సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1757వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • బాబా మనల్ని వదిలిపెట్టారు

నేను ఒక సాయి భక్తురాలిని. మేము యు.ఎస్.ఏలో నివాసముంటున్నాము. 2024, జనవరి 1న నాకు మా అమ్మకు ఏదో జరిగినట్లు చాలా చెడ్డ కల వచ్చింది. దాంతో నేను చాలా భయపడిపోయాను. ఉదయం ఫోన్ చేస్తే నాన్న, 'అమ్మకి జ్వరం, తీవ్రమైన తలనొప్పి ఉన్నాయ'ని చెప్పారు. ఆ మాట నాలో ఆందోళన కలిగించింది. ఏదో చెడు జరగబోతుందనిపించి బాబాను ప్రార్థించాను. సాయంత్రం మళ్ళీ ఫోన్ చేస్తే, అప్పుడు కూడా అమ్మ నాతో మాట్లాడే స్థితిలో లేదు. అమ్మకోసం జాగ్రత్త తీసుకోవడానికి అక్కడ ఎవరూ లేనందువల్ల నేను చాలా ఆందోళన చెంది, నా నుదుటికి బాబా ఊదీ రాసుకొని, "బాబా! అమ్మకి జ్వరం, తలనొప్పి తగ్గిపోయేలా దయచూపి అమ్మను రక్షించండి. కలలో జరిగినట్లు ఏ చెడు జరగకుండా అమ్మకి బాగుంటే, మీ అనుగ్రహం గురించి బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించి నిద్రపోయాను. నేను ఇలాగే ప్రతి విషయాన్ని బాబా పాదాల వద్ద ఉంచుతాను. అలా చేస్తే ఆయన జాగ్రత్త వహిస్తారని నా భావన. అది నిజం.. బాబా నా ప్రార్థన విన్నారు. మరుసటిరోజు ఉదయం నేను ఫోన్ చేస్తే, కొద్దిగా ఒళ్లునొప్పులు ఉన్నప్పటికీ అమ్మ బాగానే ఉంది. నాతో మాట్లాడింది. "చాలా ధన్యవాదాలు బాబా. కొన్నిసార్లు అవసరంలో జాగ్రత్త తీసుకోవడానికి నేను అక్కడ నా తల్లిదండ్రులతో భౌతికంగా లేనని, కూతురుగా నేను ఫెయిల్ అని నాకనిపిస్తుంది బాబా. కానీ అక్కడి పరిస్థితులు మీకు తెలుసు కదా! దయచేసి అమ్మానాన్నలను జాగ్రత్తగా చూసుకోండి బాబా. బిడ్డలుగా మా తల్లిదండ్రులను సంతోషంగా చూసుకోవడంలో మేము ఫెయిల్ కాకుండా దయచేసి చూడండి బాబా. అలాగే దయచేసి నా సోదరుని మార్చి తనని మీ భక్తుడిగా చేసుకోండి".


ఒకసారి నేను 4 కుటుంబాలను భోజనానికి ఆహ్వానించాను. కానీ వంట చేయడం నాకంత బాగా రాదు. దానికి తోడు 2 రోజుల ముందు నాకు జ్వరం వచ్చింది. ఆ కారణంగా నేను చాలా ఆందోళన చెంది, "బాబా! అంతా సవ్యంగా జరిగితే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. బాబా దయతో ఆ రోజు ఉదయానికి నా ఆరోగ్యం మెరుగుపడి వంట చేయగలిగాను, ప్రతీ వంటకం కూడా బాగా వచ్చింది. "చాలా ధన్యవాదాలు బాబా. అన్నిటికీ చాలా చాలా ధన్యవాదాలు తండ్రీ. ఎల్లప్పుడూ మాతో ఉండండి".


2024, జనవరి నెల మొదటివారంలో నాకు, నా భర్తకి ఆరోగ్యం బాగాలేదు. అలా 4 రోజులు గడిచాక నాకు బాగానే అనిపించింది కానీ, నా భర్తకి జ్వరం, తీవ్రమైన జలుబు వచ్చాయి. దాంతో మేము కోవిడ్ కావచ్చు అనుకొని టెస్టు చేస్తే, రిజల్టు అటు ఖచ్చితంగా నెగెటివ్ అనిగాని, ఇటు ఖచ్చితంగా పాజిటివ్ అనిగాని చెప్పడానికి లేకుండా అస్పష్టంగా వచ్చింది. ఒకవేళ కోవిడ్ పాజిటివ్ వచ్చి, తీవ్రంగా ఉంటే గనక పరిస్థితిని అస్సలు ఊహించలేము. నాకు తట్టుకొనే ధైర్యం కూడా లేదు. అటువంటి స్థితిలో 'సాయి.. సాయి' అని అనుకోవడం తప్ప ఇంకేం చేయగలను? ఎందుకంటే, ఆయన అన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకుంటారని నాకు తెలుసు. సరే, జనవరి 5న నా భర్త జ్వరం ఉన్న పర్లేదు, టాబ్లెట్ వేసుకోనని అన్నారు. నేను, "అలా చేయకండి ప్లీజ్. టాబ్లెట్ వేసుకోండి" అని చెప్పినప్పటికీ ఆయన నా మాట వినలేదు. ఆరోజు సాయంత్రం నేను, మా బాబు జలుబుకి సిరప్ తేవడానికని బయటకి వెళ్ళొచ్చాము. ఇంటికి రాగానే మావారు తన హార్ట్ బీట్ పెరుగుతుందని వాచ్‌లో అలర్ట్ వచ్చిందని చెప్పారు. అది విని నేను చాలా కంగారుపడ్డాను. కానీ, అది గుండెకు సంబంధించిన విషయమైనందున మావారి ముందు నా టెన్షన్‌ను బహిర్గతం కానివ్వలేదు. తర్వాత నేను పూజ గదిలోకి వెళ్లి ఊదీ తెచ్చి మావారి నుదుటన పెట్టాను. మావారు అలాంటివన్నీ నమ్మారు. కానీ బాబా ఊదీ ఇచ్చే రక్షణ గురించి నాకు తెలిసినందువల్ల నేను మావారికి ఊదీ పెట్టాను. తర్వాత మావారు జ్వరానికి టాబ్లెట్ వేసుకున్నారు. అయితే టాబ్లెట్ వేసుకున్నాక జ్వరం తగ్గడానికి బదులు ఎక్కువైంది. అదీకాక ఒక గంట తర్వాత కూడా మావారి హార్ట్ బీట్ తగ్గలేదు. గత 2 రోజులుగా సరిగా నిద్రపోని కారణంగా మరియు జ్వరం వల్ల మావారి హార్ట్ బీట్ పెరిగి ఉంటుందని అనుకొని చాలా ఆందోళనతో నిరంతరాయంగా 'ఓం సాయి రక్షక శరణం' అని జపించసాగాను. బాబా దయవల్ల 2-3 గంటల తర్వాత మావారికి బాగా అనిపించింది. ఇకపోతే, ఆ రోజు రాత్రి అయినా మావారు మంచిగా నిద్రపోవాలని బాబాని ప్రార్థించాను. కానీ జలుబు వల్ల ఆయనకి నిద్రపట్టలేదు. ఇక అప్పుడు నేను, "బాబా! 5 నిమషాలలోపు ఆయన నిద్రపోతే, మీ అనుగ్రహం తోటి భక్తులతో పంచుకుంటాను" అని బాబాకి మొక్కుకున్నాను. ఎందుకంటే, నిద్రపోకపోతే మావారి హృదయ స్పందన మీద ఆ ప్రభావం పడుతుంది. అందువల్ల నేను చాలా ఆందోళన చెందుతూ మావారు నిద్రపోయేవరకు బాబా లైవ్ దర్శన చూడాలనుకొని లైవ్ దర్శన్ చూడటం మొదలుపెట్టాను. అద్భుతం! 5 నిమిషాల్లో గురక శబ్దం వినిపించింది. చూస్తే, మావారు నిద్రపోతున్నారు. నేను ఆనందంతో, "ఓ మై దేవా! మీరు నిజంగా నాకు సహాయం చేసారు బాబా. కోటికోటి ప్రణామాలు, చాలా ధన్యవాదాలు బాబా. కాస్త జలుబు, దగ్గు ఉన్నాయి. దయచేసి మావారిని జాగ్రత్తగా చూసుకోండి బాబా” అని బాబాతో చెప్పుకున్నాను.


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


20 comments:

  1. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  2. Baba, take care of my son 🙏🙏

    ReplyDelete
  3. Baba, provide peace and wellness to my parents 💐💐💐💐

    ReplyDelete
  4. Om Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏

    ReplyDelete
  5. Baba, take care of Aishwarya 💐💐

    ReplyDelete
  6. Baba, I am totally surrendering at your lotus feet🙏🙏🙏🙏

    ReplyDelete
  7. Baba Kalyan ki marriage chai thandri pl meku satha koti vandanalu vadini bless cheyandi na Maro problem solve chesavu dhana vadamulu

    ReplyDelete
  8. Om Sri Sai Raksha 🙏🙏🙏

    ReplyDelete
  9. 🌺🌺🙏🙏 Om Sai Ram 🙏🙏🌺🌺

    ReplyDelete
  10. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  11. Baba chala tension gaa anipisthundi.... present memu vunna situations ni sort cheyandi please 🥺....mere naku dikku.... meru kachitham gaa chestharu ani thelisina bayam gaa vundi na valla evariki ebbandi kalagakunda chudandi please

    ReplyDelete
  12. sai baba, madava ki vachhina samasya ni meedaya valana pariskarinchagaliganu . kaani maavari daggara nammakanni poguttukuntunnanu baba. tammudiki manchi udyogam vachhelaga chudandi baba. madava bharam anthaa meede baba.

    ReplyDelete
  13. Baba ma samasya nu tvaraga pariskaram cheyyandi na barya manasu marchu baba na daggaraku vachhela cheyyi baba memu ninnu ennosarulu nee temple ku vachhamu nee Darshana bagyamu chesukunnamu anduke neemeeda nammakamto mammulanu kaluputavani vunnanu baba🙏🙏🙏🙏Eka Anta Meedaya baba🙏🙏🙏🙏🙏Om sairam🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  14. Baba na delivery safe ga ayindhi papa puttindi healthy baby ni ichavu baba atlage healthy ga vandali thandri fever vachindi baba drops vesa ippatinunchi fever inka rakunda chudu baba Chinna baby ba rakshinchu thandri fever thagithe sai maharaj Sannidhi blog lo post chests baba please save my child

    ReplyDelete
  15. ఓం సాయిరామ్

    ReplyDelete
  16. ఓం శ్రీ సాయి రామ్

    ReplyDelete
  17. Omsaisri Sai Jai Jai Sai kapadu Tandri 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo