా ఎంతో బాగా జరిగింది. "ధన్యవాదాలు బాబా".
Om Sairam🙏
ReplyDeleteOm SaiRam!!! Samardha sadguru Sainath Maharaj ki Jai!!!
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 🙏🙏
ReplyDeleteBaba, take care of my son 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏
ReplyDeleteBaba, bless Aishwarya 💐💐
ReplyDeleteI am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings forever 🙏🙏💐💐
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteBaba Kalyan ki marriage chai thandri pl meku satha koti vandanalu vadini bless cheyandi
ReplyDeleteOm sai ram, anta bagunde la chudandi tandri
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
🌺🌺🙏🙏 Om Sai Ram 🙏🙏🌺🌺
ReplyDeletesaibaba maa sai madava bharam antha meede baba. maa tammudiki tondaraga udyogam vachhelaga cheyandi baba. maa attagariki naa meeda kopam poyelaga cheyandi baba.
ReplyDeleteOm sai ram
ReplyDeleteఓం శ్రీ సాయి రామ్
ReplyDeleteOm Sri Sainathaya Namah
ReplyDeleteOmsaisri Sai Jai Jai Sai kapadu Tandri 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ReplyDeleteOne sai ram
ReplyDeleteBaba enduku ela avuthundo ardam kavatam ledu.... please baba maa valla evaru bhada padakunda chudandi memu ee kastam nundi gattu ekkinchela cheyandi 😭😭😭😭😭
ReplyDeleteBaba A ammayi manasu marchi mammulanu kalapandi Baba 🙏🙏🙏🙏🙏
ReplyDeleteOm Sri Sai Raksha🙏🙏🙏
ReplyDeleteOm sri sairam 🙏
ReplyDeleteOmsaisri Jai Jai Sai kapadu Tandri 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ReplyDeleteBaba na pillalaki mere raksha baba
ReplyDeleteబాబా నా సమస్యలకు పరిష్కారం చూపు తండ్రి. నాకు మీరే దిక్కు . ఓం సాయి రామ్ 🙏🙏🙏🙏🙏🙏
ReplyDelete